Amaravati Master Plan
-
జైలుకు ఈశ్వరన్
సింగపూర్: అవినీతి కేసులో దోషిగా రుజువైన సింగపూర్ మాజీ మంత్రి, ఏపీ సీఎం చంద్రబాబు ‘అమరావతి పార్ట్నర్’ ఎస్.ఈశ్వరన్ (62) సోమవారం జైలుకు వెళ్లారు. మంత్రిగా ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి ఏడేళ్ల కాలంలో ఆయన 3.12 లక్షల డాలర్ల విలువైన అక్రమ కానుకలు స్వీకరించడం నిజమేనని కోర్టు తేల్చడం, ఏడాది జైలు శిక్ష విధిస్తూ గత గురువారం తీర్పు వెలువరించడం తెలిసిందే. ఇప్పటికే నేరాన్ని అంగీకరించిన ఈశ్వరన్ కోర్టు తీర్పుపై అపీలుకు వెళ్లకుండా శిక్ష అనుభవించేందుకే మొగ్గు చూపారు. ‘‘నా చర్యలకు పూర్తి బాధ్యత వహిస్తున్నా. సింగపూర్వాసులందరికీ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నా’’ అంటూ సోమవారం ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అనంతరం శిక్ష అనుభవించేందుకు జైలుకు వెళ్లారు. ఏపీలో రాజధాని అమరావతి పేరిట 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో జరిగిన భూ దోపిడీలో ఈశ్వరన్ కూడా కీలక పాత్రధారి అన్నది తెలిసిందే. -
మళ్లీ సింగపూర్ కంపెనీలకే అమరావతి!
సాక్షి, విజయవాడ: అమరావతిని మళ్లీ సింగపూర్ కంపెనీలకే కూటమి ప్రభుత్వం కట్టబెట్టింది. అమరావతి విషయంలో సీఆర్డీఏ తొలి సమావేశంలోనే చంద్రబాబు ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. సింగపూర్‌తో మళ్లీ చర్చిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్‌లో సింగపూర్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. అసెండాస్, సింగ్ బ్రిడ్జ్, సెంబ్ కార్బ్ కంపెనీలను మళ్లీ తేవాలని తాజాగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవినీతి మోడల్‌గా గతంలో సింగపూర్ ఒప్పందంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అవినీతి కేసుల్లో జైలుకి వెళ్లిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఒప్పందం చేసుకున్నారు. .. ఈశ్వరన్ దోపిడీపై ఆయన్ను సింగపూర్ ప్రభుత్వం జైలుకి పంపింది. భూమి, నిధులు మనవి లాభాలు సింగపూర్ కంపెనీలవి అన్నట్లు ఉండేది. ఇదే సింగపూర్ సీడ్ క్యాపిటల్ ఒప్పందం సీక్రెట్. 58 శాతం వాటా సింగపూర్ కంపెనీలదే ఉంది. 1691 ఎకరాలను మళ్లీ సింగపూర్ కంపెనీలకే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీడ్ క్యాపిటల్ డెవలపర్‌గా మళ్లీ సింగపూర్ కంపెనీలనే తేవాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. .. స్విస్ ఛాలెంజ్ పేరుతో గ్లోబల్ టెండర్లు లేకుండానే ప్రభుత్వం కట్టబెట్టింది. స్విస్ ఛాలెంజ్ ఎంపికపై గతంలోనే మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తప్పుపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, ఏపీ ఐడీఐ చట్టానికి విరుద్ధమని ఐవైఆర్ అభ్యంతరం తెలిపారు. రూ. 66 వేల కోట్ల దోపిడీ మోడల్ అంటూ గతంలోనే ఆరోపణలు చేశారు. అదే సింగపూర్ మోడల్‌కి మళ్లీ సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
‘అమరావతి’ దేశంలో అతిపెద్ద భూస్కామ్
సాక్షి, అమరావతి : తన ఒక్కడి స్వప్రయోజనం కోసం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అటు 29 గ్రామాల ప్రజలను ఇటు రాష్ట్రాభివృద్ధిని పణంగా పెట్టారని పలువురు మేధావులు, సామాజికవేత్తలు విమర్శించారు. అమరావతి దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణమని, ఇందులో రూ.లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారు. సమాజ నిర్మాణానికి మూల స్తంభంగా ఉండాల్సిన మీడియాలోని ఓ వర్గం కూడా ఆయనకు జత కలవడంతో రాష్ట్రానికి ముప్పు ఏర్పడుతోందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బహిరంగ దోపిడీలకు తెగబడిన చంద్రబాబు అధికారం కోల్పోయాక రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అటంకాలు కల్పిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తంచేశారు. సీనియర్ జర్నలిస్ట్ అనిల్ గోపరాజు రచించిన ‘‘భ్రమరావతి కథలు’’ పుస్తకావిష్కరణ, ‘‘అమరావతి–మూడు రాజధానులు’’ అంశంపై విజయవాడలో ఆదివారం ప్రత్యేక సదస్సు జరిగింది. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో పలువురు వక్తలు మాట్లాడారు. అధికారం కోల్పోయిన చంద్రబాబు కక్ష కట్టినట్లుగా వ్యవహరించి అడుగడుగునా రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడ్డారని, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంపైనా వేయనన్ని కోర్టు కేసులు వేయించారని వారు గుర్తుచేశారు. ‘చంద్రబాబు ఓ మాయను సృష్టిస్తారు.. దాన్ని ఎల్లో మీడియా అది నిజమని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుంది. అందుకోసం రాష్ట్ర ప్రయోజనాలను సైతం నాశనం చేశారు’.. అని ఆరోపించారు. ‘అమరావతి’ పేరుతో చంద్రబాబు చేసిన మోసాలన్నీ సమగ్రంగా అనిల్ గోపరాజు చక్కగా వివరించారన్నారు. ఈ భూ కుంభకోణంలో చంద్రబాబుతో పాటు నారా లోకేశ్‌కు కూడా భాగం ఉందని.. గతంలో నారా బ్రాహ్మణి ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్‌గా పనిచేసిన సింగపూర్ కంపెనీకే చంద్రబాబు అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రాజెక్టును కట్టబెట్టారన్నారు. టీడీపీ తప్పుడు ప్రచారంతో ప్రజలు ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని సామాజిక కార్యకర్త రజనీచౌదరి సూచించారు. సదస్సులో రాజకీయ విశ్లేషకుడు చింతా రాజశేఖర్, విద్యావేత్త డాక్టర్ జయప్రకాష్, అంధ్రా అడ్వకేట్స్ ఫోరం కన్వినర్ బి. అశోక్‌కుమార్, నాయీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి తుళ్లూరు సూరిబాబు, అఖిల భారత బ్రాహ్మణ మహాసభ జోనల్ కార్యదర్శి కృత్తివెంటి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులకు ‘రాష్ట్రాభివృద్ధి–సంక్షేమం’పై పోటీలు నిర్వహించి నగదు బహుమతులు అందజేశారు. ఇక సదస్సులో వక్తలు ఏమన్నారంటే.. బూర్జువా వ్యవస్థ ఏర్పాటుకు యత్నం రాజకీయాల్లో అధికారాన్ని అడ్డుపెట్టి డబ్బు ఎలా సంపాదించాలో చంద్రబాబుకు బాగా తెలుసు. హైటెక్ సిటీ నిర్మాణంలోనూ మోసం చేశారు. ఇలా మోసాలు మొదలుపెట్టి, అమరావతి భూకుంభకోణంతో 100 తరాలకు సరిపడా ధనం పోగేసుకున్నారాయన. అంతేకాక.. ఈ ప్రాంతంలో మరో వర్గం ఉండకూడదని ఆరాటపడి చట్టాలు చేశారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటి బూర్జువా, జమీందారీ వ్యవస్థలను ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. కానీ, సీఎం జగన్ దాన్ని భగ్నం చేశారు. బాబు అమరావతి ప్రాంత రైతులను సైతం నిలువునా ముంచారు. ఈ ప్రాంత రైతులకు, సీఆర్డీఏల మధ్య జరిగింది వ్యాపార ఒప్పందం మాత్రమే. అమరావతి రాజధానిగా గెజిట్ నోటిఫికేషన్ లేదు. అక్కడ భూ సమీకరణ ప్రక్రియ ఇంకా పూర్తికానందువల్ల రాజధానిగా గుర్తింపు ఉండదు. – పి. విజయబాబు, అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఈశ్వరన్, బాబు తోడు దొంగలు చంద్రబాబు స్వార్థం లేకుండా ఏ పనీ చేయరు. అమరావతి కూడా అలాంటిదే. ఈయనలాంటి వ్యక్తే సింగపూర్‌కు చెందిన మంత్రి ఈశ్వరన్ కూడా. ఈ తోడుదొంగలకు ఎల్లో మీడియా జతకలిసి రాష్ట్ర ప్రజలను మోసంచేశాయి. దాంతో అక్కడ ఈశ్వరన్, ఇక్కడ బాబు ఇద్దరూ జైలుకెళ్లారు. రాష్ట్రాభివృద్ధిపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజానికి.. సర్వతోముఖాభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ దేశానికే దిక్సూచిగా మారింది. వలంటీర్ వ్యవస్థ, సచివాలయాల ద్వారా పరిపాలనను, ప్రభుత్వ సేవలను మారుమూల గ్రామాల్లో ప్రజల ముంగిటకే సీఎం జగన్ తీసుకెళ్లారు. – పి.గౌతంరెడ్డి, ఏపీ ఫైబర్‌నెట్ చైర్మన్ రాజధాని లేకపోవడం బాబు పుణ్యమే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత చంద్రబాబుదే. ఇక్కడ 29 గ్రామాల మధ్య సన్నిహితులతో ఆయన ముందే భూములు కొనిపించారు. అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని నాటి కేంద్రంలోని కీలక వ్యక్తి సలహా ఇచ్చారు. దానికి అమరావతిగా ఓ పత్రికాధిపతి నామకరణం చేశారు. చంద్రబాబు మొత్తం పథకాన్ని అమలుచేశారు. వీరంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. ప్రస్తుతం సింగపూర్‌లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్.ఈశ్వరన్‌తో కలిసి చంద్రబాబు 1,691 ఎకరాల భూమిని ఆ దేశ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేశారు. – వీవీఆర్ కృష్ణంరాజు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజధాని ఎక్కడైనా ఉండొచ్చు పరిపాలన కోసం రాజధాని అవసరం. అది రాష్ట్రం మధ్యలోనే కాకుండా ఎక్కడైనా ఉండొచ్చు. అక్కడ ప్రైవేటు వ్యక్తులు, నివాసాలు ఎక్కడా ఉండవు. అమెరికా రాజధాని వాషింగన్ట్ డీసీలో కేవలం అధ్యక్ష భవనం, పార్లమెంట్, వివిధ శాఖల కార్యాలయాలు మాత్రమే ఉంటాయి. న్యూఢిల్లీలో సైతం అలాగే ఉంటాయి. కానీ, అందుకు భిన్నంగా చంద్రబాబు కొత్త రాజధాని నగరం అమరావతి నిరి్మస్తామంటూ ప్రజలను మోసం చేశారు. – కోడూరు కృష్ణారెడ్డి, నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్(నాటా) కో–కన్వినర్ ఆ భూములు ప్రభుత్వపరం చేయాలి ఎక్కడైనా రాజధానిని ప్రభుత్వ భూములు, అవి లేని పక్షంలో పంటకు పనికిరాని భూముల్లో ఏర్పాటు చేయాలి. అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, సిబ్బంది నివాసాలు మాత్రమే ఉండాలి. ప్రైవేటు వ్యక్తులకు స్థానం ఉండదు. రాజధాని ప్రాంతాలైన న్యూఢిల్లీ, చంఢీగడ్‌లో కూడా భూములు ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. అమరావతి పేరుతో సమీకరించిన మొత్తం భూములను ప్రభుత్వపరం చేయాలి. యాజమాన్య హక్కులు ప్రభుత్వానికి మాత్రమే ఉండాలి. చంద్రబాబు ఒకే ఇంట్లో తగవులు పెట్టగల ఘనుడు. మోసం చేయడంలో దిట్ట. ముందే భూములు కొనిపించి రైతుల సంపదను బాబు కొల్లగొట్టారు. – డీఎస్ఎన్వీ ప్రసాదబాబు, జనవాహిని సామాజిక సంస్థ అధ్యక్షుడు -
నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్
సాక్షి, గుంటూరు: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో ఇవాళ మరో పరిణామం చోటు చేసుకుంది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్ తరపున న్యాయవాదులు హైకోర్టులో ఈ పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఏ14గా లోకేష్ ఉన్న సంగతి తెలిసిందే. రాజధాని పేరుతో అమరావతిలోని అన్ని రోడ్లను కలుపుతూ ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) వేసే ప్రాజెక్టు పేరిట నాటి టీడీపీ సర్కార్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడింది. ఈ విషయంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఫిర్యాదుతో ఏపీ సీఐడీ రంగంలోకి దిగింది. దర్యాప్తులో భాగంగా ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద గతేడాది ఏప్రిల్‌లో సీఐడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తు తదనంతరం.. ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసులో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా సీఐడీ పేర్కొంది. అయితే.. ఈ కేసులో ఇప్పటికే ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణను పేర్కొన్న సిట్ నారా లోకేశ్‌ను ఏ–14గా పేర్కొంటూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో మంగళవారం ప్రత్యేక మెమో దాఖలు చేసింది. ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్లో మార్పులు చేసి నారా లోకేష్ లబ్ధి పొందాలని ప్రయత్నించారని అభియోగాలు నమోదు చేసింది ఏసీ సీఐడీ. తన తండ్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో జరిగిన స్కామ్‌లో నారా లోకేష్ కీలక భూమిక పోషించారని, అలైన్మెంట్ ఖరారులో అక్రమాలతో హెరిటేజ్ ఫుడ్స్ కోసం భూములను నారా లోకేష్ కొల్లగొట్టినట్లు దర్యాప్తు సంస్థ సీఐడీ నిర్ధారించుకుంది. చంద్రబాబు, నారాయణ, లోకేష్‌తోపాటు లింగమనేని రమేశ్, రాజశేఖర్‌లు, అలాగే.. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను కూడా ఈ కేసులో నిందితులుగా పేర్కొంది ఏపీ సీఐడీ. అయితే నారాయణ ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిల్ పొందారు. -
Live: చంద్రబాబు కేసు అప్డేట్స్.. Click & Refresh
Updates.. 08:52PM, సెప్టెంబర్ 19, 2023 సీఐడీ కౌంటర్ దాఖలు ► విజయవాడ: చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సీఐడీ కౌంటర్ ► బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా 06:50PM, సెప్టెంబర్ 19, 2023 చంద్రబాబు @ A25 ► విజయవాడ : ACB కోర్టులో మెమో దాఖలు చేసిన CID ► ఫైబర్ నెట్ కుంభకోణంలో 25వ నిందితుడిగా చంద్రబాబు పేరు చేరుస్తూ మెమో ►ఫైబర్ నెట్‌పై వేసిన పిటి వారెంట్‌కు అనుబంధంగా మెమో దాఖలు 06:00PM, సెప్టెంబర్ 19, 2023 ఫైబర్ గ్రిడ్ కుంభకోణం జరిగిందిలా.. ► గతంలో ఏపీ సివిల్ సప్లైస్‌కు సర్వీసులు అందించిన టెర్రాసాఫ్ట్ కంపెనీ ► నాసిరకం ఈ- పోస్ మిషన్లు పంపిణీ చేసినందుకు టెర్రా సాఫ్ట్‌ను నాడు బ్లాక్ లిస్టులో పెట్టిన ప్రభుత్వం ► అయినా టెర్రాసాఫ్ట్‌పై అంతులేని ప్రేమ కురిపించిన చంద్రబాబు సర్కారు ► టెర్రాసాఫ్ట్‌కు టెండర్లు కట్టబెట్టేందుకు నాడు చంద్రబాబు సర్కారు అవకతవకలు ► బ్లాక్‌లిస్ట్‌లో టెర్రాసాఫ్ట్‌ను రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే తప్పించిన వైనం ► బ్లాక్ లిస్ట్ లో పెట్టిన 2 నెలలకే టెర్రాసాఫ్ట్‌ను లిస్ట్ నుంచి తొలగించిన అప్పటి సివిల్ సప్లైస్ డైరక్టర్ రవిబాబు ► హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీతో జట్టు కట్టి ప్రాజెక్టు దక్కించుకున్న టెర్రాసాఫ్ట్ ► టెండర్లు దక్కించుకున్న తర్వాత హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీని నిబంధనలకి విరుద్దంగా బయటకి పంపిన టెర్రాసాఫ్ట్ ► ఇప్పటికే హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అనీల్ జైన్ స్టేట్ మెంట్ రికార్డు చేసిన CID ► తమని మోసం చేసినట్టు వాంగ్మూలమిచ్చిన హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ VP అనీల్ జైన్ ► నిబంధనలకి విరుద్దంగా మరొక కంపెనీ నుంచి రూ.115 కోట్ల నాసిరకం మెటీరియల్‌ను కొనుగోలు చేసి ఫైబర్ నెట్‌కు సరఫరా చేసిన టెర్రా సాఫ్ట్ ► చంద్రబాబు సూచనల మేరకే టెర్రాసాఫ్ట్ వ్యవహరం మలుపులు తిరిగిందని తేల్చిన CID 05:40PM, సెప్టెంబర్ 19, 2023 ACB కోర్టులో చంద్రబాబుపై మరో కేసులో PT వారంట్ ► చంద్రబాబుపై మరో పిటి వారెంట్ దాఖలు, ఫైల్ నంబర్ 2916/2023 ► ఫైబర్‌నెట్ కుంభకోణంలో చంద్రబాబు ప్రదాన ముద్దాయిగా పిటి వారెంట్ ► రూ.115 కోట్ల నిధులు గోల్ మాల్ అయ్యాయని దర్యాప్తులో తేల్చిన సిట్ ► 2021 లోనే ఫైబర్ నెట్ కుంభకోణంలో 19 మందిపై సిఐడి కేసు నమోదు ► నాటి FIRలో A1గా వేమూరి హరిప్రసాద్, A2గా మాజీ MD సాంబశివరావు ► చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు వేమూరి హరిప్రసాద్ 05:12PM, సెప్టెంబర్ 19, 2023 ACB కేసులో విచారణ రేపటికి వాయిదా ► CID కస్టడీ పిటిషన్‌పై సమయం అడిగిన చంద్రబాబు లాయర్లు ► హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్న దృష్ట్యా కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలన్న చంద్రబాబు లాయర్లు ► రేపటి వరకు సమయం అడిగిన చంద్రబాబు లాయర్లు, సరేనన్న ACB కోర్టు ► CID వేసిన చంద్రబాబు కస్టడీ పిటీషన్ పై విచారణ రేపటికి వాయిదా 05:00PM, సెప్టెంబర్ 19, 2023 వాదనలు ముగిసాయి, 2 రోజుల్లో తీర్పు : హైకోర్టు ► ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి ► ఇప్పుడు కోర్టు నిర్ణయం తీసుకోనివ్వండి ► రెండు రోజుల్లో ఈ పిటిషన్‌పై తీర్పు ఇస్తాం 04:50PM, సెప్టెంబర్ 19, 2023 చివరిగా మరోసారి మా విజ్ఞప్తి వినండి : బాబు లాయర్ లూథ్రా ► చంద్రబాబును ఈ కేసులో A1 అంటున్నారు ► నిధులు విడుదల చేసిన వ్యక్తే అసెంబ్లీలో ప్రకటన చేశారు ► నిజంగా తప్పు చేసి ఉంటే, లేదా కుంభకోణం కుట్ర ఉంటే సభలో ఎందుకు ప్రకటన చేస్తారు? ► సెక్షన్ 17A సవరణ ఈ కేసుకు వర్తిస్తుంది. గవర్నర్ అనుమతి తీసుకోకుండా అరెస్ట్ చేశారు ► ఈ కేసును రఫెల్ కేసుతో పోల్చవచ్చు. ఆ కేసులో జస్టిస్ జోసెఫ్ ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేసుకోవాలి ► మా వాదన అంతా 17A చుట్టే ఉంది. CID వాదనల్లో 90%, 10% అన్న దగ్గర కన్ఫ్యూజన్ ఉంది ► సీమెన్స్ కంపెనీ నుంచి వచ్చిన ఈ మెయిల్‌కు రిమాండ్ రిపోర్ట్‌కు తేడా ఉంది 04:45PM, సెప్టెంబర్ 19, 2023 ఈ కేసును ఇవ్వాళే ముగిస్తాం : హైకోర్టు ► ఈ కేసులో ఇంకేదైనా చెప్పుకోవాలంటే ఇప్పుడే అవకాశం ఇస్తున్నాం ► ఉదయం నుంచి ఇప్పటిదాకా ఇదే కేసులో వాదనలు విన్నాం ► ఈ కేసులో స్పష్టత వచ్చింది. చివరి అవకాశం ఇస్తున్నాం 04:35PM, సెప్టెంబర్ 19, 2023 బాబు లాయర్లు ఇచ్చినవి సరైన రిఫరెన్స్‌లు కావు.! : CID లాయర్లు ► ఈ కేసులో బాబు లాయర్లు అర్నబ్ గోస్వామి కేసును ఉదహరించారు ► అర్నబ్ గోస్వామిది వాక్ స్వాతంత్ర హక్కుకు సంబంధించినది ► ఆ కేసుకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు ► ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి నుంచి పథకం ప్రకారం జరిగింది ► సెక్షన్482 పిటిషన్లపై నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది ► అరెస్టు చేయకూడదంటూ హైకోర్టులు ప్రతీసారి జోక్యం చేసుకోవద్దంటూ నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేసులో సుప్రీం తీర్పునిచ్చింది ► పోలీసులకు పూర్తి విచారణ చేసుకునే వెసులుబాటు కల్పించాలి ► ఈ కేసులో విచారణ ఇప్పుడే ప్రారంభమైంది… ఈడీ, ఇన్‌కంటాక్స్ కూడా విచారిస్తున్నాయి. దీనిని కోర్టు పరిగణలోకి తీసుకోవాలి 04:32PM, సెప్టెంబర్ 19, 2023 CID వాదనలు అభ్యంతరకరంగా ఉన్నాయి : బాబు లాయర్ సాల్వే ► ఈ ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నరేళ్లు పూర్తయ్యాయి ► ఈ ప్రభుత్వం ఇప్పుడు పైల్స్ కనిపించడం లేదని, అవి చంద్రబాబు మాయం చేశారని ఆరోపిస్తున్నారు ► 2018లోనే ఫిర్యాదు వచ్చిందన్న వాదనను మేం ఒప్పుకోం ► 2021లో నమోదయిన ఫిర్యాదునే కోర్టు పరిగణించాలి 04:32PM, సెప్టెంబర్ 19, 2023 సెక్షన్ 17A సవరణ ఈ కేసులో వర్తించదు : CID లాయర్ ► ఈ కేసులో ప్రాథమిక విచారణ జూన్ 5, 2018న జరిగింది : పొన్నవోలు సుధాకర్ రెడ్డి ► అంటే 2018లో సెక్షన్ 17A సవరణకు ముందే ఇది పూర్తయింది ► 2015 నుంచే స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై ఆరోపణలున్నాయి ► ఒక సెక్షన్‌కు సంబంధించిన సవరణ కోసం దర్యాప్తు ఆగదు ► ఈ కేసులో శుక్రవారం కౌంటర్ ఫైల్ చేయగలం 04:25PM, సెప్టెంబర్ 19, 2023 సెక్షన్ 17A గురించి చర్చిద్దాం : బాబు లాయర్ హరీష్ సాల్వే ► CID లాయర్ వాదిస్తుండగా.. జోక్యం చేసుకున్న సాల్వే ► కేసు పెట్టింది 2020లో కాబట్టి 2018లో చేసిన సవరణ వర్తిస్తుంది ► సీమెన్స్ గుజరాత్లో కూడా ప్రాజెక్టు చేపట్టింది ► గుజరాత్లో ఎలా జరిగిందో.. ఏపీలో కూడా చంద్రబాబు అలాగే నిర్వహించారు ► ప్రభుత్వం కోరినట్టు ప్రాజెక్టు పూర్తయింది ► ఇక్కడ తప్పు ఎక్కడ జరిగి ఉండొచ్చంటే.. పన్ను ఎగ్గొట్టడానికి డిజైన్ టెక్ చేసిన ప్రయత్నంలో చంద్రబాబును ఇరికించారు ► 2024లో ఏపీ శాసనసభకు, లోక్‌సభకు ఎన్నికలున్నాయి ► చంద్రబాబును లోపల పెట్టడమన్నది రాజకీయ కక్ష కాకుంటే మరొకటని భావించలేం ► ఒక వేళ చంద్రబాబు విదేశాలకు పారిపోయి ఉంటే.. దాన్ని ఈ ప్రభుత్వం సంతోషంగా అనుమతించేది 04:20PM, సెప్టెంబర్ 19, 2023 క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టేయాలంటే... : CID లాయర్ ► NCT ఢిల్లీ X ప్రీతీ సరఫ్ కేసును ప్రస్తావించిన CID లాయర్ ► సాంకేతిక కారణాలు చూపించి క్వాష్ కొట్టేయడం సరికాదని సుప్రీంకోర్టు చెప్పింది ► సెక్షన్ CrPC 482 ప్రకారం దర్యాప్తు అధికారులను విచారణ పూర్తి చేసుకోనివ్వాలి 04:10PM, సెప్టెంబర్ 19, 2023 స్కిల్ డెవలప్ స్కాంలో ఎప్పుడు ఏం జరిగిందంటే.. కోర్టుకు వివరించిన CID లాయర్ రంజిత్ ►నిందితులకు ఆదాయపుపన్నుశాఖ నోటీసులు జారీచేసింది ► స్కిల్ స్కాంపై ఆదాయంపన్ను శాఖ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించింది ► వాళ్ల మోడస్ ఆపరండీని మొత్తం ఇన్‌కంటాక్స్ పసిగట్టింది ► రూ.200 కోట్ల మేర నిధులను మళ్లించినట్టుగా IT తన ఫోరెన్సిక్ ఆడిట్లో గుర్తించింది ► స్కిల్ డెవలప్మెంట్ కోసం నాటి చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్లో ఎలాంటి తేదీ కూడా లేదు ► ఒప్పందం చేసుకున్న వెంటనే డిజైన్ టెక్ స్కిల్లర్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది ► ఎలాంటి ముందస్తు ఒప్పందం లేకుండానే ఈ కంపెనీని ఇన్కార్పొరేట్ చేశారు ► స్కిలర్ నుంచి రూ.178 కోట్లు కొనుగోలు చేసినట్టుగా డిజైన్‌టెక్ చూపింది ► ఒప్పదంలోకాని, ప్రతిపాదనలోకాని ఎలాంటి తేదీ కూడా లేదు ► డాక్యుమెంట్లలో ఎలాంటి తేదీలు కూడా లేవు, ఇది ఉద్దేశపూర్వకంగా విస్మరించారు ► ప్రభుత్వం ఉత్తర్వుల్లో కానీ, MOUల్లో ఎలాంటి స్థిరత్వం లేదు ► సంతకాలకు ముందే ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా 164 స్టేట్మెంట్లో నిందితులు అంగీకరించారు 04:00PM, సెప్టెంబర్ 19, 2023 ఇది పక్కా కుంభకోణమే, చంద్రబాబే సూత్రధారి, పాత్రధారి : CID లాయర్లు ► నేరం జరిగినప్పుడు తాను ముఖ్యమంత్రిని కాబట్టి ఇది రాజకీయ కక్ష్య అని చంద్రబాబు అంటున్నారు. ► విచారణ పూర్తై అధికారులు నివేదిక సమర్పించిన తరువాతే కోర్టు జోక్యం చేసుకోవాలి. ► FIRలో తన పేరులేదు కాబట్టి అరెస్టు చేయకూడదని చెప్పడం తప్పు ► FIR సర్వస్వం కాదు కోర్టులో కేసు విచారణ జరుగుతున్న సందర్భంలో కూడా పేరు చేర్చవచ్చు. ► ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో వ్యవహరించింది… అందుకే 2021లో చంద్రబాబు పేరును ఎఫ్ఐఆర్లో చేర్చలేదు ► ప్రైవేటు కంపెనీలు ఒక్క రూపాయి ఇవ్వకుండానే ప్రభుత్వానికి చెందిన 300కోట్లు రిలీజ్ చేశారు ► ముందుగానే ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేయడం అనేది ఎక్కడా ఉండదు. ► చంద్రబాబు ఆధ్వర్యంలోనే ఈ కుట్ర జరిగింది.. షెల్ కంపెనీలకు సైతం చంద్రబాబే సూత్రధారి, పాత్రధారి 03:48PM, సెప్టెంబర్ 19, 2023 కేవలం ఎఫ్ఐఆర్ ఆధారంగానే అరెస్ట్ జరగలేదు: CID లాయర్లు ► దర్యాప్తు బృందంపై రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. కానీ, వీళ్లంతా శిక్షణ పొందిన అధికారులు. ఆరోపించేవాళ్లు ముందు ఈ విషయం గుర్తించాలి. ► సీమెన్స్ కంపెనీతో జరిపిన మెయిల్ సంభాషణలు మా దగ్గర ఉన్నాయి. ► చంద్రబాబు సెక్రటరీకి ఈడీ, ఐటీ నోటీసులు ఇచ్చాయి. ఆయన దేశం విడిచి అమెరికాకు పారిపోయారు. ► సీమెన్స్‌కు నిందితుడు సుబ్బారావు, గంటా ఈమెయిల్స్ పంపారు.. అప్పటి ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ కూడా ఇందులో బాగం అయ్యారు. ► కేవలం ఎఫ్ఐఆర్ ఆధారంగానే చంద్రబాబు అరెస్ట్ జరగలేదు. 03:23PM, సెప్టెంబర్ 19, 2023 పోలీసులపై నిందలు మోపుతారా? : CID లాయర్లు ►ఈ కేసు ప్రారంభ దశలోనే ఉంది. బెయిల్ దరఖాస్తు చేసుకున్న దరిమిలా.. 10 రోజుల్లో దర్యాప్తు పూర్తి కాదు. ►ప్రభుత్వం ప్రతీకారమే తీర్చుకోవాలనుకుంటే.. ఈ పెద్దమనిషి (చంద్రబాబు నాయుడు) ఏనాడో అరెస్టు అయ్యేవారు కదా. ►సెక్షన్ 17A ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకున్న అమాయక సేవకులను (innocent servants) రక్షించడం కోసం మాత్రమే. ►శంభూ నాథ్ మిశ్రా కేసును ఉదహరిస్తూ.. ‘‘రికార్డులను రూపొందించడం, నిధుల్ని దుర్వినియోగం చేయడం అధికారిక విధి కాదు." ►కేసు దర్యాప్తు దశలోనే ఉంది. ఐటీ శాఖ దర్యాప్తు చేస్తోంది. ఈడీ దర్యాప్తు చేస్తోంది. ►నేను సీఎంను(మాజీ) కాబట్టే.. అనే అంశం ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఇది రాజకీయమైంది ►ఎంవోయూలో సబ్ కాంట్రాక్ట్ ప్రస్తావనే లేదు. ఎలాంటి సేవలు అందించకుండానే షెల్ కంపెనీలకు నిధులు వెళ్లాయి. ► రూ. 3 వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది ► షెల్ కంపెనీల జాడ తీస్తున్నాం ► నిబంధనలకు వ్యతిరేకంగా ఎంవోయూ నుంచి సబ్ కాంట్రాక్టుకు ఎలా వెళ్లింది? ► అన్ని బోగస్ కంపెనీలు కలిపి ప్రజాధనాన్ని లూటీ చేశాయి. ► ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా నిధుల దుర్వినియోగం జరిగింది ► ఈ డీల్‌కు కేబినెట్ ఆమోదం లేదు ► చంద్రబాబు పథకం ప్రకారమే తన అనుచరులతో కలిసి బోగస్ కంపెనీల పేరుతో రూ.371 కోట్ల ప్రజాధనం దోచుకున్నారు. ►మార్గదర్శకాలను కూడా కోర్టు అనుసరించాలి. విచారణ పూర్తయ్యే దాకా ఆగాలి. దర్యాప్తు సంస్థను నివేదిక సమర్పించేదాకా వేచి చూడాలి. మెరిట్స్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడ. 02:55PM, సెప్టెంబర్ 19, 2023 చంద్రబాబు క్వాష్పిటిషన్కు అనర్హుడు : CID తరపు లాయర్లు ► చంద్రబాబు క్వాష్ పిటిషన్‌కు అనర్హుడు ► ఎఫ్ఐఆర్ చేసిన వెంటనే చంద్రబాబును అరెస్ట్ చేయలేదు. ► రెండేళ్లు అన్ని సాక్ష్యాలు సేకరించాకే అరెస్ట్ చేశారు. ► పోలీసులకు పూర్తి స్వేచ్చను ఇచ్చి.. క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయాలి ► సెక్షన్ 319 ప్రకారం ఎన్ని ఛార్జిషీట్లు అయినా వేయొచ్చు.. ఎంత మంది సాక్ష్యులను అయినా చేర్చొచ్చు. 02:38PM, సెప్టెంబర్ 19, 2023 సీఐడీ తరపున వాదనలు ►చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ► గణపతి వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు తో పాటు శంభునాథ్ మిశ్రా కేసు లో తీర్పుల్ని వివరిస్తున్న ముకుల్ రోహత్గీ ► చంద్రబాబు క్వాష్ పిటిషన్‌కు అనర్హుడంటూ వాదనలు ► ఈ దశలో నిందితుడికి అనుకూలంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని హైకోర్టుకు విజ్ఞప్తి 02:25PM, సెప్టెంబర్ 19, 2023 లంచ్ విరామం తర్వాత మొదలైన కోర్టు ►లంచ్ తర్వాత మొదలైన హైకోర్టు ► క్వాష్ పిటిషన్‌పై వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు 1:58 PM, సెప్టెంబర్ 19, 2023 హైకోర్టుకు లంచ్ బ్రేక్.. ►చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ లంచ్ తర్వాతకు వాయిదా ►లంచ్ తర్వాత వాదనలు వినిపించనున్న చంద్రబాబు లాయర్లు 1:40 PM, సెప్టెంబర్ 19, 2023 స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో బాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు ► చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరుపై అభ్యంతరాలున్నాయి ► ఒక వేళ ఈ FIR 2018 సవరణ కంటే ముందు నమోదై ఉంటే అడిగేవాళ్లం కాదు ► కానీ FIR 2020లో నమోదయింది కాబట్టి చంద్రబాబును అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి ► 2020లో అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసినప్పుడు ఇలాగే జరిగింది ► కర్ణాటక కేసును ఉదహరించిన లూథ్రా, 17Aలో ముందస్తు అనుమతి అవసరమని వాదన 1:30 PM, సెప్టెంబర్ 19, 2023 ► చంద్రబాబును అరెస్ట్‌పై కాంగ్రెస్ ప్రకటన ► చంద్రబాబును అరెస్ట్‌పై మాట్లాడిన మధుయాష్కీ ► చంద్రబాబును జైలుకు పంపడం వెనుక మోదీ, కేసీఆర్ ఉన్నారు ► కేసీఆర్ పాత్ర పై మాకు పూర్తిస్థాయి సమాచారం ఉంది ► ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పనిచేసినందుకే చంద్రబాబుపై కక్షసాధింపు చర్యలు ► చంద్రబాబు అరెస్టు పై కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించలేదు? : మధుయాష్కి 12:30 PM, సెప్టెంబర్ 19, 2023 ► స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో బాబు తరపున హరీష్ సాల్వే వాదనలు ► చంద్రబాబు అరెస్టులో సరైన నియామవళి పాటించలేదు ► చంద్రబాబు అరెస్టులో గవర్నర్ అనుమతి తీసుకోలేదు ► ప్రీవెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 17A ప్రకారం అరెస్ట్ చూపించారు ► దీని ప్రకారం పోలీసులు గవర్నర్ అనుమతి తర్వాతే అరెస్ట్ చేయాలి ► ఈ కేసులో 2020లో FIR నమోదయింది, అప్పుడు బాబు పేరు లేదు ► అరెస్ట్ చేసే సమయానికి బాబు పేరు FIRలో లేదు ► FIRలో పేరు ఉంటేనే అరెస్ట్ చేయాలి కాబట్టి ప్రోసీజర్ సరిగా ఫాలో కాలేదు ► ఎన్నికలు వచ్చాయి కాబట్టి రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు ► సీమెన్స్ కంపెనీ రాసిన మెయిల్ ఆధారంగా APSSDC ఛైర్మన్ ఫిర్యాదు చేశారు ► స్కిల్ డెవలప్మెంట్లో సేవలందించింది సీమెన్స్‌కు చెందిన ఉప కంపెనీనే ► ప్రభుత్వం బాధ్యత నిధులు విడుదల చేయడం, సేవలు పొందడం ► CID ఆరోపించినట్టు ఎక్కడా సాక్ష్యాలను తారుమారు చేయలేదు ► ఈ కేసులో చంద్రబాబు సహకరిస్తున్నా.. అరెస్ట్‌కు తొందరపడ్డారు ► ముగిసిన హరీష్ సాల్వే వాదనలు 12:20 PM, సెప్టెంబర్ 19, 2023 ► స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసును విచారిస్తోన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ► కేసు నుంచి చంద్రబాబు పేరును తొలగించాలని క్వాష్ పిటిషన్ ► చంద్రబాబు తరపున వర్చువల్‌లో (వీడియో కాన్ఫరెన్స్ ద్వారా) హరీష్ సాల్వే వాదనలు ► చంద్రబాబు తరపున రంగంలోకి దిగిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్థార్థ లూథ్రా, హరీష్ సాల్వే, సిద్దార్థ్ అగర్వాల్ ► CID తరపున సుప్రీం న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు 12:09PM, సెప్టెంబర్ 19, 2023 ► హైకోర్టు ముందుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కాం ► ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు లాయర్ల పిటిషన్ ► ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కాం కేసును ఎల్లుండికి (ఈ నెల 21కి) వాయిదా వేసిన హైకోర్టు 11:30 AM, సెప్టెంబర్ 19, 2023 హైకోర్టులో మధ్యాహ్నం 12 తర్వాత రింగ్‌రోడ్డు కేసు విచారణ ► చంద్రబాబు రిమాండ్ పిటిషన్‌పై మధ్యాహ్నం 12 గంటలకు వాదనలు జరిగే అవకాశం ► సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే హాజరవుతారు, సమయం కావాలన్న బాబు లాయర్లు ► చంద్రబాబు తరపు న్యాయవాదుల అభ్యర్ధనను అంగీకరించిన హైకోర్టు ► హరీష్ సాల్వే వల్ల జరిగిన ఆలస్యంపై CIDని అడిగిన హైకోర్టు ► తమకు అభ్యంతరం లేదని చెప్పిన ప్రభుత్వ న్యాయవాదులు 11:20 AM, సెప్టెంబర్ 19, 2023 పచ్చ మీడియా చెప్పని/చెప్పలేని అసలు నిజాలు ► అరెస్ట్ అక్రమమంటూ గొంతు చించుకుంటోన్న పచ్చమీడియా ► కేంద్ర సంస్థల నుంచి బాబుకు ఇప్పటివరకు వచ్చిన నోటీసులు ► కేంద్ర దర్యాప్తు సంస్థ నుంచి వచ్చిన ఏ ఒక్క నోటీసునూ బయటపెట్టని పచ్చ మీడియా Case - 1 ► ఆగష్టు 4న ఇన్‌కమ్‌టాక్స్ నుంచి చంద్రబాబుకు అందిన నోటీసు ► అమరావతి కాంట్రాక్టర్ల నుంచి 600 కోట్ల కాంట్రాక్టులో (సచివాలయం బిల్డింగ్) 119 కోట్లు (20 శాతం ) ముడుపులు ► బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరికి ఇచ్చానని చెప్పిన షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ ► ఆ నోటీసు గురించి ఇప్పటివరకు నోరు మెదపని బాబు, ఎల్లో మీడియా Case - 2 ► స్కిల్ డెవలప్మెంట్తో మాకు సంబంధం లేదని లిఖితపూర్వకంగా పంపిన సీమెన్స్ ► అయినా సీమెన్స్ కంపెనీ, చాలా గొప్ప పని బాబు చేశారంటూ ఎల్లోమీడియా ప్రచారం ► టెండర్ లేకుండా తరలిపోయిన 371 కోట్ల గురించి అధికారులను అడగాలని తిరకాసు ► ఈ కేసులో నలుగురిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్ చేసిన విషయం రహస్యం.! ► బాబు పర్సనల్ సెక్రటరీ మరియు మనోజ్ విదేశాలకు పారిపోయిన విషయం అత్యంత గోప్యం Case - 3 ► ఫిబ్రవరి 17,2020న ప్రెస్ నోట్ విడుదల చేసిన ఆదాయంపన్ను శాఖ ► స్వయంగా విడుదల చేసిన ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ► బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో ఫిబ్రవరి 13 ,2020న తనిఖీలు ► ఐటీ అధికారులు సోదాల్లో 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలకు సంబందించి నల్లధన వివరాలు ► దీనికి సంబంధించి చంద్రబాబుకు ఇన్‌కంటాక్స్ నోటీసులు ► ఇప్పటివరకు నోటీసుల గురించి ఎక్కడా కోట్ చేయని పచ్చమీడియా 11:15 AM, సెప్టెంబర్ 19, 2023 అల్లర్లను నమ్ముకున్న తెలుగుదేశం టీం ► గుంటూరు, విశాఖ, విజయవాడలో రోడ్లపైకి టిడిపి నేతలు ► ఎలాంటి అనుమతులు లేకుండా ర్యాలీ చేస్తామంటూ ఏర్పాట్లు ► జన జీవనానికి ఇబ్బందులు వస్తాయని వద్దని చెప్పిన పోలీసులు ► పలు చోట్ల పోలీసులతో వాగ్వాదం, అల్లర్లు చేసేందుకు ప్రయత్నాలు ► గుంటూరులో తెలుగుదేశం ర్యాలీని అడ్డుకున్న పోలీసులు ► నక్కా ఆనంద్ బాబు, డేగల ప్రభాకర్, నన్నపనేని రాజకుమారిని నిలువరించిన పోలీసులు ► పూజలు చేస్తామంటూ వేర్వేరు దారుల్లో గుళ్లకు వస్తోన్న టిడిపి నేతలు ► దుర్గగుడికి ఆటోలో వచ్చిన దేవినేని ఉమ, వినాయకుడి గుడి వద్ద ఉమను గమనించి నిలువరించిన పోలీసులు 11:00 AM, సెప్టెంబర్ 19, 2023 హైబ్రీడ్ మోడ్‌లో చంద్రబాబు కేసు విచారణ.! ► నేరుగా వాదిస్తాం, వర్చువల్‌గా వాదిస్తాం... ► హైకోర్టుకు చంద్రబాబు తరపున లాయర్ల విజ్ఞప్తి ► ఒక సీనియర్ లాయర్, మరో సీనియర్ లాయర్ వర్చువల్‌గా ► ఆన్లైన్లో వాదనలు వినాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి ► మధ్యాహ్నం తర్వాత కేసు విచారణ చేపట్టనున్న హైకోర్టు 10:30 AM, సెప్టెంబర్ 19, 2023 కస్టడీ ఇస్తారా? రిమాండ్ పొడిగిస్తారా? ► హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో చంద్రబాబు పిటిషన్లపై నేడు విచారణ ► నేటితో ముగియనున్న నేటితో ముగియనున్న రిమాండ్ ► సాధారణ ప్రక్రియలో భాగంగా రిమాండ్ పొడిగించే అవకాశం ► హైకోర్టుకు చేరుకున్న అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ► మధ్యాహ్నం 12 గంటల తర్వాత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం 10:30 AM, సెప్టెంబర్ 19, 2023 ఏ కేసులో ఏ లాయర్ ? గంటకు ఫీజు ఎంత? ► చంద్రబాబు పిటిషన్లపై హేమాహేమీలను దించిన టిడిపి లీగల్ సెల్ ► చంద్రబాబు కోసం రంగంలోకి దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లు ► క్వాష్ పిటిషన్‌పై వాదనలు వినిపించనున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లోథ్రా ► రిమాండ్ ఉత్తర్వుల సస్పెన్షన్, కస్టడీ ఇవ్వొందంటూ వాదించనున్న ముఖుల్ రోహత్గీ ► ఏపీ హైకోర్టులోనే మరో బెంచ్‌లో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణ ► ఈ పిటిషన్‌పై చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే వర్చువల్ వాదనలు ► గంటకు కోటి అయినా ఇచ్చేందుకు టిడిపి లీగల్ సెల్ సిద్ధమని ఢిల్లీలో చర్చలు 10:10 AM, సెప్టెంబర్ 19, 2023 ఏపీ హైకోర్టుకు చేరుకున్న లూథ్రా ► ఏపీ హైకోర్టుకు చేరుకున్న సీనియర్ లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా ► చంద్రబాబుపై నమోదయిన స్కిల్ కేసును కొట్టేయాలని లూథ్రా పిటిషన్ ► లూథ్రా వేసిన క్వాష్ పిటిషన్ ఇవ్వాళ హైకోర్టులో విచారణ ► గత పది రోజులుగా కేసుపై వీపరీతంగా ప్రిపేర్ అయిన లూథ్రా ► చంద్రబాబును విడిపించే బలమైన లాజిక్ దొరక్క లూథ్రా నిర్వేదం ► నిర్వేదంలో గురు గోవింద్ సింగ్, స్వామి వివేకానంద కొటేషన్లతో ట్వీట్లు Swami Vivekananda says in Karma Yoga - "A man must go about his duties without taking notice of the sneers and the ridicule of the world." And definitely not by those who have neither read nor understood the words of the venerable 1Oth guru who stood for justice and piety!! — Sidharth Luthra (@Luthra_Sidharth) September 14, 2023 10:00 AM, సెప్టెంబర్ 19, 2023 చంద్రబాబు కోసం దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లు ► చంద్రబాబు తరపున దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లు ► ముగ్గురు టాప్ మోస్ట్ లాయర్లతో టిడిపి లీగల్ సెల్ మంతనాలు ► ఇవ్వాళ హైకోర్టులో వాదనలు వినిపించనున్న ముగ్గురు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ► సిద్ధార్ధ లూథ్రాతో పాటు హారీశ్ సాల్వే, సిద్ధార్ధ్ అగర్వాల్ ► ఇతర పనుల నిమిత్తం ఫ్రాన్స్‌లో ఉన్న హారీశ్ సాల్వే ► ఎక్కడ ఉన్నా.. ఇక్కడ వాదనలు వినిపించాలని హారీశ్ సాల్వేకు టిడిప లీగల్ సెల్ విజ్ఞప్తి ► ఫ్రాన్స్ నుంచి వర్చువల్ గా వాదనలు వినిపించనున్న హరీశ్ సాల్వే 9:00 AM, సెప్టెంబర్ 19, 2023 యనమలపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు.. ►చంద్రబాబు జైల్లో కూర్చుని విజన్ 2047 గురించి ఆలోచిస్తున్నారు. ►జాతీయ నేతలకు ధన్యవాదాలు చెప్పమన్నారని స్వయంప్రకటిత మేధావి యనమల రామకృష్ణుడు సెలవిస్తున్నారు. ►బెయిల్ కోసం ఆయన బెంబేలెత్తిపోతుంటే మీ బిల్డప్స్ ఏంటి రామా కృష్ణా!. చంద్రబాబు గారు జైల్లో కూర్చుని విజన్ 2047 గురించి ఆలోచిస్తున్నారని, జాతీయ నేతలకు ధన్యవాదాలు చెప్పమన్నారని స్వయంప్రకటిత మేధావి యనమల రామకృష్ణుడు సెలవిస్తున్నారు. బెయిల్ కోసం ఆయన బెంబేలెత్తిపోతుంటే మీ బిల్డప్స్ ఏంటి రామా కృష్ణా! — Vijayasai Reddy V (@VSReddy_MP) September 19, 2023 08:12AM, సెప్టెంబర్ 19, 2023 ►గుంటూరులో టీడీపీ నేతల పూజా కార్యక్రమాలు ►చంద్రబాబు బెయిల్ కోసం ప్రత్యేక పూజలు ►వినాయక మండపాల వద్ద టీడీపీ నేతల పూజలు ►ఆధ్యాత్మిక ప్రాంతాల్లో రాజకీయాలు చేయడం ఏంటని భక్తుల ఆగ్రహం 7:59 AM ఢిల్లీలో లోకేష్ వెంటే రఘురామ కృష్ణంరాజు ►రాజ్‌ఘాట్‌కు నారా లోకేష్, టీడీపీ మంత్రులు, ఎంపీలు ►అదే టీంలో రఘురామ కృష్ణంరాజు ►ఢిల్లీ వెళ్లినప్పటి నుంచి రఘురామ లాబీయింగ్‌పై ఆధారపడ్డ లోకేష్ ►బీజేపీ పెద్దల అపాయింట్మెంట్లు ఇప్పించాలని విజ్ఞప్తి ►పార్లమెంటు సమావేశాలతో కేంద్ర పెద్దలు బిజీ బిజీ ►ఎలాగైనా వారి దృష్టిలో పడేందుకు టీడీపీ బృందం విశ్వప్రయత్నాలు 07:30 AM, సెప్టెంబర్ 19, 2023 లోకేష్‌లో గుబులు ► ఇంకా ఢిల్లీలోనే చంద్రబాబు కొడుకు నారా లోకేష్ ► ఎల్లో మీడియాలో లోకేష్ పై విపరీతంగా ప్రచారం ► రాజమండ్రి రాగానే లోకేష్ ను అరెస్ట్ చేస్తారంటున్న ఎల్లో మీడియా ► రాజమండ్రికి రావాలా? వద్దా? ఇంకొన్నాళ్లు ఢిల్లీలోనే ఉండాలా? ► ఎల్లో మీడియా చెప్పినట్టు అరెస్ట్ చేస్తే రాజమండ్రి కంటే ఢిల్లీ బెటరా? ► ఢిల్లీలో సుప్రీంకోర్టు లాయర్లతో లోకేష్ మంతనాలు ► తనకు వ్యతిరేకంగా ఏయే ఆధారాలున్నాయన్నదానిపై చర్చ ► ఇవ్వాళ ఢిల్లీలో ఎంపీలతో కలిసి ధర్నాలో పాల్గొనున్న లోకేష్ ► ఢిల్లీలో ఉదయం రాజ్ ఘాట్ సందర్శించనున్న లోకేష్ ► ఎక్కడికి వెళ్లినా వెంట టిడిపి ఎంపీలు ఉండాలని సూచించిన లోకేష్ 07:20 AM, సెప్టెంబర్ 19, 2023 పీక్స్‌కు చేరిన ఎల్లో మీడియా సానుభూతి ఆరాటం ► లోకేష్ ను అరెస్ట్ చేస్తారని ఎల్లో మీడియాలో భారీ ప్రచారం ► బాబును అరెస్ట్ కు లోకేష్ ను జత చేయాలని ఎల్లో మీడియా ఆరాటం ► ప్రజల్లో సానుభూతి తెచ్చుకొనేందుకు ప్రయాసలు ► ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేశ్‌ను అరెస్ట్ చేస్తారంటున్న ఎల్లో మీడియా ► ఫైబర్ గ్రిడ్ కేసులో ఇప్పటికే కొందరి అరెస్ట్ ► రెండేళ్ల నుంచి ఫైబర్ గ్రిడ్ కేసులో దర్యాప్తు ► ఈ రోజు రాత్రి లోకేశ్ రాజమండ్రి చేరుకునే అవకాశం ► రాజమండ్రికి లోకేష్ రాగానే CID అరెస్ట్ చేస్తుందంటూ పచ్చ ప్రచారం 07:00 AM, సెప్టెంబర్ 19, 2023 అసలు మన లాయర్లు ఏం చేస్తున్నారు? : చంద్రబాబు రుసరుస ► తన కేసు వాదిస్తోన్న లాయర్లతో కలుస్తానని నిన్న యనమలకు చెప్పిన చంద్రబాబు ► నేడు చంద్రబాబుతో సుప్రీంకోర్టు లాయర్ తో పాటు టీడీపీ లీగల్ సెల్ లాయర్లు కలిసే అవకాశం ► కేసులో సాంకేతిక లోపాలు ఏమున్నాయన్న దానిపై టిడిపి లీగల్ సెల్ రంధ్రాన్వేషణ ► ఏసీబీ కోర్టులో ఏం వాదించాలి? హైకోర్టులో క్వాష్ పిటిషన్ సందర్భంగా ఏం చెప్పాలి? ► బాబు కోసం భారీ కసరత్తు చేస్తోన్న సుప్రీంకోర్టు లాయర్లు 6:50 AM, సెప్టెంబర్ 19, 2023 టీడీపీవి బూటకపు వాదనలు.. ► స్కిల్ స్కామ్ కేసులో మనోజ్ వాసుదేవ్ పార్థసాని, పెండ్యాల శ్రీనివాసరావు దేశం విడిచి పారిపోయారు. ► వీరికి చంద్రబాబుతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. ► ఈ కేసు విషయంలో టీడీపీ చేస్తున్నవన్నీ బూటకపు వాదనలు. ► స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రూ.371 కోట్ల అవినీతి జరిగినట్టు ఐటీ, ఈడీ నిర్ధారించాయి. ► చంద్రబాబు షెల్ కంపెనీలకు నిధులు మళ్లించి, తర్వాత వాటిని స్వాహా చేశాడు. ► ఇన్నేళ్ళ తర్వాత ఈ కేసులో చట్టం చంద్రబాబును పట్టుకుంది. “స్కిల్ స్కామ్ కేసులో మనోజ్ వాసుదేవ్ పార్థసాని, పెండ్యాల శ్రీనివాసరావు దేశం విడిచి పారిపోయారు” - వీరికి చంద్రబాబుతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. - ఈ కేసు విషయంలో టీడీపీ చేస్తున్నవన్నీ బూటకపు వాదనలు. - స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రూ.371 కోట్ల అవినీతి జరిగినట్టు ఐటీ, ఈడీ… pic.twitter.com/LScpdrWDGE — YSR Congress Party (@YSRCParty) September 18, 2023 06:30 AM, సెప్టెంబర్ 19, 2023 ఏసీ లేని గదిలో ఎవరయినా ఉంటారా? : బాబుకు కోపమొచ్చింది..! ► రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహా బ్లాక్ లో చంద్రబాబు ► పదో రోజుకు చేరుకున్న చంద్రబాబు రిమాండ్ ► నిన్న కుటుంబ సభ్యులను ములాఖత్ లో కలిసిన చంద్రబాబు ► కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేత యనమలతో బాబు చర్చలు ► తనకు గదిలో ఏసీ లేదని, ఇబ్బందిగా ఉందని బాబు తనతో చెప్పాడన్న యనమల ► కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్న జైలు అధికారులు ► చంద్రబాబు కాలక్షేపం కోసం అయిదు న్యూస్ పేపర్లు, టీవీ ► స్నేహా బ్లాక్ లో ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్న చంద్రబాబు ► ఇంటి నుంచి అన్ని పూటల భోజనం, స్నానానికి వేడి నీళ్ల సదుపాయం 06:20 AM, సెప్టెంబర్ 19, 2023 హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ► స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నేడు హైకోర్టులో విచారణ ► చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ► జ్యుడీషియల్ రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరిన చంద్రబాబు ► చట్టవిరుద్ధంగా చంద్రబాబుని అరెస్ట్ చేశారని వాదించారన్న లాయర్ సిద్దార్థ లూథ్రా ► ఇవ్వాళ కౌంటర్ దాఖలు చేయనున్న CID ► అనంతరం ఇరు పక్షాల వాదనలు విననున్న హైకోర్టు 06:15 AM, సెప్టెంబర్ 19, 2023 హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ► ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నేడు హైకోర్టులో విచారణ ► బెయిల్ కోరుతూ పిటిషన్ వేసిన చంద్రబాబు ► చంద్రబాబు వేసిన పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం 06:10 AM, సెప్టెంబర్ 19, 2023 బాబును కస్టడీకి ఇవ్వండి : CID విజ్ఞప్తి ► ఏసీబీ కోర్టులో CID కస్టడీ పిటిషన్ ► స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ పిటిషన్ ► కస్టడీకి ఇస్తే స్కాంకు సంబంధించి కీలక వివరాలు రాబడతామన్న సీఐడీ 6:00 AM, సెప్టెంబర్ 19, 2023 బెయిల్, మధ్యంతర బెయిల్.. ACB కోర్టులో నేడు విచారణలు ► ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ ► చంద్రబాబు తరపున మరో పిటిషన్, మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ ► బెయిల్ తో పాటు మధ్యంతర పిటిషన్ పై నేడు విచారణ. -
పొలిటికల్ కారిడార్ : అమరావతి పాదయాత్రలో పాల్గొనేవారికి రోజుకు రెండు వేలు
-
అమరావతిలో పేదల హౌసింగ్ జోన్
సాక్షి, అమరావతి: అమరావతిలో ఈడబ్లూఎస్, అఫర్డ్‌బుల్ హౌసింగ్ జోన్ ఏర్పాటుకు సీఆర్డీయే మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కూరగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు, వెంకటపాలెం గ్రామాల పరిధిలోని 967.25 ఎకరాల్లో ఈ హౌసింగ్ జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్‌లో నివాసయోగ్యంగా పేర్కొన్న ప్రాంతంలోనే ఈ కొత్త హౌసింగ్ జోన్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు జారీ చేసిన నోటిఫికేషన్‌పై ఏమైనా సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లో సీఆర్డీయే కమిషనర్‌ను ఉద్దేశించి లిఖిత పూర్వకంగా తెలపాలని చెప్పింది. గడువు ముగిసిన తర్వాత వచ్చే వాటిని పరిశీలించేది లేదని స్పష్టం చేసింది. -
బాబుగారి అరచేతిలో వైకుంఠం..
సాక్షి, అమరావతి : ఆకాశాన్నంటే మేడలు.. రాజభవనాలను తలదన్నే కట్టడాలు.. కనుచూపు మేర కళ్లు చెదిరేలా కళాత్మక భవంతులు.. ఇంద్రుడికే కన్ను కుట్టేలా ఐకానిక్ స్ట్రక్చర్లు.. జపాన్, మలేషియా, సింగపూర్.. అన్నీ కలిస్తే అమరావతి అట.. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు.. అంతా కనికట్టు.. విశ్వవిఖ్యాతి గాంచిన ఇంద్రజాలికులకే సాధ్యం కాని చంద్రజాలం.. రాజధాని అమరావతిని భ్రమరావతిగా మార్చిన వైనం.. టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యల్లో ఆరితేరిన జగజ్జెట్టీలకే ఆశ్చర్యం.. పగటి వేషగాళ్లే నివ్వెరపోయేలా మాయ మాటల చాతుర్యం.. ఐదు కోట్ల ఆంధ్రుల కలల సౌధం.. దూరం.. దూరం.. 2015 అక్టోబర్ 22 అంతర్జాతీయ స్థాయి రాజధాని అంటూ చంద్రబాబు అట్టహాసంగా ప్రధాని మోదీతో అమరావతికి శంకుస్థాపన చేయించిన రోజు... ఏకంగా 53వేల ఎకరాలు గుప్పిటపట్టారు... బాహుబలి సినిమాను తలదన్నే గ్రాఫిక్స్‌ను మీడియా మేనేజ్మెంట్తో బురిడీ కొట్టిస్తూ రాజధాని సినిమా చూపించారు. మూడున్నరేళ్ల తరువాత అమరావతిలో వాస్తవ చిత్రం చూస్తే చంద్రబాబు మాయాజాలం కళ్లకు కడుతోంది. వేలాది ఎకరాలు ఖాళీగా పడిఉన్నాయి... రాజధాని నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యానికి, చంద్రబాబు భూదందాకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నాణేనికి ఓవైపు... ఆ ఇంద్రలోకపు ‘అమరావతి’... భూలోకంలో మన చంద్రుడికే సాధ్యమన్నారు. అహోరాత్రులు కష్టపడి...అజరామరమైన నగరాన్ని నిర్మిస్తాడన్నారుదేశ విదేశాలన్నీ చుట్టొచ్చి...అన్నిటిని తలదన్నే రాజధాని కడతాడన్నారు. కాలికి బలపం కట్టుకుని...కలలోనైనా ఊహించని కానుకిస్తాడన్నారు నాణేనికి మరోవైపు... భవిష్యత్ అవసరాలకంటూ...బలవంతంగానైనా భూ సేకరణ ఆకృతుల ఖరారు కోసమంటూ... అనవసర కాలయాపన ఆ కంపెనీలు, ఈ కంపెనీలంటూ... ఎకరాలకు ఎకరాలు సంతర్పణ ఈ రోడ్డు, ఆ రోడ్డు అంటూ... దారితెన్నూ లేని గమనం వెరసి... ఒక్క శాతం భూమిలోనే ‘అమరావతి’ ఆకారం... చూపినదంతా అరచేతి వైకుంఠం ఆ కథేంటో మీరూ చదవండి. అరచేతిలో స్వర్గం అంటే ఏమిటో తెలియాలంటే చంద్రబాబు ప్రభుత్వం చూపిస్తున్న రాజధాని గ్రాఫిక్స్ చూడాలి. కొండను తవ్వి ఎలకను పట్టడం అంటే... అమరావతి ప్రాంతాన్ని సందర్శించాలి. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయి రాజధాని అంటూ ఈ ఐదేళ్లలో చంద్రబాబు బాహుబలి సినిమాను తలదన్నే రీతిలో ప్రజలకు డిజైన్లు, గ్రాఫిక్‌లు చూపించారు. ఇదే పేరు చెప్పి ఏకంగా 53 వేల ఎకరాలను గుప్పిట పట్టారు. ఆ తర్వాత మాస్టర్ ప్లాన్ అంటూ హడావుడి చేశారు. కానీ, 50 నెలల సుదీర్ఘ సమయం తర్వాత అమరావతి వెళ్లి చూస్తే కనిపించేది ఏమిటంటే!? 53 వేల ఎకరాల్లో 99 శాతం ఖాళీగా పడి ఉన్న భూములు... కేవలం 500 ఎకరాల్లో సాగుతున్న పొడిపొడిగా పనులే! పైపైచ్చు ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా హడావుడి చేస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే... రాజధాని పేరిట ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా ప్రజలను రంగుల కలతో భ్రమల్లో ఉంచింది. ఆ అరచేతి వైకుంఠం ఎలా ఉందంటే... తీసుకున్న ఎకరాలు 50,000 పనులు మొదలు పెట్టిన ఎకరాలు 500 రాజధాని అమరావతి నిర్మాణం కోసమంటూ చంద్రబాబు ప్రభుత్వం 53,581 ఎకరాలు తీసుకుంది. అందులో ప్రభుత్వ భూమి 15 వేల ఎకరాలు మాత్రమే. 29 గ్రామాల్లో రైతుల నుంచి భూ సమీకరణ పేరుతో 38,581 ఎకరాలు తీసుకునేందుకు గురిపెట్టారు. రైతులపై సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించి ఇప్పటికి 33,208 ఎకరాలు సమీకరించారు. మరో 3,800 ఎకరాలను భూ సేకరణ అస్త్రంతో లాక్కునేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. ఇలా 53 వేల ఎకరాలకు పైగా స్వాధీనం చేసుకున్నా... వాస్తవంగా అసలైన రాజధాని ప్రాంత నిర్మాణానికి కేటాయించింది కేవలం 1,350 ఎకరాలు మాత్రమే. అందులోనూ ప్రస్తుతం కేవలం 500 ఎకరాల్లోనే నిర్మాణ పనులు అదీ తూతూమంత్రంగా సాగుతున్నాయి. అంటే, కేవలం ఒక్క శాతం భూమిలోనే ప్రభుత్వం పనులు చేస్తోందన్నది స్పష్టమవుతోంది. మిగిలిన వేలాది ఎకరాలు నిర్జనంగా పడి ఉన్నాయి. సీన్ లేని ‘సీడ్ యాక్సస్’ 60 అడుగుల వెడల్పు, 21.50 కి.మీ. పొడవునా చెన్నై– కోల్‌కతా జాతీయ రహదారితో అమరావతిని అనుసంధానిస్తూ సీడ్ యాక్సస్ రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం 2015లో నిర్ణయించింది. మొదటి దశలో వెంకటపాలెం నుంచి బోరుపాలెం వరకు 13.50 కి.మీ, రెండో దశలో విజయవాడ కనకదుర్గ వారధి నుంచి ఉండవల్లి వరకు 8 కి.మీ. నిర్మించాలన్నది ప్రతిపాదన. రాజధాని గ్రామాలకు నీరు, విద్యుత్, కేబుల్, గ్యాస్ సరఫరాకు భూగర్భ కేబుళ్ల వ్యవస్థ కోసం సీడ్ యాక్సస్ రోడ్డును అనుసంధానిస్తూ భూగర్భ పవర్ డక్ట్లు వేయాలి. మొత్తం రూ.579 కోట్ల కాంట్రాక్టును చంద్రబాబు సన్నిహిత సంస్థకు అప్పగించారు. 9 నెలల్లో పూర్తి చేస్తామని బాబు స్వయంగా ప్రకటించారు. రెండున్నరేళ్లు గడిచినప్పటికీ పనులు సగం కూడా కాలేదు. ఐదు ప్రదేశాల్లో పవర్ డక్ట్‌లకు గాను రెండుచోట్ల మొదలుపెట్టి మధ్యలో నిలిపివేశారు. మిగిలిన మూడు అతీగతి లేదు. జాతీయ రహదారితో రాజధానిని అనుసంధానిస్తూ రెండో దశ పనులను ఇంతవరకు ప్రారంభించనే లేదు. కానరాని రహదారి రాజధానిలో అంతర్జాతీయ స్థాయి రోడ్లు నిర్మిస్తామని గొప్పలు చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఆచరణలో బొక్కబోర్లా పడింది. అమరావతిలో ఏడు ఎక్స్‌ప్రెస్ రహదారులతో పాటు మొత్తం 320 కి.మీ. మేర 34 రహదారులను నిర్మించాలని ప్రణాళిక రూపొందించింది. 7 ఎక్స్‌ప్రెస్ రహదారులను 6 వరుసలుగా, 27 ఇతర రహదారులను ఆరు వరుసలుగా నిర్మిస్తారు. అందుకు ఏకంగా రూ.14 వేల కోట్లతో ప్రణాళిక ఆమోదించింది. అయిదు ప్రధాన రహదారులతో పాటు మరో 27 రోడ్లకు టెండర్లు పిలిచారు. 2017 మార్చి 30న వీటికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు ఏడాదిలోగా పూర్తి చేస్తామన్నారు. సరిగ్గా రెండేళ్లయినా ప్రభుత్వం ఒక్క రోడ్డు కూడా పూర్తి చేయలేకపోయింది. మొత్తం 34 రోడ్లలో ప్రస్తుతం 24 రోడ్ల పనులే ప్రారంభించారు. ఆ పనులు కూడా పైపైనే సాగుతున్నాయి. అయిదు ప్రాధాన్య రహదారుల్లో ఒక్కటీ సిద్ధం కాలేదు. ఎటుచూసినా మధ్యలో నిలిచిన పనులు, గుంతలే దర్శనమిస్తున్నాయి. వర్షం వస్తే ఈ గుంతల్లో భారీగా నీరు చేరుతోంది. వీటిలో పడి ఇప్పటికే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ చెప్పుకోవాల్సిందేమంటే... భూ సమీకరణ కింద భూములు ఇవ్వని రైతుల అనుమతి లేకుండానే వారి పొలాల మీదుగా రోడ్డు పనులు చేస్తూ బెదిరింపులకు పాల్పడటం. భూములు సొంతం... పనులు చేయం 85 సంస్థలకు 1,375 ఎకరాలు ధారాదత్తం అమరావతి కేంద్రంగా ప్రభుత్వ పెద్దలు అస్మదీయులకు భూములు ధారాదత్తం చేశారు. ఒక్కో సంస్థకు ఎకరా నుంచి 200 ఎకరాల వరకు కేటాయించారు. ఇప్పటివరకు 85 సంస్థలకు 1,375 ఎకరాలు ఇలా ఇచ్చారు. వీటిలో ఆరు సంస్థలకు ఎంత చొప్పున భూమి ఇవ్వాలన్నదీ స్పష్టంగా పేర్కొనకపోవడం గమనార్హం. మిగిలిన 79 సంస్థలకు 1,343 ఎకరాలు కేటాయించింది. ప్రైవేటు సంస్థలకు ఎకరా రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలకే కట్టబెట్టి... కేంద్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులకు మాత్రం ఎకరా రూ.4 కోట్లు చొప్పున ఇచ్చారు. 85 సంస్థల్లో మూడు మాత్రమే కార్యకలాపాలు ప్రారంభించాయి. అవి కూడా విట్, ఎస్ఆర్ఎం, అమృత లాంటి విద్యా సంస్థలు మాత్రమే. మిగిలిన సంస్థలేవీ పనుల ఊసే ఎత్తడం లేదు. ముఖ్య నేతకు ముడుపులిచ్చి మరీ భూములు పొందడంతో ఆ సంస్థలు నిబంధనలను ఖాతరు చేయడం లేదు. గడువులోగా పనులు ప్రారంభించని సంస్థల నుంచి భూములను వెనక్కుతీసుకోవాలి. ప్రభుత్వానికి ఆ ధ్యాసే లేదు. వడ్డాది శ్రీనివాస్, సాక్షి, అమరావతి -
‘ప్రపంచ రాజధాని’.. అంతా భ్రాంతియేనా..?
సాక్షి, నెల్లూరు: సింగపూర్, బీజింగ్, టోక్యో, సియోల్, న్యూయార్క్, కొలంబో, దుబాయ్ ప్రతినిధులు ఇండియాలో ఓ సదస్సులో పాల్గొనేందుకు వచ్చారు. అందరూ కాఫీ షాప్‌లో మాట్లాడుకుంటున్నారు. ఆ పక్క టేబుల్లో ఉన్నోళ్లు అమరావతి గురించి చర్చించుకుంటున్నారు. ‘అమరావతి న్యూయార్క్‌లా ఉంటుందని ఒకరు, కాదు సింగపూర్‌లా ఉంటుందని మరొకరు.. ఇలా వారి మధ్య వాదులాట మొదలైంది. ఈ మాటలు ఆ దేశాల పౌరులు విని నోరెళ్లబెట్టారు. అసలు దీని సంగతేందో కనుక్కుందామని ఒక ట్రాన్స్‌లేటర్‌ని వెంట పెట్టుకుని ‘ప్రపంచ రాజధాని’కి వచ్చారు. అప్పుడే అక్కడ బాబోరు ప్రచారంలో ఉన్నారు. మైక్ పట్టుకుని ఆణిముత్యాలు వదులుతున్నారు. ‘తమ్ముళ్లూ.. దిస్ ఈస్ నేను.. ఒకప్పుడు హైదరాబాద్ కట్టాను. ఇప్పుడు ప్రపంచానికి దిక్సూచిని నిర్మిస్తున్నా. సింధూ, హరప్పా నాగరికతల గురించి బుక్స్‌లో ఎలా చదువుకుంటున్నామో, భవిష్యత్ తరాలు కూడా అమరావతి నాగరికత గురించి రీడ్ చేయాలి. (తమ్ముళ్లూ.. నిరుత్సాహంగా ఉన్నారు. చప్పుట్లు కొట్టి హర్షధ్వానాలు చెప్పండి అంటూ బాబోరు అడిగి మరీ కొట్టించుకున్నారు) రాజధాని లేకుండా చేశారని నేనేమీ బాధపడలేదు. (సార్! బాధ డబ్బుల విషయంలో.. కేంద్రం ఓ రూ.25 వేల కోట్లు ఇచ్చుంటే బాగుండేది. ఎక్కువ భాగం మన అకౌంట్లో పడిపోయేదని సన్నిహితుల దగ్గిర ఎప్పుడూ అంటుండేవారని ఓ సీనియర్ నాయకుడు గుసగుసలాడాడు) వరల్డ్‌లోని బెస్ట్ క్యాపిటల్స్‌ని తలదన్నేలా అమరావతి నిర్మాణం మొదలెట్టా. అందుకోసం స్పెషల్ ఫ్లయిట్లో వెళ్లి 20 దేశాలు చూసొచ్చా. అక్కడున్న రాజధానుల కన్నా బెటర్‌గా అమరావతిని కట్టాలని ఆలోచన చేస్తున్నా. కాకపోతే మనది లోటు బడ్జెట్ కదా.. అందుకే కొంచెం లేట్ అవుతోంది. (అంతలో ఓ నాయకుడు కొంచెం కాదు.. జీవితకాలం లేట్ అని అన్నాడు కాస్త పెద్దగానే.. కాకపోతే బాబోరికి వినపడకుండా) ఇంకో పది, పదిహేనేళ్లు పట్టొచ్చు. కేంద్రం సహకరించడంలేదు. మనవాళ్లపై రైడ్స్ జరుగుతున్నాయ్. బాధగా ఉంది. మీరంతా నాకు రక్షణ వలయంగా ఉండాలి. అక్కలూ.. చెల్లెళ్లూ..! మమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే..(ఇంతలో ఒకతను బాబోరి దగ్గరికెళ్లి చెవిలో.. సర్ టాపిక్ డైవర్ట్ అయింది అన్నాడు) బాబోరు వెంటనే తమాయించుకుని ప్రపంచంలో ఉండే టెక్నాలజీ అంతా ఇక్కడే ఉంది. (ప్రసంగం వింటున్న ఒకతను అందుకే డేటా చోరీ చేసి ఓట్లు తొలగించింది అన్నాడు పక్క వ్యక్తితో) నన్ను మళ్లీ గెలిపిస్తే ఒలింపిక్స్ జరిపిస్తా. అమరావతి ప్రారంభోత్సవానికి వందకు పైగా దేశాల అధ్యక్షులను తీసుకొస్తా. అన్ని దేశాల రాజధానులకు ఫ్లయిట్స్ వేయిస్తా’ అంటూ బాబోరు బుల్లెట్స్ వదులుతూనే ఉన్నారు. ఇదంతా ఆ విదేశీ ప్రతినిధులకు ట్రాన్స్‌లేటర్ తర్జుమా చేసి చెప్తుండగా వారంతా విని మూర్చపోయారు. – గోరంట్ల వెంకటేష్‌బాబు, నెల్లూరు -
‘మాస్టర్‌ప్లాన్ బీరువాలో దాచావా బాబూ’
సాక్షి, అమరావతి: బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరిగారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులతో ఒక్క పనికి కూడా శంకుస్థాపన చేయలేదని అన్నారు. ఇప్పటివరకు అమరావతి నిర్మాణానికి సంబంధించి మాస్టర్‌ప్లాన్ ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని బాబుపై మండిపడ్డారు. మాస్టర్ ప్లాన్ బీరువాలో దాచారా అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం కోసం బాండ్ల జారీ ద్వారా సేకరించిన రెండువేల కోట్ల రూపాయలకు లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. భారత 72వ స్వాతంత్ర్య దినం సందర్భంగా పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన జెండా ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన కాంగ్రెస్‌తో దోస్తీ కట్టిన బాబు ముమ్మాటికీ ఆంధ్రా ద్రోహి, పచ్చి అవకాశవాది అని తీవ్ర విమర్శలు చేశారు. రెండుకళ్ల సిద్ధాంతంలో రాటుదేలిన బాబు చివరకి పొత్తుల్లో కూడా అదే ఫాలో అయ్యారని ఎద్దేవా చేశారు. గ్రామీణప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధికి కారణం ప్రధాని నరేంద్రమోదీ చలవేనని అన్నారు. రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఒక్క రూపాయికూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రకటించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా తొలి విడతగా 10 కోట్ల మందికి ఉచిత ఆరోగ్య సేవలు అందనున్నాయి. సెప్టెంబర్ 25 నుంచి పథకం అమలవుతుందని ప్రధాని తెలిపారు. -
హైదరాబాద్‌లో 13,170 గృహాలు రెడీ!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం దేశంలో 4,65,555 గృహాలు నిర్మాణం పూర్తయి.. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి విలువ రూ.3,32,848 కోట్లుగా ఉంటుందని ప్రాప్‌ఈక్విటీ తెలిపింది. వీటిల్లో ద్వితీయ శ్రేణి పట్టణాల్లో 68,094 యూనిట్లు ఉన్నాయని, వీటి విలువ రూ.33,512 కోట్లుగా ఉంటుందని సర్వే పేర్కొంది. - హైదరాబాద్‌లో 2.3 కోట్ల చ.అ.ల్లో 51 ప్రాజెక్ట్‌లు నిర్మాణం పూర్తి చేసుకొని రెడీగా ఉన్నాయని . వీటిల్లో 13,710 యూనిట్లు గృహ ప్రవేశానికి రెడీగా ఉన్నాయని వీటి విలువ రూ.7,778 కోట్లుగా ఉంటుందని ప్రాప్‌ఈక్విటీ ఫౌండర్ అండ్ ఎండీ సమీర్ జసూజ తెలిపారు. ఆర్ధిక సంక్షోభం, నిర్మాణంలో సవాళ్లు, ప్రభుత్వ, పర్యావరణ అనుమతుల జాప్యం, అమ్మకాల్లో మందగమనం, సరఫరా ఎక్కువగా ఉండటం వంటివి నిర్మాణం, అమ్మకాలపై ప్రభావం చూపించాయని ఆయన పేర్కొన్నారు. - ఇతర నగరాల్లోని గణాంకాలను పరిశీలిస్తే.. గృహ ప్రవేశానికి రెడీగా ఉన్న గృహాల్లో 70 శాతం నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లోనే ఉన్నాయి. నిర్మాణ గడువు పూర్తయినా నేటికీ పూర్తి కాని ప్రాజెక్ట్‌లు ఎన్సీఆర్లో 1.80 లక్షల యూనిట్లుంటాయి. వీటి విలువ రూ.1.22 లక్షల కోట్లు. ఇక, ముంబైలో 1.05 లక్షల యూనిట్లున్నాయి. వీటి విలువ రూ.1.12 లక్షల కోట్లు. బెంగళూరులో 38,242 యూనిట్లు, విలువ రూ.26,454 కోట్లు, చెన్నైలో 20,847 యూనిట్లు, విలువ రూ.9,511 కోట్లు, పుణెలో 22,517 యూనిట్లు, విలువ రూ.14,111 కోట్లు, కోల్‌కతాలో 15,552 యూనిట్లు, విలువ రూ.6,175 కోట్లుగా ఉంటుందని సర్వేలో తేలింది. -
అర చేతిలో స్వర్గం అమరావతి స్వప్నం
-
రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పు
సాక్షి, అమరావతి: భూ వినియోగానికి సంబంధించి రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేయనున్నారు. 630 ఎకరాల అటవీ భూమిని నివాస, వాణిజ్య నిర్మాణాల జోన్ నుంచి ప్రభుత్వ జోన్లోకి మార్చాలని ఇటీవల జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయించారు. దీంతో పీ3 (రక్షిత ప్రాంతం), ఆర్1 (విలేజ్ ప్లానింగ్ జోన్), ఆర్3 (మీడియం, హై డెన్సిటీ జోన్), సీ3 (నైబర్‌హుడ్ జోన్)లో ఉన్న 630 ఎకరాల అటవీ భూమి ఇక ప్రభుత్వ జోన్లోకి వెళ్లనుంది. వివరాలు.. పెనుమాక, నవులూరు, తాడేపల్లి, ఉండవల్లి గ్రామాల పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఈ భూమిని రాజధాని అవసరాలకు వినియోగించుకునేందుకు అనుమతివ్వాలంటూ కేంద్ర పర్యావరణ శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని అటవీ సలహా కమిటీ ఇటీవల ఈ భూ వినియోగ మార్పిడికి సూ త్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే కొన్ని షరతులు విధించింది. ఈ భూమిలో 60 శాతాన్ని గ్రీన్ జోన్‌గా ఉంచాలని స్పష్టం చేసింది. అలాగే ఈ భూమిని వాణిజ్య, నివాస భవనాలు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, లాడ్జిలు వంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని తేల్చిచెప్పింది. కేవలం ప్రభుత్వానికి సంబంధించిన మౌలిక వసతుల కల్పనకు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది. దీంతో ఈ భూమిని వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ భూమి మొత్తం మాస్టర్ ప్లాన్‌లో నివాస, వాణిజ్య నిర్మాణాల జోన్లో ఉండటమే ఇందుకు కారణం. దీంతో ఈ భూమిని ప్రభుత్వ జోన్లోకి మార్చుకోవడం ద్వారా వినియోగించుకోవాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీర్మానం చేశారు. అయితే మాస్టర్ ప్లాన్‌లో మార్పు చేసినా.. 630 ఎకరాల్లోని అత్యధిక భూమి పర్యావరణ సున్నిత జోన్లోనే ఉంది. -
రాజధాని ప్రాజెక్టుపై ప్రపంచ బ్యాంకులో ఫిర్యాదు
సాక్షి, అమరావతి: అమరావతి సుస్థిర రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టు (ఐడీ: పీ 159808)ను మరోసారి పునఃపరిశీలించాలని కోరుతూ రాజధాని ప్రాంత రైతులు చేసిన ఫిర్యాదును ప్రపంచ బ్యాంకు పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు ఫిర్యాదు నమోదు చేసినట్టు ప్రపంచ బ్యాంకు ఇన్స్పెక్షన్ ప్యానెల్ కార్యనిర్వాహక కార్యదర్శి కార్యాలయం నుంచి సందేశం అందింది. దాదాపు 13 పేజీల ఫిర్యాదును రైతులు పంపారు. అమరావతి ప్రాజెక్టుకు నిధులు ఇచ్చే ముందు తాము చేసిన ఫిర్యాదులను పరిశీలించాలని కోరారు. ప్రపంచ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టు సాగుతోందని వివరించారు. తాము తమ సొంత భూమిని వదులుకోవాల్సి వస్తోం దని, తమ ఇష్టానికి వ్యతిరేకంగా భూముల్ని తీసుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అనేకసార్లు తాము ప్రపంచ బ్యాంకుకు ఈ విషయాల్ని చెప్పినప్పటికీ పట్టించుకోనందున తనిఖీ బృందానికి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందన్నారు. పునరా వాసం పథకాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వంటి అంశాలను ప్రస్తావించారు. -
బినామీల ‘బడా’ దోపిడీ!
► రాజధాని గ్రామాల లేఔట్ల పనుల టెండర్లలో గోల్మాల్ ► నెక్కల్లు, శాఖమూరు లేఔట్లలో మౌలిక సదుపాయాలకు రూ.666.18 కోట్లతో టెండర్ ► బడా సంస్థలకే పనులు దక్కేలా నిబంధనలతో టెండర్ నోటిఫికేషన్ ► బినామీలకు సబ్ కాంట్రాక్టు కింద అప్పగించి కమీషన్లు కొట్టేసే ఎత్తుగడ ► మిగతా 27 గ్రామాల లేఔట్లకు రూ.13,500 కోట్లతో అంచనాలు సిద్ధం సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు పరిహారం కింద కేటాయించిన ప్లాట్లకు మౌలిక సదుపాయాల పనులను బినామీలకు కట్ట బెట్టి భారీ ఎత్తున కమీషన్లు నొక్కేయడానికి ప్రభుత్వ పెద్దలు స్కెచ్ వేశారు. గుంటూరు జిల్లా నెక్కల్లు, శాఖమూరు గ్రామాల రైతులకు ప్లాట్లు ఇచ్చిన లేఔట్(జోన్–1)లకు మౌలిక సదుపాయాలు కల్పించే పనులకు రూ.666.18 కోట్ల అంచనా వ్యయంతో ఈపీసీ పద్ధతిలో ఈ నెల 5న సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనులు సింగపూర్ కన్సార్టియం (అసెండాస్–సిన్బ్రిడ్జ్–సెమ్బ్‌కార్ప్), ఎల్అండ్టీ, షాపూర్జీ పల్లోంజీ వంటి బడా సంస్థలకే దక్కేలా నిబంధనలు రూపొందించి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం గమనార్హం. ఆ సంస్థలకు పనులు దక్కాక తమ బినామీ కాంట్రాక్టర్లకు అప్పగించి, కమీషన్లు కొట్టేయాలన్నదే ప్రభుత్వ పెద్దల పన్నాగం. ఇదే రీతిలో మిగతా 27 గ్రామాల లేఔట్లకు మౌలిక సదుపాయాలను కల్పించే పనులను రూ.13,500 కోట్లతో చేపట్టి, కమీషన్లు దండుకోవడానికి వ్యూహం రచించారు. ఈ మేరకు అంచనాలు సిద్ధం చేసినట్లు సమాచారం. రాజధాని ప్రాంతంలో 29 గ్రామాల ప్రజలకు నివాస, వాణిజ్య స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం లేఔట్లు ఏర్పాటు చేసింది. ఉండవల్లి, పెనుమాక మినహా మిగతా 27 గ్రామాల రైతులకు లేఔట్లలో ఇప్పటికే ప్లాట్లు కేటాయించారు. ఆ లేఔట్లకు రహదారులు, తాగునీటి సరఫరా, మురుగునీటి కాలువలు, భూగర్భ విద్యుత్ లైన్లు, ఇంటర్నెట్ కేబుల్ లైన్లు, వరద నీటి కాలువలు, సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లు వంటి మౌలిక సదుపాయాలను కల్పించా లని సర్కారు నిర్ణయించింది. తొలుత నెక్కల్లు, శాఖమూరు గ్రామాల రైతులకు ప్లాట్లు కేటాయిం చిన లేఔట్లకు మౌలిక సదుపాయాలు కల్పించే పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్లోనే తిరకాసు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడంలోనే వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కేవలం బడా కంపెనీలే టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు విధించారు. ఆ నిబంధనలు.. ► 2007–08 నుంచి 2016–17 వరకూ ఇదే రకమైన (ఇండస్ట్రియల్ పార్కులు, టౌన్‌షిప్‌లు, సెజ్‌లు, ఐటీ పార్క్‌లు, రోడ్లు, ఎయిర్‌ఫీల్డ్స్, పట్టణ ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజీ, విద్యుత్, తాగునీటి సరఫరా, సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లువంటి పనులు) ఏటా రూ.111.03 కోట్ల విలువైన పనులు పూర్తి చేసి ఉం డాలి. జాయింట్ వెంచర్లలో ప్రధాన కాంట్రాక్టర్‌గా వ్యవహరించిన వారు ఇదే రీతిలో పనులు పూర్తి చేసి ఉండాలి. ► గత పదేళ్లలో ఏటా రూ.293 కోట్ల విలువైన భవన నిర్మాణ పనులు పూర్తి చేసి ఉండాలి. ► గత ఐదేళ్లలో కనీసం మూడేళ్లపాటు వరుసగా లాభాలు గడించి ఉండాలి. బ్యాంకుల్లో రూ.74 కోట్ల నగదు నిల్వలు ఉండాలి. ► గత ఐదేళ్లలో సీడీఆర్ (కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చర్), ఎస్డీఆర్ (స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చర్) అమలు చేసి ఉండకూడదు. ► గత పదేళ్లలో ఏటా కనీసం రూ.12,420 క్యూబిక్ మీటర్లకు తగ్గకుండా రహదారులు, సీసీ రోడ్ల పనులు చేసి ఉండాలి. వంద మీటర్ల వ్యాసార్ధంతో తాగునీరు, మురుగునీటి పైపులైన్ వ్యవస్థ ఏటా కనీసం 27.50 కి.మీ.లు వేసి ఉండాలి. 200 మీటర్లు, అంతకన్నా ఎక్కువ వ్యాసార్ధంతో కూడిన హెచ్డీపీఈ పైపులైన్ వ్యవస్థను ఏటా కనీసం ఎనిమిది వేల మీటర్లు వేసి ఉండాలి. విద్యుత్, ఇంటర్నెట్ కేబుల్ పనులు కనీసం 180 కి.మీ. పూర్తి చేసి ఉండాలి. ఏటా రోజుకు 3 లక్షల లీటర్ల మురుగునీటిని శుద్ధిచేసే సామర్థ్యంతో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను నిర్మించి ఉండాలి. ► గత పదేళ్లలో ఆర్థికమాంద్యం వల్ల నిర్మాణ రంగం కుదేలైపోయింది. దేశీయ కాంట్రాక్టు సంస్థలు ఎస్డీఆర్, సీడీఆర్ అమలు చేశాయి. భారీ ఎత్తున పనులు చేసిన దాఖలాలు లేవు. వీటిని పరిశీలిస్తే బడా సంస్థలకు మాత్రమే టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పిస్తూ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు స్పష్టమవుతోంది. నెక్కల్లు గ్రామ పంచాయతీ లేఔట్ -
విలక్షణ డిజైన్లు కావాలి!
రాజధాని మాస్టర్ ఆర్కిటెక్ట్ ‘నార్మన్ పోస్టర్’కు సీఎం సూచన సాక్షి, అమరావతి: రాజధాని మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ పోస్టర్ ఇచ్చిన ప్రాథమిక డిజైన్లకు సీఎం చంద్రబాబు మళ్లీ పలు సూచనలు చేశారు. విలక్షణమైన డిజైన్లు కావాలని వారికి సూచించారు. లండన్ నుంచి వచ్చిన నార్మన్ పోస్టర్ సంస్థ ప్రతినిధులు బుధవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా.. ఈసారి కాలువలు, చెరువులను అనుసంధానం చేసి రాష్ట్రంలో కరువే లేకుండా చేస్తామని చంద్రబాబు అన్నారు. ప్రకాశం బ్యారేజీ మెయిన్ బ్రాంచ్ కెనాల్ గేటు వద్ద కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. బస్సు ప్రమాద ఘటనపై వైఎస్సార్ సీసీ నేతలు రాజకీయం చేస్తున్నారన్నారు. -
హోటళ్లలో కప్పులు కడుగుతున్నాం
అప్పుడు పూల తోటల్లో రూ.500 కూలి వచ్చేది ఇప్పుడు హోటల్లో రూ. 200 కూడా రావడం లేదు మహిళా కార్మికుల ఆవేదన సాక్షి, అమరావతి: ‘‘అయ్యా! అప్పుడు పూలు, కూరగాయల తోటల్లో పని చేసుకునేవాళ్లం. ఇప్పుడు కాఫీ హోటళ్లలో కప్పులు కడుగుతున్నాం. అప్పుడు మధ్యాహ్నం వరకు పనిచేస్తే రూ.500 కూలి వచ్చేది. ఇప్పుడు సాయంత్రం వరకు పని చేసినా రూ.200 కూడా రావడం లేదు’’ అని మందడం గ్రామానికి చెందిన డి.కోటమ్మ, ఆదెమ్మ, సత్యవతి కన్నీటి పర్యంతమయ్యారు. రాజధాని ప్రాంత పర్యటనలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సాయంత్రం సచివాలయం ప్రధాన గేటు వద్దకు వచ్చారు. గేటుకు సమీపంలోని హోటల్లో పనిచేస్తున్న కోటమ్మ, ఆదెమ్మ, సత్యవతిలు జగన్‌ను రాకను గమనించి పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు. జగన్ వాహనం నుంచి దిగి వారిని పరామర్శించారు. వారంతా తమ గోడు వెళ్లగక్కారు. రాజధాని నిర్మాణం పేరిట పచ్చటి పంట పొలాలను ప్రభుత్వం లాగేసుకోవడంతో పనులు దొరక్క ఎలా బతకాలో తెలియడం లేదని విలపించారు. ప్రజా రాజధాని కావాలి.. - ఎమ్మెల్యే ఆర్కే అమరావతిలో ప్రజలు, రైతులు ఉండే రాజధాని కావాలని, రియల్ ఎస్టేట్ రాజధాని వద్దని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టంచేశారు. మంగళగిరి మండలం నిడమర్రులో గురువారం వైఎస్ జగన్‌మెహన్ రెడ్డి రాజధాని ప్రాంత రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ‘‘రైతుల భూములను దోచుకోవడం పద్ధతి కాదు. భూసేకరణ పేరుతో మూడు పంటలు పండే భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. సమాజానికి అన్నం పెట్టే రైతుల నుంచి భూములను లాక్కోవడం ఎంతవరకు సమంజసం? ప్రశ్నించిన రైతులపై కేసులు నమోదు చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్ జగన్ పోరాడుతారని ఆయన భరోసానిచ్చారు. -
రైతు కన్నీళ్లతో వ్యాపారమా!
మూడేళ్లయినా.. రాజధానికి ఒక్క ఇటుక పడిందా? సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష నేత జగన్ ధ్వజం ►రాజధానిలో అన్నీ తాత్కాలికమే.. ఒక్క శాశ్వత నిర్మాణమైనా చేపట్టారా? ►బడుగుల భూములు సింగపూర్ కంపెనీల పరం ►అన్నదాతలతో చంద్రబాబు కన్నీరు పెట్టిస్తున్నారు ►రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారమా? ►అమరావతి నిర్మాణానికి వేల ఎకరాలు ఎందుకు? ►చెత్త కాగితాలపై రైతులకు ప్లాట్లు కేటాయిస్తున్నారు ►భూమిపై ఆ ప్లాట్ ఎక్కడుందో చూపడం లేదు ►ఆంక్షల నడుమ రాజధానిలో వైఎస్ జగన్ పర్యటన ►పలు గ్రామాల్లో రైతులతో ముఖాముఖి సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో ముఖ్యమంత్రి చంద్రబాబు గద్దెనెక్కి దాదాపు మూడేళ్లవుతున్నా రాజధాని నిర్మాణానికి ఒక్క ఇటుకైనా వేసిన పాపాన పోలేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. తాత్కాలిక భవనాలతోనే కాలం గడుపుతున్నారని ధ్వజమెత్తారు. రైతుల నుంచి వేల ఎకరాలు లాక్కొని, వారి కన్నీళ్లతో వ్యాపారం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. అమరావతికి వేలాది ఎకరాలు ఎందుకని ప్రశ్నిం చారు. రాజధాని తెల్లతోలు, తెల్ల జుట్టు (సింగపూర్, ఇతర దేశాలు) ఉన్న వారికే అన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రైతుల కంట కన్నీరు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములను తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కి ఇచ్చేస్తామని ప్రకటించారు. పేదల భూములంటే చంద్రబాబు తన అత్త సొత్తు అనుకుంటున్నారని దుయ్యబట్టారు. రాజధాని ప్రాంతంలో రైతుల భూములను లాక్కోవడానికి ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు ఉపక్రమించడం, లంక భూములు, అసైన్డ్ భూములను రైతుల నుంచి కొట్టేయడానికి కుట్ర చేస్తున్న నేపథ్యంలో... బాధిత రైతులకు అండగా నిలిచేందుకు జగన్ గురువారం రాజధాని గ్రామాల్లో పర్యటించారు. ఉదయం హైవేపై పాత టోల్గేట్ వద్ద, మధ్యాహ్నం నిడమర్రులో, సాయంత్రం లింగాయపాలెంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వారి కష్టాలను అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా జగన్ ఏం చెప్పారంటే... ⇔ బలవంతపు భూసేకరణ వల్ల నష్టపోతున్న రైతులకు భరోసా కల్పించడానికి రాజధాని గ్రామాలకు వస్తుంటే ఆంక్షలు విధిస్తున్నారు. సచివాలయం మీదుగా వెళ్లడానికి కూడా అవకాశం లేదంటున్నారు. ప్రతిపక్ష నేత పర్యటించడానికీ అవకాశం లేదంటూ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కత్తితో పొడుస్తున్నారు. చంద్రబాబు దగ్గరుండి మరీ ప్రజాస్వామ్యాన్ని హత్య చేయించడాన్ని చూసి సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. ⇔ ఏయే గ్రామాలకు వెళ్లకుండా అడ్డుకున్నారో.. ఆ గ్రామాల ప్రజలు వచ్చి బాధలు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. వారి బాధలు విన్న తర్వాతైనా ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగి బుద్ధి వస్తుందని ఆశిద్దాం. ప్రజలంతా ఒక్కటై చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే రోజు త్వరలో వస్తుంది. ⇔ ‘భూసేకరణ’ బాధిత రైతులకు అండగా నిలిచేందుకు నేను రాజధానిలో పర్యటిస్తుంటే.. సాయంత్రానికి ముఖ్యమంత్రి, మంత్రులు టీవీల ముందుకు వస్తారు. రాజధాని రావడం జగన్‌కు ఇష్టం లేదంటూ బండలు వేస్తారు. చంద్రబాబు ఇక్కడ (రాజధానిలో) అద్దె(బాడుగ) ఇళ్లు తీసుకొని ఉంటున్నారు. నేను ఇక్కడ స్థలం కొని ఇల్లు నిర్మించుకుంటా. ⇔ రాష్ట్రమంతటా రిజిస్ట్రేషన్ల రేట్లు 200 శాతం పెంచారు. కానీ, రాజధాని గ్రామాల్లో మాత్రం పెంచలేదు. తక్కువ ధరలకే రైతుల భూములు లాక్కోవడానికి చంద్రబాబు దుర్మార్గపు ఆలోచన చేశారు. ఆయన దుర్బుద్ధికి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదు. భూములు తీసుకొనేటప్పుడు మార్కెట్ రేటు ఇవ్వాలనే జ్ఞానం కూడా ముఖ్యమంత్రికి లేదు. రైతుల ఉసురు పోసుకొని, వారి భూములతో వ్యాపారం చేస్తున్నారు. నచ్చిన కంపెనీలకు, నచ్చిన ధరకు భూములు కట్టబెట్టి కమీషన్లు మింగేస్తున్నారు. ⇔ రాజధానిలో గ్రామాలు, ఇళ్లు సింగపూర్ వాళ్లకు నచ్చడం లేదని వాటిని తొలగించేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. రోడ్ల నిర్మాణం పేరిట పేదల ఇళ్లను కూల్చేస్తున్నారు. ⇔ చంద్రబాబు అధికారం చేపట్టి మూడేళ్లు కావస్తోంది. ఈ మూడేళ్లలో రాజధానిలో జరిగిన అభివృద్ధి శూన్యం. రాజధానిలో ఒక్క ఇటుకా కనపడలేదు. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ.. ముఖ్యమంత్రి అన్నీ తాత్కాలికమే అంటున్నారు. హా గన్నవరం విమానాశ్రయం నుంచి రాజధానికి అనుసంధానం చేసే రోడ్లను ప్రభుత్వం ఈ మూడేళ్లలో నిర్మించలేకపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందే భూసేకరణ జరిగిన ఎన్‌హెచ్–5, ఎన్‌హెచ్–9 అనుసంధాన రోడ్డు నిర్మాణం పూర్తి చేయలేక ప్రభుత్వం చతికిలపడింది. సీనీ దర్శకుడితో రాజధాని మాస్టర్ ప్లాన్ ⇔ రాజధానికి ఇప్పటికీ పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్ తయారు చేయలేదు. సింగపూర్, చైనా, శ్రీలంక.. ఏ దేశానికి సీఎం వెళితే ఆ దేశం మాస్టర్ ప్లాన్ ఇస్తుందని చెబుతారు. ఆఖరికి బాహుబలి సినిమాలోని సెట్టింగ్‌ల్లాంటి మాస్టర్ ప్లాన్‌ను దర్శకుడు రాజమౌళి తయారు చేసి ఇస్తారని చెబుతున్నారు. ⇔ ముఖ్యమంత్రి అవినీతిలో కూరుకుపోయారు. మద్యం, ఇసుక, దేవాదాయ భూములు.. వేటినీ వదల్లేదు. తాత్కాలిక సచివాలయ భవనాన్నీ వదల్లేదు. 6 లక్షల చదరపు అడుగుల భవన నిర్మాణానికి రూ.650 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఖర్చంతా భవన నిర్మాణానికేనట! స్థలం కొని, ఫ్లాట్ కట్టిస్తే చదరపు అడుగుకు రూ.1,700 తీసుకుంటుం డగా... తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణానికే చదరపు అడుగుకు చంద్రబాబు ప్రభుత్వం రూ.10 వేలు చెల్లించింది. ఎందుకు అంత ధర చెల్లించారో, ఎంత అవినీతి జరిగిందో అందరికీ తెలుసు. ⇔ రాజధానికి ఎన్ని ఎకరాలు కావాలి? భూ సమీకరణ కింద ఇప్పటికే 27 వేల ఎకరాలు తీసుకున్నారు. ప్రభుత్వ భూములు 21 వేల ఎకరాలు ఉన్నాయి. మొత్తం 48 వేల ఎకరాల భూమి ప్రభుత్వం చేతిలో ఉంది. అయినా అవి చాలవన్నట్లు పేదలు, ఎస్సీ, ఎస్టీలు, బీసీల అసైన్డ్ భూములను, రైతుల పట్టా భూములను లాక్కోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్ని వేల ఎకరాలు తీసుకున్నా ఇప్పటికీ శాశ్వత సచివాలయం, శాసనసభ, హైకోర్టు లాంటి భవనాల ఊసే కనిపించడం లేదు. ⇔ రాజధానిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టులో రూ.5,700 కోట్ల పెట్టుబడులు పెట్టే రాష్ట్ర ప్రభుత్వానికి 42 శాతం మాత్రమే ఉంటుందట! కేవలం రూ.307 కోట్ల పెట్టుబడులు పెట్టే సింగపూర్‌కు 58 శాతం వాటా ఇస్తారట! దోపిడీ కోసమే ప్రభుత్వం స్విస్ చాలెంజ్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. ⇔ రైతుల పట్టా భూములు తీసుకొని, పరిహారం ఇస్తున్న ప్లాట్లను ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేయడం లేదు. కేటాయించిన ప్లాట్ ఎక్కడుందో భూమి మీద మార్కింగ్ చేసి చూపించడం లేదు. భూమి తీసుకున్న గ్రామం పరిధిలోనే ప్లాట్లు కేటాయించకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారు. కావాల్సిన వారికి, బినామీలకు మాత్రం వారికి ఇష్టమైన చోట ప్లాట్లు కేటాయిస్తున్నారు. ⇔ ప్లాటు కేటాయింపును చెత్తకాగితం మీద రాసి ఇస్తున్నారు. రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి తదితర హామీల విషయంలో కూడా చంద్రబాబు సంతకంతో ఉన్న పత్రాలను ఇంటింటికీ పంచారు. కానీ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఆ పత్రాలకు ఉన్న విలువ ఎంతో ప్రజలకు తెలుసు. చిత్తుకాగితం మీద రాసిస్తున్న ప్లాట్ల కేటాయింపుదీ అదే పరిస్థితి. వాటికి చట్టబద్ధత లేదు. చంద్రబాబు మాట తప్పరనే నమ్మకమూ ప్రజలకు లేదు. ⇔ ఇచ్చిన ప్లాట్ల వద్దకు వెళ్లి చూస్తే... అక్కడ మార్కింగ్ లేదు. విద్యుత్, రోడ్లు, డ్రెయినేజీ.. ఏమీ లేవు. ఆ ప్లాట్లను ఏం చేసుకోవాలి? అమ్ముకోవడానికి కూడా రైతులకు అవకాశం ఇవ్వడం లేదు. ⇔ పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎక్కువ సహాయం చేయాలి. మనసున్న ముఖ్యమంత్రి ఎవరైనా అదే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి తీసుకున్న అసైన్డ్ భూములకు తక్కువ ప్యాకేజీ ఇవ్వడం అన్యాయం. వారి పట్ల వివక్ష చూపించడం దుర్మార్గం. ⇔ లంక భూములున్న ఎస్సీలకు ఇప్పటికీ ప్లాట్లు కేటాయింపు చేయలేదు. కనీసం ఇస్తామని కూడా చెప్పడం లేదు. ఎస్సీలకు ప్లాట్లు ఇచ్చినా అవి ఎక్కడున్నాయో చూపించడం లేదు. ⇔ భూ సమీకరణ చేస్తున్న సమయంలో గ్రామాలు, ఇళ్ల జోలికి రాబోమని ప్రభుత్వం ప్రకటించింది. సమీకరణకు భూములు ఇవ్వడానికి నిరాకరించిన గ్రామాలపై ఇప్పుడు కక్ష గట్టింది. ఆ ఊర్లు, ఇళ్లు తొలగించాలని కంకణం కట్టుకుంది. 200 అడుగుల మేర రోడ్డు వేస్తున్నామంటూ గ్రామాలు, ఇళ్లను కూల్చేస్తున్నారు. భూములు ఇవ్వని గ్రామాల్లో బలవంతపు భూ సేకరణకు నోటిఫికేషన్లు జారీ చేయడం అన్యాయం. ⇔ లంక భూములకు సంబంధించిన పట్టాలు, టైటిల్ డీడ్స్ రైతుల వద్ద ఉన్నా.. అడంగళ్లలో వారి పేర్లు తొలగించి ప్రభుత్వ భూమిగా చూపించడం దుర్మార్గం. లంక భూములను చంద్రబాబు బినామీలు రైతులను బెదిరించి కారు చౌకగా కొట్టేశారు. బినామీలు కొన్న తర్వాత ఆ భూములకు ప్లాట్లు ఇచ్చే నీచమైన, దౌర్భాగ్యమైన పరిస్థితులు రాజధానిలో నెలకొనడం దారుణం. ⇔ రాజధాని నూజివీడు, నాగార్జున యూనివర్సిటీ వద్ద వస్తుందంటూ చంద్రబాబు మొదట్లో లీకులు ఇచ్చారు. ప్రజలు అక్కడ దృష్టి పెట్టినప్పుడు చంద్రబాబు బినామీలు, అధికార పార్టీ నేతలు అసలు రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు. కావాల్సిన వారంతా చౌకగా భూములు కొనేసిన తర్వాత చంద్రబాబు రాజధాని ప్రకటన చేశారు. అంతటితో ఆగలేదు. బినామీల భూములను ల్యాండ్ పూలింగ్ పరిధి నుంచి తప్పించారు. బినామీల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించారు. రైతుల భూములున్న ప్రాంతాలను అగ్రిజోన్‌గా వ్యవసాయానికే పరిమితం చేశారు. ⇔ చంద్రబాబు ప్రభుత్వం రైతుల భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. మూడేళ్లు పూర్తవుతున్నా రాజధానిలో ఒక్క ఇటుక కూడా వేయలేదు. రాజధాని నిర్మిస్తారనే నమ్మకం ప్రజల్లో పోయింది. బ్రహ్మాండమైన రాజధాని నిర్మాణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. రైతులు కూరగాయాల దుకాణాలే పెట్టుకోవాలా? ⇔ రాజధానికి 2,000 ఎకరాలు సరిపోతుంది. రోడ్ల నిర్మాణానికి భూములు తీసుకుంటే చాలు. మిగతా భూముల్లో జోనింగ్ చేసి విడిచిపెడితే.. రైతులు ఇష్టమైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు, లేదంటే వ్యవసాయం చేసుకుంటారు. ⇔ రైతుల కళ్లల్లో చంద్రబాబు కన్నీళ్లు చూస్తున్నారు. ఈ పరిస్థితిని వైఎస్సార్సీపీ మారుస్తుంది. ⇔ ప్రభుత్వం తీసుకున్న భూముల్లో హైపర్ మార్కెట్లు, సూపర్ మార్కెట్లు, స్టార్ హోటళ్లు, భారీ మాల్స్, 22 అంతస్తులు నిర్మించుకోవచ్చట! కానీ రైతులకు ఇచ్చిన వాణిజ్య ప్లాట్లలో కూరగాయల దుకాణాలు, బార్బర్ షాపులు మాత్రమే పెట్టుకోవాలట. జి+12కే నిర్మాణాన్ని పరిమితం చేయాలని నిబంధనలు విధించారు. ⇔ రాజధానిలో సామాజిక ప్రభావ మదింపు అంచనా నివేదికలు బూటకం. తూతూమంత్రంగా పూర్తి చేశారు. ప్రజల అభిప్రాయాలకు ఆ నివేదికల్లో చోటు లేకపోవడం అన్యాయం. చంద్రబాబు సింగపూర్‌కు వెళ్లకముందు జరీబు భూములుగా ఉన్నవి, సింగపూర్‌కు వెళ్లి వచ్చిన తరువాత మెట్టగా మారిపోయాయి. ⇔ రైతుల భూములను బలవం తంగా లాక్కోవడానికి చంద్రబాబు సర్కారు సాగిస్తు ్తన్న కుయుక్తులను గట్టిగా ప్రతిఘటిస్తాం. చూస్తూ ఉండగానే మూడేళ్లు గడిచిపోయాయి. మరో రెండేళ్లు భూములను కాపాడుకుంటే ఆ తర్వాత ఎవరూ ఏమీ చేయలేరు. ⇔ దేవుడి దయ ఉంటే ఏడాదిలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. లంక, అసైన్డ్ భూములున్న దళితులు భూమి పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. మన ప్రభుత్వం.. అంటే ప్రజల ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి న్యాయం చేస్తాం. జాబు రావాలంటే బాబు పోవాలి ‘‘బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల సమయంలో టీడీపీ హామీ ఇచ్చింది. ఇప్పుడు రాజధానిలో తమకు బతుకుతెరువు పోయింది’’ అని రైతులు ప్రతిపక్ష నేత జగన్ ముందు వాపోయారు. జగన్ స్పందిస్తూ... ‘జాబు రావాలంటే బాబు పోవాలి’ అన్నారు. దీంతో రైతులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. డెల్టా రైతులకు అండగా నిలుస్తాం.. కృష్ణా డెల్టా గ్రామాల్లో మినుము, అపరాలు సాగుజేసి నిండా మునిగిపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవడం లేదని రైతులు వైఎస్ జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రాజధాని గ్రామాల్లో పర్యటించేందుకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆయనను డెల్టా రైతులు కలుసుకున్నారు. తమ కష్టాలను వివరించారు. 50 ఏళ్లలో ఇంతటి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోలేదని ఆవేదన వ్యక్తం చేసారు. రెండేళ్లుగా వ్యవసాయంతో నష్టపోయామని, పరిహారం కోసం తమ పేర్లను ప్రభుత్వం కనీసం నమోదు చేయడం లేదని చెప్పారు. డెల్టా రైతులకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని, న్యాయం జరిగే వరకూ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. నేడు ప్రకాశం జిల్లాలో జగన్ పర్యటన సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం గురువారం రాత్రి కందుకూరు చేరుకున్న జగన్ స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో బస చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లిలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన ఫ్లోరోసిస్, కిడ్నీ బాధితులను కలసి వారి కష్టాలు తెలుసుకుం టారు. ఆ సమస్యను వెలుగులోకి తీసుకురావడం ద్వారా ఆరోగ్య శ్రీని కాపాడటంతో పాటు ప్రభుత్వానికి ప్రజారోగ్య బాధ్యతను గుర్తుచేసేందుకు బాధ్యతగలిగిన ప్రతిపక్షనేతగా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. -
ఫ్రెంచ్ బృందంతో సీఆర్డీఏ చర్చలు
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాజెక్టుల గురించి ఫ్రెంచ్‌కి చెందిన ఇద్దరు సభ్యుల బృందంతో సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ చర్చలు జరిపారు. శుక్రవారం సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో వారితో సమావేశమైన ఆయన అమరావతి నగర ప్రణాళిక, అక్కడి మౌలిక వసతుల ప్రాజెక్టులు, సామాజిక, ఆర్థిక మాస్టర్ప్లాన్లను వివరించారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణానికి సాంకేతిక సహకారం అందిస్తామని ఫ్రెంచ్ బృందం హామీ ఇచ్చింది. ప్రజా రవాణా, విద్యుత్, నీరు, సివరేజ్ వ్యవస్థల ఏర్పాటు గురించి చర్చించి ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏఎఫ్‌డీ) ద్వారా రుణమిచ్చే అవకాశాలను వారు వివరించారు. అలాగే అమరావతితోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికున్న అవకాశాల గురించి తెలుసుకునేందుకు త్వరలో ఫ్రెంచ్ ప్రతినిధుల బృందం రానున్నట్లు తెలిపారు. చర్చల్లో ఇండియాలో ఫ్రెంచ్ ఎంబసీ కౌన్సిలర్ ఫ్యాన్నీ హెర్వె, ఎఎఫ్‌డీ ప్రాజెక్టు డెరైక్టర్ హెర్వె డుబ్రియెల్ పాల్గొన్నారు. -
ఏపీలో హైకోర్టు ఏర్పాటు చేయండి
కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధానిలో హైకోర్టు ఏర్పాటు చేయడం ద్వారా రెండు రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ కేంద్రాన్ని కోరారు. మంగళవారం ఆయన రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఉండాలని పేర్కొన్నారు. హైకోర్టు కోసం తెలంగాణ న్యాయవాదులు, న్యాయాధికారులు ఆందోళనలో ఉన్నారు. ఏపీలో కూడా ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం అమరావతిలో హైకోర్టుకు భవనాలు ఏర్పాటుచేసేందుకు సిద్ధంగా లేదు. అక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దెబ్బతీస్తున్నారు. గత మూడు నెలలుగా తెలంగాణలో న్యాయవ్యవస్థ స్తంభించిపోయింది. న్యాయాధికారులు సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో వారు సస్పెన్షన్‌కు గురయ్యారు. సమస్య మరింత పెరిగిపోయింది. అందువల్ల త్వరితగతిన హైకోర్టు ఏర్పాటుచే యాలి’ అని కోరారు. -
ఇంటి అద్దెపై పేచీ
-
సింహభాగం సింగపూర్‌కే
రాజధాని మాస్టర్ డెవలపర్‌కు సర్కారు దాసోహం సాక్షి, హైదరాబాద్: సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు చెప్పినట్లు రాష్ట్ర ప్రభుత్వం తలాడిస్తోం ది. రాజధాని అమరావతి మాస్టర్ డెవలపర్‌గా అసెండాస్, సెమ్బ్‌కార్ఫ్, సెంబ్రిడ్జి కన్సార్టియంలను ఎంపిక చేయాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం సీఎం ఆ కంపెనీల ప్రతినిధులతో రాష్ట్రంలోనూ, సింగపూర్‌కు వెళ్లి మంతనాలు జరిపారు. ఆ కంపెనీలు సమర్పించిన స్విస్ చాలెంజ్ ప్రతిపాదనలపై చర్చించి ఖరారు చేయడానికి యనమల నేతృత్వంలో మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. ఇదివరకు 33 ఏళ్లు కాదని సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియంకు 99 ఏళ్లపాటు సర్వ హక్కులతో భూమిని లీజుకు కట్టబెట్టేందుకు రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి చట్టాన్ని సవరించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ కంపెనీల కోసం రెండోసారి ఆ చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. రాజ ధాని మాస్టర్ డెవలపర్‌గా సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియంకు 58% వాటా కట్టబెట్టి, రాష్ట్ర ప్రభుత్వం 42% వాటాతో సరిపుచ్చుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. కేపిటల్ సిటీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కార్పొరేషన్, సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియం కలిసి జాయింట్ వెంచర్ కంపెనీగా ఏర్పడతాయి. ఇందులో కేపిటల్ సిటీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కార్పొరేషన్‌కు 42%, సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియంకు 58% వాటా ఉండనుంది. అయితే ఇందుకు అమల్లో ఉన్న రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి చట్టం అంగీకరించదు. ప్రస్తుత చట్టం ప్రకారం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వం లేదా స్థానిక సంస్థలకు కచ్చితంగా 51% వాటా ఉండాలి. ప్రైవేట్ రంగానికి 49 % వాటానే ఉండాలి. ఈ నేపథ్యంలో చట్ట సవరణకు ప్రభుత్వం నిర్ణయించింది. -
రాజధానిలో కొత్త మోసాలు
► ఎకరాకు పది సెంట్లుఇస్తేనే పూలింగ్‌లో ► చేరుస్తామంటున్న అధికారులు ► లేదంటే పూలింగ్ నిలిపేస్తామని బెదిరింపు ► ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు నీరుకొండ (తాడేపల్లి రూరల్): కంచె చేను మేస్తే..అన్న చందం గా ఉంది రాజధాని ప్రాంతంలో అధికారుల తీరు. కన్నతల్లిలాంటి భూములు వదులుకోవడానికి సిద్ధపడిన రైతులకు చేతనైనంత చేయూతనివ్వాల్సిన అధికా రులు దీనికి విరుద్ధంగా వ్యవహరి స్తున్నారు. రాజధాని అవసరం కోసం ప్రభుత్వం 25 వేల మంది రైతుల వద్ద నుంచి వేల ఎకరాలను తీసుకుని, వారి బాగోగులను మాత్రం పట్టించుకోవడం మాత్రం మానేసింది. గతంలో ల్యాండ్ పూలింగ్‌కు ఇస్తామని ఏడాది క్రితం సీఆర్డీఏ అధికారులకు రాసిచ్చినా, ఇప్పటి వరకు స్పందన లేదని మంగళగిరి మండలం నీరుకొండకు చెందిన రైతులు ఆరోపిస్తున్నారు. ఎకరం పొలం పూలింగ్‌కు ఇస్తే పది సెంట్లు నజరానాగా ఇవ్వాలని ఓ అధికారి అల్టిమేటం జారీ చేశారని, అదేమంటే జిల్లా అధికారుల ఒత్తిళ్లు అంటూ సదరు అధికారిణి సెలవిస్తున్నారని వాపోతున్నారు. స్వచ్ఛందంగా భూము లు అప్పగించేందుకు సిద్ధమై సర్వే నిర్వహించాలని అడిగితే తనకున్న 1.5 ఎకరాల్లో పది సెంట్లు వేరే సర్వే నంబర్లో కేటాయించారని నీరుకొండకు చెందిన ఓ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆ పది సెంట్ల భూమిని వారికి అమ్మినట్టు దస్తావేజులు రాయాలంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోతున్నాడు. తాడేపల్లికి చెందిన ఓ మహిళకు సర్వే నంబర్ 86(సీ)లో 1.5 ఎకరాల భూమి ఉంది. 86 సర్వే నంబర్‌లోనే ఓ జిల్లా అధికారి సన్నిహితుడు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి నాలుగు నెలల క్రితం అర ఎకరం పొలం కొనుగోలు చేశారు. ఆ భూమిని ఆఘమేఘాల మీద ల్యాండ్ పూలింగ్‌లో చేర్చారు. కానీ 86 (సీ)లో ఉన్న ఎకరన్నర పొలం ల్యాండ్ పూలింగ్‌కు ఇస్తామన్నా తీసుకోవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘మీ పొలం ల్యాండ్ పూలింగ్‌కు తీసుకోవాలంటే పది సెంట్లు కేటాయించాలని, లేదంటే భూసేకరణ కింద భూమి పోతుందని, చాలా నష్టపోతార’ని అధికారులు బెదిరిస్తున్నట్లు చెబుతున్నారు. సదరు వ్యక్తి భయపడి పది సెంట్లు ఇవ్వగా, మిగతా ఎకరం 40 సెంట్లు 86(ఈ)లో ఉన్నట్టు చెబుతున్నారని, మాకు చెందిన పది సెంట్ల భూమిని ఓ మహిళ అధికారి తమ కుటుంబ సభ్యుల పేరు మీద బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపిస్తున్నారు. నిడమర్రులో తమలా మోసపోయిన వారు చాలా మంది ఉన్నారని చెబుతున్నారు. కొందరు సీఆర్డీఏ అధికారులు బినామీ పేర్ల మీద ఇలా బెదిరించి భూములు రాయించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టాలని కోరుతున్నారు. వాస్తవమని తేలితే క్రిమినల్ కేసులు నిజంగా అధికారులు అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకోవడమే కాకుండా, క్రిమినల్ కేసులు కూడా పెడతాం. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు రైతులు నేరుగా సీఆర్డీఏ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయొచ్చు. - చెన్నకేశవులు, సీఆర్డీఏ ల్యాండ్ పూలింగ్ డెరైక్టర్ -
టీ విద్యుత్ ఉద్యోగులకు తరలింపు భయం
♦ జూన్ 2లోగా అమరావతికి వెళ్లేందుకు సిద్ధం కావాలని ఏపీ ఆదేశాలు ♦ ఏపీ నుంచి రిలీవ్ చేయాలని పది రోజులుగా నిరసనలు సాక్షి, హైదరాబాద్: ఏపీ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు ‘రాజధాని తరలింపు’ భయం పట్టుకుంది. జూన్ 2లోగా ఎప్పుడైనా ఏపీ నూతన రాజధాని అమరావతికి తరలివెళ్లాల్సి ఉంటుందని, ఇందుకు సిద్ధమై ఉండాలని ఏపీ విద్యుత్ సంస్థలు హైదరాబాద్‌లోని తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం తమ కార్యాలయాలను హైదరాబాద్ నుంచి అమరావతికి తరలిస్తే తామూ వెళ్లకతప్పదని భయాందోళనలకు గురవుతున్నారు. ఏపీ విద్యుత్ సంస్థల్లో 360 మంది వరకు తెలంగాణ ప్రాంత ఉద్యోగులు కొనసాగుతున్నారు. వీరిలో 170 మంది హైదరాబాద్‌లో, మిగిలిన వాళ్లు ఏపీలోని జోనల్ కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. బలవంతంగా అమరావతికి తరలిస్తే... తెలంగాణ నుంచి రిలీవైన 1252 మంది ఏపీ ప్రాంత విద్యుత్ ఉద్యోగుల తరహాలోనే వీరూ రోడ్డున పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమను తక్షణమే ఏపీ నుంచి తెలంగాణకు రిలీవ్ చేయాలని కోరుతూ తెలంగాణ ప్రాంత ఉద్యోగులు 10 రోజులుగా విద్యుత్‌సౌధలో ఆందోళనలు చేస్తున్నారు. మూడు రోజులుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. అయినా, రిలీవ్ చేసేందుకు ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ససేమిరా అంటున్నాయి. ఏపీలో కొనసాగుతుండడం వల్ల ఇప్పటికే తెలంగాణ ఇంక్రిమెంట్‌ను కోల్పోయామని తెలంగాణ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రిలీవ్ చేయకపోయినా తెలంగాణ ప్రభుత్వం పెద్ద మనసుతో ముందుకు వస్తే తామూ వచ్చేస్తామని ఓ ఉద్యోగి ‘సాక్షి’కి తెలిపారు. లేనిపక్షంలో ఉద్యోగుల విభజన వివాదం పరిష్కారమయ్యే వరకు అమరావతిలో పనిచేయక తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడికి వెళ్లి పనిచేయడం సాధ్యం కాదన్నారు. ఏపీలోని తెలంగాణ విద్యుత్ ఉద్యోగులను తీసుకుంటారా? అని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డిని బుధవారం విలేకరులు ప్రశ్నించగా చట్టపర చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉందని, కోర్టు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. -
రాజధానిలో భూముల...కొనుగోలుపై అప్రమత్తం
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని ప్రాంతంలో నకిలీ పత్రాలతో భూముల క్రమవిక్రయాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఆర్డీఏ శనివారం ఒక ప్రకటనలో అప్రమత్తం చేసింది. ముసాయిదా భూసమీకరణ పథకం నోటిఫికేషన్ ఇప్పటి వరకూ నేలపాడు గ్రామానికే ఇచ్చామని పేర్కొంది. 30 రోజుల అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత రైతులు తమ వాటా ప్లాట్ల కోసం ఒక్కరిగా 9.18ఏ, ఉమ్మడిగా 9.18బీ దరఖాస్తు ఫారాల్లో కోరుకున్న స్థలాలు లాటరీ ద్వారా నిర్ణయించి భూసమీకరణ యాజమాన్య పత్రం రిజిష్ట్రేషన్ చేస్తామని వివరించింది. అలా రిజిష్ట్రేషన్ పొందిన భూ యజమానికి మాత్రమే దానిపై అర్హత ఉంటుందని స్పష్టం చేసింది. కొందరు వ్యక్తులు పేదల ఆక్రమణలో ఉన్న భూములు, అసైన్డ్ పట్టాలు, లంక భూములను అనధికారికంగా కొనుగోలు చేసి..లబ్ధిదారునికి ధ్రువీకరణ పత్రం వచ్చాక రిజిష్ట్రేషన్ చేయాలని ఒత్తిడి చేసే అవకాశముందని పేర్కొంది. అలాంటి భూములను కొనుగోలు చేయకుండా జాగ్రత్త వహించాలని సూచించింది. ఇప్పటి వరకూ రాజధాని ప్రాంతంలో భూసమీకరణ యాజమాన్య ధ్రువపత్రాలు ఇవ్వలేదని, ఈ పత్రంపై సీఆర్డీఏ కమిషనర్ సంతకం ఉండదని పేర్కొంది. కాంపిటెంట్ అథారిటీ, రిజిష్ట్రేషన్ శాఖ, మండల కార్యాలయాలను సంప్రదించి సంబంధించి ప్లాటును చూసి, దాని నంబరు, కొలతలు, జీపీఎస్ రీడింగ్‌లు తెలుసుకుని కొనుగోలు చేయాలని తెలిపింది. -
రాజధానిపై గురి
- మహిళా మావోయిస్టును అదుపులోకి తీసుకున్న పోలీసులు - కొంతకాలంగా రాజధాని ప్రాంతంలో సంచరిస్తున్నట్టు అనుమానం - ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకత ఆసరాగా ప్రజా మద్దతు పొందే ప్రయత్నాలు - అధికార పార్టీ ముఖ్యనేతలు, సోదరులకు హెచ్చరికలు పంపినట్టు వదంతులు రాజధాని ప్రాంతంపై మావోయిస్టులు దృష్టి సారించారు. ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలను ఆరంభించారు. దీనిలోభాగంగానే మావోయిస్టు మహిళా నేత భూతం అన్నపూర్ణ, అలియాస్ అరుణ కొంతకాలం నుంచి రాజధాని ప్రాంతంలో సంచరిస్తూ భూ, ఇసుక మాఫియాలపై రెక్కీ నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు: జిల్లాలో రాజధాని ప్రకటన నుంచి భూ మాఫియా తన కార్యకలాపాలను ఉధృతం చేసింది. అధికార పార్టీ ముఖ్యనేతల సోదరులు, తనయులు భూ దందాలకు పాల్పడుతూ అమాయకుల భూములను కబ్జా చేస్తున్నారు. పోలీసులు సైతం అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతుండడంతో న్యాయం జరగక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక మౌనంగా రోదిస్తున్న బాధితులు వందల మంది ఉన్నారు. మరో వైపు ప్రభుత్వ శాఖలు సైతం అధికార పార్టీ నేతలు చెప్పినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూములు కాజేయడంలో సహకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలతోపాటు పోలీసు శాఖపై ప్రజల్లో వ్యతిరేక భావం పెరిగిపోయింది. దీన్ని అవకాశంగా భావించిన మావోయిస్టులు జిల్లాపై కొన్ని నెలలుగా దృష్టి సారించినట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. అలాగే వర్షాభావ పరిస్థితు లు, రాజధాని నేపథ్యంలో రైతులు, రైతు కూలీలు పనులు లేక అల్లాడిపోతున్నారు. కొన్నేళ్ళుగా ప్రజా మద్దతు కోల్పోయిన మావోయిస్టులు ప్రస్తుత తరుణంలో తమకు కొన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని భావించి తమ కార్యకలాపాలను తిరిగి ఆరంభించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్న మావోయిస్టు మహిళా నేత భూతం అన్నపూర్ణ, అలియాస్ అరుణ, అలియాస్ పద్మ కొంతకాలంగా రాజధాని ప్రాంతంలో సంచరిస్తూ భూ, ఇసుక మాఫియాలపై రెక్కీ నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మావోయిస్టుల కదలికలు గుర్తించని జిల్లా పోలీసులు ... ఇసుక, భూ మాఫియాలపై దృష్టి సారించిన మావోయిస్టు నేతలు ఇక్కడ సంచరిస్తున్నారనే సమాచారం జిల్లా పోలీసులకు అందలేదని చెబుతున్నారు. ఛత్తీస్గడ్ నుంచి హైదరాబాద్ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు వచ్చిన సమాచారం మేరకు రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలో మావోయిస్టు దండకారణ్యం స్పెషల్ జోన్ సీనియర్ కమాండెంట్ నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న భార్య డిప్యూటీ కమాండెంట్‌గా పనిచేసిన భూతం అన్నపూర్ణ అలియాస్ అరుణ, అలియాస్ పద్మను హైదరాబాద్ ఎస్ఐబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన ముఖ్యనేతలు, సోదరులు, తనయులకు మావోయిస్టుల నుంచి హెచ్చరికలు వచ్చాయనే వదంతుల నేపథ్యంలో అరుణను పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. ఆమె నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నట్లు తెలిసింది. ఇసుక, భూ మాఫియాలకు హెచ్చరికలు ... జిల్లాలో భూ దందాలకు పాల్పడుతున్న అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత తనయుడితోపాటు, భూ మాఫియాకు మావోయిస్టుల నుంచి ఇప్పటికే హెచ్చరికలు వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. జిల్లాలో పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నేతలు కోట్ల రూపాయల విలువ చేసే ప్రైవేటు, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నట్టు మావోయిస్టులు దృష్టికి వచ్చిం దంటున్నారు. ఈ తరుణంలో జిల్లాలో ప్రవేశిస్తే తమకు కొన్ని వర్గాల నుంచి అయినా మద్దతు లభిస్తుందని భావించి మావోయిస్టులు ఇక్కడ సంచరిస్తున్నట్టు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అదేవిధంగా జిల్లాలోని ఓ సీనియర్ ఎమ్మెల్యే సోదరుడు, ఓ జెడ్పీటీసీ భర్తతోపాటు మరికొందరు నేతలు ఇసుక మాఫియాగా ఏర్పడి కోట్ల రూపాయలు అక్రమంగా కొల్లగొడుతున్నారని తెలుసుకుని వారికి హెచ్చరికట్లు పంపినట్లు సమాచారం. -
రాజధానిలో.. ఇక అంతా ప్రైవేటీకరణే!
ఉన్నత, సాంకేతిక విద్య, వైద్యం, విద్యుత్, పట్టణ వసతులన్నీ ప్రైవేటుకే.. ఐఎన్‌సీఏపీ, ఏపీ ఇన్వెస్ట్, ఎస్ఐబీపీ, ఎస్టీపీబీలకు స్వస్తి ఇవన్నీ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలిలో విలీనం కార్పొరేట్ సామాజిక బాధ్యత పేరిట ఆదాయ వనరుల సమీకరణ పెట్టుబడులు సమకూర్చే నిధిసహా ఐదు రకాల నిధుల ఏర్పాటు సాక్షి, హైదరాబాద్ : ఏపీ నూతన రాజధానిలో ఇక ఏదీ రాష్ట్రప్రభుత్వం చేయదు. అంతా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతోనే చేపడతారు. ఉన్నత, సాంకేతిక విద్యా సదుపాయాలతోపాటు వైద్య, ఆరోగ్యం, విద్యుత్, పట్టణ వసతుల కల్పన.. ఇలా అన్నింటినీ పీపీపీ పద్ధతిలో ప్రైవేటువారికే అప్పగించనున్నారు. ఇందుకవసరమైన విదేశీ, స్వదేశీ పెట్టుబడులను రాబట్టేందుకు, అలాగే రాష్ట్రంలో పన్నులు, యూజర్ చార్జీల రూపంలో ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటారు. ఈ లక్ష్యాల సాధన కోసమే ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు. ఈ మండలి ఏర్పాటుతో ప్రస్తుతమున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(ఐఎన్‌సీఏపీ), ఏపీ ఇన్వెస్ట్ సంస్థతోపాటు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్ఐపీబీ), రాష్ట్ర టూరిజం ప్రోత్సాహక మండలి(ఎస్టీపీబీ)కి స్వస్తి పలికారు. ఈ సంస్థలన్నింటినీ ఆర్థికాభివృద్ధి మండలిలో విలీనం చేశారు. పెట్టుబడుల్ని రాబట్టడంలోను, ఆకర్షించడంలోను పైన పేర్కొన్న సంస్థలు, మండళ్లు విఫలమైనట్టు భావించిన ప్రభుత్వం వాటిని రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలిలో విలీనం చేసింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి(ఈడీబీ)ని ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో పేర్కొన్న మేరకు.. ఆర్థికాభివృద్ధి మండలి స్వరూపం.. చేయాల్సిన పనులకు సంబంధించిన ముఖ్యాంశాలిలా ఉన్నాయి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికోసం జాతీయ, అంతర్జాతీయ వ్యాపారసంస్థలు, వ్యాపారవేత్తలనుంచి పెట్టుబడుల్ని రాబట్టడం. పట్టణ మౌలిక వసతులు, ఇంధనం, పర్యాటక, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, వైద్య ఆరోగ్యం, స్కిల్ అభివృద్ధి, పారిశ్రామిక రంగాల్లో ప్రైవేట్‌సంస్థల నుంచి పెట్టుబడుల్ని తీసుకురావడం. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఆదాయ వనరుల్ని సమీకరించడం. ఆర్థికాభివృద్ధి మండలిలో భాగంగా ప్రణాళిక వ్యూహం.. విధానం డివిజన్, పెట్టుబడుల ప్రోత్సాహక డివిజన్, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం డివిజన్, ఆదాయ వనరుల సమీకరణ డివిజన్, స్పెషల్ వెహికల్స్ డివిజన్ ఉంటాయి. ఆర్థికాభివృద్ధి మండలి అవసరమైన సేవల్ని సింగపూర్ కో-ఆపరేషన్ ఎంటర్ప్రైజెస్, యూరోపియన్ పీపీపీ సెంటర్, ప్రపంచబ్యాంక్ పీపీపీ రిసోర్స్సెంటర్ల నుంచి పొందుతుంది ఆర్థికాభివృద్ధి మండలిలో ఐదు నిధులను ఏర్పాటు చేస్తారు. ఇందులో పెట్టుబడులు సమకూర్చే నిధి ఒకటి. దేశ, విదేశాల్లో పెట్టుబడుల సదస్సుల ఏర్పాటుకు, అలాగే రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై డాక్యుమెంటరీలు, ఇతర బ్రోచర్లద్వారా ప్రచారం చేయడానికి దీన్ని వినియోగిస్తారు. సామర్ధ్య అభివృద్ధి నిధిని మైక్రో ఎకనమిక్స్, పీపీపీ శిక్షణలకు, దేశ విదేశాల్లో వర్క్‌షాపుల నిర్వహణకు వినియోగిస్తారు. ప్రాజెక్టు అభివృద్ధి నిధిని ఏదైనా ప్రాజెక్టుకు సంబంధించి ప్రాథమికంగా సాంఘిక, ఆర్థిక స్థితిగతులు, ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు, న్యాయపరమైన, పర్యావరణపరమైన అధ్యయనాలకోసం వినియోగిస్తారు. వయబులిటీ గ్యాప్ నిధిని ప్రైవేట్ సంస్థ చేపట్టే ఏదైనా ప్రాధాన్యతగల ప్రాజెక్టుకయ్యే వ్యయంలో అంతరముంటే దానికి సంబంధించిన నిధుల్ని ప్రభుత్వం ఇచ్చేందుకు వినియోగిస్తారు. ఇన్నోవేషన్ నిధిని పారిశ్రామిక, వాణిజ్య వ్యాపారాల్లో వినూత్న ఆలోచనలు, నూతన ధోరణుల గురించి వినియోగిస్తారు. రైతు సాధికార కార్పొరేషన్‌కు, మహిళా సాధికార కార్పొరేషన్‌కు, కేపిటల్ సిటీ సర్వీసెస్‌కు, స్మార్ట్ సిటీ సర్వీసెస్‌కు, పారిశ్రామిక కారిడార్లకు, ఏపీ ఇన్నోవేషన్‌కు స్పెషల్ పర్పస్ వెహికల్స్‌ను ఏర్పాటు చేస్తారు. ఆదాయ వనరుల సమీకరణల్ని రిటైల్ పెట్టుబడిదారులనుంచి, నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కార్పొరేషన్స్, మ్యూచువల్ ఫండ్, యూనిట్స్, బాండ్లద్వారా చేపడతారు. అలాగే అంతర్గత ఆదాయ వనరుల పెంపునకు పన్నులస్థాయిని పెంచడంతోపాటు పన్నురేట్ల పెంపు, యూజర్‌చార్జీల విధింపు వంటి చర్యలు చేపడతారు. 1991 నుంచి వచ్చింది రూ.41,860 కోట్లే! 1991 ఆగస్టు నుంచి మార్చి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం రూ.8.96 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు రాగా.. వాటిలో కేవలం రూ.41,860 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు మాత్రమే అమలైనట్లు ఆర్థికశాఖ గుర్తించింది. ఇది ప్రతిపాదనల్లో కేవలం 4.67 శాతం మాత్రమేనని పేర్కొంది. -
పాత ఉద్యోగులపై పక్షపాతం
ఉడా ఉద్యోగులకుప్రాధాన్యత కరువు ఇంజినీరింగ్ విభాగంలో వింత సాక్షి, విజయవాడ బ్యూరో : వీజీటీఎం ఉడాలో పనిచేసిన ఉద్యోగులకు సీఆర్డీఏలో కనీస ప్రాధాన్యం లభించట్లేదు. వారిని పూర్తిగా పక్కనపెట్టేసి తూతూమంత్రం పనులు జరిగే రాజధాని రీజియన్ ప్రాజెక్టుల పనికి కేటాయించారు. ఉడా ఇంజినీరింగ్ విభాగంలో కీలకంగా పనిచేసిన వారికి ఇప్పుడు అక్కడా దాదాపు పనిలేకుండాపోయింది. తాత్కాలిక సచివాలయ నిర్మాణం, రాజధాని ప్రాజెక్టుల కోసం.. అదే ఇంజినీరింగ్ విభాగంలో బయటి నుంచి కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగులను నియమించుకుంటున్నారు. కానీ, అదే విభాగంలో ఎప్పటి నుంచో ఉన్న పాత ఉద్యోగులను మాత్రం ఖాళీగా కూర్చోబెడుతున్నారు. దాదాపు పూర్తయిన ఇన్నర్ రింగురోడ్డు, పంటకాలువ రోడ్డు పనులను వీరికి కేటాయించారు. ఉద్యోగుల కంటే.. ఫర్నీచరే ఎక్కువ బందరు రోడ్డులోని మనోరమ హోటల్ పక్కన అద్దెకు తీసుకున్న భవనంలో ఒక అంతస్తును ఉడా ఇంజినీరింగ్ ఉద్యోగులకు కేటాయించారు. ఇక్కడ ఉద్యోగుల కంటే బల్లలు, కుర్చీలు, బీరువాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఒక డెప్యూటీ ఇంజినీర్, ముగ్గురు అసిస్టెంట్ ఇంజినీర్లు, మరో నలుగురు సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. కనీసం అటెండర్‌ను కూడా కేటాయించకపోవడంతో అన్ని పనులు వారే చూసుకుంటున్నారు. ఒకవైపు రాజధాని ప్రాజెక్టులు చూసే ఇంజినీరింగ్ విభాగం తీవ్రమైన పని ఒత్తిడి ఎదుర్కొంటుండగా, అక్కడ వీరిని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారనే దానికి ఉన్నతాధికారుల నుంచి సమాధానం రావడంలేదు. సీఆర్డీఏ ఆవిర్భవించినప్పుడు ఉడా ఉద్యోగుల పనితీరుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత అన్ని విభాగాల్లోనూ పాతవారిని అందరితో కలిపేసి పనిచేయిస్తున్నా ఒక్క ఇంజినీరింగ్ విభాగంలోనే పాత వారిని పక్కనపెట్టారు. ప్రస్తుతం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం జరుగుతోంది. రాజధాని అనుసంధాన రోడ్డు, అవుటర్ రింగు రోడ్డు పనులతోపాటు త్వరలో చేపట్టే పనులకూ చాలామంది ఉద్యోగులు, అధికారుల అవసరం ఉంది. అయితే సీఆర్డీఏ ఉన్నతాధికారులు ఈ పనులకు బయట నుంచి కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగులను నియమించుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ఏఈలను అలాగే నియమించారు. మరికొందరి నియామకానికి కసరత్తు చేస్తున్నారు. ఉన్న ఉద్యోగులను పక్కనపెట్టి కాంట్రాక్టు ఉద్యోగుల కోసం పాకులాడడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
రైతు ఆత్మహత్యలు బాబు పుణ్యమే..
ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ముల్లా 17,18 తేదీల్లో అసెంబ్లీ వద్ద 36 గంటల ధర్నా విజయవాడ(భవానీపురం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో వ్యవసాయం నిర్లక్ష్యానికి గురవుతోందని ఆలిండియా కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ హన్నన్‌ముల్లా అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు పుణ్యమేనన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 22 నెలల కాలంలో 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఆ రైతు కుటుంబాలకు రూ.10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గవర్నర్‌పేటలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ల్యాండ్ పూలింగ్, భూసేకరణ, భూసమీకరణ పేరుతో రాజధాని ప్రాంతంలో మూడు పంటలు పండే వ్యవసాయ భూములను లాక్కోవడం దారుణమన్నారు. రూ.87,500 కోట్ల రైతు రుణమాఫీ చేయాల్సి ఉండగా కేవలం రూ.7,400 కోట్లు మాత్రమే ప్రభుత్వం బ్యాంక్‌లో జమ చేసిందన్నారు. ఈ కాలంలో రైతులపై రూ.18 వేల కోట్ల వడ్డీ భారం పడిందని వివరించారు. ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచి వారికి రోజుకు రూ.300 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 17,18 తేదీల్లో అసెంబ్లీ వద్ద 36 గంటలపాటు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బీ బలరాం, ప్రధాన కార్యదర్శి వంగల సుబ్బారావు పాల్గొన్నారు. -
ఏదైతే అయ్యింది, లెక్కలైతే బయటకు వచ్చాయి కదా!
ఆంధ్రప్రదేశ్ రాజధాని చుట్టూ జరుగుతున్న భూభాగోతాలు, వందలకోట్ల కుంభకోణాల వ్యవహారాన్ని చూసి టీడీపీ నాయకులే ముక్కున వేలేసుకుంటున్నారట. తమతోనే ఉంటూ తమకు తెలియకుండానే కొందరు నాయకులు ఎంతో పైకి ఎదిగిపోవడాన్ని చూసి జీర్ణించుకోలేక పోతున్నారట. కొందరు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీనాయకులు నడుపుతున్న రహస్య మంత్రాంగం, భూముల కొనుగోలు, బినామీ వ్యవహారాలు బయటపడడంతో లెక్కలన్నీ బయటకు వచ్చాయని, ఇది ఒకందుకు మంచిదేనని వారు లోలోపల సర్దిచెప్పుకుంటున్నారట. పార్టీనాయకులు కొందరు ముందుచూపుతో వ్యవహరిస్తూ, ఎవరికీ దొరకకుండా వ్యవహారాలను చక్కబెట్టుకోవడం చూసి షాకవుతున్నారట. ఏదిఏమైనా లెక్క తేలింది కదా, అన్ని విషయాలు బయటకు రావాల్సిందేనని సర్దిచెప్పుకుంటున్నారట. తమకు తెలియకుండానే వందలకోట్ల భూదందాలు నిర్వహించినందుకు వారికి అంతకు అంత కావాల్సిందేనని పనిలోపనిగా శపిస్తున్నారట. సీనియర్‌నాయకులు సైతం ఈ విధంగా కూడా చేయవచ్చా అని ఆశ్చర్యపోతున్నారట. ఇటీవల ఒక సీనియర్ ఎమ్మెల్యే సైతం ముందు చూపు అంటే ఆ నాయకులదేనని, తాము ఇన్నేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా ఇంత తక్కువ కాలంలో ఇంతగా ఎదగవచ్చునని కలకనలేదని, ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములే వాడి అని మరోసారి నిరూపితమైందని ముక్తాయింపునిచ్చారట... -
అసైన్డు భూములనూ కొల్లగొట్టారు...
రాజధాని ప్రాంతంలో రైతుల భూములే పెట్టుబడిగా రూ.లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు పక్కాగా రియల్ ఎస్టేట్ దందాకు తెర తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అస్మదీయులతో కలిసి వ్యూహాత్మకంగా అసైన్డు భూములను కొల్లగొట్టారు. పట్టా భూముల తరహాలనే అసైన్డు భూములకూ పరిహారం ఇచ్చేలా రాజధాని భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేసినా... పరిహారం ఇవ్వరంటూ టీడీపీ నేతలు ఊరూరా ప్రచారం చేయించారు. ఈలోగా అసైన్డు భూముల రైతులకు పంపిన కౌలు చెక్‌లను వెనక్కి పంపాలంటూ ప్రభుత్వం జూన్ 12న సీఆర్డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్‌ను ఆదేశించింది. దాంతో.. అసైన్డు భూముల రైతులకు పంపిణీ చేయాల్సిన కౌలు చెక్‌లను సీఆర్డీఏ అధికారులు ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. దీన్ని సాకుగా చూపి... అసైన్డు భూములను ప్రభుత్వం ఉత్తినే లాక్కుంటుందంటూ మరోసారి లంక గ్రామాల్లో భారీ ఎత్తున ప్రచారం చేశారు. రైతులను మరింత భయపెట్టి ఎకరం రూ.5 లక్షల నుంచి రూ.40 లక్షల వరకూ కొనుగోలు చేశారు. ఆ తర్వాత అసైన్డ్ భూముల సేకరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో భూముల ధరలు పెరిగి భారీగా లాభపడ్డారు. అస్మదీయుల మధ్యే పోటాపోటీ! అసైన్డు భూముల కొనుగోలులో సీఎం అస్మదీయుల మధ్య పోటీ నెలకొంది. సీఎం తనయుడు లోకేష్, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావులు మంగళగిరిలో నివాసం ఉండే రియల్ ఎస్టేట్ బ్రోకర్ ద్వారా బినామీ పేర్లతో అసైన్డు భూములు కొనుగోలు చేయించారని దళిత పేద రైతులు ‘సాక్షి’కి చెప్పారు. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి, అమరావతి మండలాల్లో వీరిద్దరే 474 ఎకరాలపైకుపైగా భూమిని బినామీ పేర్లతో సొంతం చేసుకున్నట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన వ్యాపార భాగస్వామి, బినామీగా భావిస్తున్న గూడూరు సురేష్ ద్వారా అసైన్డు భూములు కొనుగోలు చేశారు. మంత్రి రావెల కిశోర్‌బాబు, గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు అసైన్డు భూముల కొనుగోలులో పోటీ పడ్డారని రైతులు తెలిపారు. పచ్చి మోసం... పక్కా దగా! అసైన్డు భూములు కొనుగోలు చేయడం.. విక్రయించడం చట్ట విరుద్ధం. కానీ.. ఆ భూములను కొనుగోలు చేయడంలో పచ్చ రాబందులు చతురత ప్రదర్శించారు. భూమిని కొనుగోలు చేసిన తర్వాత.. 25 శాతం సొమ్మును రైతులకు చెల్లించేటపుడు వీడియో, ఫోటోలు తీయిస్తున్నారు. ఆ భూములను 1954కు ముందే తమకు ప్రభుత్వం పంపిణీ చేసినట్లు.. తమ ఇష్టపూర్వకంగానే వాటిని అమ్మినట్లు హామీ పత్రం రాయించుకున్నారు. తక్కిన సొమ్మును ఆ భూమిని ల్యాండ్ పూలింగ్‌లో ప్రభుత్వం తీసుకుంటే ఇస్తామని.. లేదంటే మీ భూములు మీరే సాగు చేసుకోవచ్చునంటూ నమ్మబలికారు. కొందరు రిజిస్ట్రేషన్ చట్టాన్ని ఆసరాగా చేసుకుని.. ఆ శాఖ అధికారులతో భారీ ఎత్తున నజరానాలు ముట్టజెప్పి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. మరికొందరు కోర్టు నుంచి ఎన్వోసీ(నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం) తెచ్చుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మంగళగిరి, అమరావతి, తుళ్లూరు, పెదకాకాని, గుంటూరు ఆర్వో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో 480 ఎకరాల విక్రయానికి సంబంధించిన 499 రిజిస్ట్రేషన్లు చేశారు. మరో 650 ఎకరాల విక్రయానికి సంబంధించిన 381 పెండింగ్ రిజిస్ట్రేషన్లు చేశారు. మొత్తం మీద అధికారిక లెక్కల ప్రకారమే 348.46 ఎకరాల భూములను టీడీపీ నేతలు కొనుగోలు చేశారు. కొనుగోలు ఒప్పందాల ద్వారా మరో 1200 ఎకరాలకుపైగా భూములను సొంతం చేసుకున్నట్లు సమాచారం. రైతులను మభ్యపెట్టి, బెదిరించి ఎకరం కేవలం రూ.ఐదు లక్షలనుంచి రూ.40 లక్షలకే కొనుగోలు చేసిన భూముల విలువ ప్రస్తుతం ఎకరా రూ.1.75 కోట్లు పలుకుతుండటం గమనార్హం. అంటే... ఈ అసైన్డు భూములు కొనుగోలులోనే టీడీపీ నేతలు రూ.2,775 కోట్లు లాభపడ్డారు. భూసమీకరణ నోటిఫికేషన్ బుట్టదాఖలు రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో 2,028 ఎకరాల అసైన్డు భూములు ఉన్నాయి. ఇందులో 1,278 ఎకరాల భూమిని 1954లో అసైన్డు చేశారు. తక్కిన 750 ఎకరాల భూమిని పలు దఫాల్లో రైతులకు పంపిణీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నిరుపేదలకు ప్రభుత్వం అరెకరం.. ఎకరం చొప్పున వాటిని అసైన్డు చేసింది. రాజధాని ప్రాంతం లో పట్టా, అసైన్డు భూముల సమీకరణకు మాత్రమే పరిహారం చెల్లించేలా జనవరి 1, 2015న ఉత్తర్వులు జారీ చేసింది. పట్టా జరీబు భూములకు ఎకరానికి రూ.50 వేలు, మెట్ట భూములకు రూ.30 వేలు చొప్పున కౌలు ఇస్తామని అందులో పేర్కొంది. అసైన్డు భూముల రైతులకు ఇదే తరహాలో కౌలు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది.పట్టా జరీబు భూముల రైతులకు ఎకరానికి వెయ్యి గజాల చొప్పున ఇంటి స్థలం, 450 గజాల చొప్పున వాణిజ్య స్థలం, మెట్ట భూముల రైతులకు ఎకరానికి వెయ్యి గజాల చొప్పున ఇంటి స్థలం, 200 గజాల చొప్పున వాణిజ్య స్థలం ఇవ్వాలని నిర్ణయించింది.అసైన్డు భూముల రైతులకు మెట్ట భూమి ఎకరానికి 800 గజాల చొప్పున ఇంటి స్థలం, వంద గజాల చొప్పున వాణిజ్య స్థలం.. అసైన్డు జరీబు భూమికి ఎకరానికి 800 చొప్పున ఇంటి స్థలం, 200 గజాల చొప్పున వాణిజ్య స్థలం ఇవ్వాలని నిర్ణయించింది. అసైన్డు భూములకు ప్యాకేజీ ఓకే... అస్మదీయులు అసైన్డు భూములు కొల్లగొట్టాక వాటికి ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు డిసెంబర్ 13న విజయవాడలో నిర్వహించిన ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అసైన్డు భూముల కొనుగోలుదారులకు ఆ భూములపై హక్కులు కల్పించేలా చట్ట సవరణ చేయాలని ఆ సమావేశంలోనే ప్రాథమికంగా నిర్ణయించారు. ఆ మేరకు అసైన్డు చట్టాన్ని సవరించడానికి ప్రణాళిక సిద్ధం చేయాలంటూ ఇటీవల సీసీఎల్ఏ (భూపరిపాలన కమిషనర్)ను ఆదేశించారు. అసైన్డు భూముల చట్టాన్ని సవరించడం ద్వారా తన కుమారుడు లోకేష్‌తోపాటూ అస్మదీయులకు భారీ ఎత్తున లబ్ధి చేకూర్చడానికి సీఎం చంద్రబాబు కుట్ర చేశారన్నది స్పష్టమవుతోంది. ఓ వైపు అసైన్డు భూముల అమ్మకాలను క్రమబద్ధీకరించడానికి చర్యలు తీసుకుంటోన్న సర్కారు.. మరోవైపు ఈనెల 17న అసైన్డు భూములకు ప్యాకేజీ ప్రకటించారు. 1954 కన్నా ముందు అసైన్డు చేసిన మెట్ట భూములకు ఎకరానికి వెయ్యి గజాల ఇంటి స్థలం, 200 గజాల వాణిజ్య స్థలం, జరీబు భూములకు వెయ్యి గజాల ఇంటి స్థలం, 450 గజాల వాణిజ్య స్థలం ఇవ్వడానికి అంగీకరించారు. ఇక 1954 తర్వాత అసైన్డు చేసిన వాటికి మెట్ట భూములకు ఎకరానికి 800 గజాల ఇంటి స్థలం, 100 గజాల వాణిజ్య స్థలం.. జరీబు భూములకు 800 గజాల ఇంటి స్థలం, 200 గజాల వాణిజ్య స్థలం ఇచ్చేందుకు అంగీకరించారు. ఇప్పుడు ఏడాదికి జరీబు అసైన్డు భూములకు రూ.50 వేలు.. మెట్ట భూములకు రూ.30 వేల చొప్పున ఇచ్చే కౌలు చెక్లతోపాటూ ఇంటి, వాణిజ్య స్థలాలు కూడా మంత్రుల ఖాతాలోకే వెళ్లేలా నిబంధనలు రూపొందించడం గమనార్హం. అధికారులే భయపెట్టారు మా ముత్తాతల కాలంలో ప్రభుత్వం మాకు భూములను ఇచ్చింది. అన్నదమ్ములిద్దరి కుటుంబాలు 75 సెంట్ల భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నాము. భూసమీకరణ ప్రకటించడంతో కొంత ఆందోళన చెందాము. చాలాకాలం సమీకరణకు భూములు ఇవ్వలేదు. అయితే అసైన్డ్ భూములను ప్రభుత్వం లాగేసుకుంటుందని భూసమీకరణకు ఇస్తే మేలని అధికారులు, నేతలు భయభ్రాంతులకు గురిచేయడంతో ఎట్టకేలకు సమీకరణకు ఇచ్చాము. ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదు. భూమి సాగు లేక పరిహారం అందక కుటుంబపోషణ భారంగా మారింది. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవట్లేదు. పట్టా భూముల మాదిరిగానే మాకు పరిహారం అందజేయాలి. పచ్చల నాగేశ్వర రావు, మోహన్‌రావు, నవులూరు మూడు తరాలుగా సాగు చేసుకుంటున్నాం... మూడు తరాలుగా ప్రభుత్వం ఇచ్చిన ఎకరా భూమిని సాగుచేసుకుని జీవిస్తున్నాము. భూసమీకరణకు ఇవ్వకపోవడంతో అధికారులు వచ్చి బెదిరించారు. ఆ భూములను ప్రభుత్వం కేటాయించిందని, సమీకరణకు ఇస్తే కొద్దిగానైనా పరిహారం వస్తుందని, లేదంటే భూములను ఊరకనే తీసుకుంటారని చెప్పడంతో సమీకరణకు ఇచ్చాము. అయినా అధికారులు పరిహారం ఇవ్వలేదు. వెంటనే పట్టాభూములు మాదిరిగా పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. వేమూరి జవహర్లాల్, నవులూరు దళితులంటే సర్కారుకు చులకన భూమిపై బ్రతికే కుటుంబాలు పరిహారం ఇవ్వకుంటే ఎలా బ్రతుకుతాయి? తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములకు పట్టా భూములకు ఇచ్చినట్లే పరిహారం అందించాలి. దళితులంటే ప్రభుత్వానికి చులకన కనుకే ఇంతకాలం పరిహారం ఇవ్వకపోగా ఇప్పుడు తక్కువ ప్రకటించింది. వెంటనే పట్టాభూములకు ఇచ్చినట్లే పరిహారం అందించాలి. వేమూరి జాన్, నవులూరు -
పేదల భూముల్లో రాబందులు
⇒కొట్టేసిన లంక భూములు 1,250 ఎకరాలు ⇒లబ్ధి చేకూరింది... 2,500 కోట్ల రూపాయలుట ⇒కాజేసిన అసైన్డ్ భూములు 1,848 ఎకరాలు ⇒లాభం 3,234 కోట్ల రూపాయలు కానలలో కనిపించే రాబందులు కళేబరాలను మాత్రమే పీక్కుతింటాయి.. జీవం ఉన్నవాటి జోలికి రావు. రాజధానిలో వాలిన ‘భూ’ రాబందులు బతికి ఉండగానే బడుగురైతులను పీక్కుతింటున్నాయి.. పాపం-పుణ్యం ఆలోచించవు.. బినామీ పేర్లతో రైతుల భూములను బిట్లు బిట్లుగా కాజేసిన భూ బకాసురులు అవి సరిపోక అసైన్డ్, లంక భూములను కాజేయడానికి అంతర్జాతీయ స్థాయి స్కెచ్ వేశారు.. రాజధానిని ప్రకటించి... సమీకరణ నాటకాలు మొదలుపెట్టడానికి మునుపే అసైన్డ్, లంక భూములపై ‘పెద్దలంతా’ కన్నేశారు. పరిహారం ఇవ్వకుండానే లాక్కుంటారన్న ప్రచారాలతో పాటు సామదానభేద దండోపాయాలెన్నో ప్రయోగించారు. రైతులను భయపెట్టి.. వారంతట వారే అయినకాడికి పొలాలు అమ్ముకునేలా చేశారు. అంతా అయ్యాకపరిహారాలు, ప్యాకేజీలు ప్రకటించుకున్నారు. ఐదూపది లక్షలిచ్చి సొంతం చేసుకున్న భూములు ఇపుడు కోట్లు పలుకుతున్నాయి. దళిత రైతులపై కూడా ఇలాంటి మాయోపాయాలే ప్రయోగించి అసైన్డ్ భూములనూ మింగేశారు. ఆ భూముల రిజిస్ట్రేషన్లను ‘చట్టబద్ధం’ చేసేశారు. ఇక జోన్ల పేరుతో చేసిన వంచన మరీ ఘోరం. అంతర్జాతీయ నిపుణులను నియమించి కోట్లు వెచ్చించి ‘మాస్టర్‌ప్లాన్’లు తయారుచేయించారు. బినామీలకు అచ్చివచ్చేలా నచ్చినచోట ఇష్టం వచ్చిన జోన్‌ను ప్రకటించుకున్నారు. వారి భూములున్న చోట్ల ‘డెవలప్మెంట్’ జోన్లు- పక్కా ‘కమర్షియల్’ జోన్లు. పేదరైతుల భూములున్న చోట గ్రీన్ జోన్లు. వారి భూముల ధరలు కోట్లకు చేరుకోగా రైతుల భూముల ధరలు లక్షలకు పడిపోయాయి. ధర లేకపోయినా అమ్ముకోకుండా కఠిన నిబంధనలు, వ్యవసాయం తప్ప మరో కార్యానికి పనికిరాకుండా కండిషన్లు అమల్లోకొచ్చాయి. ఇదీ రాజధాని పేరుతో ‘పెద్దలు’ ఆడుతున్న రాక్షసక్రీడ.. ►రాజధాని ప్రాంతంలోని లంక భూములు, అసైన్డ్ భూములు తొలుత భూ సమీకరణలో లేవు. ►‘భూ’ బకాసురుల కుట్రలు ఫలించే వరకు వాటిని పక్కనుంచారు.. ►పరిహారం ఇవ్వకుండా లాక్కుంటారని అనుచరులతో ప్రచారాలు చేయించారు ►దాంతో నిజమేననుకుని రైతులు భయపడ్డారు. ►భూములను వచ్చిన రేటుకు అమ్మేసుకున్నారు. ►పెద్దలంతా బినామీ పేర్లతో 1249.54 ఎకరాల భూములను సొంతం చేసుకున్నారు. ►ఆ తర్వాత లంక భూముల సమీకరణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ►ఎకరా ధర రూ. 1.75 కోట్లు పలికింది.. ‘పెద్దలు’ రూ. 2,500 కోట్లకు పైగా లాభపడ్డారు. ►అసైన్డ్ భూములూ అంతే.. బినామీ పేర్లతో 1,848 ఎకరాలు కైంకర్యం చేశారు. ►ప్యాకేజీ ప్రకటించిన తర్వాత వాటి ధరలు అమాంతం పెరిగాయి. ►ఎకరా రూ. 1.5కోట్లు నుంచి రూ. 1.75 కోట్లు పలుకుతున్నాయి. ‘పెద్దల’కు రూ. 3,234 కోట్లమేర లబ్ధి చేకూరింది. పేద రైతుల పొట్టగొట్టిన గ్రీన్‌జోన్! ►అమరావతిలో పెద్దలు వేసిన జోన్ల ‘పథకం’ పేద రైతుల పొట్ట కొట్టింది. ►ఎకరా రూ. 4 కోట్లు ఉన్న భూమి ధర రాత్రికి రాత్రి రూ. 40 లక్షలకు పడిపోయింది. ►రూ. 2 కోట్లు పలికిన భూమిని రూ. 20 లక్షలకు కూడా కొనేవాళ్లు లేరు. ►విచిత్రమేమిటంటే పక్కపక్కనే ఉన్న భూములు కూడా ఇలా రకరకాల రేట్లు పలుకుతున్నాయి. ►ఒకరి భూమి కోట్లు పలుకుతుంటే పక్కనే ఉన్న మరొకరి భూమి లక్షలకు కూడా కొనేవారు లేరు. ►రాజధాని భూములను జోన్ల వారీగా వర్గీకరించిన ఫలితమిది. ►ఏ జోన్లో ఏం రాబోతున్నదనే విషయాన్ని గోప్యంగా ఉంచి అనుయాయుల చేత భూములు కొనిపించారు... ► బాబుగారి బినామీల భూములున్న చోట కమర్షియల్ జోన్.. పేదరైతుల భూములున్న చోట అగ్రికల్చర్ జోన్... ►దాంతో బాబుల భూముల ధరలకు రెక్కలొచ్చాయి..అగ్రికల్చర్ జోన్‌లోని పేద రైతుల భూముల ధరలు పడిపోయాయి.. ►పెద్దల ఆర్జన వేల కోట్లకు పెరిగింది.. పేద రైతుల జీవితాలు ఊబిలో దిగబడ్డాయి... అదీ వాళ్ల స్కెచ్. -
22న మాస్టర్ ప్లాన్ తుది నోటిఫికేషన్ విడుదల
విజయవాడ: ఈ నెల 22న మాస్టర్ ప్లాన్ తుది నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 28 నుంచి మార్చి 7 వరకు గ్రామాల వారీగా మాస్టర్ ప్లాన్ నోటిఫైం చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ల్యాండ్ పూలింగ్‌కు భూములిచ్చిన రైతులకు మార్చి 31 నుంచి ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎక్స్‌ప్రెస్ హైవేల కోసం 350 వరకు నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తుళ్లూరు, మందడం గ్రామాల్లో కొన్ని ఇళ్లు తొలగిస్తామని చెప్పారు. ఇళ్ల పరిహారాన్ని ఇంకా ఖరారు చేయలేదని తెలిపారు. మాస్టర్ డవలపర్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. అగ్రికల్చర్ జోన్‌పై అభ్యంతరాలను సోమవారం పరిష్కరిస్తామని చెప్పారు. అసైన్డ్ భూములు కొన్నవారికి కూడా ప్యాకేజీ ఇస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. -
టీడీపీ నేతల గురించి అలా అనలేదు: మంత్రి నారాయణ
విజయవాడ: టీడీపీలోని అందరు నేతలతోనూ తాను మంచి సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. విజయవాడలో ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా తుని ఘటనలో టీడీపీ నేతలు ఉన్నట్లు తాను చెప్పలేదని మంత్రి అన్నారు. రోడ్ల విస్తరణ కారణంగా 1000 ఇళ్లను తొలగించాల్సి ఉందని.. ఈ నెల 15వ తేదీలోగా మాస్టర్ల ప్లాన్ పూర్తి అవుతుందని తెలిపారు. ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్, మాస్టర్ ప్లాన్ కు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇప్పటివరకు 13 గ్రామాల్లో పర్యటించి ఇళ్లు కోల్పోతున్నవారిలో 90 శాతం మందికి నచ్చజెప్పినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్ ఖారారయిన తర్వాతే ఇళ్ల తొలగింపు చేపడతామని నారాయణ పేర్కొన్నారు. ఇళ్లను తొలగిస్తున్నారంటూ ఎమ్మెల్యే ఆర్కే ప్రజలను రెచ్చగొట్టడం సరికాదన్నారు. చెప్పని మాటలు ప్రచారం చేయడం సమంజసం కాదని చెప్పారు. ఒక వర్గానికి తనను దూరం చేసేందుకే తనపై దుష్రచారం చేస్తున్నారంటూ మంత్రి నారాయణ మండిపడ్డారు. -
అమరావతి సాక్షిగా కృష్ణమ్మ కబ్జా
-
అమరావతి సాక్షిగా కృష్ణమ్మ కబ్జా
* ‘బాబు’ల కోసం రాజధానిలో కృష్ణా నది కరకట్టలో మార్పులు * నదిలోకి జరిపేందుకు ప్రతిపాదన.. అక్రమ నిర్మాణాలను రక్షించే ‘ప్లాన్’ * మాస్టర్‌ప్లాన్‌లో కొత్త అలైన్మెంట్తో ముంపు ముప్పు * ప్రకాశం బ్యారేజీపై తీవ్ర ఒత్తిడి.. నిపుణుల హెచ్చరికలు బేఖాతర్ సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: నేరం చేసినా తప్పించుకోవాలంటే... అది నేరం కాదని... మహా పుణ్యకార్యమని అందరినీ ఒప్పించాలి... పనిలో పనిగా అదే నేరం చేసిన తనవాళ్లనందరినీ తప్పించేయాలి... అధికారదండం చేతిలో ఉంటే... అందులోనూ చంద్రబాబు అంతటి వాడే తలచుకుంటే... జనాన్ని నమ్మించడం.. నేరం కాదని నిరూపించడం.. అందరినీ ‘ఒడ్డు’న పడేయడం చిటికెలో పని.. సీఎం చంద్రబాబు రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో ఇపుడు చేస్తున్నదిదే... కృష్ణానది సమీపంలో ఓ అక్రమ నిర్మాణంలో కొలువుదీరిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇపుడు ఏకంగా నదిని కబ్జాచేసి ఆ నిర్మాణానికి అధికారికముద్ర వేయబోతున్నారు. కరకట్టను నదిలోకి జరిపేసేందుకు ‘మాస్టర్ ప్లాన్’ సిద్ధం చేశారు. దీంతో సీఎం నివాసమే కాదు అస్మదీయుల అక్రమ నిర్మాణాలన్నీ సక్రమమైనవిగా మారిపోబోతున్నాయి. తాను ఏరి కోరి కోట్లు పోసి అనేక హంగులు సమకూర్చుకున్న ‘లింగమనేని ఎస్టేట్’ను అక్కడి నుంచి ఎలాగూ కదపలేం కనుక అది అక్రమ నిర్మాణం అనేందుకు కారణమైన కృష్ణానది కరకట్టనే అక్కడి నుంచి నదిలోకి ముఖ్యమంత్రి మార్చేయబోతున్నారు. కరకట్టను లోపలికి జరపడమంటే నదీప్రవాహ ఉరవడికి అడ్డుకట్ట వేయడమేనని, తద్వారా ప్రకాశం బ్యారేజీకి ప్రమాదమని తెలిసినా వెనుకడుగువేయడం లేదు. దీనికి ‘రాజధాని బృహత్ ప్రణాళిక’ అనే అందమైన ముసుగు వేశారు. నదిలోకి జరగనున్న కరకట్ట కృష్ణానది ప్రవాహ దిశ మారకుండా ఉండేందుకు, దిగువ ప్రాంతాలను వరద ముప్పు నుంచి తప్పించేందుకు ప్రకాశం బ్యారేజీకి ఎగువ, దిగువన కుడి, ఎడమ కరకట్టలను దశాబ్దాల కిందట నిర్మించారు. అమరావతి నిర్మాణం నేపథ్యంలో కృష్ణానది ఎడమ కరకట్టను సుమారు 250 నుంచి 400 మీటర్ల లోపలకు నదిలో నిర్మించాలని ‘రాజధాని బృహత్ ప్రణాళిక’లో ప్రతిపాదించారు. దీనిని బట్టి గుంటూరుజిల్లా వెంకటపాలెం- పెనుమాక మధ్యలోని చిగురు బాలల ఆశ్రమం వద్ద నుంచి కొండవీటి వాగు నదిలో కలిసే ప్రాంతం వరకు కరకట్టను లోపలకు నిర్మించనున్నారు. అదే జరిగితే నది వెడల్పు తగ్గడం వల్ల ప్రకాశం బ్యారేజీపై తీవ్ర ఒత్తిడి పడుతుందని నిపుణులంటున్నారు. ఇప్పటికే ప్రమాదకరంగా ఉన్న ప్రకాశం బ్యారేజీకి ముప్పు తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా... రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో అనేక రహస్యాలు ఉన్నాయి. అవి ఒక్కటొక్కటిగా బైటపడుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి మంగళగిరి మీదుగా సీడ్ క్యాపిటల్‌లోకి వెళ్లేందుకు నిర్మించనున్న 60 మీటర్ల రహదారిని మాస్టర్‌ప్లాన్‌లో స్పష్టంగా పొందుపరిచారు. చంద్రబాబు, లోకేష్ తదితరుల నివాసాలకు వెనుక వైపున ఈ రహదారి ఉంటుంది. అయితే దానికి ఆనుకుని కృష్ణానది ఎడమ కరకట్ట ఉన్నదన్న విషయాన్ని ప్రణాళికలో ఎక్కడా సూచించలేదు. కరకట్ట అలైన్మెంట్ మార్పు చేస్తామన్నారే గాని, దానికి కారణాలు కూడా చెప్పలేదు. నూతన అలైన్మెంట్ ఎత్తు, వెడల్పునూ పేర్కొనలేదు. అక్రమ నిర్మాణంగా ఉన్న సీఎం నివాసం సహా అధికార పార్టీ పెద్దలకు చెందిన మొత్తం 22 రకాల నిర్మాణాలకు దూరంగా కృష్ణానది కరకట్టను నదిలోకి జరపడమే ఈ అలైన్మెంట్ మార్పు ఉద్దేశంగా కనిపిస్తోంది. దీనివల్ల ఈ నిర్మాణాలిక సక్రమ నిర్మాణాలుగా మారిపోనున్నాయి. కరకట్ట మారగానే రానున్న హోటళ్లు.. రిసార్టులు.. కరకట్ట సమీపంలో సుమారు 165 ఎకరాల భూమి అనేకమంది బడాబాబుల చేతుల్లో ఉంది. భూసమీకరణలో ప్రభుత్వానికి 20 ఎకరాలు మాత్రమే ఇచ్చారు. మిగిలినవారు భూములివ్వబోమంటూ అభ్యంతర పత్రాలను సమర్పించారు. కొత్త ప్రతిపాదనల ప్రకారం కరకట్టను నది లోపలకు మార్చి నిర్మించనున్నందున చంద్రబాబు, లోకేష్‌లు ఉంటున్న నివాసాలతో పాటు బడాబాబులకు చెందిన భూములు కూడా సక్రమమైనవిగా బయటపడతాయి. ఆ ప్రాంతాన్ని మాస్టర్‌ప్లాన్‌లో ‘పి2’ ‘ఎస్2’ కింద చూపారు. ఇందులో హోటళ్లు, రిసార్టులు, విద్యా సంస్థలు రానున్నాయి. ఇక్కడ భూమి కలిగిన ఓ ప్రజాప్రతినిధి భవిష్యత్తులో ఓ పెద్ద వైద్య కళాశాలను నిర్మించాలన్న ఆలోచనతో ఉన్నారని సమాచారం. తాను ప్రభుత్వానికి కొంత భూమి ఇచ్చినందున ప్రత్యామ్నాయంగా ఇక్కడే భూమి ఇవ్వాలని ఆ నేత డిమాండ్ చేస్తున్నారట. ఆర్సీ చట్టం ఏం చెబుతోందంటే..? కృష్ణా, గోదావరి నదుల పరిరక్షణ కోసం బ్రిటిష్ ప్రభుత్వం 1884లో రివర్ కన్జర్వేషన్ (ఆర్సీ) చట్టం చేసింది. దీని ప్రకారం గవర్నర్ జనరల్, కలెక్టర్, ఆర్సీ అధికారికి అధికారాలున్నాయి. ఈ చట్టం ప్రకారం నదుల ప్రవాహానికి అవరోధాలు కలిగించే ఎలాంటి నిర్మాణాలూ చేపట్టకూడదు. నదిలోపలి లంక భూముల్లోనూ నదీ ప్రవాహానికి ఆటంకం కలిగించే ఎలాంటి నిర్మాణాలూ చేపట్టరాదు. పంటలు కూడా వేయరాదు. నదీ ప్రవాహం గట్టును కోసేస్తూ వ్యక్తుల ప్రాణాలకు, ఆస్తులకు హాని కలిగిం చే విధంగా మారితే ఆర్సీ అధికారి నివారణా చర్యలు చేపట్టాలి. కలెక్టర్‌కు సమాచారం ఇవ్వాలి. ఆటంకం కలిగించేవారిపై చర్యలు తీసుకోవాలి. చట్టాన్ని ఉల్లంఘించేవారిపై క్రిమినల్ చర్యలూ చేపట్టవచ్చు. కరకట్టకు లోపల ఎందరో ప్రముఖులు... కృష్ణా కరకట్ట లోపల అంటే నదీ ప్రవాహ ప్రాంతంలో అనేకమంది ప్రముఖుల నివాసాలున్నాయి. సీఎం చంద్రబాబు.. లింగమనేని రమేష్‌కు చెందిన ఇంటిని అధికారిక నివాసంగా మార్చుకోగా, ఆయన కుమారుడు లోకేశ్.... అప్పారావు అనే ఎన్నారైకి చెందిన గృహంలో ఉంటున్నారు. వీరితో పాటు బీజేపీకి చెందిన నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, కాంగ్రెస్ నేత- సినిమా నటుడు చిరంజీవి, తెదేపా నేతలు కోమటి బ్రదర్స్, చైతన్య విద్యాసంస్థల యజమాని బి.ఎస్.రావు, పాతూరి నాగభూషణం, చందన బ్రదర్స్, బొప్పన బ్రదర్స్, లక్కిరెడ్డి బ్రదర్స్, డాక్టర్ రమేష్ తదితరుల నివాసాలు ఉన్నాయి. ఇక్కడే గణపతి సచ్చిదానంద ఆశ్రమంతో పాటు ఇతర ఆధ్యాత్మిక కేంద్రాలున్నాయి. మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి చికిత్సాలయమూ ఇక్కడే ఉంది. కరకట్ట లోపల నిర్మాణాలన్నీ అనుమతి లేని నిర్మాణాలేనని, అవి ఆర్సీ చట్టానికి విరుద్ధమని ప్రభుత్వమే పలు సందర్భాలలో ప్రకటించింది. ఆర్సీ చట్టం కింద రాష్ర్టప్రభుత్వం గత ఏడాది మార్చిలో 25 మందికి నోటీసులు కూడా జారీ చేసింది. -
ప్రభుత్వంపై తిరగబడుతున్న రైతులు
-
'రాజధాని మాస్టర్‌ప్లాన్' సదస్సును అడ్డకున్న రైతులు
గుంటూరు: గుంటూరు జిల్లాలోని తుళ్లూరులో గురువారం రాజధాని మాస్టర్‌ప్లాన్‌పై అవగాహన సదస్సును అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సదస్సును తుళ్లూరు రైతులు అడ్డుకున్నారు. హామీలు నెరవేర్చేవరకు సదస్సు జరపడానికి వీల్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతకాలం మోసం చేస్తారంటూ అధికారులను రైతులు నిలదీశారు. -
'ఎన్ని సభలు నిర్వహించినా అడ్డుకుంటాం'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని మాస్టర్‌ప్లాన్ అవగాహన సదస్సుపై గుంటూరు జిల్లాల్లో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. బుధవారం మంగళగిరి మండలం ఎర్రబాలెంలో అవగాహన సదస్సును అక్కడి గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామకంఠాలను కదిలించేది లేదని అధికారులు చెప్పేవరకు.. ఎన్ని సభలు నిర్వహించినా తాము అడ్డుకుంటామని అధికారులకు ఎర్రబాలెం గ్రామస్తులు స్పష్టం చేశారు. -
జరీబు రైతు గరం..గరం..
భూములు ఇచ్చిన చోటే స్థలాలు ఇవ్వాలి.. లేకుంటే రాజధాని నిర్మాణ పనులను సాగనివ్వం అప్పుడు ఇంటింటికీ తిరిగిన మంత్రులు ముఖం చాటేశారు.. ఇప్పుడు వస్తున్న అధికారుల హామీలను ఎలా నమ్మాలి.. ప్రభుత్వ వైఖరిపై మండిపడిన రైతు సంఘం నేతలు ఉద్దండ్రాయునిపాలెంలో సీఆర్డీఏ కమిషనర్‌పై ప్రశ్నలు గుప్పించిన గ్రామస్తులు, మహిళలు గుంటూరు : రాజధాని మాస్టర్ ప్లాన్ అవగాహన సదస్సుల్లో అధికారులు ఎన్ని మాయమాటలు చెబుతున్నా, జరీబు రైతులు వెనుకంజ వేయడం లేదు. తాము ఏ గ్రామంలో భూములు ఇచ్చామో అక్కడే స్థలాలు ఇవ్వాలని, లేకుంటే ప్రభుత్వ ప్రయత్నాలు ముందుకు సాగనిచ్చేది లేదంటున్నారు. అవసరమైతే రాజధానిని వేరే ప్రాంతానికి తరలించుకోండని అధికారులను హెచ్చరిస్తున్నారు. అవగాహన సదస్సులకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు రావాల్సిందేనని పట్టుబడుతున్నారు. రాజధాని భూ సమీకరణకు సహకరించిన టీడీపీ నేతలు కూడా ప్రభుత్వ తీరుకు ఆవేదన చెందుతున్నారు. తమ మాటలు నమ్మి రైతులు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారని, ఇప్పుడు ప్రభుత్వం రోజుకో మాట చెబుతుంటే, రైతులకు సమాధానం చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నామని, గ్రామాల్లో తిరగలేకపోతున్నామని టీడీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాస్టర్‌ప్లాన్ అవగాహన సదస్సుల్లో రైతులు తిరుగుబాటు చేయడంతో సీఆర్డీఏ కమిషనర్ ఎన్. శ్రీకాంత్ ఆదివారం తుళ్ళూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి, రైతుల సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. అయితే ఉద్దండ్రాయునిపాలెంలో రైతు సంఘనేత అనుమోలు సత్యనారాయణ, ఎంపీపీ వడ్లమూడి పద్మలత, జెడ్పీటీసీ బెజవాడ నరేంద్రలు ఫ్రభుత్వ వైఖరిపై తీవ్రంగా స్పందించారు. భూ సమీకరణ సమయంలో ఇంటింటికీ తిరిగిన మంత్రులు ఇప్పుడు అవగాహన కార్యక్రమాలకు హాజరుకావడం లేదని, అప్పుడు జరీబు ప్రాంతంలోనే స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కనిపించడం లేదని, ఇప్పుడు అధికారులు ఇచ్చే హామీలను ఎలా నమ్మాలని ప్రశ్నించారు. ప్రతీ అంశానికి చట్టబద్ధత కల్పించాలని, మాస్టర్‌ప్లాన్‌ను తెలుగు లోకి అనువదించి అందరికీ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్‌లో రోడ్ గ్రిడ్ ఏర్పాటుతో అనేక గ్రామాల్లోని ఇళ్లు, నివేశన స్థలాలు పోయే పరిస్థితి ఉంటే, వాటికి సమాధానం చెప్పకుండా ఇలా ఎన్ని సమావేశాలు ఏర్పాటు చేసినా ఉపయోగం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు కార్యక్రమాన్ని త్వరగా ముగించి వెళ్ళిపోయారు. -
మా బతుకులు మమ్మల్ని బతకనీయండి
రాజధాని మాస్టర్‌ప్లాన్‌పై రైతుల అభ్యంతరం పునాదిపాడుని రెసిడెన్షియల్ జోన్లోనే ఉంచాలంటూ వినతి పునాదిపాడు (కంకిపాడు) : రాజధాని మాస్టర్ ప్లాన్‌తో మా బతుకుల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. మాస్టర్ ప్లాన్‌లో మార్చండి...రెసిడెన్షియల్ జోన్‌గా కొనసాగించి మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి...అంటూ పునాదిపాడు రైతులు తహశీల్దార్‌కు విజ్ఞప్తిచేశారు. పునాదిపాడు పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో పునాదిపాడు, గొల్లగూడెం గ్రామాలకు చెందిన రైతులు సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రైతు ప్రతినిధులు మద్దాలి తిరుమలరావు, మద్దాలి సాయిబాబు తదితరులు మాట్లాడుతూ గ్రామంలో 1686 ఎకరాల ఆయకట్టులో 650 ఎకరాల్లో ఇళ్లు, ఫ్లాట్లు ఏర్పడ్డాయన్నారు. 1036 ఎకరాల్లో సాగు జరుగుతుందన్నారు. 2008 ఉడా మాస్టర్ ప్లాన్‌లో జీవో నెంబరు 387 ప్రకారం పునాదిపాడుతో సహా ఉయ్యూరు వరకూ రెసిడెన్షియల్ జోన్‌గా ప్రకటించారన్నారు. స్టాంపు డ్యూటీ రూ 50 లక్షలకు పెంచారన్నారు. చెన్నై-విశాఖ కారిడార్‌లో కంకిపాడు క్లస్టరులో 3200 ఎకరాలు పేర్కొంటూ కేంద్రం వద్ద జాబితాలు ఉన్నాయని, కారిడార్ పేరుతో ఇళ్లు, పొలాలు ఖాళీ చేయాలని ఒత్తిడి తెచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. అభివృద్ధి పేరుతో పొలాలు తీసుకుని నామ మాత్రపు పరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులిపేసుకుందన్నారు. అగ్రికల్చర్ జోన్ 1లో గ్రామాన్ని చేర్చటం వల్ల అభివృద్ధిలో వెనుకబడి పోతుందన్నారు. కొనుగోలుదారులు లేక, భూమిని నమ్ముకున్న రైతులు ఇబ్బందులో పడే ప్రమాదం ఉందన్నారు. తహశీల్దార్‌కు వినతి రైతులు ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహశీల్దార్ రోజాకు వినతిపత్రాన్ని అందించారు. రైతులు మాట్లాడుతూ సొంత పొలాల్లో రైతులు ఇళ్లు కట్టుకోవాలంటే అనుమతులు ఎలా ఉంటాయో వివరించాలని కోరారు. రైతులు నష్టపోకుండా పునాదిపాడు గ్రామాన్ని రెసిడెన్షియల్ జోన్ గా కొనసాగించాలని విజ్ఞప్తిచేశారు. రైతుల వినతులపై స్పందించిన తహశీల్దార్ రోజా మాట్లాడుతూ మండలం వ్యాప్తంగా రైతుల నుంచి వచ్చిన అభ్యర్థలను పరిశీలించి సీఆర్డీఏకు నివేదిక పంపుతామన్నారు. రైతులకు అన్యాయం జరగకుండా తమ వంతు కృషి చేస్తామని వివరించారు. కార్యక్రమంలో సర్పంచి జంపని వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచి ముసిబోయిన వెంకటేశ్వరరావు, రైతు ప్రతినిధులు పీ.సుగుణమూర్తి, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, అనుమోలు శ్రీను, ఆర్.నాగేంద్రబాబు, యార్లగడ్డ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
2050 అవసరాలకు అనుగుణంగా మాస్టర్‌ప్లాన్
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 54 మండలాలకు సీఆర్డీఏ విస్తరణ సాక్షి, విజయవాడ బ్యూరో: మాస్టర్ ప్లాన్‌ను రాజధాని ప్రాంతం 2050 నాటి అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. దీని ప్రకారం కృష్ణా జిల్లాలో 29, గుంటూరు జిల్లాలో 25 కలిపి మొత్తం 54 మండలాల్లో సీఆర్డీఏ విస్తరించనుంది. రాజధాని 29 గ్రామాల్లో విస్తరించనుంది. మూడు గ్రామాల్లోని 16 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని పరిపాలనపరమైన (సీడ్ కేపిటల్) ప్రాంతాన్ని నిర్మించనున్నారు. సీఆర్డీఏ విస్తరించబోయే ప్రాంతాల్లో... కృష్ణా జిల్లాలోని ఆగిరిపల్లి, బాపులపాడు, చల్లపల్లి, చందర్లపాడు, జి.కొండూరు, గన్నవరం, ఘంటసాల, గుడివాడ, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల, కంకిపాడు, మోపిదేవి, మొవ్వ, మైలవరం, నందిగామ, నందివాడ, నూజివీడు, పామర్రు, పమిడిముక్కల, పెదపారుపూడి, పెనమలూరు, తోట్లవల్లూరు, ఉంగుటూరు, వత్సవాయి, వీరులపాడు, విజయవాడ అర్బన్, విజయవాడ రూరల్, ఉయ్యూరు మండలాలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలోని అమరావతి, అమృతలూరు, అచ్చంపేట, భట్టిప్రోలు, చేబ్రోలు, దుగ్గిరాల, యడ్లపాడు, గుంటూరు, కొల్లిపర, కొల్లూరు, క్రోసూరు, మంగళగిరి, పెద్దకూరపాడు, పెద్దకాకాని, ఫిరంగిపురం, పొన్నూరు, ప్రత్తిపాడు, సత్తెనపల్లి, తాడేపల్లి, తాడికొండ, తెనాలి, చుండూరు, తుళ్లూరు, వట్టి చెరుకూరు, వేమూరు మండలాలను కలిపారు. -
జాబ్‌మేళాకు విశేష స్పందన
తుళ్ళూరు రూరల్ : ఆంధ్రప్రదేశ్ స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతంలోని తుళ్ళూరులో బుధవారం నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. పంచాయతీ కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటైన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో పలు నియామకాలకు నిర్వహించిన జాబ్‌మేళాకు 238 మంది యువతీయువకులు హాజరయ్యారు. వీరిలో146 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఓడీపీఎస్ఎస్ సెక్యూరిటీ సర్వీసెస్‌లో 26 మంది, నవత ట్రాన్స్‌పోర్టులో 21మంది, ఏజీస్ గ్లోబల్ సర్వీసెస్‌లో 45 మంది, ఐసీఐసీఐ బ్యాంకులో సేల్స్ఆఫీసర్లుగా 46 మంది ఎంపిక య్యారు. ఇతర విభాగాలలో శిక్షణ నిమిత్తం మరో 92 మందిని ఎంపిక చేసినట్లు ఆంధ్రప్రదేశ్ స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ జాబ్స్ సిటీ మేనేజర్ షేక్మీరావలి చెప్పారు. కార్యక్రమంలో సీఆర్డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రహంతుల్లా, సోషల్ డెవలప్మెంట్ డెరైక్టర్ జయదీప్, క్యాంపస్ అడ్మిన్ అధికారి అజయ్‌చౌదరి, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
రాజధాని ప్రాంతంలో మట్టి, నీరు జల్లిన సీఎం
మిగిలిన మట్టి, నీటితో 25 ఎకరాల్లో స్మారక కట్టడం సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలోని గ్రామాలు, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి పూజలు చేసి తెచ్చిన మట్టి, నీటిని బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు హెలీకాప్టర్ నుంచి రాజధాని ప్రాంతంలో చల్లారు. శంకుస్థాపన ప్రాంగణంలోనూ వాటిని చల్లారు. హెలీకాప్టర్ నుంచి వీటిని చల్లడానికి వెళ్లేముందు ఉండవల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తున్న రాజధాని అమరావతిని ప్రపంచంలోనే పది అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. భారతదేశంతో పాటు క్రీస్తు జన్మస్థలం జెరూసలెం, మహ్మద్ ప్రవక్త జన్మస్థలం మక్కా, మహాత్మా గాంధీ, నెహ్రూ, బీఆర్ అంబేడ్కర్, భగత్‌సింగ్ వంటి గొప్ప వ్యక్తులు జన్మించిన ప్రాంతాల నుంచి ఈ మట్టి, నీటిని సేకరించామన్నారు. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం, కశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయ ప్రాంగణం, మానససరోవర్, అజ్మీర్ దర్గా, మౌంట్ అబు, తిరుమల బంగారు బావి నుంచి సేకరించిన మట్టి, జలాలను తీసుకొచ్చామని చెప్పారు. అలాగే రాష్ట్రంలోని 13 వేల గ్రామాల నుంచి మట్టి, జలాలు పూజలు, ప్రార్థనలతో తీసుకువచ్చినట్లు తెలిపారు. వీటన్నింటినీ కలిపి రాజధాని ప్రాంతమంతటా చల్లడం వల్ల ఆయా పవిత్ర స్థలాలు, పుణ్య క్షేత్రాల పవిత్రత అమరావతిపై ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఇలా చల్లగా మిగిలిన, మట్టి, నీటితో 25 ఎకరాల్లో అద్భుతమైన స్మారక కట్టడాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు వెల్లడించారు. శంకుస్థాపన పూర్తయిన వెంటనే రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామన్నారు. సమాచార వ్యవస్థను మెరుగుపరుస్తామని, భారీ నిర్మాణాలకు అనువుగా భూమిని పొక్లెయిన్లు, రోలర్లతో చదును చేయిస్తామని సీఎం చెప్పారు. -
శంకుస్థాపన వేదిక వద్ద పటిష్ట భద్రత
ప్రాంగణంలో నిఘా పెంచిన ప్రభుత్వం వేదిక వద్ద ఎంఐపీ, వీవీఐపీ, మీడియా గ్యాలరీ ఏర్పాటు తాడికొండ : అమరావతి రాజధాని ప్రాంతంలో ఉద్దండ్రాయునిపాలెంలో అంతర్జాతీయ స్థాయిలో చేపట్టిన రాజధాని నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఉన్నతాధికారులు గట్టి భద్రతా చర్యలు చేపడుతున్నారు. దేశ ప్రధానితో సహా సింగపూర్, జపాన్ దేశాల ప్రముఖులు రానున్నందున శంకుస్థాపన వేదిక వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నారు. డాగ్‌స్క్వాడ్ వేదికపై పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టారు. బీఫ్ శబ్ధంతో కంగారుపడ్డ అధికారులు ఒక దశలో వేదిక వద్ద మిషన్లకు బీప్ శబ్దం రావటం తో కంగారుపడి మొత్తం పరిశీలించారు. అనంతరం ఇనుపముక్క ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. వేదిక కింద మోస్ట్ వీఐపీ, వీవీఐపీలతో పాటు మీడి యా గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. లక్ష మంది సాధారణ ప్రజలు కూర్చునేందుకు పందిళ్లు సిద్ధం చేస్తున్నారు. 50 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు శంకుస్థాపన వేదిక సమీపంలోనే సాధారణ ప్రజలు వచ్చే వాహనాలు నిలిపేందుకు 50 ఎకరాల పొలం లో పార్కింగ్ ఏర్పాటుచేస్తున్నారు. పార్కింగ్‌ల బాధ్యతను గృహ నిర్మాణశాఖ అధికారులకు అప్పగించారు. ఈ సారి వేదికకు కేవలం 200 మీటర్ల దూ రంలోనే సాధారణ ప్రజల వాహనాల పార్కింగ్ స దుపాయం కల్పిస్తున్నారు. ప్రధాని కోసం ఏర్పాటు చేసే హెలిప్యాడ్ ప్రాంతంలో పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు. -
20 ఎకరాల్లో టౌన్షిప్
సాక్షి, హైదరాబాద్: తక్షణ అవసరాలైన సర్కారు కార్యాలయాలు, వాణిజ్య అవసరాల కోసం 20 ఎకరాల్లో అమరావతి టౌన్షిప్ నిర్మాణం చేపట్టాలని కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ప్రైవేట్ సంస్థతో సంయుక్త డెవలపర్ విధానంలో నిర్మాణాలను చేపట్టాలని సీఆర్డీఏ ప్రతిపాదించింది. సంయుక్త డెవలపర్ విధానంలో ఆ 20 ఎకరాలను ప్రైవేట్ సంస్థకు 99 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని, ఇందులో సీఆర్డీఏకు కొద్దిపాటి వాటా ఉంటుందని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. తక్షణం నూతన రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవాలంటే వీలైనంత త్వరగా అమరావతి నుంచే పరిపాలన సాగాలని, ఇందుకు అవసరమైన ప్రభుత్వ శాఖలు, వాటిల్లోని ఉద్యోగులను అమరావతికి తరలించాలని సీఆర్డీఏ పేర్కొంది. ఉద్యోగులను తరలించాలంటే కనీసం ఐదు లక్షల చదరపు అడుగుల్లో కార్యాలయాల, వాణిజ్య కార్యకలాపాలకోసం నిర్మాణాలు చేయాల్సి ఉందని సీఆర్డీఏ తెలిపింది. ఇందుకు ప్రభుత్వానికి మూడు ప్రతిపాదనలను పంపించింది. 20 ఎకరాల్లో సీఆర్డీఏ కోసం ఆ ఐదు లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలను సంయుక్త డెవలపర్‌గా ఉండే ప్రైవేట్ సంస్థ చేపడతుంది. దానికి ప్రతిఫలంగా ఆ ప్రైవేట్ సంస్థకు 10 ఎకరాల్లోని డెవలప్మెంట్ను విక్రయించుకునే హక్కు ఇవ్వనున్నారు. అయితే 99 సంవత్సరాల పాటు లీజు విధానంలోనే ఆ విక్రయాలు ఉండాలనే నిబంధన విధించనున్నారు. లేదంటే సీఆర్డీఏకు అవసరమైన నిర్మాణాల కోసం రూ. 15 కోట్లు సొంత నిధులనే వెచ్చించడం. ఇక మూడో ప్రతిపాదనగా.. సంయుక్త డెవలపర్ విధానంలోనే ఆ 20 ఎకరాలను 99 సంవత్సరాల పాటు లీజుకు ఇస్తూ ప్రైవేట్ డెవలపర్‌ను ఎంపిక చేయడం. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపట్టాలని సీఆర్డీఏ భావిస్తోంది. తక్షణ అవసరాల కోసం నిర్మించే ఆ భవంతుల్లో 10 వేల మంది ఉద్యోగుల పనిచేయడానికి వీలు కలుగుతుందని సీఆర్డీఏ పేర్కొంది. -
నేడు రాజధానిలో పవన్ పర్యటన
-
నేడు రాజధానిలో పవన్ పర్యటన
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం బలవంతంగా భూమి సేకరించనున్న ప్రాంతాల్లో ఆదివారం జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం చేపట్టదలచిన బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పవన్‌కల్యాణ్ కొద్ది రోజులుగా ట్విట్టర్లో స్పందిస్తున్నారు. తాజా పరిస్థితుల్లో రాజధాని ప్రాంతంలో మూడు పంటలు పండే ప్రాంతాలైన ఉండవల్లి, పెనుమాక తదితర గ్రామాల్లో పవన్ పర్యటించనున్నారు. గతంలో కూడా పవన్ రాజధాని ప్రాంతాలను సంద ర్శించారు. పర్యటన అనంతరం పవన్ హైదరాబాద్‌కు వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను కలసి భూసేకరణ తీరును వివరించే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలిపాయి. -
ప్రైవేట్ భవనాల్లో ప్రభుత్వ ఆఫీసులు
విజయవాడ, గుంటూరు, నూజివీడులో ఏర్పాటు ఉద్యోగులు, అధికారులకు వసతి సౌకర్యాలు హరిత హోటల్లో మంత్రులకు సూట్లు తిలోత్తమ హోటల్లో ఐఏఎస్, ఐపీఎస్‌లకు వసతి త్వరలో అద్దెలు పెంపు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఉద్యోగుల తరలింపులో భాగంగా శాఖల కార్యాలయాలను ప్రైవేట్ భవనాల్లోనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వసతుల గుర్తింపునకు ఏర్పాటు చేసిన కమిటీ ప్రభుత్వానికి తాజాగా ప్రజంటేషన్ ఇచ్చింది. విజయవాడ, గుంటూరు, నూజివీడులో శాఖల కార్యాలయాలకు ప్రైవేట్ భవనాలను అద్దెకు తీసుకోవాలని సూచించింది. ఈ వివరాలను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం మీడియాకు వెల్లడించారు. ప్రైవేట్ భవనాల అద్దెలను సవరించాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతం అద్దెలు తక్కువగా ఉన్నాయని, వీటిని త్వరలోనే పెంచనున్నట్లు తెలిపారు. భవానీపురంలోని హరిత హోటల్లో 25 సూట్ల(విలాసవంతమైన గదులు)ను మంత్రులకు కేటాయించనున్నారు. అలాగే విజయవాడలోని తిలోత్తమ హోటల్లో 53 గదులను ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కేటాయిస్తారు. ప్రైవేట్ భవనాలను ఏకపక్షంగా అద్దెకు తీసుకోరాదని కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. భవనాలను అద్దెకు ఇచ్చేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని పేర్కొంది. ప్రైవేట్ భవనాల అద్దెలను యజమానులకు ఆమోదయోగ్యమైన రీతిలో నిర్ధారించాలని కమిటీ సూచించింది. కార్యాలయాలు, ఉద్యోగులు, అధికారుల వసతి వివరాలు... ►గన్నవరం మేధా టవర్స్‌లోని నాలుగు అంతస్తుల్లో 1,40,000 చదరపు అడుగుల వసతి. మేధా టవర్స్‌ను ఎస్ఈజెడ్(సెజ్) పరిధి నుంచి డీనోటిఫై చేయాలి. ► విజయవాడ సబ్ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న గోకరాజు రంగరాజుకు చెందిన ఆరు అంతస్తుల భవనంలో 2,36,264 చదరపు అడుగుల వసతి ► గన్నవరం జాతీయ రహదారి సమీపంలోని గెస్ట్‌హౌస్‌లో 2,500 చదరపు అడుగులు ►ఐఐఐటీ-నూజివీడులో 144 గదుల్లో 1,14,048 చదరపు అడుగుల వసతి ► ఎస్టీ బాలుర హాస్టల్లో 13 గదుల్లో 5,184 చదరపు అడుగుల వసతి ► కుష్టు వ్యాధి ఆసుపత్రి ఐదు భవనాల్లో 18,738 చదరపు అడుగుల వసతి ► ఒక్కో ఉద్యోగికి 100 చదరపు అడుగుల చొప్పున వసతి అవసరం ►ఉద్యోగుల నివాసాల కోసం 1.5 కోట్ల చదరపు అడుగుల వసతి అవసరం. -
కలలా వారధి
నేటికీ ప్రారంభంకాని కృష్ణానదిపై వంతెన పనులు వెంకటపాలెం నుంచి గొల్లపూడి వరకు నిర్మాణం రూ. 1940 కోట్ల వ్యయంతో టెండర్ అప్పగింత 30 నెలల్లో పూర్తి చేయాలని నిబంధనలు ఏడాది పూర్తవుతున్నా పునాదికి నోచని వైనం రెండు జిల్లాలకు వారధి.... మూడు కిలోమీటర్లకు పైగా వంతెన... దాదాపు రూ.1940 కోట్ల వ్యయం... టెండర్ అప్పగించి ఏడాది. నేటికీ పనులు ప్రారంభి ంచని సంస్థ...కిమ్మనని ప్రభుత్వం... రాజధాని ప్రాంతంలో ప్రజల ఎదురు తెన్నులు..నిర్మాణం పూర్తవుతుందా లేదా... ప్రారంభమే లేని చోట కార్యరూపం దాల్చ గలదా అనే సందేహం... చివరకు ప్రారంభానికి నోచని ప్రాజెక్టుగా మిగులుతుందా అనే అనుమానం..! తాడికొండ: అమరావతి రాజధాని ప్రాంతంలో కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ, ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు గత ఏడాది ప్రభుత్వం మంజూరు చేసిన కృష్ణానదిపై వంతెన నిర్మాణం నేటికీ ప్రారంభమే కాలేదు. గత ఏడాది సెప్టెంబరులో తుళ్లూరు మండలం వెంకటపాలెం 6/0 కిలోమీటరు వద్ద నుంచి కృష్ణాజిల్లా గొల్లపూడి వద్ద కృష్ణానదిపై 3 కిలోమీటర్ల 100 మీటర్ల పొడవ ునా వంతెన నిర్మించేందుకు ప్రభుత్వం రూ.1940 కోట్లతో టెండరు పిలిచింది. గామన్ఇండియా సంస్థ ఈ టెండరును దక్కించుకుంది. 30 నెలల్లో వంతెన నిర్మాణం పూర్తి చేయాలన్న నిబంధన ఉన్నప్పటికీ నేటి వరకు పనులే ప్రారంభించలేదు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా పనులు మొదలు పెట్టలేదని సమాచారం. దీనిపై నేషనల్హైవే అధికారులు సదరు సంస్థకు షోకాజ్ నోటీసులు ఇవ్వగా ఆస్ట్రేలియా కంపెనీతో కలసి త్వరలో పనులు ప్రారంభిస్తామని తిరుగు సమాధానం ఇచ్చినట్టు సమాచారం. ఆస్ట్రేలియా కంపెనీ దేశంలో ఇప్పటికి 9 చోట్ల ఇటువంటి వంతెన నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసింది. దీంతో ఆ కంపెనీతో కలసి పనిచేసేందుకు గామన్ ఇండియా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వంతెన నిర్మాణానికి కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు 90 శాతం భూములు కూడా ఇచ్చారు. నిర్మాణ వ్యయం రూ.1940 కోట్లలో రూ.300 కోట్లు భూములు ఇచ్చిన రైతులకు పరిహారం అందించారు. కొందరు రైతులు మాత్రం భూసమీ కరణను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. వారికి సంబంధించిన ప్యాకేజీ కూడా ఉన్నతాధికారుల వద్ద డిపాజిట్ చేశారు. అయితే నేటికీ వంతెన నిర్మాణం కార్యరూపం దాల్చలేదు. మాస్టర్ ప్లాన్‌లో మరో రెండు వంతెనలు అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా మరో రెండుచోట్ల కృష్ణానదిపై వంతెనలు నిర్మించేందుకు మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచారు. తుళ్లూరు మండలం లింగాయపాలెం నుంచి ఇబ్రహీంపట్నం వరకు, అమరావతి నుంచి చెవిటికల్లు వరకు వంతెన నిర్మాణాలు చేపట్టనున్నారు. ప్రభుత్వం వంతెన నిర్మాణాలు చేపడితే గుంటూరు-కృష్ణా జిల్లాల మధ్య పడవ ప్రయాణాలు తప్పుతాయి. -
భూసేకరణ బూచి చూపితే భయపడం
- అసలు చట్టమైతే కదా...సేకరణ - ప్రజలకు న్యాయం చేసి ముందుకెళ్లండి: ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరి: రాజధాని ప్రాంతంలో ఈ నెల 20 నుంచి భూసేకరణ చేస్తామని రాష్ట్రమంత్రి పి.నారాయణ ప్రకటించడం రైతులను భయపెట్టడం, మోసగించడమేనని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆరోపించారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. కేంద్రప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని పార్లమెంటు ఉభయసభల్లో గట్టెక్కించలేక మార్పులు, చేర్పులపై పునరాలోచనలో పడిన నేపథ్యంలో నారాయణ ఇలా ప్రకటించడాన్ని ఆయన ఆక్షేపించారు. ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ బలవంతంగా భూసేకరణ చేయలేదని స్పష్టమైందని, ఒకవేళ అంతకు తెగిస్తే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద రైతులు, కూలీలకు అండగా నిలుస్తారని ఆర్కే పేర్కొన్నారు. రైతులందరి ఆమోదంతోనే ప్రజారాజధాని రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని,అందుకు భిన్నంగా జరిగితే అలు పెరగని పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. గతి తప్పిన హామీలు... ఇప్పటి వరకు సంపూర్ణ రుణమాఫీ జరగలేదు. పొలాలు ఇచ్చిన రైతులకు కౌలు చెక్కులు పూర్తిగా ఇవ్వనేలేదని ఎమ్మెల్యే విమర్శించారు. దేవాదాయ భూములను నేరుగా స్వాధీనం చేసుకునే అధికారం లేనప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుందని, అటవీ భూములను కేంద్రప్రభుత్వం ఇప్పటివరకు డీనోటిఫై చేయలేదన్నారు. లంక భూములు, అసైన్డ్ భూముల రైతులకు పరిహారం అందజేస్తామని చెప్పినా ఇంతవరకు అమలు కాలేదన్నారు. కౌలురైతుల లెక్కింపు, వ్యవసాయ కూలీల వివరాలు నమోదు చేయకపోగా అర్హులను జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాలకు చెందిన వందలమంది కూలీలు, వ్యవసాయాధారిత చేతివృత్తుల వారి గురించి అసలు పట్టించుకొనకపోగా 9.2, 9.3 ఫారాలు ఇచ్చి న్యాయస్థానం మెట్లెక్కిన రైతులను మోసగించేందుకు రాష్ట్రప్రభుత్వం ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. భూములిచ్చిన రైతుల కోసం ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ప్రకారం... భూమి ఎక్కడ.. ఎప్పుడిస్తారో ఇప్పటివరకు స్పష్టం చేయలేదన్నారు. కొండవీటి వాగును ఏం చేస్తారు? రాజధాని అమరావతి దుఃఖదాయని అయిన కొండవీటి వాగును మరల్చడం, వాగు ముం పు లేకుండా చేపట్టాల్సిన ప్రణాళికలను ఇప్పటికీ ప్రభుత్వం సిద్ధం చేయలేదని ఎమ్మెల్యే ఆర్కే గుర్తుచేస్తూ... తమ సొంత లాభాల కో సం హడావు డిగా సీడ్ క్యాపిటల్ అని, మాస్టర్ ప్లాన్ అని కొత్తకొత్త పదాలతో ప్రజలను మోసగిస్తోందని దుయ్యబట్టారు. కృష్ణాతీరంలో అక్రమ కట్టడాలని ప్రకటించిన వాటిని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం సక్రమ కట్టడాలుగా మార్చుకుని, వాస్తు పిచ్చితో వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. -
త్వరితంగా నిర్మాణం
రాజధాని కోసం కార్యాచరణ {పణాళిక రూపొందించాలి సలహా కమిటీ సభ్యుల నిర్ణయం కార్యాలయాల తరలింపు వేగిరపరచాలన్న మంత్రి హైదరాబాద్: నూతన రాజధాని నిర్మాణాన్ని వీలైనంత త్వరలో పూర్తి చేసేందుకు నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను రూపొం దించాలని రాజధాని నగర సల హా కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే సింగపూర్ నుంచి సీడ్ కేపిటల్ ప్రణాళిక అందినందున ఇక త్వరితగతిన నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. ఆదివారం సచివాలయంలో పురపాలకశాఖ మంత్రి డా. పి.నారాయణ అధ్యక్షతన సలహా కమిటీ సభ్యులు బీద మస్తాన్‌రావు, జీఎంఆర్ గ్రూప్ ప్రతినిధి బొమ్మిడాల శ్రీనివాస్, నూజివీడు సీడ్స్ అధినేత ఎం.ప్రభాకరరావు, పీపుల్స్ కేపిటల్ ప్రతిని ధి సీహెచ్ శ్రీనివాసరాజు తదితరులతో సమావేశమయ్యారు. సింగపూర్ ప్రతినిధులు మాస్టర్ ప్లాన్ అందించిన తర్వాత తొలిసారి కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాజధాని నిర్మాణంతో పాటు భూములిచ్చిన రైతుల అంశాలు ప్రస్తావించారు. రాజధానికోసం విజయవాడ, గుం టూరు పరిధిలో భూములిచ్చిన రైతులకు వీలైనంత త్వరలో లే ఔట్లు వేసి, అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వాలని నిర్ణయించారు. సమావేశంలో సలహా సంఘం కమిటీ సభ్యులతో పాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి డా. పీవీ రమేశ్, సీఆర్డీఏ కమిషనర్ ఎస్.శ్రీకాంత్, పురపాలక శాఖ తాత్కాలిక ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్ర ప్రధాన కార్యాలయాలను వీలైనంత త్వరలో కొత్త రాజధాని పరిధిలోకి తరలించాలని నిర్ణయించారు. సచివాలయంలో మంత్రి నారాయణ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
చలో ‘అమరావతి’పై మరో కమిటీ
విజయవాడ, గుంటూరులకు ప్రభుత్వ శాఖలు! తాత్కాలిక ఏర్పాట్ల పరిశీలనకు కమిటీ ఐదుగురు ఐఏఎస్ అధికారులతో అధ్యయనం దశలవారీగా తరలిస్తామన్న మంత్రి పల్లె హైదరాబాద్: రాజధాని ప్రాంతానికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాన కార్యాలయాల కోసం విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే పలు భవనాలను పరిశీలించినప్పటికీ తరలింపు ప్రక్రియ ముందుకు సాగలేదు. కార్యాలయాలను ఒక్కసారిగా తరలించడం కాదన్న ఉద్దేశంతో కీలకమైన విభాగాలను దశలవారిగా తరలించాలన్న ఆలోచనకు వచ్చారు. ఆయా శాఖలను తరలించడంపై ఇప్పటికే పలు కమిటీలు వేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అయిదుగురు ఐఏఎస్ అధికారులతో మరో కమిటీని నియమించింది. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) పరిధిలోని విజయవాడ, గుంటూరులకు ప్రభుత్వ కార్యాలయాలు తరలించడానికి వీలుగా తాత్కాలిక ఏర్పాట్లను చేయడానికి ఈ కమిటీని నియమించింది. పురపాలక శాఖ కార్యదర్శి కరికాల వలవన్ (ఇన్చార్జ్ కార్యదర్శి) మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరించే ఈ కమిటీలో పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, గృహనిర్మాణ శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి హేమ మునివెంకటప్ప, రహదారులు, భవనాలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంబాబ్లను సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలను తక్షణమే సీఆర్డీఏ పరిధిలోకి తరలించడానికి వీలుగా గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో తాత్కాలిక ఏర్పాట్లను చేయాలని కమిటీని ఆదేశించింది. తాత్కాలికంగా కార్యాలయాలను ఏర్పాటు చేయ డం కోసం భవనాలను కమిటీ పరిశీలించి తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. భవనాల ఎంపికలో ఈ కమిటీకి కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు సహకరించాలని సీఎస్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విజయవాడ నుంచే పరిపాలన: పల్లె విజయవాడ నుంచి పరిపాలన సాగించడానికి వీలుగా ప్రభుత్వ కార్యాలయాలను దశలవారీగా అక్కడికి తరలిస్తామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం అడ్డగోలుగా రాజధాని లేకుండానే రాష్ట్రాన్ని విభజించిందని విమర్శించారు. సవాళ్లను అవకాశంగా మలచుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నగరాన్ని నిర్మించడానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. అమరావతి నిర్మాణానికి ఇప్పటికే సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ అందించిందన్నారు. రాజధాని నగరం నిర్మించేలోగా.. విజయవాడ నుంచి తాత్కాలిక కార్యాలయాలను ఏర్పాటు చేసి పరిపాలన సాగిస్తామని చెప్పారు. వీలైనంత తొందరగా విజయవాడకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించడానికి తాత్కాలిక భవనాల ఎంపిక కోసమే ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఓ కమిటీని వేశామన్నారు. ఆ కమిటీ నివేదిక ఇవ్వగానే దశల వారీగా కార్యాలయాలను తరలించి పరిపాలన సాగిస్తామని తెలిపారు. -
అమరావతిలో తెలుగుదనం ఏదీ?
సందర్భం నవ్యాంధ్ర రాజధాని ప్రణాళిక సిద్ధ మైంది. అమరావతి గురించే ప్రపంచం అంతా మాట్లాడుకునేలా, అందరూ ఇటువైపే చూసేలా నిర్మిస్తానని ముఖ్య మంత్రి ప్రకటించారు. పత్రికలు, చానళ్లు ఈ ప్రణాళికను ఆకాశానికి ఎత్తేశాయి. ముఖద్వారం, వాణిజ్యం, అధికారం, నదీతీరంతో చతుర్ముఖ వికాసానికి ప్రతి రూపంగా ఈ మహానగరిని అభివర్ణిం చాయి. 16.9 చదరపు కిలోమీటర్ల పరిధిలో, కేంద్ర రాజధాని 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో, రాజధాని నగరం 742 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని ప్రాంతాలను ప్రకటించారు. 2050 నాటికి 1 కోటి 35 లక్షల జనాభా, 56 లక్షల ఉద్యోగాలు గల నగరం అవుతుందని వెల్లడించారు. లక్ష కోట్ల రూపాయలకు పైబ డిన ఖర్చుతో కూడిన భారీ చిత్రాన్ని రూపొందించారు. రాజధానిపై విడుదల చేసిన నమూనా చిత్రాలు అబ్బుర పరు స్తున్నాయి. సింగపూర్‌లో విహరిస్తున్నట్లు, కాన్బెర్రాలో ప్రయాణి స్తున్నట్లు, న్యూయార్క్‌లో నివసిస్తున్నట్లు మురిపిస్తున్నాయి. నవ్యాంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి పేరును ప్రకటిస్తే అంతా ఆనందపడ్డారు. బుద్ధుని కాలచక్రం చుట్టూ కలలు కన్నారు. ఆ సందర్భంగా ధరణికోటను తవ్వి తలకెత్తుకుంటే అందరూ గర్వ పడ్డారు. పత్రికలు, ప్రసార మాధ్యమాలు దీని గత చరిత్ర చుట్టూ కథలల్లి తెలుగు ప్రజలను ఉర్రూతలూగించాయి. ఇప్పుడు విడు దలైన రాజధాని నమూనా చిత్రాలు ఆంధ్రుల చరిత్ర, సాంస్కృతిక వారసత్వాలను పుణికిపుచ్చుకోలేదని స్పష్టమైంది. దీనికి సింగపూర్ బృందాన్ని తప్పు పట్టకూడదు. పట్టణ ప్రణాళికల రూపకల్పనలో వారికున్న అనుభవాన్ని నమూనా చిత్రాలే చాటి చెబుతున్నాయి. మన ప్రభుత్వం కోరిన దానినే వారు ఇచ్చి ఉంటారు. వివిధ దేశాలలో దేవుళ్లు ఆయా ప్రజల రూపాలలో ఉన్నట్లే మన రాజధాని చిత్రాలు తెలుగు గడ్డ మీద నాటిన సింగ పూర్ మొక్కల్లాగా ఉన్నాయి. ప్రపంచీకరణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వల్ల పట్టణ ప్రణాళికా రచనలో చోటు చేసు కున్న విపరిణామాలను ప్రముఖ పట్టణ ప్రణాళికా రచయిత ఎడ్వర్డ్ టి మెక్ మహూన్ సోదాహ రణలతో ప్రకటించారు. అమెరికాలో ఏదో ఒక పట్టణంలో ఎవరి నైనా రోడ్డు పక్కన వదిలి పెడితే తాను ఎక్కడ ఉన్నదీ ఊహించి చెప్పలేడు. అన్నీ ఒకేలా ఉంటాయి. ఇప్పుడు పట్టణ ప్రణాళికా రచన మరింత సులభతరం అయింది. న్యూజెర్సీలో కార్పొరేట్ కంపెనీలలో కంపూటర్లలో తయారైపోతాయి. అవే పోర్ట్ ల్యాం డ్లో, ఫోనిక్స్, ఫిలడల్ఫియాలో మళ్లీ మళ్లీ వినియోగంలోకి వస్తా యి. గతంలో ప్రతి పట్టణానికి తనదైన ప్రత్యేకత ఉండేది. ప్రత్యేక నిర్మాణశైలితో పట్టణాలు ఏకైక రూపాలుగా ఉండేవి. ఇప్పుడు ఏకైక రూపాలకు బదులు ఏకరూప పట్టణాలు పుట్టుకొస్తున్నాయి. వాటి ప్రత్యేక నిర్మాణశైలి అంతరించి మూసపో సిన స్థిర రూప నిర్మాణ పద్ధతి సాగుతున్నది. భవిష్యత్తులో పట్టణ ప్రణాళికా రచయితలు పట్టణాలకు ప్రత్యేకతనీ, ఏకైక రూపాన్ని ఇచ్చే సాంస్కృతిక, నిర్మాణ కళారీతులను పట్టించుకోకపోతే అక్కడి ప్రజలకు ఆ పట్టణాలు ఎప్పుడూ పరాయివి గానే ఉంటాయి. సాంస్కృతికంగా, ప్రకృతిప రంగా, ప్రత్యేక నిర్మాణ కౌశలాల పరంగా ఏకైక గుర్తింపు గల ప్రాం తాలను, పట్టణాలను మాత్రమే పర్యాటకులు ఎంచుకుంటారు. ఆం ధ్రులు గర్వించే రాజధానిని నిర్మిస్తానని, అది ప్రజా రాజధానిగా ఉంటుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. నమూనా చిత్రాలలో అది గోచరించడం లేదు. రాజధానికి కావలసిన ఆధునిక అవస రాలకు సింగపూర్ బృందం ఇచ్చిన సాంకేతికపరమైన నమూనాగా వినియోగించుకోవాలి. అదే సమయంలో నవ్యాంధ్ర రాజధానికి ఒక చారిత్రక నేపథ్యాన్ని, సాహిత్య సాంస్కృతిక వారసత్వాన్ని, భారతీయ నిర్మాణ రీతులను మేళవించాలి. పంట భూములలో, చారిత్రక వారసత్వ ప్రదేశాలు ప్రత్య క్షంగా లేనిచోట కొత్త రాజధానిని నిర్మిస్తున్నారు. అందుచేత రాజ ధానికి ప్రత్యేకతలు కల్పించడానికి చరిత్రను పునఃసృష్టి చేయాలి. మనకున్న కోటలు, రాజ ప్రాసాదాలు, పలు నిర్మాణ రీతులు, మిశ్రమ కళాకృతులు ఉన్నాయి. వీటిని యథాతథంగా అనుకరించ కుండా కొత్త నిర్మాణ రూపాల సృష్టికి వినియోగించుకోవాలి. అప్పుడే రాజధాని ఆంధ్రులకు గర్వకారణం అవుతుంది. లేకపోతే బ్రెసిలియా పట్టణ చేదు అనుభవం మిగులుతుంది. బ్రెజిల్‌కు 1956-60 సంవత్సరాల మధ్య బ్రెసిలియా పేరు తో కొత్త రాజధానిని సరికొత్త ప్రదేశంలో నిర్మించారు. గతం వైపు చూడని ముందుచూపు మాత్రమే గల కొత్త సమాజం లక్ష్యంగా ఈ రాజధాని ప్రణాళికను రూపొందించారు. ఉద్దేశపూర్వకంగానే చారిత్రక నేపథ్యం లేకుండా చేశారు. బ్రెసిలియాను ఒక అల్ట్రా మోడరన్ మాన్యుమెంటల్ పట్టణంగా నిర్మించారు. అందరి దృష్టి లోనూ ఇది అబ్బురపరచే పట్టణం. కానీ కృత్రిమ పట్టణం. ఆ నగర వీధులలో సంచరించడానికి ప్రేరణనిచ్చే స్థల నేపథ్యపు జీవ కళ లేకుండా పోయింది. ఇదీ బ్రెసిలియా విషాదం. ప్రజా రాజధాని అంటే ముఖ్యమంత్రి దృష్టిలో 1 కోటి 35 లక్షల జనాభాతో కేంద్రీకృత అభివృద్ధి గల మహానగరంగా కనిపి స్తున్నది. కేంద్రీకృత అభివృద్ధి నమూనా ఫలితాలు తెలిసి కూడా హైదరాబాద్‌కు పైచేయిగా ఉండే నగరాన్ని నిర్మించాలన్న ఆదు ర్దాతో అదే నమూనాకు పునాదులు వేస్తున్నారు. ఇలాంటి కేంద్రీ కృత రాజధాని జిల్లాల అభివృద్ధిని వాతాపిజీర్ణం చేస్త్తుంది. ప్రతి చిన్న ఉపాధికి వలసలను తప్పనిసరి చేస్తుంది. అభివృద్ధిని వికేం ద్రీకరించకపోతే రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలు శాశ్వతంగా పేదరికంలోనే ఉండిపోతాయి. ఇతర జిల్లాలు ఎదుగు బొదుగూ లేనివి అవుతాయి. అన్ని జిల్లాలు రాజధాని మీదే ఆధారపడే స్థితికి బదులు రాజధాని అన్ని జిల్లాల అభివృద్ధికి చోదకశక్తి కావాలి. అమరావతి రాజధానిలో తెలుగుదనం ప్రక్షిప్తం కాకపోతే ప్రజలకు గర్వకారణం కాకపోగా పరాయి పట్టణాన్నే తలపిస్తుంది. డీవీవీఎస్ వర్మ (వ్యాసకర్త అధ్యక్షులు-ఏపీ లోక్‌సత్తా పార్టీ) మొబైల్: 9866074023 -
ఇదే ఆంధ్రప్రదేశ్ రాజధాని
కీలక ప్రభుత్వ నిర్మాణాలన్నీ తుళ్లూరు పరిసరాల్లోనే..! ఐదు దశల్లో పీపీపీ విధానంలో రాజధాని నిర్మాణం 2050 నాటికి పూర్తిస్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి హైదరాబాద్: ఆంధ్రుల రాజధాని అమరావతి కీలక ప్రాంతమంతా (కోర్ ఏరియా) తుళ్లూరు పరిసరాల్లోనే కేంద్రీకృతమైంది. ప్రభుత్వ కీలక నిర్మాణాలన్నీ తుళ్లూరు, రాయపూడి గ్రామాల్లోనే నిర్మితం కానున్నాయి. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, రాష్ట్ర మంత్రుల నివాస గృహాలు, సిటీ గ్యాలరీ తదితర నిర్మాణాలు తుళ్లూరు పరిసరాల్లోనే నిర్మిస్తారని ‘సాక్షి’ ముందుగానే వెల్లడించింది. ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించకముందే తుళ్లూరు ప్రాంతంలో రాజధాని ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. తుళ్లూరు కేంద్రంగానే భూ సమీకరణను ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో అప్పట్లో ఇక్కడే ప్రభుత్వ కీలక నిర్మాణాలు ఉంటాయని భావించారు. ప్రస్తుతం సింగపూర్ ప్రభుత్వం అందించిన చివరి విడత ప్రధాన రాజధాని ప్రణాళిక (సీడ్ కేపిటల్ ప్లాన్) ప్రకారం అమరావతి గవర్నమెంట్ కోర్ ప్రాంతం మొత్తం లింగాయపాలెం, రాయపూడి, బోరుపాలెం, తుళ్లూరులలో ఉంటుందని రూఢీ అయ్యింది. నాలుగు భాగాలుగా విభజన.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి అందించిన సీడ్ కేపిటల్ ప్రణాళికలో నాలుగు భాగాలుగా విభజించారు. అమరావతి గేట్ వే, అమరావతి వాటర్ ఫ్రంట్, అమరావతి డౌన్ టౌన్, అమరావతి గవర్నమెంట్ కోర్ పేరుతో అభివృద్ధి చేయనున్నారు. ఓ మెగా సిటీతో పాటు ఏడు ప్రాంతీయ కేంద్రాలను ఏడు రంగాల్లో హబ్‌లుగా అభివృద్ధి చేసేందుకు సింగపూర్ ప్రభుత్వం బృహత్తర ప్రణాళికను ఏపీ ప్రభుత్వానికి అందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్‌ను సోమవారం రాజమండ్రిలో అందజేశారు. ఈ సీడ్ కేపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ పరిధి 16.9 చదరపు కి.మీ. ఉంటుంది. సింగపూర్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న దశలో కేపిటల్ సీడ్ మాస్టర్ ప్లాన్ 8 చ.కి.మీ. మాత్రమే ప్రతిపాదించారు. తాజాగా అందించిన ప్రణాళికలో మాత్రం దాన్ని రెండింతలు పెంచి 16.9 చ.కి.మీ. మేరకు చూపించారు. ఐదు దశల్లో సీడ్ కేపిటల్ ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మించనున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టీకరించింది. 2050 నాటికి అమరావతి రాజధాని పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని ప్రణాళికలో పొందుపరిచారు. అమరావతి గేట్ వే భాగం తాళ్లాయపాలెం పరిధిలో ఉంటుంది. ఇక్కడే గత నెల 6నముఖ్యమంత్రి రాజధాని నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ గ్రామం మందడం రెవెన్యూ గ్రామం కింద ఉంది. ఇక్కడ సిటీ గ్యాలరీ, వెట్‌ల్యాండ్ పార్క్, కల్చరల్ సెంటర్, అమరావతి ప్లాజా, యూనివర్సిటీ ఏర్పాటు చేస్తారు. అమరావతి డౌన్ టౌన్ భాగంలో ఉద్దండరాయునిపాలెం, లంక గ్రామాలున్నాయి. ఈ గ్రామాలను ఆనుకుని అమరావతి వాటర్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తారు. ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం నడుమ స్పోర్ట్స్ సౌకర్యాలు, బొటానికల్ గార్డెన్స్, ప్రాంతీయ ఆసుపత్రి, కెనాల్ పార్కులు, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. లింగాయపాలెం నుంచి తుళ్లూరు వరకు సెమీ ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు, ప్రభుత్వ కీలక నిర్మాణాలన్నీ ఉండాలని ప్రణాళికలో సూచించారు. రాజధాని ప్రాంత అభివృద్ధి మొత్తం గుంటూరు జిల్లాలోనే.. రాజధాని ప్రాంత అభివృద్ధి మొత్తం గుంటూరు జిల్లాలోనే ఉండేలా ప్లాన్ రూపొందించారు. అమరావతి మెగా సిటీతో పాటు ఏడు ప్రాంతీయ కేంద్రాలను గుంటూరు, కృష్ణా జిల్లాల్లో హబ్‌ల పేరుతో అభివృద్ధి చేసేలా ప్రణాళిక తయారు చేశారు. ఈ రెండు జిల్లాల్లో గుంటూరులో ఆగ్రో ప్రాసెసింగ్ హబ్, తెనాలిలో లైట్ ఇండస్ట్రియల్ సపోర్ట్ హబ్, సత్తెనపల్లిలో హెవీ ఇండస్ట్రీ, నందిగామలో టూరిజం, నూజివీడులో ఫుడ్ ప్రాసెసింగ్, గన్నవరంలో ఫ్యూచర్ ఏరోట్రోపోలీస్ (విమానయాన సంబంధిత), గుడివాడలో వాల్యూయాడెడ్ ఎకనమిక్ హబ్‌లను అభివృద్ధి చేస్తారు. అమరావతి వారసత్వ నగరంగా ఉంటుంది. కృష్ణా జిల్లాలో పామర్రు-మచిలీపట్నం నడుమ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు ఉంటుందని ప్లాన్‌లో పేర్కొన్నారు. ఐదు గ్రామాలు ఖాళీ కావాల్సిందే! సింగపూర్ ప్రభుత్వం రూపొందించే మాస్టర్ ప్లాన్ గ్రామాలను తాకకుండా ఉంటుంది.. ఆ విధంగానే ప్లాన్ రూపొందించాలనిచెప్పామని పలు దఫాలుగా రాష్ట్ర మంత్రులు ప్రకటించారు. అందుకు భిన్నంగా ఐదు గ్రామాలు కచ్చితంగా ఖాళీ చేయక తప్పదని సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్ ప్రకారం తెలుస్తోంది. గ్రామాల వెలుపలి నుంచి మాత్రమే ప్రణాళిక రూపొందుతుందని ఏపీ మంత్రి నారాయణ సైతం ప్రకటించిన సంగతి తెలిసిందే. సీడ్ కేపిటల్ ప్లాన్ ప్రకారం కీలక నిర్మాణాలన్నీ తుళ్లూరు పరిసరాల్లోనే ఉండటంతో ఎంతో చరిత్ర ఉన్న కృష్ణా పరివాహక గ్రామాలు ఆనవాళ్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడనుంది. మాస్టర్ ప్లాన్‌లో సూచించిన మేరకు తాళ్లాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, ప్రభుత్వ కీలక నిర్మాణాలు నిర్మించే వెలగపూడి, రాయపూడి గ్రామాలు ఖాళీ చేయక తప్పదని అధికారవర్గాలు చెబుతున్నాయి. తుళ్లూరు పరిసర గ్రామాలపైనా పాక్షికంగా ప్రభావం ఉంటుంది. ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ -
దరఖాస్తులు ఫుల్లు..
సాక్షి, గుంటూరు : జిల్లాలో నాలుగురోజులుగా జరుగుతున్న మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ చివరిరోజు శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. మంగళ, బుధవారాల్లో కేవలం 21 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అనూహ్యంగా శుక్ర, శని వారాల్లో రాజధాని ప్రాంతవాసులతోపాటు జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాం తాల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. రద్దీ ఎక్కువగా ఉండడంతో అర్ధరాత్రి వరకు స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాపారం అధికంగా ఉండే షాపులను ఎంచుకుని పోటీలు పడి దరఖాస్తులు చేస్తున్నారు. గుంటూరు నగరానికి చుట్టుపక్కల ఉన్న రాజధానిప్రాంతాలైన మంగళగిరి, పెదకూరపాడు, అమరావతి, ప్రత్తిపాడు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో ఉన్న షాపులకు దరఖాస్తులు అధికంగా వచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రికి 241 షాపులకు 2,497 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో రాజధాని ప్రాంతంలో ఉన్న మద్యం దుకాణాలకు 50కు పైగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో అత్యధికంగా దాచేపల్లి మండలం నడికుడి మద్యం దుకాణానికి శుక్రవారం రాత్రికే 109 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల గడువు ముగిసే సమయానికి ఈ షాపుకు 300కు పైగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం రాత్రి వరకు వచ్చిన దరఖాస్తుల నుంచి ఎక్సైజ్ శాఖకు సుమారుగా రూ.8 కోట్లు ఆదాయం వచ్చినట్లు ఇన్చార్జి డీసీ ఎం.ఆదిశేషు తెలిపారు. శనివారం దరఖాస్తుల గడువు ముగిసే సమయానికి గత ఏడాది కంటే అధికంగా 7వేల దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. దీంతో ఎక్సైజ్ శాఖకు దరఖాస్తుల ద్వారా రూ.25 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. బారులు తీరిన దరఖాస్తు దారులు గుంటూరునగరంలోని మహిమ గార్డెన్స్‌లో జరుగుతున్న మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ కౌంటర్ల వద్ద శుక్రవారం తెల్లవారుజాము నుండే దరఖాస్తు దారుల తాకిడితో క్యూలు కిటకిటలాడాయి. శనివారం అర్ధరాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగుతోంది. రాత్రి వరకు అందిన సమాచారం మేరకు అన్ని షాపులకు దరఖాస్తులు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రాజధానిప్రాంతంతోపాటు నరసరావుపేట డివిజన్లోని మద్యం దుకాణాలకు పోటీ ఎక్కువగా ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. నేడు దరఖాస్తుల పరిశీలన శనివారంతో దరఖాస్తుల స్వీకరణ ముగియడంతో వచ్చిన దరఖాస్తులను ఆదివారం పరిశీలించనున్నారు. వీటిల్లో సక్రమంగా ఉన్నవాటిని గుర్తించి మిగతావి తిరస్కరిస్తారు. 29న నగరంలోని వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కలెక్టర్ కాంతిలాల్‌దండే ఆధ్వర్యంలో మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహించనున్నారు. లాటరీలో మద్యం దుకాణాలు దక్కించుకున్నవారు లెసైన్సు ఫీజులో మూడో వంతు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు జతచేసిన డీడీ రుసుముపోను మిగతా నగదు చెల్లిస్తే సరిపోతుంది. -
రాజధాని నిర్మాణంలో కొండవీటి వాగు కీలకం
తాడేపల్లి రూరల్ : రాజధాని ప్రాంతంలో గురువారం సింగపూర్ బృందం పర్యటించింది. కొండవీటి వాగును పరిశీలిస్తూ ఈ బృందం పర్యటన కొనసాగింది. ముందుగా ఉండవల్లి కరకట్టపై వర్కుషాపు సమీపంలోని హెడ్ రెగ్యులేటర్‌ను బృందం పరిశీలించింది. దాని పని తీరు, నీటి నిల్వ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. రాజధాని నిర్మాణంలో కొండవీటి వాగు కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలపై సింగపూర్ బృందం అధ్యయనం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఏపీ సీఆర్డీఏ చీఫ్ ఇంజినీర్ కాశీ విశ్వేశ్వరరావు సింగపూర్ బృందంతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణం చేపట్టే క్రమంలో కొండవీటి వాగు ముంపుపై ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉందన్నారు. కృష్ణానదికి, కొండవీటి వాగుకు ఏకకాలంలో వరదలు సంభవించినప్పుడు కృష్ణానది నుంచి కృష్ణాయపాలెం వరకు బ్యాక్ వాటర్ వచ్చి, పైనుంచి వచ్చే కొండవీటి వాగు నీరు అక్కడ పంట పొలాలను ముంచెత్తుతోందని వివరించారు. ఈ క్రమంలో కృష్ణాయపాలెంలో నీరు నిల్వ ఉంచుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. లాం ఫారం దగ్గర చెరువు తవ్వి గ్రీనరీ పార్కు ఏర్పాటు చేసి, అక్కడ కూడా నీరు నిల్వ చేయాల్సి ఉందన్నారు. దీంతోపాటు నీరుకొండ ప్రాంతంలో మరొక నీటి నిల్వ భాగాన్ని ఏర్పాటు చేసి, ఎగువ ప్రాంతానికి నీరు పంపించే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. వేసవి సమయంలో కృష్ణానది నుంచి కృష్ణాయపాలెంలోకి నీటిని వెనక్కు మళ్లించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉందని సింగపూర్ బృందంతో చర్చించారు. కొండవీటి వాగు మలుపులు ఎక్కువగా ఉన్నాయని, ఆ మలుపులను కట్ చేయాల్సి ఉందన్నారు. కొండవీటి వాగు ముంపు నుంచి ఇబ్బందులు తలెత్తకుండా రోడ్లు, కల్వర్టుల నిర్మాణం చేపట్టాల్సి ఉందని సూచించారు. రాజధాని నిర్మాణంలో కొండవీటి వాగు కీలక పాత్ర పోషించడమే కాక, భవిష్యత్తు అవసరాలకు ప్రధాన వనరుగా నిలపాల్సిన అవసరం ఉందనే అంశాన్ని సింగ్‌పూర్ బృందం, అధికారులు చర్చించుకున్నారు. ఇదిలా ఉంటే రాజధాని నిర్మాణం అనంతరం వచ్చే మురుగును ఎటువైపు మళ్లించాలనే దానిపై కూడా చర్చించారు. కొండవీటి వాగు నీటిని రాజధాని అవసరాల కోసం ఉపయోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తే మురుగునీటిని కృష్ణానదిలో కలపకుండా వేరే మార్గాన్ని అన్వేషణ చేయాలని నిర్థారణకు వచ్చారు. ఈ పర్యటనలో ఏపీ సీఆర్డీఏ అసిస్టెంట్ ఇంజినీర్ ప్రేమ్‌కుమార్, ప్రణాళిక అధికారి నాగేశ్వరరావు, 12 మంది ఉన్న ఈ సింగపూర్ బృందంలో స్ట్రాటజిక్ అడ్వైజర్ వాంగ్కాయి యంగ్, అసిస్టెంట్ డెరైక్టర్ సీఎల్సీ జేమ్స్ టే, సైమన్టాంగ్, సుబానా తదితరులు ఉన్నారు. -
జూలై 16కు ముందే సీడ్ కేపిటల్ డెవలప్మెంట్ ప్లాన్
సింగపూర్ ప్రతినిధుల వెల్లడి సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 16వ తేదీకి ముందే సీడ్ కేపిటల్ డెవలప్మెంట్ ప్లాన్‌ను సమర్పిస్తామని సింగపూర్ కంపెనీల ప్రతినిధులు రాష్ట్రప్రభుత్వానికి తెలిపారు. ఇప్పటికే కేపిటల్ రీజియన్ మాస్టర్ ప్రణాళికను, కేపిటల్ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. సీడ్ కేపిటల్ ప్లాన్‌పై సింగపూర్ కంపెనీ ప్రతినిధులు సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. ప్రధానంగా మున్సిపల్ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి గిరిధర్ అరమానెతో పాటు ఇతర అధికారులను సీడ్ కేపిటల్ ప్రణాళికలో ఏఏ అంశాలు ఉండాలని సింగపూర్ ప్రతినిధులు అడిగి తెలుసుకున్నారు. సీడ్ కేపిటల్లో సచివాలయం, రాజ్‌భవన్, ప్రభుత్వ కార్యాలయాలు, అసెంబ్లీ, ముఖ్యమంత్రి నివాసం, మంత్రుల నివాసగృహాలు తదితర భవనాలపై చర్చకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వివరించిన మేరకు సీడ్ కేపిటల్ ప్రణాళికను రూపొందించి వచ్చే నెల 16వ తేదీకి ముందుగానే ప్రభుత్వానికి సమర్పిస్తామని అధికారులకు సింగపూర్ ప్రతినిధులు వివరించారు. దీని తర్వాత ప్రారంభోత్సవ తేదీలు నిర్ణయం, ప్రధాని, రాష్ట్రపతి వంటి వారిని ఆహ్వానించడం చేస్తామని అధికారులు చెబుతున్నారు. -
విదేశీ సంస్థలకు భవానీ ద్వీపం
అమితాసక్తి చూపుతున్న సింగపూర్ * కట్టబెట్టే యోచనలో ప్రభుత్వం సాక్షి, విజయవాడ బ్యూరో: విజయవాడ పర్యాటకానికి మణిదీపంలాంటి భవానీ ద్వీపాన్ని విదేశీ సంస్థలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. సింగపూర్ కంపెనీలకు దీంతోపాటు పక్కనే ఉన్న మరికొన్ని ద్వీపాలను లీజుకిచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే దీనిపై ప్రభుత్వ ఉన్నతాధికారులతో పలు దఫాలుగా సింగపూర్ కంపెనీలు చర్చలు జరిపాయి. రాజధాని మాస్టర్‌ప్లాన్ హడావుడి పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఈ లీజుపై దృష్టి పెట్టనుంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన కృష్ణానదిలో 7 వేల ఎకరాల్లో పలు ద్వీపాలున్నాయి. ఇందులో 133 ఎకరాల భవానీద్వీపం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. రాష్ట్ర విభజనకు ముందే దీన్ని అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖ ప్రణాళిక రూపొందించింది. ఎన్నికల తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో దీనిపై తనకు చాలా ప్లానింగ్ ఉందని పాత ప్రణాళికలను పక్కన పెట్టాలని స్వయంగా చంద్రబాబు పర్యాటక శాఖకు సూచించారు. సింగపూర్‌లోని సెంటోసా ద్వీపం తరహాలో దీన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని ఆయన పలుమార్లు చెప్పారు. మాస్టర్‌ప్లాన్ తయారుచేసిన సింగపూర్ కంపెనీల్లో ఒకదానికి వాటిని అభివృద్ధి చేసి 33 ఏళ్లపాటు నిర్వహించుకునే అవకాశం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిసింది. గతంలో ఆందోళనలు నిర్వహించిన టీడీపీ కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భవానీ ద్వీపాన్ని ప్రైవేటుకు లీజుకిచ్చే ప్రయత్నాన్ని టీడీపీ అడ్డుకుంది. ఆ ప్రయత్నం విరమించుకునే వరకూ అప్పటి టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, ప్రస్తుత మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆందోళనలు నిర్వహిం చారు. ఇప్పుడు ద్వీపాన్ని అభివృద్ధి చేయకుండా ఏకంగా విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టేందుకు సిద్ధమవుతుండడం విశేషం. -
రాజధాని ప్రాంతంలో సింగపూర్ బృందం పర్యటన
తుళ్ళూరు/తాడేపల్లి రూరల్: రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలంలోని కృష్ణానది తీర ప్రాంతాన్ని మంగళవారం ఏడుగురు ప్రతినిధులతో కూడిన సింగపూర్ బృందం పరిశీలించింది. నూతన రాజధానికి మాస్టర్ ప్లాన్ ఇచ్చిన మర్నాడే ఈ బృందం రాజధాని ప్రాంతంలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయవాడ నుంచి బయలుదేరిన ఈ బృందం ప్రకాశం బ్యారేజి మీదుగా గుంటూరు జిల్లా సీతానగరం చేరుకుని అక్కడ నుంచి ఉండవల్లి కరకట్ట మీదుగా తూళ్లూరు మండలం వెంకటపాలెం చేరుకున్నారు. అక్కడి నుంచి మందడం మీదుగా తాళాయపాలెంలోని శ్రీశైవక్షేత్రానికి వెళ్లారు. అక్కడ ఐదు నిమిషాల పాటు మ్యాప్‌ల ఆధారంగా కృష్ణానదిని పరిశీలించారు. ఈప్రాంతాన్ని పర్యాటక రంగంగా తీర్చిదిద్దాలని రాజధాని మాస్టార్ ప్లాన్‌లో పొందు పరిచిన నేపథ్యంలో సింగపూర్ బృందం శ్రీశైవక్షేత్రంకు ఉత్తరంగా కనిపించే కృష్ణానది గురించి ఆసక్తి కనబరిచింది. పరిసర ప్రాంతాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ బృందం విజయవాడ తిరుగు ప్రయాణమయ్యింది. -
21వ శతాబ్దపు రాజధాని
జూలై 15 నాటికి సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్ రాజధాని నిర్మాణానికి గడువు చెప్పలేను మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు హరిత రాజధాని కోసం ప్లాన్ ఇచ్చాం: సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సాక్షి, హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతి 21వ శతాబ్దపు ప్రజా రాజధానిగా, ఓ డైనమిక్ సిటీగా మారాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. సింగపూర్ మంత్రి ఎస్ ఈశ్వరన్ సోమవారం మాస్టర్ ప్లాన్ (రెండో దశ) ను ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియా తో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ నూతన రాజ ధాని అభివృద్ధిలో సింగపూర్ కన్సార్షియం భాగస్వామ్యమైనందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. జూలై 15 నాటికి సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్ (కీలకమైన ప్రభుత్వ నిర్మాణాలు ఉండే ప్రాంతం)ను సింగపూర్ ప్రభుత్వం అందిస్తుందని, జూన్ 6న భూమిపూజ చేసి విజయదశమి నుంచి నిర్మాణ పనులు మొదలెడతామని తెలి పారు. ప్రధానితోపాటు సింగపూర్ ప్రభుత్వా న్ని రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఆ హ్వానిస్తామని చెప్పారు. రాజధాని నిర్మాణం ఎ న్ని దశల్లో.. ఎంత కాలం పడుతుందో.. తాను నిర్ణీత గడువు చెప్పలేనన్నారు. పారదర్శకతకు, అవినీతి రహితానికి మారుపేరైన సింగపూర్‌కు తాము అదే విధంగా పారదర్శకంగా సాయమందిస్తామని చెప్పారు. మాస్టర్ డెవలపర్ ఎంపికకు స్విస్ ఛాలెంజ్ విధానాన్ని అవలంబిస్తామన్నారు. కేంద్రం నుంచి తాము ఆర్థిక సాయం తప్ప ఏ రకమైన సాయం కోరడం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పట్టణాభివృద్ధి శాఖ నుంచి రూ.వెయ్యి కోట్లు, రాజ ధాని నిర్మాణానికి రూ.500 కోట్లు ఇప్పటికే కేం ద్రం ప్రకటించిందన్నారు. వ్యతిరేక కథనాలు ఇవ్వకుండా తమకు సహకరించాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. 2019 ఎన్నికల నాటికి రాజ దాని నిర్మాణం కూడా టీడీపీ ఉపయోగించుకుంటుందా? అని మీడియా ప్రశ్నించగా... సీఎం అంగీకరించారు. హరిత రాజధాని కోసం ప్లాన్ : ఈశ్వరన్ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సహజ వనరుల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునే విధంగా హరిత రాజధాని అమరావతి మాస్టర్‌ప్లాన్ తయారు చేశామని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ చెప్పారు. రాజధాని నిర్మాణం నాలుగైదేళ్లలో పూర్తయ్యేది కాదని, దశాబ్దాలుగా రాజధాని ప్లాన్‌ను అమలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. సీఎం చంద్రబాబు విజన్ ఆధారంగానే ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేశామన్నారు. రాజధాని మా స్టర్ డెవలపర్ ఎంపికకు నిర్వహించే స్విస్ ఛా లెంజ్ విధానంలో పాల్గొనేందుకు సింగపూర్ కంపెనీలు సైతం ఆసక్తిగా ఉన్నాయని తెలిపారు. సాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్ మాస్టర్ ప్లాన్‌కు ఒప్పందం ఆంధ్రప్రదేశ్‌లో సమీకృత ఘన, వ్యర్థ పదార్థాల నిర్వహణ (ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్) మాస్టర్ ప్లాన్‌కు ఏపీ, సింగపూర్ ప్రభుత్వాల నడుమ ఒప్పందం కుదిరింది. సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సమక్షంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, సింగపూర్ కోపరేషన్ ఎంటర్ప్రైజెస్ కలిసి సంయుక్తంగా ఒప్పందం చేసుకున్నాయి. ఈ మేరకు ఏపీలో రెండు ప్రభుత్వాలు కలిసి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహించనున్నాయి. సింగపూర్ కోపరేషన్ ఎంటర్ప్రైజెస్ ఏపీలో మున్సిపల్ శాఖ అధికారులతో రెండు వర్క్‌షాపులు నిర్వహించి, ఎంపిక చేసిన మున్సిపల్, నగర పాలికల్లో ప్రాజెక్టును అమలు చేస్తారు. ఈ ప్రాజెక్టు గడువు మూడు నెలల్లో పూర్తవుతుందని ఇరు ప్రభుత్వాలు భావిస్తున్నాయి. సింగపూర్ కంపెనీ సేవలో బాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కార్పొరేట్ కంపెనీ ప్రతినిధిని హిజ్ ఎక్సలెన్సీ అని సంబోధిస్తూ అతిథి మర్యాదలు చేయడం పలువురిని విస్మయపరిచింది. కేపిటల్ సిటీ ప్లాన్ అందజేయడానికి వస్తున్న సింగపూర్ మంత్రి ఎస్.ఈశ్వరన్ రాకకోసం చంద్రబాబు ఎల్ బ్లాక్‌లోని 8 ఫ్లోర్‌లోని తన చాంబర్ నుంచి కిందకు దిగొచ్చి దాదాపు పావుగంట పాటు పోర్టికోలో పడిగాపులు కాశారు. ఈశ్వరన్‌తోపాటు సింగపూర్‌కు చెందిన కార్పొరేట్ కంపెనీ సుర్బానా సీఈవో పాంగ్ ఈ యాన్ తదితరులకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. మాస్టర్ ప్లాన్ అందుకున్న తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ... ఈశ్వరన్‌తో పాటు సుర్బానా కంపెనీ ప్రతినిధిని కూడా ‘హిజ్ ఎక్సలెన్సీ’ అని రాచమర్యాదలివ్వడం అధికారులను విస్మయపరిచింది. కార్యక్రమం అనంతరం వారందరికీ ప్రత్యేక జ్ఞాపికలు బహూకరించారు. -
నేడు సర్కారుకు రాజధాని మాస్టర్‌ప్లాన్
-
జూన్‌లో రాజధానికి భూమిపూజ
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణానికి జూన్ మూడోవారంలో భూమిపూజ చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నెలాఖరులోగా క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సింగపూర్ ఇవ్వనుంది. మే 14న ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో ప్రభుత్వం భూసేకరణ నోటీసు జారీ చేయనుంది. ఇప్పటివరకు 11,300 ఎకరాల భూములకు సంబంధించిన రైతులతో సీఆర్డీఏ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ నెలాఖరులోగా మొత్తం 33 వేల ఎకరాలకు సంబంధించి అగ్రిమెంట్లు పూర్తిచేయాలని సీఆర్డీఏకు ప్రభుత్వం లక్ష్యం విధించింది. అయితే, 6 వేల ఎకరాలకు సంబంధించిన రైతులు మాత్రం 9.2 ఫారాల ద్వారా తమ అభ్యంతరాలు తెలిపారు. -
'ల్యాండ్ పూలింగ్ నుంచి మమ్మల్ని తప్పించండి'
-
'ల్యాండ్ పూలింగ్ నుంచి మమ్మల్ని తప్పించండి'
హైదరాబాద్: తమను ల్యాండ్ పూలింగ్ నుంచి తప్పించాలంటూ 300 మంది ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రైతులు గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ల్యాండ్ పూలింగ్‌కు తమ భూములు ఇచ్చేంది లేదంటూ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించిన రైతులంతా 9.3 ఫారాలను కోర్టుకు అందజేశారు. దాంతో విచారణకు స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. -
శ్రీవారి ఆశీస్సులతో రాజధాని నిర్మాణం
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో నవ్యాంధ్రప్రదేశ్ రాజధానినిర్మిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కష్ణమూర్తి అన్నారు. సోమవారం ఆయన కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. రెవెన్యూ విభాగంలో పని చేసే ప్రతి ఒక్కరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నానన్నారు. సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని సమర్థవంతంగా కార్యదక్షతతో ముందుకు నడిపిస్తున్నారని, అందుకు అవసరమైన మరింత శక్తిని ఆ శ్రీవేంకటేశ్వర స్వామివారే ప్రసాదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టే ఏ కార్యక్రమమైనా ఆటంకం లేకుండా దిగ్విజయంగా సాగుతుందన్నారు. -
ఏపీలో భూ ప్రకంపనలు
రాష్ట్ర రాజధాని ప్రాంతం సహా పలు ప్రాంతాల్లో స్వల్పంగా కంపించిన భూమి విజయవాడ బ్యూరో: నేపాల్ రాజధాని కఠ్మాండు కేంద్రంగా శనివారం సంభవించిన భూకంపం ఆంధ్రప్రదేశ్‌పైనా ప్రభావం చూపింది. రాష్ట్ర రాజధాని ప్రాంతంతో సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం స్వల్ప స్థాయిలో భూప్రకంపనలు సంభవించాయి. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు వివిధ ప్రాంతాల్లో వచ్చిన ఈ భూ ప్రకంపనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. రాష్ట్ర రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలోని అమరావతి, ఉండవల్లి ప్రాంతాల్లోనూ స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. ఇదిలా ఉండగా భూప్రకంపనల వల్ల కొన్నిచోట్ల ఇళ్లల్లో సామాను కదిలిపోయింది. అయితే ఎక్కడా చెప్పుకోదగిన నష్టమేది జరగలేదు. నిజానికి కొన్ని ప్రాంతాల్లో భూప్రకంపనలను ప్రజలు తొలుత గుర్తించలేక పోయారు. ఒళ్లు తూలుతున్నట్టు.. కళ్లు తిరుగుతున్న అనుభూతికి లోనై తమకు ఏదో అవుతోందంటూ కంగారు పడ్డారు. ఆ తరువాత భూప్రకంపనలుగా గుర్తించారు. భూ ప్రకంపనల తీవ్రత కాస్త ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వెంటనే వీటిని గుర్తించిన ప్రజలు ఇళ్లు, షాపుల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 3 సెకన్ల అత్యల్ప సమయం పాటు ప్రకంపనలు రాగా... మరికొన్ని ప్రాంతాల్లో 8 సెకన్ల వరకు భూ ప్రకంపనలు వచ్చినట్టు గుర్తించారు. -
ఆంధ్రప్రదేశ్ రాజధానిలో కార్పొరేట్లు
ఆ దిశగా ముందుకు వెళుతున్నామన్న సింగపూర్ మంత్రి 7 అభివృద్ధి కారిడార్లకు ప్రణాళిక వాటి నిర్మాణంలోనూ సింగపూర్ వ్యాపార దిగ్గజాలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో సింగపూర్‌కు చెందిన కార్పొరేట్ కంపెనీలు రంగప్రవేశం చేయనున్నాయి. ఆయా కంపెనీలు రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం వివిధ ప్రాజెక్టులు చేపట్టబోతున్నాయి. సింగపూర్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ మధ్యవర్తిగా వ్యవహరించి తయారు చేయించిన మొదటి విడత ప్రణాళికను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అందజేసిన విషయం తెలిసిందే. ఇక మిగిలిన రెండు దశల ప్రణాళికలు పూర్తయిన అనంతరం కార్పొరేట్ దిగ్గజాలు రంగంలోకి దిగనున్నాయి. ఈ విషయాన్ని మార్చి 30న సింగపూర్‌లో మాస్టర్‌ప్లాన్ అందజేసిన సమయంలో ఆదేశ వాణిజ్య శాఖ మంత్రి ఎస్.ఈశ్వరన్ స్పష్టం చేశారు. రాజధానికి సంబంధించి మిగిలిన రెండు ప్రాజెక్టులు (రెండు దశల ప్రణాళికలు) నిర్దేశించిన సమయంలో పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని, సింగపూర్ కంపెనీలకు అవకాశం లభించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి ముందుకు వెళుతున్నామని ఆ సందర్భంగా ఈశ్వరన్ పేర్కొన్నారు. దాన్ని బట్టి రానున్న రోజుల్లో రాజధాని కోసం చేపట్టే ప్రాజెక్టుల్లో సింగపూర్ కార్పొరేట్ దిగ్గజాలు రంగంలోకి వస్తాయన్న విషయం రూఢీ అవుతోంది. ఇది ఇలావుండగా, రాజధాని మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ కార్పొరేట్ సంస్థలు తయారు చేశాయి. అయితే మాస్టర్‌ప్లాన్‌ను సింగపూర్ ప్రభుత్వం రూపొందించి అందజేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ (ఐఈ-సింగపూర్) సంస్థ మాస్టర్‌ప్లాన్ తయారు చేయలేదు. ఆ మాస్టర్‌ప్లాన్ తయారు చేసే బాధ్యతను సింగపూర్‌లోని మరో రెండు కార్పొరేట్ సంస్థలకు ఐఈ అప్పగించింది. సుర్బానా ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్, జురాంగ్ కన్సల్టెంట్స్‌ల ద్వారా ఈ మాస్టర్‌ప్లాన్ తయారు చేయించినట్టు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ స్వయంగా తెలియజేశారు. ఈ సంస్థలే సమీప భవిష్యత్తులో రాజధానిలో రంగ ప్రవేశం చేయనున్నాయని ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి. కారిడార్లలోనూ కాలు పెట్టనున్న కంపెనీలు పలు రంగాలకు చెందిన ఏడు అభివృద్ధి కారిడార్లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అభివృద్ధి కారిడార్లు ఏర్పాటయ్యే ప్రాంతాలు, రంగాలను మాస్టర్‌ప్లాన్‌లో నిర్దేశించారు. ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారన్న వివరాలను ‘సాక్షి’ సేకరించింది. నూతన రాజధానిలో మచిలీపట్నం నుంచి హైదరాబాద్ వైపు రెండు అభివృద్ధి కారిడార్లను నెలకొల్పుతారు. వాటిల్లో నందిగామ కారిడార్‌లో ఫార్మా, బయోటెక్, ప్లాస్టిక్, ప్యాకేజింగ్ రంగాలను అభివృద్ధి చేస్తారు. గుడివాడ కారిడార్‌లో హరిత పరిశ్రమలు, అక్వా కల్చర్ రంగాలను అభివృద్ధి చేస్తారు. అలాగే విశాఖ నుంచి చెన్నై వైపు మరో రెండు కారిడార్లను అభివృద్ధి చేయనున్నారు. దీనిలో గన్నవరం కారిడార్‌లో ఐటీ, ఐటీఈఎస్, ఎలక్ట్రానిక్స్/హార్డ్‌వేర్, ఆటోమోటివ్, ఏరోస్పేస్ రంగాలను అభివృద్ధి చేస్తారు. గుంటూరు కారిడార్‌లో ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ చైన్స్, టెక్స్టైల్స్, నాన్ మెటాలిక్స్ ఉత్పత్తుల రంగాలను అభివృద్ధి చేస్తారు. ఇక తెనాలి కారిడార్‌లో లాజిస్టిక్స్, టూరిజం, ఎంటర్టైన్మెంట్ రంగాలను, సత్తెనపల్లి కారిడార్‌లో టూరిజం, నాలెడ్జ్ సెంటర్‌ను అభివృద్ధి చేస్తారు. నూజివీడు కారిడార్‌లో వ్యవసాయ అధారిత పరిశ్రమలను అభివృద్ధి చేస్తారు. వీటిలోనూ విదేశీ కార్పొరేట్ సంస్థలే రంగప్రవేశం చేస్తాయని అధికార వర్గాలు తెలిపాయి. దీర్ఘకాలిక లీజుపై భూముల కేటాయింపు నూజివీడు, గుడివాడ, తెనాలి, సత్తెనపల్లి, నందిగామ, గుంటూరు చుట్టుపక్కల, తాడేపల్లి ప్రాంతాలను పట్టణాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చే ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు భూములను 99 ఏళ్ల లీజు విధానంలో కేటాయించనున్నారు. రాజధాని చుట్టూ హైస్పీడు రైలు మార్గాన్ని నెలకొల్పనున్నారు. విశాఖ నుంచి చెన్నై మధ్య హైస్పీడ్ రైలు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. గుంటూరు-తెనాలి-గన్నవరం-నందిగామలను కలుపుతూ రీజినల్ ఎక్స్‌ప్రెస్ వే ఏర్పాటు చేస్తారు. మచిలీపట్నం-చిలకలూరిపేట-నరసరావుపేట-సత్తెనపల్లి-నందిగామ-ఏలూరుల మీదుగా ఔటర్ రీజినల్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించనున్నారు. -
భయపడే భూములు ఇచ్చాం
ఏక్తా పరిషత్ చైర్మన్, అన్నా ప్రతినిధి రాజగోపాల్ ఎదుట రాజధాని రైతుల ఆవేదన తాడికొండతెలుగుదేశం ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులకు భయపడి తమ భూములు ఇచ్చామని ఏక్తా పరిషత్ చైర్మన్, అన్నా ప్రతినిధి పి.వి.రాజగోపాల్ ఎదుట రాజధాని ప్రాంత రైతులు వాపోయారు. రాజధాని ప్రాంతంలో రైతుల వ్యవసాయ భూములను బలవంతంగా లాక్కొంటున్నారని తెలుసుకున్న రాజగోపాల్‌తో కూడిన అన్నాహజారే మిత్ర బృందం బుధవారం ఆయా గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేసింది. తుళ్లూరు మండలం మందడం, తాళాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం, రాయపూడి గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలు, మనోభావాలు తెలుసుకుంది. రైతుల తరఫున పోరాడతామని వారికి భరోసానిచ్చింది. అంతకుముందు తాడేపల్లి మండలం పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో పర్యటించి రైతాంగ సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్ లింగాయపాలెం గ్రామంలో విలేకరులతో మాట్లాడుతూ, బలవంతం చేయడం వల్లే భూములు ఇచ్చినట్లయితే రైతులు వాటిని వెనక్కు తీసుకోవచ్చని, ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటే తాము రైతుల తరఫున పోరాడతామని చెప్పారు. రాజధాని ప్రాంత సమస్యలను ఢిల్లీలో అన్నాహజారే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రాజధాని ప్రాంతంలో మూడు పంటలు పండే భూములను తీసుకోవడం న్యాయం కాదన్నారు. అనంతరం రాజధాని పర్యటన కమిటీ నాయకులు లింగాయపాలెం గ్రామానికి చెందిన అనుమోలు గాంధీ మాట్లాడుతూ ఈనెల 9వ తేదీన రాజధాని ప్రాంత రైతుల తరఫున ఢిల్లీలో నిర్వహించిన సేవాగ్రామ్ కార్యక్రమానికి వెళ్లి రాజధాని ప్రాంత పరిస్థితిపై సామాజిక ఉద్యమనేత అన్నాహజారేకు వివరించినట్లు చెప్పారు. ఈనెలాఖరులో అన్నాహజారే 1100 కిలో మీటర్ల పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా రాజధాని ప్రాంతాన్ని సందర్శించే అవకాాశం ఉందన్నారు. అదేవిధంగా కొద్దిరోజుల్లో రాజధాని ప్రాంతాన్ని సందర్శించడానికి మేధాపాట్కర్ కూడా రానున్నట్లు చెప్పారు. అనంతరం రాయపూడిలోని నిమ్మతోటలను పంట పొలాలను బృందం పరిశీలించింది. ఈ కార్యక్రమంలో బృందం ప్రతినిధి బలిశెట్టి సత్యనారాయణ, విష్ణు, ప్రముఖ న్యాయవాది మల్లెల శేషగిరిరావు, చిట్టిబాబు, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
ఉండవల్లి నుంచి నేడు జగన్ పర్యటన
-
ఉండవల్లి నుంచి నేడు జగన్ పర్యటన
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి మంగళవారం గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాల్లో పర్యటించి రైతులు, రైతు కూలీలతో మాట్లాడతారని చెప్పారు. ఉదయం 8 గంటలకు మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి గ్రామం నుంచి జగన్ పర్యటన మొదలవుతుందన్నారు. పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, కురగల్లు, ఐనవోలు, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం, రాయపూడి, తుళ్లూరు తదితర గ్రామాల్లో పర్యటిస్తారని తెలిపారు. రాజధాని గ్రామాల్లో పర్యటన తర్వాత గుంటూరు చేరుకుని పార్టీ నేతలతో కొద్దిసేపు మాట్లాడతారని, అనంతరం హైదరాబాద్‌కు పయనమవుతారని వివరించారు. తమ పార్టీ రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని ముందు నుంచీ చెబుతున్నామని, తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి కూడా అసెంబ్లీలో దీనిపై స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు. రాజధాని నిర్మాణ క్రమంలో అక్కడి రైతులు, రైతు కూలీల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా, వారికి ఎలాంటి ఇబ్బందు లు సృష్టించకుండా చూడాలని మాత్రమే తాము డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంత రైతుల్లో మనోధైర్యం నింపటానికి, అన్ని విధాలా వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడానికే జగన్ పర్యటిస్తున్నారని వివరించారు. -
రాజధాని ప్రాంతంలో నేడు వైఎస్ జగన్ పర్యటన
ఉండవల్లిలో ఉదయం 8 గంటలకు ప్రారంభం మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో పర్యటన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ వెల్లడి విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. రాజధాని ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో పర్యటించి అక్కడి రైతులు, రైతు కూలీలతో ఆయన మాట్లాడతారని ఆ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చెప్పారు. వారికి భరోసా కల్పించటానికే ఈ పర్యటన నిర్వహిస్తున్నారని తెలిపారు. జగన్మోహన్రెడ్డి పర్యటన వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి నుంచి జగన్మోహన్రెడ్డి పర్యటన మొదలవుతుందని చెప్పారు. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాల్లో పర్యటన సాగుతుందన్నారు. అక్కడి నుంచి పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, కురగల్లు, ఐనవోలు, ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, రాయపూడి, తుళ్లూరు తదితర గ్రామాల్లో పర్యటించి అక్కడి రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారని వివరించారు.రైతులు రాజధాని నేపథ్యంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రైతు కూలీల ఉపాధి సమస్యలు, పంట పొలాల సమస్యలు ఇలా అన్ని అంశాలపై అక్కడి ప్రజలతో మాట్లాడి తెలుసుకుంటారన్నారు. పర్యటన తర్వాత జగన్మోహన్రెడ్డి అక్కడి నుంచి గుంటూరు చేరుకొని పార్టీ నేతలతో కొద్దిసేపు మాట్లాడి అనంతరం హైదరాబాద్‌కు పయనమవుతారని తెలిపారు. -
అన్నాతో భేటీ కానున్న రాజధాని రైతులు
సాక్షి, హైదరాబాద్: భూ సమీకరణను వ్యతిరేకిస్తున్న రాజధాని ప్రాంత రైతులు తమ ఆందోళనను ఢిల్లీ స్థాయిలోనూ తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ను కలిసి తమ గోడు వినిపించనున్నారు. భూ సేకరణ చ ట్టంలో సవరణలకు వ్యతిరేకంగా ఈ నెల 23, 24 తేదీల్లో అన్నా హజారే ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో రెండురోజుల పాటు నిరాహార దీక్ష చేయనున్నారు. దీంతో ఆ రోజుల్లో ఢిల్లీ వెళ్లి అన్నా హజారేను కలవాలని రాజధాని నిర్మాణం వల్ల భూములు కోల్పోతున్న రైతులు నిర్ణయించారు. దాదాపు 15 మంది రైతులు, రైతు కూలీలు ఈ నెల 21న విజయవాడ నుంచి రైలులో బయలుదేరి ఢిల్లీ వెళుతున్నారు. వారిలో కారుమంచి ఇంద్రనీల్, శ్రీనాథ్ చౌదరి, గద్దె శేఖర్, పాల్, జార్జి, బుజ్జి తదితరులున్నారు. మూడు పంటలు పండే తమ భూమిని బలవంతంగా లాగేసుకునేందుకు ప్రభుత్వం ఎలా ప్రయత్నిస్తోందో అన్నా హజారేకు సవివరంగా తెలియజేసేందుకు వీరు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఒకటి తయారు చేశారు. తమవి ఎంతటి సారవంతమైన భూములో, ఎలాంటి పంటలు పండుతాయో తెలిపేందుకు.. ఆ భూములన్నింటినీ వీడియో తీయించి ఓ షార్ట్ ఫిల్మ్‌ను కూడా రైతులు రూపొందించారు. ఇలావుండగా వీరు తమ సమస్యను అన్ని పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలకు సైతం వివరించనున్నారు. ఈ మేరకు అపాయింట్మెంట్లను కూడా ఇప్పటికే కోరారు. -
'రెండోపంట వేయొద్దనడానికి మీరెవరు'
గుంటూరు: ఏపీ రాజధాని పరిధిలో రెండో పంట అవకాశం లేదంటూ సీఆర్డీఏ కమీషనర్ చేసిన వ్యాఖ్యలపై మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గుంటూరులో ఆయన బుధవారం మాట్లాడుతూ... సీఆర్డీఏ పరిధిలో ఎమర్జెన్సీ అమలు చేయాలని చూస్తున్నారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక చట్టం, రాజధాని పరిధిలో మరో చట్టాన్ని అమలు చేయాలని చూస్తే సహించమని ఆయన హెచ్చరించారు. భూములు స్వచ్ఛందంగా ఇచ్చిన చోట ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నాతమకు అభ్యంతరం లేదన్నారు. రెండోపంట వేయొద్దని చెప్పే హక్కు కమీషనర్ కు లేదన్నారు. ఈ విషయమై రైతులకు కోర్టుకు వెళ్లే హక్కు ఉందని ఆర్కే తెలిపారు. -
మూడు లేయర్లలో రాజధాని నగర నిర్మాణం
విజయవాడ : మూడు లేయర్లలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరాన్ని నిర్మిస్తామని సీఆర్డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్ తెలిపారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాజధాని ప్రాంత భూముల్లో రెండోపంటకు అనుమతి లేదని, జనవరి నెలాఖరుకు 10వేల ఎకరాల భూ సమీకరణ పూర్తి చేస్తామన్నారు. రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న గ్రామాలు అలాగే ఉంటాయన్నారు. వాటిని కలుపుకునే మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామన్నారు. రాజధాని పరిధిలోని వ్యవసాయ భూముల్లో లేఅవుట్లకు అనుమతి లేదన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఆక్రమణలపై గుంటూరు కలెక్టర్‌ను నివేదిక ఇవ్వమని ప్రభుత్వం ఆదేశించినట్లు శ్రీకాంత్ పేర్కొన్నారు. అందుబాటులో లేని భూయజమానులు ఆన్లైన్లో అఫిడవిట్లు సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. భూ సమీకరణకు 30మంది అధికారులను నియమిస్తే ఇప్పటిదాకా 19మంది విధుల్లో చేరినట్లు చెప్పారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై అధికారుల బృందం సింగపూర్ పర్యటన ముగిసినట్లు శ్రీకాంత్ తెలిపారు. రాజధాని పరిసరాల్లో ప్రయివేట్ వాహనాల వినియోగం ఉండకుండా చూస్తామన్నారు. -
రాజధాని నిర్మాణానికి త్వరలో రూ.వెయ్యి కోట్లు
కేంద్ర మంత్రి సుజనా చౌదరి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి రూ.వెయ్యి కోట్ల నిధులు మరో 20 రోజుల్లో అందనున్నట్లు కేంద్రమంత్రి సుజనా చౌదరి ప్రకటించారు. రాబోయే ఐదేళ్లలో రాజధాని నిర్మాణానికి రూ.20 వేల కోట్ల సాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్‌తో కలిసి సుజనా చౌదరి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదా రాకున్నా కేంద్రం అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. నాకేమీ అవమానం కాదు తనతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యేందుకు విముఖత చూపారన్న వార్తలను ప్రస్తావించగా.. సుజనా చౌదరి బదులిస్తూ కేసీఆర్‌కు స్వల్ప అనారోగ్యం కారణంగానే ఇలా జరిగింది తప్ప వేరే అంశం లేదన్నారు.తనకు అవమానం జరిగినట్లు భావించట్లేదని స్పష్టం చేశారు. అలాగే ఏపీ ఆర్థిక పరిస్థితిపై సీఎం ఇటీవల మాట్లాడుతూ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నట్లు ప్రకటించడాన్ని విలేకరులు సుజనా వద్ద ప్రస్తావించగా.. ఆయన కొట్టిపారేశారు. -
రాజధాని ప్రాంతంలో కాంటూరు సర్వే
-
రాజధాని ప్రాంతంలో కాంటూరు సర్వే
* మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు వీలుగా సర్వే * ఇప్పటికే పలు గ్రామాల్లో డీజీపీఎస్ సర్వే పూర్తి * తాజాగా ఈటీఎస్ సర్వే చేసేందుకు అధికారుల సన్నాహాలు * భూములెన్ని, రైతులెందరు, ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు వంటి వివరాలు తెలుసుకునే ందుకు సర్వే దోహదం * ఫిబ్రవరి 15కల్లా పూర్తి చేయాలని నిర్ణయం సాక్షి, గుంటూరు: రాష్ట్ర రాజధాని ప్రాంతంలో సింగపూర్ బృందం మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు వీలుగా కాంటూరు సర్వే చేసేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీఏ) అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు సిబ్బందికి ఆదేశాలు సైతం జారీ చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై జిల్లా సర్వే ఏడీ కిజియా కుమారి ఆధ్వర్యంలో కసరత్తు జరుగుతోంది. భూమి ఎత్తుపల్లాలను కొలవడానికి ఈ సర్వే ఉద్దేశించింది. దీని ద్వారా ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఉన్న భూమి ఎత్తు పల్లాలను తెలుసుకోవచ్చు. దీనిని బట్టి సింగపూర్ బృందం ‘రాజధాని’ మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తుంది. ఇదిలా ఉండగా ఇప్పటికే రాజధాని ప్రాంత గ్రామాల్లో డీజీపీఎస్(డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) విధానం ద్వారా ఒక్కో గ్రామానికి రెండు నుంచి 4 పాయింట్లను గుర్తించి హద్దులను నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో ఉన్న భూములు, రైతుల వివరాలను సమగ్రంగా తెలుసుకునేందుకు వీలుగా ‘ఎంజాయ్మెంట్’ సర్వేను ఈటీఎస్(ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్) విధానంలో చేసేందుకు సన్నాహాలు చేపట్టారు. గ్రామాల్లో ఉన్న భూములెన్ని.. సదరు భూమి ఎవరి స్వాధీనంలో ఉంది... ఏ సర్వే నంబర్లో ఎంతమంది రైతులున్నారు.. ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నదీ.. స్పష్టంగా తెలుసుకునేందుకు ఈటీఎస్ సర్వే తోడ్పడుతుంది. ఈ సర్వే ద్వారా ఒక అంగుళం తేడా లేకుండా భూములను సర్వే చేయవచ్చు. ఇందుకోసం అన్ని జిల్లాల నుంచి 29 ఈటీఎస్ మెషీన్లను తెప్పించారు. ఇందులో 12 మాత్రమే పనిచేస్తున్నట్లు సమాచారం. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఔట్సోర్సింగ్ విధానంలో ఈ మెషీన్లు సమకూర్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ సర్వేలను ఫిబ్రవరి 15వ తేదీలోగా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సర్వే ఏడీ కిజియా కుమారి, గుంటూరు ఆర్డీవో భాస్కరనాయుడు ‘సాక్షి’కి తెలిపారు. సర్వేకు సంబంధించి.. ప్రతిరోజూ సర్వే సిబ్బందితో సమీక్షిస్తున్నట్లు వారు తెలిపారు. ఇంతకుముందు సర్వే బృందం రోజుకు 30 ఎకరాలు సర్వే చేస్తుండగా దానిని 60 ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు వారు వివరించారు. పీడిస్తున్న సిబ్బంది కొరత... ఇదిలా ఉండగా రాజధాని ప్రాంతంలో భూముల సర్వేకు సిబ్బంది కొరత వెంటాడుతోంది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలనుంచి నియమించిన ఎనిమిది మంది డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే సిబ్బంది రాకపోవడంతో నవులూరులోని రెండు యూనిట్లు, కురగల్లు, నిడమర్రు, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి కాంపిటెంట్ ఆథారిటీ కార్యాలయానికి ఇంకా సర్వే సిబ్బందిని కేటారుుంచలేదు. సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకుని గుంటూరు జిల్లాలో రెవెన్యూ డివిజన్‌కు ఒక సర్వేయర్‌ను మినహాయించి మిగతా సిబ్బందిని అంతా రాజధాని ప్రాంతంలో భూముల సర్వేకు వినియోగిస్తున్నారు. దీంతో జిల్లాలోని మిగతా ప్రాంత ప్రజలకు సర్వే కష్టాలు తప్పడంలేదు. ఒక్కో యూనిట్‌కు ఇద్దరు చైన్మన్లను నియమించుకోవాలని డిప్యూటీ కలెక్టర్లను గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అయితే ఆ నియూమకాలు ఇప్పటికీ పూర్తికాలేదు. దీనికితోడు రాజధాని ప్రాంత గ్రామాల్లో సర్వే సిబ్బందికి రైతుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా సర్వే బృందాలకు రైతుల పేర్లతోపాటు వారి గట్లను చూపించాలి. అయితే ఇందుకు రైతులు సహకరించనట్లు సమాచారం. -
బాధిత రైతులకు.. అండగా..
గుంటూరు సిటీ: బాధిత రైతుల్లో మనో ధైర్యం నింపేందుకు మరోమారు రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నట్టు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ వెల్లడించారు. బుధవారం గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన రాజధాని రైతులు, కౌలు రైతులు, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ గురువారం పలు గ్రామాల్లో పర్యటించి రైతులకు అండగా నిలవనున్నట్టు ఆయన తెలిపారు. ఉదయం పది గంటలకు ఉండవల్లి నుంచి ప్రారంభించి పెనుమాక, నిడమర్రు, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం గ్రామాల్లో పర్యటన జరగనున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా రైతులకు తమ అండ ఉంటుందని తెలియజేయడంతోపాటు ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరికలు కూడా జారీ చేస్తామన్నారు. అనంతరం జిల్లా ఎస్పీని కలసి వాస్తవ పరిస్థితులపై వినతిపత్రం సమర్పిస్తామన్నారు. రాజధాని ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో ఎమర్జెన్సీ వాతావరణం రాజ్యమేలుతోందని మర్రి రాజశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజధానికి భూములివ్వని వారిని భయభ్రాంతులకు గురిచేసే విధంగా అక్కడ పచ్చచొక్కాల దమనకాండ అమలవుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భూములను దౌర్జన్యంగా లాక్కునేందుకు ప్రయత్నించడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఇవ్వనంటే అర్ధరాత్రి దాడి చేసి పోలీసులతో అక్రమంగా నిర్బంధిస్తారా? ఇదెక్కడి న్యాయం? అంటూ పాలకులను నిలదీశారు. దహనకాండ వ్యవహారంలో శ్రీనాథ్‌చౌదరి అనే వ్యక్తిపై అక్రమ కేసు మోపారన్నారు. బాధ్యతాయుత ప్రతిపక్షంగా అక్రమాలను ప్రతిఘటిస్తూ రైతులకు అండగా నిలుస్తున్న వైఎస్సార్ సీపీ పైనే ఆరోపణలు చేస్తూ తమతోపాటు రైతుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అయితే వారి తాటాకు చప్పుళ్లకు బెరిరే వారు ఇక్కడ ఎవరూ లేరనే విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు. తాము ఇక్కడ రాజధాని నిర్మించవద్దని కానీ, ఎవరూ భూములు ఇవ్వవద్దని కానీ ఎన్నడూ వ్యాఖ్యానించలేదని ఆయన స్పష్టం చేశారు. -
'రాష్ట్రంలో కుల రాజకీయాలు ఎక్కువయ్యాయి'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల రాజకీయాలు ఎక్కువయ్యాయని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ స్పష్టం చేశారు. ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం రాష్ట్రంలో కుల రాజకీయాలే అధికంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇస్తున్నవారికి మరోచోట భూములు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన ప్రభుత్వానికి సూచించారు.