RK
-
కొత్త వాళ్లకి అవకాశాలు ఇవ్వండి
‘‘ఈ వేదికపై ఉన్న చాలా మంది నిర్మాతలు నా సినిమాలతో స్ఫూర్తి పొందామని చెబుతుండటం సంతోషం. మీరు పెద్ద సినిమాలు చేస్తున్నారు.. అప్పుడప్పుడు చిన్న సినిమాలు చేసి కొత్తవాళ్లకి చాన్స్ ఇస్తే ఇన్నేళ్లుగా నేను చేసిన ప్రయత్నానికి కొనసాగింపుగా ఉంటుంది’’ అని డైరెక్టర్ కె.రాఘవేంద్ర రావు అన్నారు. ఆకాష్ , భావనా వళపండల్ జంటగా గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సర్కారు నౌకరి’. కె.రాఘవేంద్ర రావు నిర్మిస్తున్నారు. ఆర్కే టెలీఫిలింస్ స్థాపించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఓ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘సర్కారు నౌకరి’ టీజర్‌ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సురేశ్ బాబు, నవీన్ యెర్నేని, టీజీ విశ్వప్రసాద్, ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ, గాయని సునీత తదితరులు పాల్గొన్నారు. -
దివంగత నక్సలైట్ ఆర్కే భార్య శిరీష ఇంట్లో సోదాలు
-
ఆర్కే జీవిత చరిత్రపై పుస్తకాల ముద్రణ
అంబర్‌పేట (హైదరాబాద్): మావోయిస్టు దివంగత అగ్ర నేత రామకృష్ణ (ఆర్కే) పేరుతో పుస్తకం ముద్రిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు సదరు ప్రింటింగ్ ప్రెస్పై దాడి చేసి పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అంబర్‌పేట అలీకేఫ్ చౌరస్తా ప్రాంతంలో రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి నవ్య ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రింటింగ్ ప్రెస్‌లో రామకృష్ణ జీవితంపై పుస్తకం ముద్రిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేసి పుస్తకాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ పుస్తకాల్లో మావోయిస్టు భావజాలం ఉందని డీసీపీ వెల్లడించారు. పుస్తకాలు, ప్రింటింగ్ ప్లేట్లు, పెన్‌డ్రైవ్‌లను తీసుకెళ్లారు. ప్రింటింగ్ ప్రెస్ యజమాని రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, రామకృష్ణారెడ్డి పీవోడబ్ల్యూ నేత సంధ్య భర్త కావడం గమనార్హం. భర్త జ్ఞాపకాలతో పుస్తకం వేసుకుంటే తప్పా? ‘నా భర్త, కొడుకు ఇద్దరు చనిపోయారు. వారి జ్ఞాపకాలను ఒక పుస్తకం రూపంలో తెద్దాం అనుకున్నా. ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకొచ్చా. ఈనెల 14న సుందరయ్య విజ్ఞానకేంద్రంలో రామకృష్ణ సంస్మరణ సభ ఉంది. భర్త, కొడుకు జ్ఞాపకాలను పుస్తక రూపంలో తీసుకొస్తే తప్పేముంది. వీరి జ్ఞాపకాలు చాలా పత్రికల్లో వచ్చాయి కూడా. వాటినే పుస్తక రూపంలో తీసుకొస్తే దాన్ని తప్పుబట్టి పోలీసులు సీజ్ చేయడం దారుణం’అని ఆర్కే భార్య శిరీష వాపోయారు. -
మావోయిస్టు అగ్రనేత ఆర్కే వర్ధంతి సభ
-
ఆర్కేను రక్షించుకోలేకపోయాం: కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి
సాక్షి, అమరావతి/టంగుటూరు/చర్ల (ఖమ్మం)/కొరాపుట్ (ఒడిశా): సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ (63) అలియాస్ రామకృష్ణ, ఆర్కే, సాకేత్, మధు, శ్రీనివాస్‌కు వైద్యం అందించినప్పటికీ రక్షించుకోలేకపోయామని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ స్పష్టం చేశారు. ఆర్కే మరణాన్ని ధృవీకరిస్తూ శుక్రవారం ఓ ప్రకటన, అంత్యక్రియలకు సంబంధించిన ఫొటోలను శనివారం విడుదల చేశారు. ఆర్కేకు అకస్మాత్తుగా కిడ్నీల సమస్య మొదలుకాగా, వెంటనే డయాలసిస్ ప్రారంభించినప్పటికీ.. కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తాయని, పర్యవసానంగా ఈ నెల 14న ఉదయం 6 గంటలకు అమరుడయ్యారని అభయ్ పేర్కొన్నారు. ఆర్కేకు విప్లవ శ్రేణుల మధ్య అంత్యక్రియలు నిర్వహించామని, ఆయన మృతి పార్టీకి తీరనిలోటని చెప్పారు. సాధారణ జీవితం, అకుంఠిత దీక్ష, ప్రజల పట్ల ప్రేమ, కామ్రెడ్స్‌తో ఆప్యాయతలు, విప్లవ గమనంపై స్పష్టతతో విప్లవోద్యమానికి నిస్వార్థంగా సేవలు అందించారని కొనియాడారు. ఆర్కే ఆశయాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అంత్యక్రియలకు భారీగా హాజరైన ఆదివాసీలు ► ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడు – కొండపల్లి మధ్య అటవీ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ శ్రేణుల సమక్షంలో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించారు. ► ఈ సందర్బంగా ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండాను ఉంచి మావోయిస్టులు నివాళులు అర్పించారు. ఆర్కే అంత్యక్రియల్లో బీజాపూర్, సుకుమా జిల్లాల్లోని పాలగూడ, గుండ్రాయి, కంచాల, మీనగట్ట, దామారం, జబ్బగట్ట తదితర గ్రామాల నుంచి సుమారు 2 వేల మందికిపైగా ఆదివాసీలతో పాటు పెద్ద ఎత్తున మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. భారీ ర్యాలీ నిర్వహించినట్లు సమాచారం. ఆలకూరపాడులో ఆర్కే చిత్రపటానికి నివాళులర్పిస్తున్న భార్య శిరీష, కుటుంబ సభ్యులు లొంగిపోయుంటే బతికుండేవారు ఆర్కే మృతి విషయాన్ని ఒడిశాలోని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పిళ్లై ఓ వీడియో ద్వారా వెల్లడించారు. పోలీసులకు లొంగిపోయుంటే ఆర్కేకు నాణ్యమైన వైద్యం అందేదని, బతికేవాడన్నారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో గతంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు రామన్న, హరి భూషణలతో పాటు దండకారణ్యం జోనల్ స్పెషల్ కమిటీ సభ్యులు శోభరాజ్, గంగా, వినోద్‌లు సైతం ప్రాణాలు విడిచారని ఐజీ గుర్తు చేశారు. ఆర్కేకు ఘన నివాళి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఆర్కే భార్య శిరీష, కుటుంబ సభ్యులు, అమరుల బంధుమిత్రుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఆర్కే చిత్రపటానికి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ‘ఆర్కే అమర్ రహే.. అమరవీరులకు జోహార్లు’ అంటూ నినాదాలు చేశారు. ఉద్యమ గీతాలు ఆలపించారు. ‘నా భర్తతో పాటు కుమారుడు వీరత్వం పొందాడని గర్వంగా భావిస్తున్నాను. ఆర్కే మృతితో ఉద్యమం ఆగిపోదు. ఆయనలాంటి గెరిల్లా యుద్ధ వీరులు ఇంకా పుట్టుకొస్తారు’ అని శిరీష అన్నారు. ‘ప్రజల కోసం జీవిస్తాం.. ప్రజల కోసమే మరణిస్తాం’ అన్న మాటను ఆర్కే నిలబెట్టుకున్నాడని అమరవీరుల బంధుమిత్రుల సంఘం స్టేట్ సెక్రటరీ భవాని పేర్కొన్నారు. ‘ఆర్కే ప్రజల మనిషి. ప్రజల హృదయాల్లో ఉంటాడు. ఆయన ప్రజల కోసమే అమరుడయ్యారు’ అని విరసం నేత కళ్యాణరావు పేర్కొన్నారు. కాగా, శుక్రవారం ఆర్కే మరణ వార్తను ధ్రువీకరించుకుని శిరీష, బంధుమిత్రులు విలపించారు. శిరీషను విరసం అధ్యక్షుడు అరసవెల్లి కృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పినాకపాణి, సహాయ కార్యదర్శి రివేరా, అమరుల బంధు మిత్రుల సంఘం సభ్యురాలు శోభా తదితరులు పరామర్శించారు. -
ఆర్కే అంత్యక్రియలు.. ఫొటోలు విడుదల చేసిన మావోయిస్టు పార్టీ
సాక్షి, అమరావతి: మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే అంత్యక్రియలు ముగిశాయి. మావోయిస్టు లాంఛనాలతో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించినట్టు మావోయిస్టు పార్టీ తెలిపింది. ఈ సందర్భంగా ఆర్కే అంత్యక్రియల ఫొటోలు విడుదల చేసింది. తెలంగాణ సరిహద్దులో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించినట్టు తెలిపింది. పామేడు-కొండపల్లి సరిహద్దులో నిర్వహించిన ఈ అంత్యక్రియలకు మావోయిస్టులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి నివాళులర్పించారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు పూర్తిచేసినట్టు తెలిసింది. -
మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి?
రాయ్‌పూర్: మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్.కె అనారోగ్యంతో మృతి చెందినట్టు వార్తలు వెలువడుతున్నాయి. అక్కి రాజు రామకృష్ణ అలియాస్ ఆర్కే అనారోగ్య కారణాలతో బీజాపూర్ అడవుల్లో మృతిచెందినట్టుగా ఛత్తీస్‌గఢ్ పోలీసులు చెప్తున్నారు. గత మూడేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆర్కే తుదిశ్వాస విడవడంతో మావోయిస్టు పార్టీ పెద్ద దిక్కును కోల్పోయింది. నాలుగు దశాబ్దాలుగా పార్టీకి సేవలందించిన ఆర్కే అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో జరిగిన శాంతి చర్చల్లో కీలక పాత్ర వహించారు. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఆర్కే తలపై రూ.కోటి రివార్డు కూడా ఉంది. దేశవ్యాప్తంగా పలు కేసుల్లో ఆయన కీలక సూత్రధారిగా ఉన్నారు. ఆర్కే స్వస్థలం గుంటూరు జిల్లా తుమృకోట. ఎన్నోసార్లు ఇలాంటి వార్తలే.. ఆర్కే చాలాసార్లు పెద్ద పెద్ద ఎన్కౌంటర్ల నుంచి చివరి నిమిషంలో తప్పించుకున్నారు. భారీ ఎన్కౌంటర్ జరిగిన ప్రతీసారి ఆర్కే చనిపోయారా? లేదా బతికే ఉన్నారా? అనే చర్చ కూడా నడుస్తూ ఉండేది. కానీ, మళ్లీ ఆయన కదలికలు మొదలయ్యేవి. అయితే, ఆయన కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో తాజాగా వెలువడుతున్న వార్తలు ఆ పార్టీ సానుభూతిపరులను నైరాశ్యంలో ముంచాయి. అయితే, ఆర్కే మరణ వార్తపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలాఉండగా.. కీలక నేతల వరుస మరణాలు మావోయిస్ట్ పార్టీ ని అయోమయంలో పడేశాయి. కరోనాతో పాటు అనారోగ్య సమస్యల తో ఒక్కొక్కరు గా నేతలు చనిపోతూ ఉండటం ఆ పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తోంది. (చదవండి: అమీర్‌పేట్‌లో ఉద్రిక్తత.. ప్రోటోకాల్ రగడ) (చదవండి: సాంబారు రుచిగా లేదని తల్లి, సోదరిని చంపిన కిరాతకుడు) -
కరోనాతో సీనియర్ జర్నలిస్ట్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ చిన్న పెద్ద వ్యతాసం లేకుండా అందరిని బలి తీసుకుంటోంది. ఇప్పటీకే మహమ్మారి బారినపడి ఎంతోమంది జర్నలిస్టులను ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆర్కేగా సుపరిచితుడైన సీనియర్ జర్నలిస్ట్ భళ్ళమూడి రామకృష్ణ బుధవారం కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో గాంధీ హాస్పిటల్లో చేరారు. గత వారం రోజులుగా చికిత్స పొందుతున్న ఆర్కే ఈ ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆర్కే స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, ఎన్‌టీవీలతోపాటు డెక్కన్ క్రానికల్‌లో ఆయన పనిచేశారు. ఆర్కే మరణంతో మీడియా వర్గాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.. జర్నలిస్ట్ భళ్ళమూడి రామకృష్ణ మృతి పట్ల జర్నలిస్టు సంఘాలు విచారం వ్యక్తం చేశాయి. చదవండి: కరోనా: దేశంలో కొత్తగా 3,82,315 కేసులు -
ఆపరేషన్ ఆర్కే పేరుతో గాలింపు చర్యలు
సాక్షి, మల్కన్‌గిరి: మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పరిసరాల్లో ఉన్నట్లు సమాచారం అందడంతో ఒడిశా పోలీస్ యంత్రాంగం కూంబింగ్ ముమ్మరం చేసింది. ఆర్కేతోపాటు మరో ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు ఉదయ్, చలపతి కూడా ఇదే ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆపరేషన్ ఆర్కే పేరుతో గాలింపు మొదలుపెట్టారు. ఎస్‌వోజీ, డీబీఎఫ్‌లతో పాటు ఆంధ్ర గ్రేహౌండ్స్, తూర్పు గోదావరి జిల్లా పోలీసులతో కలిసి ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఉనికి కోసం మావోయిస్టుల యత్నాలు గతంలో చిత్రకొండ కటాఫ్ ఏరియా మావోయిస్టులకు అడ్డాగా ఉండేది. కానీ ఇప్పుడు కటాఫ్ ఏరియాలో రహదారుల నిర్మాణం జరగడం, అలాగే ఎక్కడికక్కడ బీఎస్ఎఫ్ క్యాంపులు ఏర్పాటై జవాన్లు నిరంతరం కూంబింగ్ నిర్వహిస్తుండటంతో మావోయిస్టుల అలజడి తగ్గుముఖం పట్టింది. ఈ ప్రాంతంపై తిరిగి పట్టు సాధించేందుకు మావోయిస్టులు ఇక్కడ జరుగుతున్న రోడ్ల నిర్మాణాలను అడ్డుకోవడం, కాంట్రాక్టర్ల వాహనాలు కాల్చివేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఈ ఏరియాలోనే ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఈ నెల 15వ తేదీన చిత్రకొండ కటాఫ్ ఏరియాలో కూంబింగ్ చేపట్టగా ఎదురు కాల్పులు జరిగాయి. ఆ సమయంలో అగ్రనేతలు తప్పించుకున్నారు. అనంతరం మావోయిస్టు శిబిరం నుంచి పోలీసులు మావోల సామగ్రితో పాటు ఒక పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పెన్‌డ్రైవ్‌లో ఉన్న వివరాలను మాత్రం బయటకు పొక్కనివ్వలేదు. -
లోకేశ్‌పై ఒకటికి రెండు ఇస్తామంటూ పందేలు..
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో మొదటి దశలోనే ఎన్నికలు ముగిశాయి. ఫలితాలకు ఇంకా 40 రోజుల సమయం ఉంది. అయితే ఎన్నికల్లో ఏయే స్థానాల్లో ఏయే పార్టీ అభ్యర్థులు ఎంత మెజార్టీతో గెలుస్తారు.? ఎవరు ఓడతారు.? ఓడితే ఎంత మెజార్టీతో ఓడతారు.? ఇలా బెట్టింగ్ రాయుళ్ల పెందెలకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ రాయుళ్ల ఫోకస్ అంతా మంగళగిరిపైనే ఉంది. ఇక్కడి నుంచి సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ పోటీచేస్తుండడం... ప్రతిపక్ష పార్టీ బలంగా ఉండడంతో ఎవరు గెలుస్తారు.. గెలిస్తే ఎంత మెజార్టీ వస్తుంది అనే అంశాలపై బెట్టింగ్ జోరుగా సాగుతున్నాయి. వైఎస్సార్ సీపీపైనే బెట్టింగ్ రాయుళ్ల చూపు.. నియోజకవర్గంలో సుమారు రెండు లక్షల డెబ్బై వేల ఓట్లున్నాయి. ఇక్కడ 85 శాతం పోలింగ్ నమోద అయింది. క్షేత్ర స్థాయిలో ఓటర్ పల్స్‌ని పసిగట్టిన పంటర్లు మాత్రం వైఎస్సార్ సీపీపైనే పందెం వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. లోకేశ్ గెలుస్తాడు అని బెట్టింగ్ వేసే వారికి ఒకటికి 1.5 నుంచి రెండు రెట్లు ఇస్తామంటున్నారు. (ఉదాహరణకు లోకేశ్ వైపు రూ.లక్ష పందెం కాస్తే లక్షా యాభైవేల నుంచి రెండు లక్షలు ఇచ్చే అవకాశం ఉంది). భారీగా పోలింగ్ నమోదవడంతో పాటు నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న బీసీలు, ఎస్సీలు ప్రతిపక్షం వైపు మొగ్గు చూపినట్లు భావిస్తున్నారు. లోకేశ్‌ను దెబ్బతీసిన ద్వితీయ శ్రేణి నాయకులు.. స్వయంగా సీఎం తనయుడు, టీడీపీ భవిష్యత్ నాయకుడిగా భావించే లోకేశ్ బరిలో ఉండడంతో సాధారణంగానే ఆ పార్టీ ఇక్కడ గెలుపుపై తీవ్ర కసరత్తు చేసింది. అయితే ఎలక్షన్ ముందు రోజు చాలా ప్రాంతాల్లో టీడీపీ నాయకులు లోకేశ్‌కు హ్యాండ్ ఇచ్చారు. డబ్బులు అందగానే వారి ‘దారి’ వారు చూసుకున్నారు. దీనికి తోడు లోకేశ్ గెలిస్తే తాడేపల్లి మండలంలో కొండలపై ఉన్న వారి ఇళ్లను తొలగిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. వీరంతా గంపగుత్తగా ఆర్కేకు వైపు మొగ్గు చూపినట్లు తెలసుస్తోంది. అలాగే భూ సేకరణ వల్ల ఐదేళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగిన రైతులు, ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇచ్చి నష్టపోయిన రైతులు... చేనేతలు ఇలా అందరూ టీడీపీకి వ్యతిరేకంగా ఓటు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్కే గెలిస్తే మంత్రి పదవి..! ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరిలో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ ఆర్కేను గెలిపిస్తే మంత్రిని చేస్తానని ప్రకటించడంతో అప్పటిదాకా ఉన్న సమీకరణాల్లో స్పష్టమైన మార్పు వచ్చింది. ఆర్కే మంత్రిగా ఉంటే తమ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తటస్త ఓటర్లు భావించారు. దీంతో అన్ని వర్గాల ఓటర్లతో స్పష్టంగా ఆర్కేను గెలిపించుకుందామనే భావన వ్యక్తమవడంతో లోకేశ్ ఓడిపోతారనే ప్రచారం జోరుగాసాగుతోంది. ఎన్నికలకు వారంముందు వరకు.. ఎన్నికలకు వారం ముందు వరకు నియోజకవర్గంలో ఓటరు నాడి అంతుపట్టకుండా ఉంది. బలాబలాలు సమానంగా కనిపించాయి. అయితే చివరిలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రచారం, ఆర్కేకు మంత్రి పదవి హామీ ఇవ్వడంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థికి బలం చేకూరింది. దీంతోనే పంటర్లు ఆర్కేపైనే పందెం కాసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి పోలింగ్ రోజు లోకేశ్ నానా హంగామా చేయడంతో బెట్టింగ్ రాయుళ్లు అతడి గెలుపుపైఅంచనాకు వచ్చినట్లు సమాచారం. -
పూర్ణ.. బంటి... ఓ పాట
‘సీమటపాకాయ్, అవును, లడ్డుబాబు, జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు కథానాయిక పూర్ణ. తాజాగా ఆమె ‘అదుగో’ చిత్రంలో ఓ ప్రత్యేక పాటలో నటించారు. బంటి అనే పంది పిల్ల లీడ్ రోల్లో ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. అభిషేక్ వర్మ, నభా, రవిబాబు, ఉదయ్ భాస్కర్, ఆర్కే, వీరేందర్ చౌదరి ఇతర పాత్రల్లో నటించారు. పూర్ణ నటించిన ప్రత్యేక పాటను ఈ రోజు విడుదల చేస్తున్నారు. ఈ పాటలో పూర్ణతో పాటు టైటిల్ రోల్ చేస్తున్న బంటి అనే పందిపిల్ల కూడా కనిపించనుంది. రవిబాబు మాట్లాడుతూ– ‘‘ఈ పాట ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వబోతోంది. ప్రశాంత్ విహారి చక్కటి సంగీతం అందించాడు. ఈ చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. దసరా సెలవుల్లో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎన్. సుధాకర్ రెడ్డి. -
తృటిలో తప్పించుకున్న ఆర్కే!
మల్కన్‌గిరి/సీలేరు (విశాఖ ఏజెన్సీ): ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి జోడాంబు పంచాయతీ పరిధిలోని సిమిలిపోదర్ అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత ఆర్కే తృటిలో తప్పించుకు న్నారు. ఉదయం 9 గంటల సమయంలో కాల్పులు చోటుచేసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఆర్కేతోపాటు మరో ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు పరారయ్యారని చెప్పారు. పోలీసులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. అప్రమత్తమైన పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఒడిశా డీజీపీ ఆర్పీ శర్మ మాట్లాడుతూ మావోయిస్టుల అణచివేతకు ఛత్తీస్ గఢ్, ఆంధ్ర పోలీసులతో కలిసి ఒడిశా పోలీసులు ఎంతో శ్రమిస్తున్నారని తెలిపారు. 2016లో రాయగఢ్ ప్రాంతంలో 34 మంది మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారని తెలిపారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్–ఒడిశా సరిహద్దు ల్లో భారీ ఎన్కౌంటర్లు జరిపి 38 మంది మావోయిస్టులను హతమార్చా మని తెలిపారు. మావోయి జాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని సీఎం నవీన్ పట్నాయక్ మావోయిస్టులకు పిలుపునిచ్చారని తెలిపారు. అందుకోసమే ఆపరేషన్ ఆలౌట్‌ను మల్కన్‌గిరి జిల్లా నుంచి ప్రారంభించామని స్పష్టం చేశారు. దీనికోసం గురువారం హెలికాప్టర్లతో సర్వే కూడా చేయించామన్నారు. మల్కన్‌గిరిలో క్యాంప్‌లను నిర్వహిస్తామని చెప్పారు. కాగా ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి 303 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలపై ఈసీకి ఫిర్యాదు
హైదరాబాద్: ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను గురువారం వైఎస్సార్సీపీ నేతలు కలిశారు. భన్వర్‌లాల్ కార్యాలయానికి వెళ్లిన వైఎస్సార్సీపీ ఎమ్మేల్యే ఆర్కే, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఫిర్యాదు చేశారు. -
ఆర్కే, వడివేలు కాంబినేషన్ లో మరో చిత్రం
నటుడు ఆర్కే, వడివేలు కలిసి నటించిన ఎల్లాం అవన్ సెయల్, అళగర్ మలై చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా మరోసారి ఈ హిట్ కాంబినేషన్ లో చిత్రం తెరకెక్కనుంది.నటుడు ఆర్కే ప్రస్తుతం కథానాయకుడిగా నటిస్తూ తన పాసరై బ్యానర్లో నిర్మిస్తున్న చిత్రం వైగై ఎక్స్‌ప్రెస్. నీతుచంద్ర, ఇనియ, కోమలశర్మ, సుజావరూణి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆర్కే.సెల్వమణి, ఎంఎస్.భాస్కర్, రమేశ్‌ఖన్నా ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి షాజీకైలాష్ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 200 లకు పైగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆర్కే తెలిపారు. వైగై ఎక్స్‌ప్రెస్ చిత్రం విడుదలకు ముందే మరో చిత్రాన్ని నిర్మించి, హీరోగా నటించడానికి ఆర్కే సిద్ధమయ్యారు. దీనికి నీయుమ్ నానుమ్ నడువుల పేయుమ్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో హాస్య పాత్రను నటుడు వడివేలు పోషించనున్నారని చెప్పారు.ఇంతకు ముందు తన్నీయిల్ గండం వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన ఎస్ఎన్ .శక్తివేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు. వినోదమే ప్రధానంగా తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుందని చెప్పారు. ఈ చిత్రానికి రాజారత్నం ఛాయాగ్రహణం అందించనున్నారని ఆర్కే తెలిపారు. -
ఎమ్మెల్యే ఆర్కే వినూత్న నిరసన
గుంటూరు: పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) వినూత్నంగా నిరసన తెలిపారు. గుంటూరు పట్టణంలో జరిగిన జిల్లా పరిషత్ సమావేశానికి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే ఆర్కే, వైఎస్ఆర్సీపీ నేతలు, ఇతర అధికారులు హాజరయ్యారు. పెద్ద నోట్ల రద్దు అంశంపై ప్రజలకు తన మద్ధతు తెలిపేందుకు జెడ్పీ సమావేశం పూర్తయ్యేవరకు తాను నిలుచునే ఉంటానని ఎమ్మెల్యే ఆర్కే స్పష్టంచేశారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు గంటల తరబడి క్యూలైన్లలో కష్టపడుతున్నారని చెప్పిన ఆయన సమావేశం పూర్తయ్యేవరకూ నిలబడే ఉన్నారు. పార్టీ నేత ఆర్కేకు మద్ధతుగా సమావేశం ముగిసేవరకూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు నిలబడి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా తమ నిరసన తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత కేవలం 50 రోజులు ఓపిక పడితే కష్టాలు తీరుతాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు... కానీ, యాభై రోజులు గడిచినా ప్రజల కష్టాలు తీరడం లేదంటూ నోట్ల రద్దు నిర్ణయాన్ని వైఎస్ఆర్ సీపీ నేతలు వ్యతిరేకించారు. మరోవైపు రద్దయిన రూ.500, వెయ్యి రూపాయల నోట్లను మార్చుకునేందుకు తుది గడువు నేటితో ముగియనున్న విషయం తెలిసిందే. -
చంద్రబాబు నివాసానికి భద్రత పెంపు
ఉండవల్లిలోని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి పోలీసులు భద్రతను పెంచారు. అదనంగా మరో 25 మంది సాయుధ సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌తో కలిసి ఏపీ డీజీపీ సాంబశివరావు ఆదివారం భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఏపీ డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులపై బురద జల్లడం మావోయిస్టులకు అలవాటైందని వ్యాఖ్యానించారు. మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ(ఆర్కే) విషయంలో అది మరోసారి రుజువైందని చెప్పారు. గాయపడిన మావోయిస్టులు లొంగిపోతే పూర్తిస్థాయిలో చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. ఏవోబీలో వారం కిందటే కూంబింగ్‌ను ఆపేశామని డీజీపీ సాంబశివరావు తెలిపారు. -
పిటిషన్ విత్ డ్రా చేసుకున్న ఆర్కే భార్య
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ(ఆర్కే) క్షేమంగా ఉన్నారనే సమాచారం అందడంతో ఆయన భార్య శిరీష హైకోర్టులో వేసిన పిటిషన్ విత్‌డ్రా చేసుకున్నారు. ఏవోబీ ఎన్కౌంటర్ అనంతరం ఆర్కే కనిపించకుండా పోవడంతో ఆయన భార్య శిరీష హైకోర్టులో హెబియస్ కార్పస్ వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆర్కే సమాచారం తెలియడంతో ఈ రోజు తన తరఫు న్యాయవాది ద్వారా న్యాయస్థానాన్ని పిటిషన్ విత్‌డ్రా అనుమతి కోరారు. -
మావోయిస్టు అగ్రనేత ఆర్కే క్షేమం
-
ఆర్కే క్షేమం
► విరసం నేత వరవరరావు వెల్లడి ► పది రోజుల ఉత్కంఠకు తెర ► మావోయిస్టు పార్టీ ఏఓబీ అధికార ప్రతినిధి జగబంధు ఫోన్ ద్వారా తెలిపారని వివరణ ► ఏఓబీలో కూంబింగ్ నిలిపివేయాలని డిమాండ్ ► నేడు ‘హెబియస్ కార్పస్ రిట్’ వెనక్కి... సాక్షి, హైదరాబాద్ : మావోయిస్టు పార్టీ నేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) క్షేమంగా ఉన్నట్లు విరసం నేత వరవరరావు తెలిపారు. మావోయిస్టు పార్టీ ఏఓబీ అధికార ప్రతినిధి జగబంధు ఫోన్ ద్వారా ఆర్కే క్షేమ సమాచారాన్ని అందజేసినట్లు వివరించారు. హైదరాబాద్‌లో గురువారం రాత్రి వరవరరావు మీడియాతో మాట్లాడారు. జగబంధు ఇప్పటికే విడుదల చేసిన 14 నిమిషాల ఆడియోలో తాము క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్నా... వారిలో ఆర్కే ఉన్నాడా లేదా అన్నదానిపై ఇప్పటివరకూ ఆందోళన నెలకొందన్నారు. జగబంధు తనకు ఫోన్ చేసి ఆర్కే కూడా క్షేమంగా ఉన్నారని తెలిపినట్లు వెల్లడించారు. ఏఓబీలో పోలీసు బలగాల గాలింపు వెంటనే నిలిపివేయాలని జగబంధు డిమాండ్ చేసినట్లు చెప్పారు. ఈ నెల 5, 6 తేదీల్లో విశ్వవిద్యాలయాల విద్యార్థులు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాల ప్రతినిధులు ఎన్‌కౌంటర్‌పై నిజనిర్ధారణ కోసం మల్కన్ గిరికి రానున్నందున కూంబింగ్‌ను ఉపసంహరించుకోవాలని కోరారన్నారు. పోలీసులు 31 మంది మావోయిస్టులను దారుణంగా హతమార్చారని, అందులో నిరాయుధులైన 9 మంది ఆదివాసీలున్నారని జగబంధు తనకు వివరించినట్లు వరవరరావు తెలిపారు. కాగా ఆర్కే ఆచూకీ కోసం తాము హైకోర్టులో వేసిన హెబియస్ కార్పస్ రిట్‌ను శుక్రవారం ఉపసంహరించుకోనున్నట్లు చెప్పారు. సోదరుల హర్షం ఆర్కే క్షేమంగా ఉన్నట్లు తెలియడంతో దేశ వ్యాప్తంగా మావోయిస్టు సానుభూతిపరులు, వామపక్షాల అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఇన్ని రోజులుగా ఆర్కే విషయంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఆర్కే క్షేమంగా ఉండడంపై రాజేంద్రనగర్‌లో నివసిస్తున్న ఆయన సోదరులు సంతోషం వ్యక్తం చేశారు. -
తక్షణమే ఆర్కేను కోర్టులో హాజరు పర్చాలి
కర్నూలు: ఏఓబీ ఎన్కౌంటర్లో పోలీసులు మావోయిస్టు అగ్రనేత రామకష్ణ(ఆర్కే)ను అదుపులోకి తీసుకొని ఉంటే తక్షణమే కోర్టులో హాజరు పరచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలోని సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో సరస్వతి నగర్లో బుధవారం చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగితే ఆంధ్రా డీజీపీనే మాట్లాడుతున్నారు తప్ప ఒరిస్సా పోలీసులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎన్ కౌంటర్ బూటకమని, కాల్పుల్లో 32 మంది చనిపోతే అందులో ఆర్కే లేడని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పోలీసుల అదుపులో ఉంటే ఆయనను త్వరగా బయటకు తెచ్చి కోర్టులో హాజరు పర్చాలన్నారు. మావోలు అడవుల్లో ఉంటూ ప్రాణాలు కోల్పోరాదని, వామపక్ష పార్టీల నాయకులతో కలసి పోరాడాలన్నారు. మావోయిస్టులు అందరూ జనజీవన స్రవంతిలో కలసి ప్రజాసమస్యల పోరాటంలో భాగస్వాములు కావాలని కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యున్నతికి ఈనెల 15న విజయవాడలో అన్ని సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. -
మున్నా వాళ్ల అమ్మ
పిల్లలకు రెక్కలొస్తాయి. ఎగిరిపోతారు. ‘బడిపంతులు’ సినిమాలో... ‘రెక్కలు అలసి మేమున్నాము...’ అని తల్లితండ్రులు వాపోతారు. మున్నా అలా కాదు. రెక్కలొచ్చాయని అమ్మానాన్ననూ,వాళ్ల ఆశయాన్నీ వదిలిపోలేదు. రెక్కలు ఉన్నాయి కాబట్టే... అడవిలోకి ఎగిరిపోయాడు. చిన్నప్పుడు మున్నా తల్లితో అనేవాడు... ‘‘అమ్మా... వర్షం వస్తోంది. పిట్టలకు ఇళ్ళుండవు కదా.. మనింట్లోకి రమ్మనమ్మా...’’ అనేవాడు! రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో మున్నాను పెంచింది తల్లి. ఇప్పుడు తనే.. కొడుకును పోగొట్టుకొని... భర్త జాడ కనుమరుగై రెక్కలు తెగిన పక్షి అయింది. కన్నీటి వర్షంలో తడుస్తోంది. బిడ్డల్ని త్యాగం చేసిన విప్లవ మాతలను చూశాం. అసలు బిడ్డలే వద్దనుకున్న త ల్లితండ్రులనూ విప్లవంలో చూశాం. కానీ ప్రజాయుద్ధంతో మరణాన్ని జయించడమెలాగో నేర్పిన తండ్రి ఆర్కేనే అంటారు కొడుకు మున్నా (పృథ్వి) చేయిపట్టుకొని ఉద్యమానికి పరిచయం చేసిన కన్నతల్లి శిరీష అలియాస్ పద్మక్క. మావోయుస్టు అగ్రనేత అక్కి రాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) భార్యగా, చెట్టంత కొడుకుని తాజా ‘ఎన్కౌంటర్’లో పోగొట్టుకున్న తల్లిగా ఆమె దుఃఖాన్నీ, జ్ఞాపకాలనూ ‘సాక్షి ఫ్యామిలీ’తో పంచుకున్నారు. ‘దూరంగానే ఉన్నా మా మనసులెంతో దగ్గరగా ఉన్నాయనుకున్నా. కానీ రాజ్యం మా కుటుంబాల్ని చెదరగొట్టింది. నా కొడుకుని పొట్టనబెట్టుకుంది. నా భర్తని మాయం చేసింది. అయినా ఈ యుద్ధం ఆగదు’ అని తేల్చి చెప్పిన పద్మక్కతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. మీ భర్త, మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే ఏమయ్యాడంటారు? నా భర్త యుద్ధరంగంలోనే ఉంటే నాకు ఏదోలా కబురుపంపేవాడు. ఆర్కేని కచ్చితంగా పోలీసులే మాయం చేశారు. కోవర్టులతో కుమ్మక్కయ్యారు కనుకనే ఆర్కేనీ, నా కొడుకునీ పట్టుకోగలిగారు. లేకపోతే వాళ్ళంత ఈజీగా దొరకరని నా నమ్మకం. ఆర్కేను వెంటనే కోర్టులో హాజరుపర్చాలి. చంపివేస్తే కనీసం డెడ్బాడీనైనా బయటపెట్టాలి. ఈ కుట్రలతో ఎంతోకాలం ప్రజల్ని మోసం చేయలేరు. ప్రజలందరూ మోసగాళ్ళు కాదు. కోవర్టులుగా కొందరే మారతారు. హైకోర్టు ఆదేశాలతో ఏం జరుగుతుందని భావిస్తున్నారు? నా భర్త ఆచూకీ కోసం కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాం. నక్సలెటైై్లనా, మరెవ్వరైనా పౌరుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హైకోర్టు స్పష్టం చేసింది. తేలాల్సింది పోలీసుల అసలు స్వరూపమే. కోర్టు గురువారానికి (నవంబర్ 3కి) వాయిదా పడింది. ఈ లోపు వాళ్ళేం చేసినా చెయ్యొచ్చు. చంపేసినా చంపే యచ్చు. అయినా ఒక ఆర్కేని మట్టుపెడితే ఇంకెందరో ఆర్కేలు పుట్టుకొస్తారు. ఆర్కేని మట్టుపెట్టి యుద్ధాన్ని ఆపగలమని భావించడం వారి వెర్రితనమే. తల్లిగా మీ దుఃఖానికి కారణం? ఖచ్చితంగా రాజ్యమే. రాజ్యహింసని అత్యంత దగ్గరగా అనుభవించిన నా కొడుకు ఉద్యమమే విముక్తి మార్గమనుకున్నాడు. నా భర్త అయినా, నా కొడుకైనా, ఇంకా ఎందరో ఉద్యమకారులైనా ప్రజల కష్టాలను తమ కష్టాలుగా భావించారు. నిస్వార్థంగా బతికారు. ఇప్పుడు జనం నా కొడుకు మున్నా కోసం ఏడుస్తుంటే ఇంకొంత కాలం వాడు ప్రజలకోసం పనిచేస్తే బాగుండనిపిస్తోంది. మున్నాతో జ్ఞాపకాలను మాతో పంచుకుంటారా? నా బిడ్డ మున్నా మనసు వెన్న. వర్షంలో తడుస్తున్నాయని పక్షులను సైతం ఇంట్లోకి పిలవమన్నాడు. వాటికి ఇళ్ళు లేవా, మనకంటే నాన్న లేడు. కానీ వాటికి ఇల్లు కూడా లేదే అంటూ దిగులు పడేవాడు. బడి నుంచి ఇంటికొచ్చే సరికి ఏ కోడిపిల్లకి ఏమైందోనని ఆదుర్దాపడేవాడు. బడినుంచి వాడి నడక నేరుగా ఇంట్లోకి కాదు, పక్షుల దగ్గరికీ, నోరులేని జీవాల దగ్గరికే. వాటికేదన్నా అయి చనిపోతే విలవిల్లాడేవాడు. బడికి వెళ్ళేప్పుడు మాత్రం నా బుగ్గ మీద ముద్దు మర్చిపోయేవాడు కాదు. ఎప్పుడైనా తొందరలో మర్చిపోయినా వెనక్కి తిరిగొచ్చి వాడి ముద్దుతో నా కన్నీళ్ళు తుడిచేవాడు. (ఆగని కన్నీటిని తుడిచే కొడుకు కోసం ఇంకా ఎదురుచూస్తున్నట్టుంది పద్మక్క ముఖం) మున్నా బాల్యం, చదువు ఎలా గడిచాయి? అత్యంత నిర్బంధంలో. నాన్న ఆచూకీ చెప్పమనో, నా భర్త వచ్చాడనో, లేక నా పైన నిఘా వేస్తే నా భర్త దొరుకుతాడనో పోలీసుల దాడులు, నిర్బంధం మమ్మల్ని నిత్యం భయభ్రాంతులకు గురిచేశాయి. ఈ రోజేమీ జరగదని ఊపిరి పీల్చుకున్న సందర్భాలు మా జీవితాల్లో అరుదు. అందుకే ఒంగోలులోనే రహస్యంగా వాడిని చదివించాం. నాకేమో వాడిని బాగా చదివించాలని ఉండేది. వాడికి ఇతర విషయాలపైనే వాడి దృష్టంతా. అదేంటో నాకు అర్థం కాలేదు. ఉన్నత చదువులంటే వాడి అర్థం వేరు. వాళ్ళ నాన్నని గురించి ఎప్పుడైనా అడి గేవాడా? ఓ రోజు హఠాత్తుగా అడిగాడు - అమ్మా నాన్న మనల్ని ఎందుకు వదిలివెళ్ళాడని. నాన్నకి మనమంటే ఇష్టమేరా కన్నా, జనం కోసమే మనల్ని వదిలి వెళ్ళాడని చెప్పాను. ఊహ తెలిసినప్పటి నుంచి నాన్న గురించే ప్రశ్నించేవాడు. నా ఆగని దుఃఖానికి కారణమేంటో వాడికి అర్థం అయ్యేది కాదు. కానీ కొంత వయసొచ్చాక, ‘రాని నాన్న కోసం ఎందుకమ్మా ఏడుస్తావు’ అన్నాడు. నాపై, నా తోబుట్టువులపై ప్రభుత్వ నిర్బంధాన్ని చూసి నిర్ఘాంతపోయేవాడు. మున్నా నక్సల్ మార్గాన్నెంచుకోవడానికి కారణం? వాడు మంచి చదువులు చదువుకోవాలని నా కోరిక. వాళ్ళనాన్న చెపితేనైనా చదువుపై శ్రద్ధపెడతాడనిఅనుకున్నాను. అందుకే ఆర్కే కాంటాక్ట్ కోసం అడవికి వెళ్ళాను. ఆయనకోసం వెళ్ళినప్పుడల్లా కాంటాక్ట్ దొరకక ఒకోసారి రెండు మూడు నెలలు మేం కూడా గిరిజనులతోపాటే అడవిలోనే గడపాల్సి వచ్చేది. మున్నా అక్కడి ప్రజల్లో ఇట్టే కలిసిపోయేవాడు. చాలా పుస్తకాలు కూడా చదివేవాడు. అక్కడి తన లాంటి పిల్లల్ని చూశాడు. వాళ్ళ తిండి తిన్నాడు. వాళ్ళ కష్టాల్ని పంచుకోవడమూ అలవాటైంది. రాజ్య హింస వాడిని చదువుకంటే అడవినే ప్రేమించేలా చేసింది. ఎప్పటికి కలవగలిగారు వాళ్ల నాన్నని? ఒక్కోసారి ఐదారు నెలలకు కూడా కాంటాక్టు దొరికేది కాదు. అంతకాలం అక్కడే ఉండేవాళ్లం. చివరకు నా బిడ్డని నా భర్త దగ్గరికి తీసుకెళ్ళా. ఆర్కే, వాడితో చదువు గురించి మాట్లాడాలన్నది నా కోరిక. ఆర్కే వాడికి చదువు నేర్పాడు. కానీ నేననుకున్న చదువుకాదది. కొద్ది రోజులు అక్కడే ఉంటానన్నాడు మున్నా. ఆ కొద్ది రోజులూ చాలా రోజులని నాకర్థం కాలేదప్పుడు. ఆ తరువాత నేను నా అక్కయ్యల దగ్గరే ఉన్నాను. జి. కల్యాణరావు గారు (రచయిత, ‘విరసం’ నేత) మా అక్క అమృత భర్త. ఉద్యమం ఎప్పుడూ అండగా నిలిచింది. మమ్మల్ని కాపాడుకోవడానికి మా కుటుంబమంతా నిర్బంధాన్ని అనుభవించింది. మున్నా గురించి ఆర్కే ఏమని చెప్పేవారు? మున్నాని ఉద్యమంలోనికి ఆహ్వనించిందే వాళ్ళ నాన్న. తన కొడుకు అందరిలా ఏ డాక్టరో, ఇంజనీరో కావాలని వాళ్ళ నాన్న కోరుకోలేదు. నేను కూడా. తన కొడుకుని తనలా ప్రపంచ ప్రజలను ప్రేమించడం నేర్పాలని ఆర్కే కల. అదే విషయాన్ని ఉత్తరాల్లోనూ రాసేవాడు. వాడిని ఓ ఉద్యోగస్థుడిలా కాకుండా, ఉద్యమకారుడిగా చూడాలని భావించేవారు. తన కొడుకే కాదు. విప్లవకారులందరి పిల్లలూ ఉద్యమాల్లోనే ఉండాలని ఉత్తరాల్లో రాసేవాడు. ‘నీ కిద్దరు పిల్లలు కదా, ఒకరినైనా ఉద్యమానికివ్వకూడదూ’ అని చాలా మంది సానుభూతిపరుల్ని కోరేవారు. మున్నా అటు వెళతాడని గ్రహించారా? వాళ్ళ నాన్న అనుసరించిన మార్గాన్ని మున్నా ఎంచుకుంటాడని నేనూ అనుకోలేదు. వాళ్ళ నాన్న త్యాగం వాడికి అర్థమైతే నా కన్నీటిని వాడు అర్థం చేసుకుంటాడనుకున్నా. నా దృష్టిలో మున్నా చిన్నపిల్లాడే, కానీ వాడేంటో కొద్దికొద్దిగా అర్థం అయ్యేసరికే వాడు నాకందనంత ఎదిగిపోయాడు. ఎంతగా అంటే మావోయిస్ట్ సైన్యానికే యుద్ధతంత్రాలు నేర్పేంతగా. మున్నా మళ్ళీ ఎప్పుడైనా మీ దగ్గరికి తిరిగి వచ్చాడా? ఇక మళ్ళీ రాలేదు. నేనే వాణ్ణి తీసుకొద్దామని వెళ్ళాను. అప్పటికి ఏడాదిన్నర అయ్యింది. వాడి కోసమే 2010లో ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు (ఏఓబి)కి వెళ్ళా. అప్పుడే గంటి ప్రసాదంతో పాటు అరెస్టయ్యా. ఐ.ఎ.ఎస్. అధికారి వినీల్ కృష్ణ నిర్బంధమప్పుడు నిజానికి మావోయిస్టుల డిమాండ్ ఆదివాసీలను విడుదల చేయాలన్నదే. కానీ, పోలీసులు మమ్మల్ని విడుదల చేశారు. అందుకు నిరసనగానే గంటి ప్రసాదం మూడు రోజులు విడుదల కాలేదు. ఆ తరువాత మీ జీవనాధారం? నక్సలై ట్లు, అలా ఉద్యమంలో పనిచేసి బయటకు వచ్చినవారు ఆస్తులు సంపాదించుకుంటారనీ, అడవిలోకి వెళ్ళొచ్చి డబ్బులు వెనకేసుకుంటారనీ రాజ్యం దుష్ర్పచారం చేస్తూ ఉంటుంది. కానీ నా జీవితమే వారికి సమాధానం. ఒంటిపైన ఒకటి, దండెం పైన రెండూ - మొత్తం మూడు చీరలే నాకుండేవి. కటిక దారిద్య్రం అనుభవించా. ఓ వైపు పోలీసుల బెదిరింపుల నుంచి కాపాడుకుంటూనే బతుకుతెరువు చూసుకోవాలి. నేను చేయని పని లేదు. బట్టలు కుడుతూ బతికాను. కూలికెళ్ళి కడుపునింపుకున్నా. ఒంగోలు పొగాకు బేర్నీలో రోజు కూలీకి కూడా పనిచేశా. చివరకు హైదరాబాద్‌లో ఐదువేల రూపాయలకు టీచర్‌గా చేరా. పోలీసు నిర్బంధం నుంచి తప్పించుకోవడానికి ప్రతిసారీ మారాల్సి వచ్చేది. ఒంగోలుకొచ్చి ఓ బళ్ళో చేరాను. మావోయిస్ట్ఆర్కే అసలు మీకెలా పరిచయమయ్యారు? కారంచేడులో దళితుల ఊచకోతతో వేదనకు గురయ్యా. స్త్రీలపై వేధింపులు ఆందోళనకు గురి చేశాయి. కారంచేడు దారుణంపై జరిగిన ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొన్నా. అప్పుడే మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. అది పెళ్ళికి దారి తీసింది. నా కొడుకు ఎంత సున్నితమనస్కుడో నా భర్త ఆర్కే కూడా అంత అతి సున్నిత మనస్కుడు. అందుకే, అన్యాయంపై ఆయుధం ఎక్కుపెట్టాడు. మున్నాకి పృథ్వి అని పేరెందుకు పెట్టారు? పృథ్వి అంటే భూమి. ఆ భూమి కోసమే వారి పోరాటం. భూమి లేని వారి కోసమే వారి ఆరాటం. ఎవరి భూమినైతే కబళించాలనుకున్నారో, ఆ భూమిపైనే వాళ్లిద్దరూ నిలబడాలనుకున్నారు. ఆ భూమిపై ఉన్న ప్రేమతోనే వాడికి ఆ పేరు పెట్టాం. ఆ భూమిని నమ్ముకున్న వాళ్ళకోసమే ఈ అమ్మనొదిలి, ఎందరో అమ్మల కోసం తండ్రీకొడుకులిద్దరూ తరలిపోయారు. అదే విషయాన్ని వాళ్ళ నాన్న నాకు నచ్చజెబుతూ ఉండేవాడు. ఆర్కే మిమ్మల్ని కూడా ఉద్యమంలోకి ఆహ్వానించారా? అవును. నేనెప్పుడూ తనలాగే ఉద్యమాన్ని అంటిపెట్టుకుని ఉండాలని ఆర్కే అనుకునేవాడు. చాలాసార్లు రమ్మన్నాడు. నా అవసరం జనతన్ సర్కార్‌కి ఉందని చెప్పేవాడు. నేనేం చేయగలనని ప్రశ్నిస్తే, ఇక్కడి ఆదివాసీ పిల్లలకి చదువు నేర్పమన్నాడు. చివరకు నేను లోపలున్నప్పుడు సాయుధ దళాలకు బట్టలు కుట్టడం కూడా వారికి చాలా ఉపయోగపడుతుందన్నారు. నేనదే చేశాను. వెళ్ళిపోయాక మున్నా ఎప్పుడైనా తన కబురంపాడా? మున్నా నాకు ఉత్తరం రాశాడు. ‘ఎందరో తల్లులను ప్రేమించే నాకు నీ మీద ప్రేమ ఉండదా అమ్మా?’ అని అందులో ప్రశ్నించాడు. రాసిన ఉత్తరాన్ని నేను దొంగతనంగా దాచుకుని, దాచుకుని చదివేదాన్ని. కానీ ఇప్పుడు నిర్భయంగా, బహిరంగంగా, స్వేచ్ఛగా చదువుకుంటాను. మీరేదైనా చెప్పాలనుకుంటున్నారా? కోవర్టులతో కొన్నాళ్ళు ఉద్యమాన్ని దెబ్బతీయొచ్చు. కానీ ఎల్లకాలం అది సాధ్యం కాదు. ఈ ఆటుపోట్లు తాత్కాలికమే. వాళ్ళను నిజమైన యుద్ధం చేయమనండి. నా కొడుకు మరణించినా, అతనే నిజమైన హీరో. మావోయుస్టు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, ఆంధ్రా ఒరిస్సా బార్డర్ (ఏ.ఒ.బి) కమిటీ ఇన్ఛార్జ్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కేది మావోయిస్ట్ పార్టీ నాయకత్వంలో కీలకస్థానం. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం గుత్తికొండ బిలం దగ్గర్లోని తుంబిరి కోటకి చెందిన ఆర్కే 4 దశాబ్దాలుగా మావోయిస్ట్ ఉద్యమానికి వెన్నెముక. 1985 జూలైలో ప్రకాశం జిల్లా కారంచేడు దళితుల ఊచకోతకు నిరసనగా ఎగిసిపడ్డ ఉద్యమం ఆర్కేనీ, ప్రకాశం జిల్లాకి చెందిన పద్మక్కనీ కలిపింది. దాదాపు మూడు దశాబ్దాల వైవాహిక జీవితంలో ఆర్కే అడవిబిడ్డల విముక్తికే తన జీవితాన్ని అర్పిస్తే, పద్మక్క అతని కుమారుడిని ఉద్యమ నెలబాలుణ్ణి చేశారు. ఇటీవలి బలిమెల ‘ఎన్కౌంటర్’తో జాడ తెలీని ఆర్కే కోసం వెతుకుతున్నారు. - అత్తలూరి అరుణ, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి -
విశాఖలో ఆర్కేకు మద్దతుగా ఆందోళనలు
-
ఇంతకీ ఆర్కే ఎక్కడ ?
-
ఆర్కే, రవిలను విడుదల చేయాలి
వరవరరావు డిమాండ్ హైదరాబాద్: పోలీసుల అదుపులో ఉన్న సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రామకృష్ణ (ఆర్కే) అలియాస్ సాకేత్ అలియాస్ రాజన్న, గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్, దుబాషి శంకర్ అలియాస్ అంకమ్బాబురావు అలియాస్ మహేందర్ తదితరులను వెంటనే విడుదల చేయాలని విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు. వీరందరినీ బూటకపు ఎన్‌కౌంటర్‌తో హత్య చేసి కట్టు కథలు అల్లడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, వారిని కోర్టులో హాజరు పరచాలన్నారు. మల్కన్‌గిరి ఎన్కౌంటర్లో మృతిచెందిన ప్రభాకర్ మృతదేహానికి గురువారం యాప్రాల్‌లో వరవరరావు జోహార్లు అర్పించారు. అడవి సంపదను దోచుకోవడానికే... ప్రధాని మోదీ, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ప్రపంచ బ్యాంక్ ఎజెండాగా పనిచేస్తున్నారన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో అడవి సంపదను దోచుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌హంట్‌ను ప్రవేశపెట్టాయని, అందులో భాగంగానే ప్రజల కోసం పోరాడుతున్న విప్లవకారులపై ఎన్కౌంటర్ హత్యలకు పాల్పడుతున్నారన్నారు. మల్కన్‌గిరి జిల్లాలో ఎన్‌కౌంటర్‌ను కుట్రగా అభివర్ణించారు. మావోయిస్టులు కాలిస్తే పోలీసులకు గాయాలయ్యాయని, పోలీసుల కాల్పుల్లో మావోయిస్టుల ప్రాణాలు పోయాయన్నారు. మల్కన్‌గిరి ఘటనలో కాల్పులు ఏకపక్షంగా జరిగాయని ఆరోపించారు. ఇందులో కానిస్టేబుల్ మృతికి కాల్పులు కారణం కాదని.. కాలువలో పడి చనిపోయాడన్నారు. ఆదివాసీలపై ఎలాంటి కేసులూ పెట్టే అర్హత ప్రభుత్వాలకు లేదని, ఇప్పటికై నా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం, ఒడిశా, కేంద్ర ప్రభుత్వాలు కూంబింగ్లను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పీడిత ప్రజలున్నంతకాలం విప్లవం... పీడిత తాడిత ప్రజలున్నంత వరకు విప్లవ ఉద్యమాలు ఆగవని వరవరరావు స్పష్టం చేశారు. ఆదివాసీల దీర్ఘకాలిక సమస్యలపై మావోయిస్టు పార్టీ 30 ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తోందన్నారు. కేసీఆర్ ప్రకటన చేయాలి: గద్దర్ విప్లవకారుల ఎన్కౌంటర్లపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రజాగాయకుడు గద్దర్ డిమాండ్ చేశారు. ఆయనతో పాటు తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, పీడీఎం రాష్ట్ర అధ్యక్షుడు రాజు, అరుణోదయ సాం స్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క, తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు, పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కుమారస్వామి తదితరులు ప్రభాకర్ మృతదేహానికి జోహార్లు అర్పిం చారు. బూటకపు ఎన్కౌంటర్లతో నక్సలిజాన్ని ఆపలేరని, మావోయిస్టుల అడ్డుతొలిగితే మార్గం సులువు చేసుకోవచ్చని చంద్రబాబునాయుడు కలలు కంటున్నాడని విమలక్క అన్నారు. సమస్యలు పరిష్కరించేవరకు పోరాటాలను ఆపేదిలేదన్నారు. ఈ ఎన్కౌంటర్ వట్టి బూట కమని, పోలీసుల నాటకమని ప్రొఫెసర్ లక్ష్మణ్ అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అత్యంత క్రూరం గా వ్యవహరిస్తోందన్నారు. ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని నారాయణరావు డిమాండ్ చేశారు. విశాఖపట్నం మన్యం గిరి జనుల కడుపు నింపే అడవుల కింద కోట్లాది రూపాయల విలువచేసే బాకై ్సట్ ఖనిజం తవ్వకాల కోసమే బడా వ్యాపారవేత్తలతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు, ఒడిశా, కేంద్ర ప్రభుత్వాలు ఈ ఎన్‌కౌంటర్‌కు పాల్పడ్డాయని రాజు ఆరోపించారు. ప్రొఫెసర్ కాశీం, స్నేహలత, చంద్రమౌళి, అంద్శై నలమాస కృష్ణ తదితరులు ప్రభాకర్‌కు నివాళులర్పించారు. ఆశలన్నీ నీ మీదనే పెట్టుకుంటిమి ‘దోపిడి రాజ్యాన్ని కూల్చడానికి అడవిబాట పట్టి పేద ప్రజల హృదయాల్లో నిలిచిపోతివా... కొడుకా ప్రభాకరా.. ఎంత పని చేస్తిరి... నీ పాట ఎటుపోయె కొడుకా... తెలంగాణ కోసం మధనపడితివి. నా ప్రాణం అంటివి. తెలంగాణ వస్తే మన బతుకులు మారతాయంటివి. దోపిడి రాజ్యాన్ని మారుద్దామంటివి. ఆశలన్నీ నీ మీదనే పెట్టుకుంటిమి. మీ నాయన పోయినా రాకపోతివి. మాకు ఎవరు తోడుంటరు కొడుకా’ అంటూ ప్రభాకర్ తల్లి రత్నమ్మ గుండెలవిసేలా రోదించారు. కూంబింగ్ నిలిపివేయాలి... దండకారణ్యంలో కూంబింగ్‌ను నిలిపివేయాలి. సమాజంలో ఆర్థిక అసమానతలున్నంత కాలం నక్సలిజం ఉంటుంది. - ప్రభాకర్ సహచరి దేవేంద్ర -
ప్రజారాజధాని కాదు..పాలకుల భోజధాని
-ఎమ్మెల్యే ఆర్కే తాడేపల్లి రూరల్: టీడీపీ ప్రభుత్వం నిర్మిస్తోంది ప్రజారాజధాని కాదు.. అది పాలకుల భోజధానిగా మారిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) విమర్శించారు. స్థానిక కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి స్విస్ చాలెంజ్ ఒప్పందంపై సంతకాలు చేస్తున్న అధికారులతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిలో పాలుపంచుకుంటున్న ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఎప్పుడైనా జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాజధాని నిర్మాణంలో భవనాలన్నింటిని తానే నిర్మిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రధాని నరేంద్రమోదీని నిలదీసి నిధులు ఎందుకు సాధించడం లేదని ప్రశ్నించారు. తాత్కాలిక రాజధాని నిర్మాణమే ఇన్ని సంవత్సరాలు పడితే శ్వాశత రాజధాని నిర్మాణం ఎన్నేళ్లు పడుతుందని ప్రశ్నించారు. కోర్ క్యాపిటల్ గ్రామాలైన లింగాయపాలెం, తాళ్లాయపాలెం, మందడం, ఉద్దండ్రాయునిపాలెం గ్రామాలను తొలగిస్తే ఆయా గ్రామాలలోని నిర్వాసితులకు ఎక్కడ నివాసాలు నిర్మించి ఇస్తారని, వారు అందజేసిన భూములకు స్థలాలు ఎక్కడ కేటాయిస్తారో తొలుత చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ క్యాంటీన్లను రాజధాని 29 గ్రామాలలో ఏర్పాటు చేయాలని సూచించారు. వెంటనే రాజధాని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలును నెరవేర్చాలని, లేదంటే ప్రజల తరఫున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని ఆయనే హెచ్చరించారు. -
'బాబు తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలి'
విజయవాడ : హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు తరలి రావాల్సిందేనన్న ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు నిర్ణయం సరైంది కాదని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆర్కే విలేకర్లతో మాట్లాడుతూ... ఇప్పటికే ప్రజలు, రైతులను మోసగించిన చంద్రబాబు... ఇప్పుడు ఉద్యోగులను కూడా అదే రీతిలో వంచిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని ఆర్కే ఈ సందర్భంగా సూచించారు. -
అ అంటే అమరావతి కాదు...
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌పై చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మంగళగిరి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆర్కే నిప్పులు చెరిగారు. ఆదివారం విజయవాడలో ఆర్కే విలేకర్లతో మాట్లాడుతూ... మాస్టర్ ప్లాన్‌పై ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. గుంటూరు జిల్లాలో అవగాహన సదస్సు నిర్వహించకుండా తుది మాస్టర్‌ప్లాన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మాస్టర్‌ప్లాన్‌పై గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, రైతుల అభ్యంతరాలు పట్టించుకోరా ? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అ అంటే అమరావతి కాదు... చంద్రబాబు అవినీతి అని ఈ సందర్భంగా ఆర్కే ఎద్దేవా చేశారు. -
తాత్కాలిక రాజధాని నిర్మాణం దోపిడీకే
- మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) గుంటూరు : 2018 చివర నాటికి రాజధాని తొలిదశ నిర్మాణం పూర్తి చేస్తామని ఆర్భాటపు ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి, మంత్రులు రెండు సంవత్సరాల కోసం తాత్కాలిక రాజధానికి కోట్లరూపాయల నిధులను దుబారా చేయడమెందుకని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) సూటిగా ప్రశ్నించారు. శుక్రవారం మంగళగిరిలోని తన కార్యాలయంలో ఆర్కే విలేకరులతో మాట్లాడుతూ... ఓ వైపు ఆర్థిక లోటులో ఉన్నామంటూ బీద అరుపులు అరుస్తున్న ప్రభుత్వం తాత్కాలిక రాజధాని నిర్మాణం పేరుతో రూ. 4 నుంచి రూ. 5 వందల కోట్లు ఖర్చుపెట్టాల్సిన అవసరమేంటన్నారు. 20 ఎకరాలలో తాత్కాలిక రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పి దానిని ఇప్పుడు ఆకస్మికంగా 45 ఎకరాలకు పెంచడం వెనుక పెద్ద అవినీతి చోటు చేసుకుందని అనుమానం వ్యక్తం చేశారు. అసలు పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండగా ఓవైపు రాజధాని నిర్మాణం శరవేగంగా జరుపుతామనే చెబుతూనే మరలా తాత్కాలిక రాజధాని పేరుతో ఎందుకు ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారన్నారు. ఈ రెండు సంవత్సరాల కాలంలో ఒక వేళ ఇక్కడ నుంచే పరిపాలన సాగించాలనుకుంటే గుంటూరు, విజయవాడలలోని ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్శిటీలను వినియోగించుకోవచ్చు కదా అన్నారు. శాశ్వత నిర్మాణాలకే ఎంత ఖర్చు చేసినా ప్రస్తుత పరిస్థితులలో చదరపు ఆడుగుకు గరిష్టంగా రూ 1800కు మించి ఖర్చు కాదని, ఇక తాత్కాలిక నిర్మాణాలకు ఎంత ఎక్కువ ఖర్చు చేసినా రూ. 1000 నుంచి 1200కు మించి ఖర్చుకాదని, తాత్కాలిక రాజధాని నిర్మాణం కోసం బిడ్లు వేసిన సంస్థలకు మాత్రం ప్రభుత్వం రూ.3,500 నుంచి 4 ,000 కేటాయిస్తున్నారంటే వారి నుంచి ముఖ్యమంత్రితో పాటు మంత్రి నారాయణలు వాటాలు పంచుకోవడానికేనని విమర్శించారు. జూన్ నాటికి ఉద్యోగులను తరలిరావాల్సిందేనని చెబుతున్న ముఖ్యమంత్రి, మంత్రులు వారికి ముందుగా మౌలిక వసతులను కల్పించి అప్పడు తరలించాలని సూచించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, మంత్రులు పుల్లారావు, నారాయణలు తమ విధానాలను మార్చుకోవాలని హితవు పలికారు. ప్రజాధనం దోపిడీని మానుకుని ప్రజా రాజధాని నిర్మాణం కొనసాగించాలని వారికి ఆర్కే హితవు పలికారు. -
'బాబు రైతులను నట్టేట ముంచారు'
హైదరాబాద్: కొత్తగా నిర్మిస్తున్న రాజధాని ప్రాంతంలో ఎక్స్ ప్రెస్ హైవేల రూట్ మార్చేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు చేయడం దారుణమని మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆర్కే(ఆర్ రామకృష్ణ) అన్నారు. నాడు మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబునాయుడు ఇప్పుడు రైతులను నమ్మించి నట్టేట ముంచారని ఆరోపించారు. చంద్రబాబు అలాంటి వ్యాఖ్యలు చేయకుండా పునరాలోచించాలని హితవు పలికారు. -
ఆర్కేపురం డివిజన్ సమస్యలపై గ్రౌండ్ రిపోర్ట్
-
చంద్రబాబుది నియంత పాలన : ఎమ్మెల్యే ఆర్కే
మంగళగిరి: భూముల సర్వేను లైసైన్స్‌డ్ సర్వేయర్లకు అప్పగిస్తే భూ వివాదాలు మరింత పెరగడంతో పాటు అవినీతి విచ్చలవిడిగా మారే అవకాశం ఉందని మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని తన కార్యాలయంలో ఆర్కే గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లైసైన్స్‌డ్ సర్వేయర్ల కు సర్వే బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం విడుదల చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌చేశారు. ముఖ్యంగా రాజధాని ప్రాంత పేదలకు చెందిన లంక అసైన్డ్భూములను కొట్టేసేందుకే ప్రభుత్వ పెద్దలు చేసిన కుట్రలో భాగమే లెసైన్స్డ్ సర్వేయర్లను ప్రవేశపెడుతున్నారని ఆరోపించారు. అధికారపార్టీ నేతలు రెవెన్యూ అధికారులు, సిబ్బందిపై ఉన్నతాధికారులతో ఒత్తిళ్లు తెచ్చి ఇప్పటికే అక్రమాలు చేయిస్తూ రెవెన్యూ కార్యాలయాల్లో దళారులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మాటవినని అధికారులను సైతం బదిలీ చేయిస్తామని, అవినీతి నిరోధక శాఖకు పట్టిస్తామంటూ బెదిరిస్తూ.. పనులు చేయించుకుంటూ అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు ఇక సర్వేలను తమ ఇష్టానుసారంగా నిర్వహించి భూములు కాజేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. కీలకమైన రెవెన్యూ శాఖలో నూతన రిక్రూట్మెంట్తో ఉద్యోగాలను భర్తీచేసి ప్రజలకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం.. ఇలా ప్రైవేటు వ్యక్తులకు సర్వే బాధ్యతలను అప్పగించి అవినీతిని ప్రోత్సహించడం దుర్మార్గమన్నారు. వెనుకబడిన వర్గాలకు చెందిన రెవెన్యూ మంత్రి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా చంద్రబాబు రెవెన్యూశాఖలో నిర్ణయాలు తీసుకోవడంపై మంత్రివర్గంలోనే అసంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. అవేమీ పట్టించుకోని ముఖ్యమంత్రి నియంతపాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. జన్మభూమి కమిటీలగానే లెసైన్స్ సర్వేయర్లతో అవినీతి పెచ్చరిల్లే ప్రమాదం ఉన్నందున వెంటనే జీవోను ఉపసంహకరించుకోకపోతే కోర్టులో పిల్ వేస్తానని స్పష్టం చేశారు. తన సామాజికవర్గానికి దోచిపెట్టేందుకే.. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ వుండగా, అది కాదని అధికార యంత్రాంగాన్ని హడావుడిగా తరలించాలని అనుకోవడం వెనుక చంద్రబాబు అద్దె నివాసాల పేరుతో తన అనుకూల సామాజిక వర్గానికి దోచిపెట్టేందుకేనని విమర్శించారు. అందులో భాగంగా తనకు అక్రమ కట్టడమైన అతిథి గృహాన్ని అద్దెకు ఇచ్చిన వారికి బహుమతిగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురు వున్న అపార్ట్మెంట్లు, విల్లాలకు భారీ అద్దెలు చెల్లించి దోచిపెడుతున్నారని ఆర్కే ఆరోపించారు. ఉద్యోగులను తరలించాలని విజయవాడ చుట్టుపక్కల అద్దెలకు తీసుకుంటున్న అపార్ట్మెంట్లు, అతిథి గృహాలు అన్ని తన బినామీలు, సామాజిక వర్గానికి చెందినవేనని, వాటికి అత్యధిక అద్దెలు చెల్లించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. -
'సీఎం రెస్ట్ హౌస్ ను కూల్చండి'
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో అక్రమ కట్టడాలను తొలగిస్తామని సీఆర్డీఏ కమిషనర్ చేసిన ప్రకటనపై మంగళగిరి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నాయకుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గుంటూరులో మీడియాతో ఆర్కే మాట్లాడుతూ... ముందుగా సీఎం చంద్రబాబు నాయుడు నివాసముంటున్న అక్రమ కట్టడాన్ని కూల్చాలని డిమాండ్ చేశారు. సీఎం రెస్ట్ హౌస్‌తో పాటు కరకట్ట మీదున్న బడాబాబుల అక్రమ నిర్మాణాలు తొలగించాలని సీఆర్డీఏ కమిషనర్‌కు సూచించారు. చంద్రబాబు భూములు ఇవ్వకముందు ఓ మాట, ఇచ్చాక మరో మాట మాట్లాడుతున్నారని ఆర్కే ఆరోపించారు. రాజధాని కోసం ఆయా గ్రామాల ప్రజలు భూములు ఇవ్వకముందు ఓ మాట మాట్లాడిన చంద్రబాబు... వాళ్లు భూములు ఇచ్చాక మాట మార్చారని ఆరోపించారు. -
సూత్రధారి చంద్రబాబు... పాత్రధారి నారాయణ
గుంటూరు : గుంటూరు జిల్లా మల్కాపురంలో చెరకు పంట దగ్ధం కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మంగళగిరి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నాయకుడు ఆర్కే మండిపడ్డారు. గురువారం గుంటూరులో ఆర్కే మాట్లాడుతూ... పంట దగ్ధం కేసులో చెరకు రైతు గద్దే చంద్రశేఖర్ మేనల్లుడు సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆర్కే మండిపడ్డారు. సురేష్‌ను వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆర్కే డిమాండ్ చేశారు. చంద్రశేఖర్ పంట దగ్ధానికి సూత్రధాని చంద్రబాబు అయితే... పాత్రధారి మాత్రం మున్సిపల్ మంత్రి పి.నారాయణ అని ఆర్కే ఆరోపించారు. అయితే సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అతడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
''రైతుల ఆందోళనతోనే సర్కారు కళ్ళు తెరిచింది''
-
టార్గెట్.. ఆర్కే!
నక్సల్స్ అగ్రనేతలే లక్ష్యంగా ఆపరేషన్ ఆల్ ఔట్! తప్పించుకున్న ఆర్కే, ఉదయ్ ఉద్రిక్తంగా ఏవోబీ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/మల్కన్‌గిరి/పాడేరు: ఆంధ్రప్రదేశ్-ఒడిశా పోలీసుల ముట్టడి నుంచి అగ్రనేతలు అక్కిరాజు హరగోపాల్ (ఆర్కే), ఉదయ్ తప్పించుకున్నారా! పోలీసువర్గాలు అవుననే చెబుతున్నాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్కేతోపాటు మల్కన్‌గిరి జిల్లా కమిటీ కార్యదర్శి ఉదయ్, ఇతర నేతలే లక్ష్యంగా సమాచారంతోనే ‘ఆపరేషన్ ఆల్ ఔట్’ చేపట్టారు. ఒడిశాలోని బేజంగి అడవుల్లో సోమవారం జరిగిన ఎదురుకాల్పుల నుంచి ఆర్కే, ఉదయ్‌లతోపాటు మరికొందరు అగ్ర నేతలు అంతకుముందే తప్పించుకున్నట్లు తెలుస్తోంది. వారి కోసం ఏపీ-ఒడిశాలకు చెందిన 500మంది పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. ఆర్కే ఏవోబీలోని బేజంగి అటవీప్రాంతానికి వస్తున్నట్లు పోలీసులకు నవంబర్లోనే పక్కా సమాచారం అందింది. జనవరి మొదటి రెండు వారాల్లో అక్కడ మావోయిస్టులు ప్లీనరీ నిర్వహించనున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఆర్కేతోపాటు మరికొందరు కీలక నేతలు కూడా ఈ ప్లీనరీకి హాజరువతారని సమాచారాన్ని ధ్రువీకరించుకున్నారు. ఒకేసారి అగ్రనేతలందర్ని తుడిచిపెట్టేస్తే మావోయిస్టు పార్టీని కోలుకోలేని రీతిలో దెబ్బతీయొచ్చని అత్యున్నతస్థాయిలో నిర్ణయించారు. ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ పోలీసులు ‘ఆపరేషన్ ఆల్ ఔట్’కు రూపకల్పన చేశాయి. రెండు నెలలుగా మావోయిస్టులు ఏవోబీలో ప్లీనరీకి ఏర్పాట్లు చేస్తున్నా పోలీసు బలగాలు వ్యూహాత్మకం మౌనం వహించాయి. విశాఖపట్నం జిల్లా ఏస్పీ కోయ ప్రవీణ్, ఒడిశాలోని మల్కనగిరి జిల్లా ఎస్పీ మహాపాత్రో కొన్ని రోజుల క్రితం బేజంగి అడవిలో వేర్వేరుగా హెలికాఫ్టర్లలో ఏరియల్ సర్వే నిర్వహించినట్లు తెలిసింది. అగ్రనేతలతోసహా 200మంది మావోయిస్టులు ప్లీనరీకి హాజరుకానున్నట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. దాంతో ఏపీ గ్రేహౌండ్స్, ఒడిశా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ దళాలతోపాటు బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ రంగంలోకి దిగాయి. శనివారం బేజంగి అడవిలో నిర్దేశిత ప్రాంతం దిశగా బలగాలు శనివారం బయలుదేరాయి. పశ్చిమ దిశ నుంచి ఒడిశా పోలీసులస్పెషల్ ఆపరేషన్ గ్రూప్‌కుచెందిన 200మంది కదలగా... మరో 200మందితో కూడిన ఏపీ గ్రేహౌండ్స్ బలగాలు తూర్పు నుంచి చుట్టుముట్టాయి. ఆదివారం రాత్రికి ఒడిశాలోని పనాసపట్టు, విశాఖపట్నం జిల్లా ముంచంగిపుట్టుకు సమీపంలోని పులజలమ మధ్య ఉన్న కొండప్రాంతానికి అటువైపు ఒడిశా బలగాలు, ఇటువైపు ఏపీ బలగాలు మోహరించాయి. సోమవారం తెల్లవారుజామున ఒడిశా పోలీసులు, నక్సల్స్‌కు మధ్య రెండుసార్లు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో దాదాపు ఐదుగురు నక్సల్స్ చనిపోయి ఉంటారని ఒడిశా పోలీసులు ఏపీ పోలీసులకు సమాచారం అందించాయి. మధ్యాహ్నం తరువాత ఇరురాష్ట్రాల పోలీసు బలగాలు ఆ ప్రాంతానికి మెల్లగా చేరుకున్నాయి. కానీ ఎక్కడా మావోల మృతదేహాలు కనిపించ లేదు. నక్సల్స్ నేతలు అడవి నుంచి రెండురోజుల క్రితమే వెళ్లిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆర్కే, ఉదయ్‌లతోపాటు మావోయిస్టులు రెండు రోజుల్లో ఎంతోదూరం వెళ్లి ఉండరని ఉద్దేశంతో పోలీసు బలగాలు బేజంగి అటవీప్రాంతంలో కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. కాగా, మల్కన్‌గిరి జిల్లా ఖొరాయిగుడకు చెందిన జొగ్గా కావని, జొగ్గా మాడ్కామి అనే ఇద్దరు గిరిజనులను ఇన్ఫార్మర్లన్న నెపంతో ఆదివారం నక్సల్స్ హత్య చేశారు. -
'లక్ష ఎకరాల భూసేకరణ.. దోపిడీలో భాగమే'
-
‘పచ్చ’ దోపిడీ !
తాడేపల్లి రూరల్: మంగళగిరి శాసన సభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) స్వయంగా పరిశీలించి, అధికారులను రప్పించి ఇసుక అక్రమ నిల్వలు చూపించి, వీటి నిగ్గు తేల్చండని కోరినా, తెల్లవారేసరికి ఆ ఇసుక మొత్తాన్ని తరలించుకుపోయారంటే అక్రమార్కుల ధీమా అర్థం చేసుకోవచ్చు. మూడు రోజుల్లో అక్రమార్కులు రూ. 50 లక్షల ఇసుకను అమ్మేసుకున్నట్టు రెవెన్యూ అధికారుల అంచనా. శుక్రవారం రాత్రి, శనివారం పగలూ సుమారు 725 ట్రక్కుల ఇసుక తోలినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. శుక్రవారం పట్టా భూముల పేరిట ఇసుక తరలించిన వీరు ఎమ్మెల్యే ఆర్కే పర్యటనతో పట్టా భూముల్లో తవ్వకాలకు స్వస్తి చెప్పి పంచాయతీ లంకలకు రాత్రి రాత్రే దారి వేసి లంక భూముల నుంచి శనివారం పగలంతా ఇసుక తోలుకున్నారు. అనుమతులు అక్రమం ... ►నిజానికి చిర్రావూరు ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వడమే పెద్ద నాటకం. కృష్ణానదిలో ఇసుక మేట వేసిన భూముల్లో ఎవరి భూమి ఎక్కడో హద్దులు వేసి నిర్ణయించాల్సింది రెవెన్యూ అధికారులు. కానీ ఎలాంటి నిర్థారణ చేయకుండానే సర్వే నంబర్ 100, 106లలో ఇసుక తవ్వుకోండంటూ అనుమతులు ఇచ్చారు. ►ఆ నంబర్ పేరిట నదిలోనూ, లం క భూముల్లోనూ ఇసుక తవ్వేస్తు న్న వైనం విజిలెన్స్ దాడుల్లో బయటపడింది. అక్రమార్కులకు రూ. 26 లక్షల జరిమానా కూడా విధిం చారు. అందులో రూ.18 లక్ష లు చెల్లించి రూ.8 లక్షలు ఎగ్గొట్టారు. ►ఇది తేలకుండానే వారికే మైనింగ్ శాఖ మళ్లీ మరో 1800 క్యూబిక్ మీ టర్ల ఇసుక రవాణాకు అనుమతులిచ్చింది. ►శుక్రవారం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వయంగా చిర్రావూరు వెళ్లి ఇసుక క్వారీ పరిశీలించి, భారీగా నిల్వలను కను గొన్నారు. ఆ ఇసుక ఎంతమొత్తమో తేల్చండంటూ అధికారులకు సూచించారు. కానీ తెల్లవారే సరికి ఆ ఇసుకంతా మాయమైంది. ►శాసనసభ్యుని ఆదేశాలతో చిర్రావూరు పట్టా భూముల్లో ఇసుక తవ్వకుండా తాడేపల్లి తహశీల్దార్ చర్యలు తీసుకున్నారు. అయితే రాత్రికి రాత్రి పంచాయతీ ఆధీనంలో లంక భూములకు దారి ఏర్పరచి, అక్కడ నుంచి ఇసుక తరలించారు. ►ఇందుకు మైనింగ్ శాఖ గతంలో ఇచ్చిన వేబిల్లులు వాడుకుంటున్నారు. శాసనసభ్యులు ఆదేశించినా ఆ వే బిల్లులు అధికారులు ఎందుకు స్వాధీనం చేసుకోలేదో తెలియదు. ►మూడు రోజుల్లో రూ. 50 లక్షల విలువైన ఇసుకను తమ్ముళ్లు దోచేసినట్టు అధికారులే గుసగుసలాడుకుంటున్నారు. ►అక్రమార్కులు బరితెగింపుకు, అధికారుల భయానికి ఈ దందా వెనుక ఉన్న వారంతా తెలుగుతమ్ముళ్లు కావడమే కారణంగా కింది స్థాయి అధికారులు చెబుతున్నారు. -
నల్లమలలో అలజడి
ఆత్మకూరు: నల్లమల అడవిలో మళ్లీ అలజడి రేగింది. వారం రోజుల క్రితం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పాలుట్ల సమీపంలో ఎన్కౌంటర్ జరిగిన విషయం విదితమే. ఈ ఘటనలో మావోయిస్టునేత ఆర్కే అనుచరుడు బాబురావుతో పాటు విమల, భారతి అనే ముగ్గురు హతమవ్వగా, ఒకరు తప్పించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్లమల అటవీ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రకాశం, కర్నూలు జిల్లా పరిధిలోని నల్లమలలో భారీ ఎత్తున పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగం ముందు జాగ్రత్తగా సున్నిపెంట పోలీస్ ఔట్‌పోస్ట్‌ను శ్రీశైలానికి తరలించింది.మహబూబ్‌నగర్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, నల్గొండ జిల్లాల్లో విస్తరించిన ఉన్న నల్లమలలో గతంలో పీపుల్స్ వార్, తర్వాత మావోయిస్ట్ పార్టీ ముమ్మరంగా కార్యకలాపాలను సాగించింది. దాదాపు 15 ఏళ్ల పాటు పోలీస్, నక్సల్స్ మధ్య నల్లమలలో యుద్ధం సాగింది. గతంలో కర్నూలు పరిధిలోని నల్లమల నక్సల్స్ షెల్టర్‌జోన్‌గా ఉండేది. మహబూబునగర్ జిల్లా పరిధిలోని పోలీసుల నిఘా అధికమైతే కర్నూలు వైపు, జిల్లా పరిధిలో కూంబింగ్ జరిగితే మహబూబ్‌నగర్ జిల్లా వైపు తమ కార్యకలాపాలను నక్సల్స్ మార్చుకునేవారు. కర్నూలు జిల్లా పరిధిలోని కొత్తపల్లి నుంచి శ్రీశైలం అటవీ పరిధి వర కు అప్పట్లో నక్సల్స్‌కు షెల్టర్ జోన్‌గా ఉండేది. ప్రస్తుతం రాష్ట్రం విడిపోయినా భౌగోళికంగా ఒకే పరిధి కావడంతో జిల్లా మళ్లీ షెల్టర్‌జోన్ గా వారికి ఉపయోగ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో తొలిసారిగా 1984లో అప్పటి పీపుల్స్‌వార్‌గ్రూప్ జానాల గూడెంలో జెండా ఎగురవేసి కార్యకలాపాలను ప్రారంభించింది. జిల్లాలోని కొత్తపల్లి, ఆత్మకూరు, శ్రీశైలం, వెలుగోడు, బండిఆత్మకూరు, మహానంది, ఆళ్లగడ్డ, అహోబిలం, రుద్రవరం మండలాల్లో పీపుల్స్‌వార్ అప్పట్లో కార్యక లాపాలను కొనసాగించింది. అప్పట్లో ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే బుడ్డా వెంగళరెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డిని మావోయిస్టులు హతమార్చారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాధవ్, అగ్రనేతలు శాఖమూరి అప్పారావు, మాట్టా రవికుమార్‌లు ఎన్కౌంటర్లో బలయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు, లొంగుబాట్లు, ఎన్కౌంటర్లతో మావోయిస్టులు నల్లమల నుంచి ఏఓ బీ, చత్తీస్‌ఘడ్‌కు మకాం మార్చారు. మావోల రిక్రూట్మెంట్: ప్రస్తుతం నల్లమల అటవీపరిధిలోని మహ బూబ్‌నగర్, కర్నూలు జిల్లాలో మావోయిస్టుల రిక్రూట్మెంట్ భారీగా జరుగుతున్నట్లు విశ్వనీయ సమాచారం. రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయినా మావోలు యథావిధిగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దీంతో న ల్లమల అటవీ పరిధిలోని అన్ని జిల్లాల్లో వీరు తమ రిక్రూట్మెంట్ కార్యక్రమాలు అధికం చేసి కేడర్ బలపరుచుకుంటున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్ల కేంద్రంగా ఆత్మకూరు డివిజన్: ఆత్మకూరు డివిజన్లో 2002లో భానుముక్కుల మలుపు వద్ద తొలి ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో వడ్లరామాపురం గ్రామానికి చెందిన లింగస్వామి మృతి చెందారు. అలాగే 2003లో బావాపురం గ్రామం వద్ద శ్రీధర్, 2004లో నల్లకాలువ సమీపంలో వేణు అనే మావోలు మృతి చెందారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో మావోల కదలికలు పూర్తిగా తగ్గిపోయాయి. ప్రస్తుతం జిల్లాలో మావోల కార్యకలాపాలు ఏమీ లేవని పోలీసు వర్గాలు పేర్కొంటున్నా.. ప్రకాశం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో వారు అప్రమత్తమయ్యారు.