చిత్తూరు (జిల్లాపరిషత్): ఎన్నికల నియ మ నిబంధనలను అతిక్రమించిన వారిపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ కేసుల వివరాలను, అభ్యర్థుల ఖర్చుల వివరాలను ఈనెల 17వ తేదీలోగా సమర్పిం చాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కోరారు. అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిం చినందుకు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆయన అభినందించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరె న్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాల వారీగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలి తాలను పోలింగ్ కేంద్రాల వారీగా ఫాం-20ను ఈసీ వెబ్‌సైట్ నందు పొం దుపరచాలన్నారు. ఇందుకు గాను హార్డ్‌కాపీతో పాటు సాప్టుకాపీని హైదరాబా ద్ ఎన్నికల కార్యాలయానికి పంపాల న్నారు. ఎన్నికల్లో అభ్యర్థులు చేసిన ఖర్చులు ఏ విధంగా నమోదు చేసి సమర్పించాలన్న దానిపై ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించకపోతే వెంటనే నిర్వహించాలన్నారు.
జిల్లాలో ఫాస్ట్‌ట్రా క్ ఖర్చుల వివరాలను తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీఆర్వో ఒంగోలు శేషయ్య మాట్లాడుతూ ఫాం-20ను ఇదివరకే సమర్పించామన్నారు. జిల్లాలో 203 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారని, వీరిలో 45 మంది అభ్యర్థులు ఖర్చుల వివరాలను అందజేశారన్నారు. మోడల్‌కోడ్ ఆఫ్ కాండక్టు (ఎంసీసీ) కమిటీచే గుర్తించిన నాలుగు కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
నిబంధన లు అతిక్రమించిన 217 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామన్నారు. జిల్లాలో అభ్యర్థులు తమ ఖర్చులను ఏ విధంగా నమోదు చేయాలన్న దానిపై ఒకరోజు అవగాహన సదస్సును ఈనెల 9న నిర్వహించామని ఎన్నికల అధికారికి డీఆర్వో తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మదనపల్లె సబ్‌కలెక్టర్ భరత్‌గుప్తా, చిత్తూ రు, తిరుపతి ఆర్డీవోలు పెంచలకిషోర్, సీహెచ్.రంగయ్య, జిల్లా ఆడిట్ అధికారి తదితరులు పాల్గొన్నారు.
17 లోపు ఎన్నికల ఖర్చుల వివరాలు పంపాలి
Published Sat, Jun 14 2014 3:14 AM | Last Updated on Sat, Apr 6 2019 9:01 PM
Advertisement