గుంటూరు: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని మాస్టర్‌ప్లాన్ అవగాహన సదస్సుపై గుంటూరు జిల్లాల్లో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. బుధవారం మంగళగిరి మండలం ఎర్రబాలెంలో అవగాహన సదస్సును అక్కడి గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామకంఠాలను కదిలించేది లేదని అధికారులు చెప్పేవరకు.. ఎన్ని సభలు నిర్వహించినా తాము అడ్డుకుంటామని అధికారులకు ఎర్రబాలెం గ్రామస్తులు స్పష్టం చేశారు.