ఓటరు నమోదుకు 88,943 దరఖాస్తులు
Published Fri, Dec 27 2013 3:50 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఓటరు నమోదు కోసం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం సత్ఫలితాన్నిచ్చింది. ఓటరు నమోదుకు రికార్డు స్థాయిలో 88,943 దరఖాస్తులు అందాయి. కలెక్టర్ కాంతిలాల్ దండేతో పాటు పార్వతీపురం సబ్ కలెక్టర్ స్వేతామహంతి ఓటరు నమోదు కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించారు. గిరిజన ప్రాంతాలతో పాటు వారపు సంతల్లో ఓటరు నమోదు ఫారాలు అందుబాటులో ఉంచి కొత్త ఓటర్లను చేర్పించడంలో సఫలీకృతులయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఓటరు నమోదు కోసం మహిళలు 39,430, పురుషులు 37,523 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఆన్‌లైన్ ద్వారా 11,989 మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా కురుపాం నియోజకవర్గంలో 13,729 మంది దరఖాస్తు చేసుకోగా, గజపతినగరంలో 6,486 దరఖాస్తులు మాత్రమే అందాయి. ఓటరు కార్డుల్లో తప్పుల సవరణ కోసం 6,856 మంది, చిరునామా మార్పు కోసం 4,778 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఓటరు నమోదుకు విశేష స్పందన రావటంపై ఇన్‌చార్జి కలెక్టర్ యూసీజీ నాగేశ్వరరావు బీఎల్‌ఓలు, ఇతర సిబ్బందికి అభినందనలు తెలిపారు.
Advertisement
Advertisement