విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. పోలింగ్ సరళి తమకు వ్యతిరేకంగా ఉండడాన్ని వారు తట్టుకోలేకపోయారు. ఆయా ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులకు తెగబడ్డారు. కొన్ని చోట్ల కేసులు నమోదు చేయించారు. వేపాడ మండలం అరిగిపాలెం లో వైఎస్సార్ సీపీ, టీడీపీ వర్గాల మధ్య స్వల్ప కొట్లాట జరిగింది. ఇక్కడ ప్రశాంత పోలింగ్‌కు సహకరిస్తున్న వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీనేతలు కాలుదువ్వారు. సాలూరు పట్టణంలోని చింతల వీధికి చెందిన జర్జాపు శ్రీనివాసరావు అనే వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తపై స్థానిక టీడీపీ నాయకులు దాడికి చేశారు.
ప్రశాంత పోలింగ్ కు సహకరించాలని కోరిన శ్రీనివాసరావుపై దాడి చేయడమే కాకుండా, ఇంటికి వెళ్లి మరీ కొట్టారు.ఎల్.కోట మండలం లచ్చంపేటలో తోపులాటలు చోటుచేసుకున్నాయి. బొబ్బిలి మండలం రంగరాయపురం, విజయనగరం మండలం గొల్లలపేటలో స్వల్ప ఘర్షణలు జరి గాయి. భోగాపురం మండలం తూడెం గ్రామం లో కాంగ్రెస్‌కు చెందిన సూరప్పారావును టీడీపీ నాయకులు దాడి చేసి గాయపరచడంతో కేసు నమోదైంది. మెంటాడ మండలం గుర్లతమ్మిరాజుపేటలో రిగ్గింగ్ జరుగుతోందన్న విషయం తెలుసుకుని అక్కడి వెళ్లిన విలేకరుల బృందం పై టీడీపీ నాయకులు దాడికి తెగబడ్డారు.
ఇక్కడ మాకు నచ్చినట్టు ఓట్లు వేసుకుంటామని బెదిరించడంతో చేసేదేం లేక విలేకరులు వెనుదిరిగారు. పాచిపెంట మండలంలో టీడీపీ నాయకులు వాహనాల్లో ఓటర్లను తరలిస్తున్నారన్న విషయం తెలుసుకున్న అక్కడి వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు డోల బాబ్జీ వారిని నిలదీశారు. దీంతో టీడీపీ నాయకులు కొందరు గిరిజనులతో కలసి పోలీస్ స్టేషన్‌లో అక్రమ కేసులు నమోదు చేయించారు. విజయనగరంలోని 17వ వార్డులో దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన టీడీపీ కార్యకర్తలను, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
టీడీపీ బరితెగింపు
Published Thu, May 8 2014 2:09 PM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement