ఎమ్మెల్సీ ఎన్నికలపై ఈసీకి ఫిర్యాదు
హైదరాబాద్: ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను గురువారం వైఎస్సార్సీపీ నేతలు కలిశారు. భన్వర్‌లాల్ కార్యాలయానికి వెళ్లిన వైఎస్సార్సీపీ ఎమ్మేల్యే ఆర్కే, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఫిర్యాదు చేశారు.