
'పండుగ కూడా చేసుకోలేని స్థితిలో ఉన్నారు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పరిసర గ్రామాల్లో కూలీలకు గత నాలుగు నెలలుగా పెన్షన్లు ఇవ్వడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) చెప్పారు. దీనిపై సీఆర్డీఏ కమిషనర్కు ఆయన బుధవారం లేఖ రాశారు.
కూలీలకు పెన్షన్లు ఇవ్వకపోవడంతో పండుగ కూడా చేసుకోలేని స్థితిలో ఉన్నారన్నారు. తక్షణమే పెన్షన్లు విడుదల చేసి వారికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే ఆర్కే లేఖలో పేర్కొన్నారు.