ఓటరు నమోదుకు స్పెషల్‌ డ్రైవ్‌ | Special drive for voter registration | Sakshi
Sakshi News home page

ఓటరు నమోదుకు స్పెషల్‌ డ్రైవ్‌

Published Fri, Jun 2 2017 3:04 AM | Last Updated on Tue, Sep 5 2017 12:34 PM

Special drive for voter registration

విజయనగరం కంటోన్మెంట్‌: ఓటరు నమోదుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు డీఆర్వో శ్రీలత చెప్పారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు 18–21 ఏళ్లలోపు యువతను గుర్తించి ఓటు నమోదు చేసేందుకు జూలై 1 నుంచి 31 వరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

 కేంద్రస్థాయి నుంచి బీఎల్‌ఓల వరకు అధికారులు ప్రజల ఇంటికి వెళ్లి ఓటర్లను తొలగించడం, కొత్త ఓటర్లను చేర్చడం లాంటి పనులు చేయాలన్నారు. ఈ మేరకు ఈ మధ్య కాలంలో విస్తృత ప్రచారం చేస్తామని తెలిపారు. వివిధ కాలేజ్‌ల ప్రిన్సిపాల్స్‌కు కూడా ఓటరు నమోదుపై ఆదేశాలిచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల సెల్‌ విభాగం పర్యవేక్షకురాలు వైఆర్‌కే వాణి, టీడీపీ తరుపున ఐవిపి రాజు, వైఎస్సార్‌ సీపీ తరపున ఎస్‌వివి రాజేష్, ఎం. అప్పలనాయుడు, బీఎస్పీ తరుపున ఆర్జి శివప్రసాద్, సీపీఎం తరుపున రెడ్డి శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement