బయటివ్యక్తులు నియోజకవర్గాలను వీడి వెళ్లాలని ఈసీ ఆదేశం
హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 30న పోలింగ్ జరిగే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సోమవారం సాయంత్రం 6 గంటలతో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. అయితే నక్సలైట్ ప్రభావిత 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం ఆరోజు సాయంత్రం 4 గంటలకే ప్రచా రం ముగియనుంది. అంతే కాకుండా తెలంగాణ జిల్లాల్లోని నియోజకవర్గా ల్లో ఓట్లు లేని వారందరూ ఆయా నియోజకవర్గాలను సోమవారం సాయంత్రం 6 గంటలకల్లా విడిచి వెళ్లాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. హోటళ్లు, లాడ్జీలు, అతిథి గృహాలను తనిఖీలు చేసి అలాంటి వారు ఎవరైనా ఉంటే పంపించేయాల్సిందిగా జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇక తెలంగాణ జిల్లాల్లో మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలైన సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, చెన్నూరు, మంథని, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, భూపాలపల్లి, ములుగు, భద్రాచలంలో 30వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది.
మిగతా 108 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో మొత్తం 265 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. 119 అసెంబ్లీ స్థానాలకు గాను 1669 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో మొత్తం 2,81,66,266 మంది ఓటు హక్కు వినియోగించడానికి వీలుగా 30,518 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నా రు. కాగా, ఈ ప్రాంతంలో 8 లోక్‌సభ, 31 అసెంబ్లీ స్థానాల్లో 15 మంది కన్నా ఎక్కువ అభ్యర్థులు పోటీలో ఉండడంతో అక్కడ రెండేసి ఈవీఎంలను వినియోగించనున్నారు. అంబర్‌పేట అసెంబ్లీకి అత్యధికంగా 32 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే 75 శాతం ఓటర్లకు ఫొటోతో కూడిన ఓటర్ స్లిప్‌ల పంపిణీ పూర్తి చేశారు. మిగతా స్లిప్‌ల పంపిణీ ఆదివారానికి పూర్తి చేయనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 125 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 4.40 లక్షల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకోవడంతో పాటు 14,661 మందిని అరెస్టు చేశారు. 8,227 బెల్ట్ షాపులను మూయించారు.
పోలింగ్ ఎగ్జిట్‌పోల్ నిర్వహించరాదు..
తెలంగాణలో 30న పోలింగ్ జరగనున్నందున 48 గంటల ముందు నుంచి ఎటువంటి ఒపీనియన్ పోల్ ప్రసారాలను ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో ప్రసారం చేయరాదని కమిషన్ పేర్కొంది. అలాగే పోలింగ్‌రోజు ఎవరూ ఎగ్జిట్‌పోల్ ని ర్వహించరాదని.. తెలంగాణ జిల్లాల్లో ఎన్నికలకు సంబంధిం చి 28వ తేదీ సాయంత్రం నుంచి ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో ఎటువంటి ప్రచారం ఇవ్వరాదని స్పష్టం చేశారు.
రేపటితో తెలంగాణలో ప్రచారం బంద్
Published Sun, Apr 27 2014 1:24 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement