
'సీఎం రెస్ట్ హౌస్ ను కూల్చండి'
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో అక్రమ కట్టడాలను తొలగిస్తామని సీఆర్డీఏ కమిషనర్ చేసిన ప్రకటనపై మంగళగిరి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నాయకుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గుంటూరులో మీడియాతో ఆర్కే మాట్లాడుతూ... ముందుగా సీఎం చంద్రబాబు నాయుడు నివాసముంటున్న అక్రమ కట్టడాన్ని కూల్చాలని డిమాండ్ చేశారు.
సీఎం రెస్ట్ హౌస్తో పాటు కరకట్ట మీదున్న బడాబాబుల అక్రమ నిర్మాణాలు తొలగించాలని సీఆర్డీఏ కమిషనర్కు సూచించారు. చంద్రబాబు భూములు ఇవ్వకముందు ఓ మాట, ఇచ్చాక మరో మాట మాట్లాడుతున్నారని ఆర్కే ఆరోపించారు. రాజధాని కోసం ఆయా గ్రామాల ప్రజలు భూములు ఇవ్వకముందు ఓ మాట మాట్లాడిన చంద్రబాబు... వాళ్లు భూములు ఇచ్చాక మాట మార్చారని ఆరోపించారు.