ఓటరు నమోదుకు ఎన్నికల కమిషన్ మరో అవకాశం కల్పించింది. ఓటర్ల తుది జాబితాలో పేరు లేని వారు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే
మరో ఛాన్స్
Feb 6 2014 1:56 AM | Updated on Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు : ఓటరు నమోదుకు ఎన్నికల కమిషన్ మరో అవకాశం కల్పించింది. ఓటర్ల తుది జాబితాలో పేరు లేని వారు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే పది రోజుల ముందు వరకు దరఖాస్తు చేసుకుని ఓటు హక్కు పొందవచ్చని వెల్లడించింది. ఇప్పుడు దరఖాస్తు చేసుకుని ఓటు హక్కు పొందినవారు కూడా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనవచ్చని తెలిపింది. అయితే ఓ చోట ఓటు ఉండి మరో చోట కూడా పొందితే క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశం లేకపోలేదు.
జనవరి 31వ తేదీ ప్రచురించిన ఓటర్ల తుది జాబితా ప్రకారం జిల్లా జనాభాలో ఓటర్లు 70.2 శాతంగా ఉన్నారు.
నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే తెనాలిలో 73.9 శాతంగా ఉంది.
2011 లెక్కలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు ఏడాదికి 2.6 శాతం పెంచి 2014 జనాభాను అంచనా చేశారు.
దీని ప్రకారం తెనాలి నియోజకవర్గంలో జనాభా 3,05,149 మంది ఉంటే, ఓటర్లు 2,25,636 మంది ఉన్నారు. అంటే ప్రతి వెయ్యి మంది జనాభాలో 739 మంది ఓటర్లున్నారు. జనాభాలో ఓటర్ల శాతం 73.9 శాతంగా ఉంది.
అత్యల్పంగా జనాభాలో ఓటర్లు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నారు. ఇక్కడ 3,22,346 మంది జనాభా ఉంటే,
ఓటర్లు 2,15,517 మంది ఉన్నారు. ప్రతి వెయ్యిమంది జనాభాలో 668 మందిఓటర్లున్నట్లు లెక్క.
ప్రతి వెయ్యిమంది జనాభాకు పెదకూరపాడులో 712 మంది ఓటర్లు, తాడికొండలో 695, మంగళగిరిలో 670, పొన్నూరులో 726, వేమూరులో 733, రేపల్లెలో 701, బాపట్లలో 690, ప్రత్తిపాడులో 697, గుంటూరు వెస్ట్‌లో 709, చిలకలూరిపేటలో 680, నరసరావుపేటలో 681, సత్తెనపల్లిలో 699, వినుకొండలో 704, గురజాలలో 716, మాచర్లలో 702 మంది చొప్పున ఓటర్లున్నారు.
జిల్లాలో సెక్స్ రేషియో 1027 గా ఉం ది. అంటే ప్రతి వెయ్యి మంది పురుషులకు 1,027 మంది మహిళలున్నట్లు అంచనా.
ఇది చిలకలూరిపేట నియోజకవర్గంలో మాత్రం 1058గా నమోదైంది. వినుకొండలో తక్కువగా 1008 మంది ఉన్నారు.
Advertisement
Advertisement