'రెండోపంట వేయొద్దనడానికి మీరెవరు' | ysrcp mla rama krishna reddy slams CRDA commissioner | Sakshi
Sakshi News home page

'రెండోపంట వేయొద్దనడానికి మీరెవరు'

Published Wed, Jan 28 2015 5:18 PM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM

'రెండోపంట వేయొద్దనడానికి మీరెవరు' - Sakshi

'రెండోపంట వేయొద్దనడానికి మీరెవరు'

గుంటూరు: ఏపీ రాజధాని పరిధిలో రెండో పంట అవకాశం లేదంటూ సీఆర్డీఏ కమీషనర్ చేసిన వ్యాఖ్యలపై మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గుంటూరులో ఆయన బుధవారం మాట్లాడుతూ... సీఆర్డీఏ పరిధిలో ఎమర్జెన్సీ అమలు చేయాలని చూస్తున్నారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక చట్టం, రాజధాని పరిధిలో మరో చట్టాన్ని అమలు చేయాలని చూస్తే సహించమని ఆయన హెచ్చరించారు.

భూములు స్వచ్ఛందంగా ఇచ్చిన చోట ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నాతమకు అభ్యంతరం లేదన్నారు.  రెండోపంట వేయొద్దని చెప్పే హక్కు కమీషనర్ కు లేదన్నారు.  ఈ విషయమై రైతులకు కోర్టుకు వెళ్లే హక్కు ఉందని ఆర్కే తెలిపారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement