CRDA commissioner
-
జనవరి 13న సీఎం జగన్ చేతుల మీదుగా ఎంఐజీ లేఅవుట్ ప్రారంభం
సాక్షి,అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సమీపంలో మధ్య ఆదాయ వర్గాల వారి కోసం అందుబాటులోకి తెచ్చిన జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లోని ఎంఐజీ లే అవుట్‌ను ఈ నెల 13న సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ సీఆర్డీఏ కమిషనర్ విజయకృష్ణన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 200 నుంచి 240 చదరపు అడుగుల వైశాల్యంలో ఉన్న ఈ ప్లాట్లను పొందేందుకు రూ.18 లక్షల లోపు వార్షిక ఆదాయమున్న ఏపీకి చెందిన వారు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు సీఆర్డీఏ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. -
'10 రోజుల్లో భూముల రికార్డులు అందజేయాలి'
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి గ్రామాల్లో దళితుల పట్ల వివక్షతపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు కమలమ్మ విచారణ చేపట్టారు. ల్యాండ్ పూలింగ్, లంక అసైన్డ్ భూములకు సంబంధించిన రికార్డులను 10 రోజుల్లోగా అందజేయాలని సీఆర్డీఏ కమిషన్ శ్రీధర్, గుంటూర్ జేసీ శుక్లాలను కమలమ్మ ఆదేశించారు. సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్, గుంటూర్ జిల్లా జాయింట్ కలెక్టర్ శుక్లా హాజరుకాగా, హాజరుకాని రెవెన్యూ, సోషల్ వెల్ఫేర్ అదికారులపై కమలమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత రైతులపై ఎందుకు వివక్షత చూపుతున్నారంటూ అధికారులను ఆమె ప్రశ్నించారు. కమిషన్ సభ్యురాలు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేదని సమాచారం. ప్రజల కోసం రాజధాని నిర్మించాలని, అప్పుడే అది ప్రజా రాజధాని అవుతుందని అధికారులకు కమలమ్మ సూచించారు. -
'10 రోజుల్లో భూముల రికార్డులు అందజేయాలి'
-
'పండుగ కూడా చేసుకోలేని స్థితిలో ఉన్నారు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పరిసర గ్రామాల్లో కూలీలకు గత నాలుగు నెలలుగా పెన్షన్లు ఇవ్వడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) చెప్పారు. దీనిపై సీఆర్డీఏ కమిషనర్‌కు ఆయన బుధవారం లేఖ రాశారు. కూలీలకు పెన్షన్లు ఇవ్వకపోవడంతో పండుగ కూడా చేసుకోలేని స్థితిలో ఉన్నారన్నారు. తక్షణమే పెన్షన్లు విడుదల చేసి వారికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే ఆర్కే లేఖలో పేర్కొన్నారు. -
శ్రీకాంత్ X శ్రీధర్
గ్రామకంఠాలపై ఎవరి పట్టు వారిదే జేసీ శ్రీధర్ నివేదికను పక్కన పెట్టిన సీఆర్డీఏ కమిషనర్ మాస్టర్‌ప్లాన్‌ను మార్చలేమంటున్న శ్రీకాంత్ కొలిక్కిరాని రాజధాని గ్రామకంఠాల నిర్ధారణ విజయవాడ : రాజధాని గ్రామకంఠాల వ్యవహారం ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య చిచ్చు రేపింది. స్థానిక నాయకుల సూచనలకు అనుగుణంగా గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వీటిపై నివేదిక తయారుచేయగా, మాస్టర్‌ప్లాన్‌ను మార్చేలా ఉన్న దీన్ని తానెలా ఆమోదిస్తానని సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే ఎనిమిది నెలల నుంచి గ్రామకంఠాల నిర్ధారణ ఒక కొలిక్కి రాలేదు. మంత్రుల అంగీకారం మేరకు... భూసమీకరణ తర్వాత గ్రామకంఠాల నిర్ధారణ కోసం సీఆర్డీఏ, గుంటూరు జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేశాయి. భూసమీకరణ మాదిరిగానే రెవెన్యూ రికార్డుల ఆధారంగా గ్రామకంఠాలను నిర్ధారించడానికి జేసీ శ్రీధర్ మొదట ప్రణాళిక రూపొందించారు. పాతకాలం రికార్డుల్లో ఎలా ఉందో అలాగే గ్రామకంఠాన్ని ఖరారు చేయాలని ప్రయత్నించడంతో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి గ్రామకంఠాలను ఇప్పుడు కూడా అలాగే ఎలా చూస్తారని, అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు చాలా మారిపోయాయని ఆయా గ్రామాలకు చెందినవారు వాదించారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి వాటిని మార్చాలని అధికారులు, మంత్రులను నిలదీశారు. చేసేదేమీ లేక మంత్రులు అందుకు అంగీకారం తెలిపినా గుంటూరు జిల్లా యంత్రాంగం ముందుకెళ్లకపోవడంతో కొద్దికాలం ఆ విషయం మరుగునపడింది. ఈలోపు రాజధాని శంకుస్థాపన కార్యక్రమం ముంచుకురావడంతో స్థానికులు తమ సమస్యను పరిష్కరించకుండా శంకుస్థాపన ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఆ సమయంలో జేసీ శ్రీధర్ విదేశీ పర్యటనలో ఉండడంతో మంత్రి నారాయణ ఆయన్ని ఉన్నపళాన వెనక్కి రప్పించి గ్రామకంఠాల నిర్ధారణను తక్షణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన మళ్లీ అన్ని గ్రామాల్లో తిరిగి స్థానికుల అభ్యంతరాలకు అనుగుణంగా ఒక నివేదిక రూపొందించారు. అయితే అనూహ్యంగా సీఆర్డీఏ కమిషనర్ దాన్ని ఆమోదించలేదని తెలిసింది. మాస్టర్‌ప్లాన్ మార్పు సాధ్యం కాదంటూ... రాజధాని ప్రకటన తర్వాత అనేక మంది గ్రామాల్లో నిర్మాణాలు చేపట్టారని, వాటన్నింటినీ ఇప్పుడు గ్రామకంఠాల పరిధిలోకి ఎలా చేరుస్తారని సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ ప్రశ్నించడంతో వాటి నిర్ధారణ పెండింగ్‌లో పడిపోయింది. రాజధాని ప్రకటనకు ముందు డిసెంబర్ ఎనిమిదో తేదీ శాటిలైట్ చిత్రాల ఆధారంగా గ్రామకంఠాలను నిర్ధారించాలని ఆయన మొదటి నుంచి ప్రతిపాదిస్తున్నారు. అప్పటి చిత్రాలను బట్టి సింగపూర్ కంపెనీలు మాస్టర్‌ప్లాన్‌ను తయారు చేశాయని, ఇప్పుడు గ్రామకంఠాలను మారిస్తే ప్లాన్‌ను మార్చాల్సి ఉంటుందని, అది సాధ్యం కాదని ఆయన వాదిస్తున్నట్లు సమాచారం. మంత్రుల సూచనల ప్రకారం స్థానిక పరిస్థితులను బట్టి తాను కొద్ది మార్పులతో నివేదిక రూపొందించానని, దానిపై ఇక తానేమీ చేయలేనని జేసీ చేతులెత్తేయడంతో మొన్నటివరకూ గ్రామకంఠాల వ్యవహారం ముందుకు కదల్లేదు. గ్రామకంఠాల వ్యవహారం మళ్లీ మొదటికేనా? ఈ నేపథ్యంలోనే ఇటీవల గుంటూరులో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధికారులతో సమావేశం నిర్వహించి గ్రామకంఠాల విషయంపై సీఆర్డీఏ, గుంటూరు జిల్లా యంత్రాంగం రూపొందించిన నివేదికల మధ్య తేడాలున్నాయని, వాటిని పరిష్కరిస్తామని బహిరంగంగానే ప్రకటించారు. ఆ తర్వాత మంత్రి నారాయణ అధికారులిద్దరూ గ్రామాల్లో కలిసి తిరిగి ఒకే నివేదిక రూపొందించి గ్రామకంఠాలను నిర్ధారించాలని గట్టిగా చెప్పి ఆ విషయాన్ని మీడియాకు సైతం తెలిపారు. ఆ తర్వాత జేసీ శ్రీధర్ గ్రామాల్లో తిరుగుతున్నా కమిషనర్ మాత్రం దూరంగా ఉంటున్నారు. దీంతో ఈ విషయం మళ్లీ మొదటికొస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
భూసేకరణపై ఉండవల్లి రైతుల ఆందోళన
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి భూసేకరణకు సంబంధించి విడుదలచేసిన మాస్టర్‌ప్లాన్‌పై మంగళవారం ఉండవల్లిలో నిర్వహించిన అవగాహన సదస్సు రసాభాసగా మారింది. ల్యాండ్ పూలింగ్‌కు 85 శాతం మంది రైతులు వ్యతిరేకించిన ఉండవల్లిలో మాస్టర్‌ప్లాన్‌పై అవగాహన సదస్సు ఎందుకు నిర్వహించారని రైతులు డీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్‌ను నిలదీశారు. ఊరి మధ్యనుంచి రోడ్లు నిర్మించేది లేదని, గ్రామ కంఠాలలో కూడా రోడ్డు వేయమని, రోడ్డు నిర్మాణానికి సేకరించిన భూమికి రెట్టింపు భూమి రైతులకు ఇవ్వడంతో పాటు మార్కెట్ ధర చెల్లిస్తామని శ్రీకాంత్ నచ్చజెప్పారు. అయినా రైతులు శాంతించలేదు. రాజధాని నిర్మాణానికి తాము భూములు ఇచ్చే సమస్యే లేదని రైతులు తెగేసి చెప్పి సమావేశం నుంచి అర్థంతరంగా వెళ్లిపోయారు. దాదాపు రెండు గంటలపాటు కమిషనర్ శ్రీకాంత్ నచ్చజెప్పినా రైతులు వినలేదు. ఉండవల్లిలో ఎకరా భూమి రెండు కోట్ల రూపాయలు పలుకుతోందని, మార్కెట్ రేటు ప్రకారం ధర ఇస్తామంటే ఆలోచిస్తామని కొందరు రైతులు స్పష్టంచేశారు. -
'సీఎం రెస్ట్ హౌస్ ను కూల్చండి'
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో అక్రమ కట్టడాలను తొలగిస్తామని సీఆర్డీఏ కమిషనర్ చేసిన ప్రకటనపై మంగళగిరి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నాయకుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గుంటూరులో మీడియాతో ఆర్కే మాట్లాడుతూ... ముందుగా సీఎం చంద్రబాబు నాయుడు నివాసముంటున్న అక్రమ కట్టడాన్ని కూల్చాలని డిమాండ్ చేశారు. సీఎం రెస్ట్ హౌస్‌తో పాటు కరకట్ట మీదున్న బడాబాబుల అక్రమ నిర్మాణాలు తొలగించాలని సీఆర్డీఏ కమిషనర్‌కు సూచించారు. చంద్రబాబు భూములు ఇవ్వకముందు ఓ మాట, ఇచ్చాక మరో మాట మాట్లాడుతున్నారని ఆర్కే ఆరోపించారు. రాజధాని కోసం ఆయా గ్రామాల ప్రజలు భూములు ఇవ్వకముందు ఓ మాట మాట్లాడిన చంద్రబాబు... వాళ్లు భూములు ఇచ్చాక మాట మార్చారని ఆరోపించారు. -
రాజధాని పరిధిలో మంత్రి నారాయణ పర్యటన
మంగళగిరి (గుంటూరు): రాజధాని పరిధిలోని పలు గ్రామాల్లో పట్టణాభివృద్ధి మంత్రి పి. నారాయణ శుక్రవారం పర్యటించారు. సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్‌తో కలసి మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో రైతులతో సమావేశమయ్యారు. గ్రామ కంఠాల నిర్ణయంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గ్రామ సరిహద్దులను నిర్ణయించి, రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఈ సందర్భంగా మంత్రి నారాయణ సూచించారు. -
రాజధాని రైతుకు కౌలుసొమ్ము
తాడికొండ : రాజధాని నిర్మాణంలో మరో ప్రధాన ఘట్టం సోమవారం ప్రారంభమైంది. భూములు ఇచ్చిన రైతులకు అధికారులు కౌలు చెక్కుల పంపిణీ ప్రారంభించారు. అలాగే నిర్మాణ పనులకు శ్రీకారం చుడుతూ వ్యవసాయ భూములను చదును చేసే ప్రక్రియను ఆరంభించారు. రాజధాని నిర్మాణానికి భూములు ఎక్కువగా ఇచ్చినతాడికొండ మండలం నేలపాడు గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఆర్డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమానికి నేలపాడు సీఆర్డీఏ అధికారి శ్రీనివాసమూర్తి అధ్యక్షత వహించగా, కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ, భూములు ఇచ్చిన రైతులకు మూడేళ్లలో అభివృద్ధి చేసి అందిస్తామని తెలిపారు. తొట్టతొలుత భూమి ఇచ్చిన రైతులు చరిత్రలో నిలిచిపోతారని చెబుతూ తొలిగా భూములిచ్చిన మహిళారైతు కొమ్మినేని ఆదిలక్ష్మిని అభినందించారు. భూములు ఇచ్చిన రైతుల వద్ద అంగీకార పత్రాలన్నీ కచ్చితంగా ఉంటే ఏడాదికి రూ.30 వేలు కౌలు అందిస్తున్నట్లు చెప్పారు. ఇక నుంచి అన్ని గ్రామాల్లో ఈ ప్రక్రియ ప్రారంభంకానుందన్నారు. వివాదాలు ఉన్న భూములకు సంబంధించి వాటిని పరిష్కరించి రైతులకు కౌలు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. దాదాపు 80 శాతం భూములు కచ్చితంగానే ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం ఏడాది వరకు కొనసాగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా రాజధానిని నిర్మించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. భూసమీకరణ పూర్తిచేసి సహకరించిన అధికారులంతా గుర్తుండిపోతారని చెపుతూ, తుళ్లూరు తహశీల్దారు సుధీర్‌బాబును అభినందించారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు రైతులతో తన ఆనందాన్ని పంచుకొనేందుకు తుళ్లూరులోనే ఉగాది పండుగను జరుపుతున్నట్టు చెప్పారు. జేసీ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ63 రోజుల్లో జెట్స్పీడుతో భూసమీకరణ పూర్తిచేసినట్లు తెలిపారు. రైతుల వద్దనుంచి అగ్రిమెంటు తీసుకొని కౌలు సొమ్ము అందిస్తున్నామని చెప్పారు. ప్రతి ఏటా పది శాతం కౌలు పెరుగుతుందన్నారు. అనంతరం గ్రామంలోని 93 ఎకరాలకు సంబంధించి 36 మంది రైతులకు రూ. 27.93 లక్షల సొమ్ముకు చెక్కులు అందించారు. గ్రామ సర్పంచ్ ధనేకుల సుబ్బారావు పొలాన్ని దున్ని అభివృద్ధిని ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శివశంకర్, ఆర్డీవో భాస్కరనాయుడు, ఎంపీపీ వడ్లమూడి పద్మలత, గ్రామ సర్పంచ్ ధనేకుల సుబ్బారావు, నాయకులు దామినేని శ్రీనివాసరావు, రైతులు పాల్గొన్నారు. -
ల్యాండ్ పూలింగ్ చట్ట విరుద్ధం: వైఎస్ఆర్సీపీ
-
ల్యాండ్ పూలింగ్ చట్ట విరుద్ధం: వైఎస్ఆర్సీపీ
ల్యాండ్ పూలింగ్ చట్ట విరుద్ధమని, భూసేకరణను వెంటనే నిలిపివేయాలని వైఎస్ఆర్సీపీ బృందం డిమాండ్ చేసింది. రాజధాని భూసేకరణ విషయంలో మొత్తం ఏడు అంశాలపై సీఆర్డీఏ కమిషనర్‌కు ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ బృందం ఓ వినతిపత్రం అందించింది. అమాయకంగా ల్యాండ్ పూలింగ్‌కు అంగీకరించిన రైతులందరికీ వారి పత్రాలను వెనక్కి ఇవ్వాలని నేతలు కోరారు. సీఆర్డీ పరిధి బయట టీడీపీ నేతలు కొన్న వేలాది ఎకరాల భూములపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విభజన చట్టం ప్రకారం ప్రభుత్వ భూముల్లో రాజధాని కట్టుకునే అంశాన్ని పరిశీలించాలని పార్టీ నేతల బృందం కోరింది. రైతులపై అధికారులు, మంత్రులు బెదిరింపులు, ప్రలోభాలకు పాల్పడటంపై కూడా న్యాయ విచారణ జరిపించాలని నాయకులు డిమాండ్ చేశారు. పదో షెడ్యూల్లోని 94వ నిబంధన ప్రకారం ప్రభుత్వ భూముల్లోనే హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలు చేపట్టాలని కోరారు. రైతులు, రైతు కూలీలు, భూమిలేని నిరుపేదలు, వృత్తిదారుల హక్కులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. -
రాజధాని భూముల్లో సాగుపై వెనకడుగు
వ్యతిరేకత రావడంతో మనసు మార్చుకున్న ప్రభుత్వం అంగీకార పత్రాలిచ్చిన భూములకే అనుమతి లేదని వెల్లడి పత్రాలివ్వని రైతులు సాగు చేసుకోవచ్చు సాక్షి, విజయవాడ బ్యూరో: ఏపీ రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో పంటల సాగుకు అనుమతి లేదని ప్రకటించిన ప్రభుత్వం అన్ని వైపుల నుంచి వ్యతిరేకత రావడంతో మనసు మార్చుకుంది. అంగీకార పత్రాలు ఇచ్చిన భూములకు సంబంధించి మాత్రమే వచ్చే సీజన్ నుంచి సాగుకు అనుమతి ఉండదని, మిగిలిన భూముల్లో సాగు చేసుకోవచ్చని తాజాగా చెబుతోంది. వచ్చే సీజన్ నుంచి రాజధాని ప్రాంతంలో పంటలు సాగు చేయడానికి అనుమతి లేదని కొద్దిరోజులక్రితం సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ చెప్పిన విషయం తెలిసిందే. అంతకు నెలరోజుల ముందే వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ విషయాన్ని తేల్చిచెప్పారు. మరోవైపు గుంటూరు జిల్లా బ్యాంకర్ల సమావేశంలోనూ కలెక్టర్ కాంతీలాల్ దండే ఈ ప్రాంత రైతులకు వచ్చే సీజన్ నుంచి రుణాలివ్వొద్దని స్పష్టంగా సూచించారు. అయితే సీఆర్డీఏ కమిషనర్ చేసిన ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, రైతు సంఘాలు విరుచుకుపడ్డాయి. విజయవాడ సీఆర్డీఏ కార్యాలయం ఎదుట రైతులతో కలసి కాంగ్రెస్, సీపీఐ నేతలు ధర్నాలు నిర్వహించారు. తొలినుంచీ రాజధాని రైతులకు మద్దతుగా పోరాటం చేస్తున్న జన చైతన్య వేదిక దీనిపై తీవ్ర విమర్శలు చేసింది. మరోవైపు రాజధాని ప్రాంత రైతుల్లోనూ భయాందోళనలు వ్యక్తమయ్యాయి. భూమి ఇవ్వకపోతే ఆ తర్వాత మిగిలిన భూముల్లో సాగుకూ అవకాశం లేదని చెప్పడం ద్వారా రైతులను బెదిరించి పని కానిచ్చుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపించింది. పంటల సాగుకు అనుమతి లేదని చెప్పడంతో తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలోని 34 వేల ఎకరాల భూముల్లో సాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం సాగు చేస్తున్న పంటలను కోసిన తర్వాత భూములను వదిలేసి ఆ తర్వాత ఏంచేయాలనే ఆందోళన రైతులను వెంటాడింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో రైతులు టీడీపీ ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తుండడం, వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. భూసమీకరణ చేయడమే ఇబ్బందికరంగా మారగా.. ఇప్పుడు పంటల సాగుపై ఆంక్షల వ్యవహారం మరింతగా ప్రభుత్వ ఇమేజ్ను దెబ్బతీస్తుందని భయపడి వెనక్కు తగ్గింది. కేవలం అంగీకార పత్రాలు ఇచ్చిన భూముల్లోనే సాగుకు అనుమతి ఉండదని చెబుతోంది. ఈ విషయం గురించి ఇప్పుడిప్పుడే గ్రామాల్లో అధికారులు, టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అంగీకార పత్రాలు ఇచ్చిన భూముల్లో సాగుకే అనుమతి ఉండదు: సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ సమీకరణకు అంగీకార పత్రాలు ఇచ్చిన భూముల్లో మాత్రమే పంటలకు అనుమతి లేదని సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అంగీకార పత్రాలు ఇచ్చిన తర్వాత సంబంధిత భూమి ప్రభుత్వం స్వాధీనంలోకి వస్తుందని, ఆ తర్వాత రైతు, సీఆర్డీఏ మధ్య ఒప్పందం జరుగుతుందని తెలిపారు. ఈ ఒప్పందం జరిగిన నాటి నుంచి రైతులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం వర్తిస్తుందని ఆయన చెప్పారు. -
'రెండోపంట వేయొద్దనడానికి మీరెవరు'
గుంటూరు: ఏపీ రాజధాని పరిధిలో రెండో పంట అవకాశం లేదంటూ సీఆర్డీఏ కమీషనర్ చేసిన వ్యాఖ్యలపై మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గుంటూరులో ఆయన బుధవారం మాట్లాడుతూ... సీఆర్డీఏ పరిధిలో ఎమర్జెన్సీ అమలు చేయాలని చూస్తున్నారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక చట్టం, రాజధాని పరిధిలో మరో చట్టాన్ని అమలు చేయాలని చూస్తే సహించమని ఆయన హెచ్చరించారు. భూములు స్వచ్ఛందంగా ఇచ్చిన చోట ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నాతమకు అభ్యంతరం లేదన్నారు. రెండోపంట వేయొద్దని చెప్పే హక్కు కమీషనర్ కు లేదన్నారు. ఈ విషయమై రైతులకు కోర్టుకు వెళ్లే హక్కు ఉందని ఆర్కే తెలిపారు. -
మూడు లేయర్లలో రాజధాని నగర నిర్మాణం
విజయవాడ : మూడు లేయర్లలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరాన్ని నిర్మిస్తామని సీఆర్డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్ తెలిపారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాజధాని ప్రాంత భూముల్లో రెండోపంటకు అనుమతి లేదని, జనవరి నెలాఖరుకు 10వేల ఎకరాల భూ సమీకరణ పూర్తి చేస్తామన్నారు. రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న గ్రామాలు అలాగే ఉంటాయన్నారు. వాటిని కలుపుకునే మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామన్నారు. రాజధాని పరిధిలోని వ్యవసాయ భూముల్లో లేఅవుట్లకు అనుమతి లేదన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఆక్రమణలపై గుంటూరు కలెక్టర్‌ను నివేదిక ఇవ్వమని ప్రభుత్వం ఆదేశించినట్లు శ్రీకాంత్ పేర్కొన్నారు. అందుబాటులో లేని భూయజమానులు ఆన్లైన్లో అఫిడవిట్లు సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. భూ సమీకరణకు 30మంది అధికారులను నియమిస్తే ఇప్పటిదాకా 19మంది విధుల్లో చేరినట్లు చెప్పారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై అధికారుల బృందం సింగపూర్ పర్యటన ముగిసినట్లు శ్రీకాంత్ తెలిపారు. రాజధాని పరిసరాల్లో ప్రయివేట్ వాహనాల వినియోగం ఉండకుండా చూస్తామన్నారు. -
కమిషనర్‌కే సర్వాధికారాలు
సీఆర్డీఏ కమిషనర్‌కు విశేషాధికారాలు కల్పించిన ఏపీ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని ప్రాంతం లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ కమిషనర్‌కు విశేష అధికారాలను కల్పించారు. ఈ మేరకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ బిల్లులో తగిన సెక్షన్లను పొందుపరిచారు. కమిషనర్ తీసుకునే నిర్ణయాలు, జారీ చేసే ఉత్తర్వులపై ఎవరూ కూడా ఏ న్యాయస్థానంలోను అప్పీల్ చేయరాదని బిల్లులో పేర్కొన్నారు. కమిషనర్‌పై ఏదైనా దావా, అప్పీలు, దరఖాస్తు లేదా నిషేధాజ్ఞ లేదా ఏదేని సహాయమునకై ఏ న్యాయస్థానం స్వీకరించరాదని బిల్లులో పేర్కొన్నారు. ప్రాధికార సంస్థ కమిషనర్ అనుమతి లేనిదే రాజధాని ప్రాంతంలో ఏదీ చేయరాదు. సొంత గృహాల్లోగానీ, భవనాల్లో గానీ ఎటువంటి మార్పులు చేయరాదు. సొంత భూమిలో సైతం ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టరాదు. రాజధాని ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి పనులకు అనుమతించే అధికారం స్థానిక సంస్థలు గానీ ఇతర ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలకు ఉండదని స్పష్టం చేశారు. కమిషనర్ అనుమతికి విరుద్ధంగా ఎవరైనా అభివృద్ధి పనులను చేపడితే మూడేళ్లపాటు జైలు శిక్షతో పాటు ఆ భూమి విలువలో 20 శాతం జరిమానా విధించనున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. అయితే ఏదైనా భవనం, భూమిలో మార్పు లేకుండా నిర్వహణ పనులను కమిషనర్‌కు రాతపూర్వకంగా తెలియజేసి చేసుకోవచ్చు. అలాగే వ్యవసాయ అవసరాలకు బావులు, బోర్లు, అలాగే మెటల్ లేని రోడ్లు నిర్మాణాలను కమిషనర్‌కు రాతపూర్వకంగా తెలియజేసి చేసుకోవచ్చు. చట్టం ప్రకారం నిర్ధారించిన వ్యక్తిని భూమి, భవనాల్లోకి అనుమతించకుండా అడ్డంకులు సృష్టిస్తే అలాంటి వారికి ఆరు నెలల పాటు జైలు శిక్షతో పాటు పది వేల రూపాయలు జరిమానా విధించనున్నారు. అనధికారిక నిర్మాణాల పనులను నిలుపుదల లేదా సీల్ చేసే అధికారం కమిషనర్‌కు అప్పగించారు. ఏదైనా నిర్మాణం తొలగించినా సంబంధిత వ్యక్తి ఎటువంటి పరిహారం కోరరాదు. కమిషనర్ ఆదేశాలిచ్చిన పక్షం రోజుల్లోగా ఏర్పాటు చేసే ట్రిబ్యునల్‌కు మాత్రమే అప్పీల్ చేసుకోవాలి. కమిషనర్ ఇచ్చిన ఆదేశాలపై కోర్టులు ఎటువంటి సూట్, అప్పీల్స్‌ను పరిగణనలోకి తీసుకోరాదు. కమిషనర్ ఆదేశాలే సుప్రీంగా ఉండేందుకే కోర్టుల జోక్యం లేకుండా చట్టంలో సెక్షన్లను పొందుపరిచారు. ట్రిబ్యునల్ చైర్మన్‌గా జిల్లా జడ్జి లేదా సిటీ సివిల్ కోర్టు జడ్జిగా ఉన్న లేక పదవీ విరమణ చేసిన వ్యక్తిని నియమిస్తారు. మరో ఇద్దరిని సభ్యులుగా నియమిస్తారు.