5లోగా నమోదు చేసుకోండి
ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై భన్వర్‌లాల్
సాక్షి, హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదుకు ఈనెల 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు.
ఉభయ రాష్ట్రాల్లోని ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు, కడప–అనంతపురం–కర్నూలు, మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఓటరుగా నమోదు చేసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు ప్రైవేటు ఎయిడెడ్, ఎయిడెడ్ స్కూల్ టీచర్లు కూడా అర్హులని చెప్పారు.