సాక్షి, తిరుమల: 2017 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ల వయసు నిండిన వారు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియ ఈ అక్టోబర్ 31వ తేదీ నుంచి ప్రారంభిస్తామని ఆయన తిరుమలలో వెల్లడించారు. బుధవారం తలనీలాలు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ అన్ని మండల కేంద్రాలు, ఆర్డీవో, సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.