Live: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌.. Click & Refresh | Court Hearing On Chandrababu Cases Live Updates | Sakshi
Sakshi News home page

Live: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌.. Click & Refresh

Published Tue, Sep 19 2023 7:56 AM | Last Updated on Tue, Sep 19 2023 9:01 PM

Court Hearing On Chandrababu Cases Live Updates - Sakshi

Updates.. 

08:52PM, సెప్టెంబర్‌ 19, 2023
సీఐడీ కౌంటర్‌ దాఖలు
► 
విజయవాడ: చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సీఐడీ కౌంటర్
► బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా

06:50PM, సెప్టెంబర్‌ 19, 2023
చంద్రబాబు @ A25

విజయవాడ : ACB కోర్టులో మెమో దాఖలు చేసిన CID
ఫైబర్ నెట్ కుంభకోణంలో 25వ నిందితుడిగా చంద్రబాబు పేరు చేరుస్తూ మెమో
ఫైబర్ నెట్‌పై వేసిన పిటి వారెంట్‌కు అనుబంధంగా మెమో దాఖలు

06:00PM, సెప్టెంబర్‌ 19, 2023
ఫైబర్‌ గ్రిడ్‌ కుంభకోణం జరిగిందిలా..

గతంలో ఏపీ సివిల్‌ సప్లైస్‌కు సర్వీసులు అందించిన టెర్రాసాఫ్ట్‌ కంపెనీ
నాసిరకం ఈ- పోస్ మిషన్లు పంపిణీ చేసినందుకు టెర్రా సాఫ్ట్‌ను నాడు బ్లాక్ లిస్టులో పెట్టిన ప్రభుత్వం
అయినా టెర్రాసాఫ్ట్‌పై అంతులేని ప్రేమ కురిపించిన చంద్రబాబు సర్కారు
టెర్రాసాఫ్ట్‌కు టెండర్లు కట్టబెట్టేందుకు నాడు చంద్రబాబు సర్కారు అవకతవకలు
బ్లాక్‌లిస్ట్‌లో టెర్రాసాఫ్ట్‌ను రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే తప్పించిన వైనం
బ్లాక్ లిస్ట్ లో పెట్టిన 2 నెలలకే టెర్రాసాఫ్ట్‌ను లిస్ట్ నుంచి తొలగించిన అప్పటి సివిల్ సప్లైస్ డైరక్టర్ రవిబాబు
హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీతో జట్టు కట్టి ప్రాజెక్టు దక్కించుకున్న టెర్రాసాఫ్ట్‌
టెండర్లు దక్కించుకున్న తర్వాత హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీని నిబంధనలకి విరుద్దంగా బయటకి పంపిన టెర్రాసాఫ్ట్‌
ఇప్పటికే హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అనీల్ జైన్ స్టేట్ మెంట్ రికార్డు చేసిన CID
తమని మోసం చేసినట్టు వాంగ్మూలమిచ్చిన హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ VP అనీల్‌ జైన్‌
నిబంధనలకి విరుద్దంగా మరొక కంపెనీ నుంచి రూ.115 కోట్ల నాసిరకం మెటీరియల్‌ను కొనుగోలు చేసి ఫైబర్ నెట్‌కు సరఫరా చేసిన టెర్రా సాఫ్ట్
చంద్రబాబు సూచనల మేరకే టెర్రాసాఫ్ట్‌ వ్యవహరం మలుపులు తిరిగిందని తేల్చిన CID

05:40PM, సెప్టెంబర్‌ 19, 2023
ACB కోర్టులో చంద్రబాబుపై మరో కేసులో PT వారంట్‌

► చంద్రబాబుపై మరో పిటి వారెంట్ దాఖలు, ఫైల్ నంబర్ 2916/2023
► ఫైబర్‌నెట్‌ కుంభకోణంలో చంద్రబాబు ప్రదాన ముద్దాయిగా పిటి వారెంట్
► రూ.115 కోట్ల నిధులు గోల్ మాల్ అయ్యాయని దర్యాప్తులో తేల్చిన సిట్
► 2021 లోనే ఫైబర్ నెట్ కుంభకోణంలో 19 మందిపై సిఐడి కేసు నమోదు
► నాటి FIRలో A1గా వేమూరి హరిప్రసాద్, A2గా మాజీ MD సాంబశివరావు
► చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు వేమూరి హరిప్రసాద్

05:12PM, సెప్టెంబర్‌ 19, 2023
ACB కేసులో విచారణ రేపటికి వాయిదా

► CID కస్టడీ పిటిషన్‌పై సమయం అడిగిన చంద్రబాబు లాయర్లు
► హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్న దృష్ట్యా కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలన్న చంద్రబాబు లాయర్లు
► రేపటి వరకు సమయం అడిగిన చంద్రబాబు లాయర్లు, సరేనన్న ACB కోర్టు
► CID వేసిన చంద్రబాబు కస్టడీ పిటీషన్ పై విచారణ రేపటికి వాయిదా

05:00PM, సెప్టెంబర్‌ 19, 2023
వాదనలు ముగిసాయి, 2 రోజుల్లో తీర్పు : హైకోర్టు

► ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి
► ఇప్పుడు కోర్టు నిర్ణయం తీసుకోనివ్వండి
► రెండు రోజుల్లో ఈ పిటిషన్‌పై తీర్పు ఇస్తాం

04:50PM, సెప్టెంబర్‌ 19, 2023
చివరిగా మరోసారి మా విజ్ఞప్తి వినండి  : బాబు లాయర్‌ లూథ్రా

► చంద్రబాబును ఈ కేసులో A1 అంటున్నారు
► నిధులు విడుదల చేసిన వ్యక్తే అసెంబ్లీలో ప్రకటన చేశారు
► నిజంగా తప్పు చేసి ఉంటే, లేదా కుంభకోణం కుట్ర ఉంటే సభలో ఎందుకు ప్రకటన చేస్తారు?
► సెక్షన్‌ 17A సవరణ ఈ కేసుకు వర్తిస్తుంది. గవర్నర్‌ అనుమతి తీసుకోకుండా అరెస్ట్‌ చేశారు
► ఈ కేసును రఫెల్‌ కేసుతో పోల్చవచ్చు. ఆ కేసులో జస్టిస్‌ జోసెఫ్‌ ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేసుకోవాలి
► మా వాదన అంతా 17A చుట్టే ఉంది. CID వాదనల్లో 90%, 10% అన్న దగ్గర కన్‌ఫ్యూజన్‌ ఉంది
► సీమెన్స్‌ కంపెనీ నుంచి వచ్చిన ఈ మెయిల్‌కు రిమాండ్‌ రిపోర్ట్‌కు తేడా ఉంది

04:45PM, సెప్టెంబర్‌ 19, 2023
ఈ కేసును ఇవ్వాళే ముగిస్తాం : హైకోర్టు

► ఈ కేసులో ఇంకేదైనా చెప్పుకోవాలంటే ఇప్పుడే అవకాశం ఇస్తున్నాం
► ఉదయం నుంచి ఇప్పటిదాకా ఇదే కేసులో వాదనలు విన్నాం
► ఈ కేసులో స్పష్టత వచ్చింది. చివరి అవకాశం ఇస్తున్నాం

04:35PM, సెప్టెంబర్‌ 19, 2023
బాబు లాయర్లు ఇచ్చినవి సరైన రిఫరెన్స్‌లు కావు.! : CID లాయర్లు

► ఈ కేసులో బాబు లాయర్లు అర్నబ్‌ గోస్వామి కేసును ఉదహరించారు
► అర్నబ్‌ గోస్వామిది వాక్‌ స్వాతంత్ర  హక్కుకు సంబంధించినది
► ఆ కేసుకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు
► ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి నుంచి పథకం ప్రకారం జరిగింది
► సెక్షన్482 పిటిషన్లపై నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది
► అరెస్టు చేయకూడదంటూ హైకోర్టులు ప్రతీసారి జోక్యం చేసుకోవద్దంటూ నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేసులో సుప్రీం తీర్పునిచ్చింది
► పోలీసులకు పూర్తి విచారణ చేసుకునే వెసులుబాటు కల్పించాలి
► ఈ కేసులో విచారణ ఇప్పుడే ప్రారంభమైంది… ఈడీ, ఇన్‌కంటాక్స్ కూడా విచారిస్తున్నాయి. దీనిని కోర్టు పరిగణలోకి తీసుకోవాలి

04:32PM, సెప్టెంబర్‌ 19, 2023
CID వాదనలు అభ్యంతరకరంగా ఉన్నాయి : బాబు లాయర్‌ సాల్వే

► ఈ ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నరేళ్లు పూర్తయ్యాయి
► ఈ ప్రభుత్వం ఇప్పుడు పైల్స్‌ కనిపించడం లేదని, అవి చంద్రబాబు మాయం చేశారని ఆరోపిస్తున్నారు
► 2018లోనే ఫిర్యాదు వచ్చిందన్న వాదనను మేం ఒప్పుకోం
► 2021లో నమోదయిన ఫిర్యాదునే కోర్టు పరిగణించాలి

04:32PM, సెప్టెంబర్‌ 19, 2023
సెక్షన్‌ 17A సవరణ ఈ కేసులో వర్తించదు : CID లాయర్‌

► ఈ కేసులో ప్రాథమిక విచారణ జూన్‌ 5, 2018న జరిగింది : పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి
► అంటే 2018లో సెక్షన్‌ 17A సవరణకు ముందే ఇది పూర్తయింది
► 2015 నుంచే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంపై ఆరోపణలున్నాయి
► ఒక సెక్షన్‌కు సంబంధించిన సవరణ కోసం దర్యాప్తు ఆగదు
► ఈ కేసులో శుక్రవారం కౌంటర్‌ ఫైల్‌ చేయగలం

04:25PM, సెప్టెంబర్‌ 19, 2023
సెక్షన్‌ 17A గురించి చర్చిద్దాం : బాబు లాయర్‌ హరీష్‌ సాల్వే

► CID లాయర్‌ వాదిస్తుండగా.. జోక్యం చేసుకున్న సాల్వే
► కేసు పెట్టింది 2020లో కాబట్టి 2018లో చేసిన సవరణ వర్తిస్తుంది
► సీమెన్స్‌ గుజరాత్‌లో కూడా ప్రాజెక్టు చేపట్టింది
► గుజరాత్‌లో ఎలా జరిగిందో.. ఏపీలో కూడా చంద్రబాబు అలాగే నిర్వహించారు
► ప్రభుత్వం కోరినట్టు ప్రాజెక్టు పూర్తయింది
► ఇక్కడ తప్పు ఎక్కడ జరిగి ఉండొచ్చంటే.. పన్ను ఎగ్గొట్టడానికి డిజైన్‌ టెక్‌ చేసిన ప్రయత్నంలో చంద్రబాబును ఇరికించారు
► 2024లో ఏపీ శాసనసభకు, లోక్‌సభకు ఎన్నికలున్నాయి
► చంద్రబాబును లోపల పెట్టడమన్నది రాజకీయ కక్ష కాకుంటే మరొకటని భావించలేం
► ఒక వేళ చంద్రబాబు విదేశాలకు పారిపోయి ఉంటే.. దాన్ని ఈ ప్రభుత్వం సంతోషంగా అనుమతించేది

04:20PM, సెప్టెంబర్‌ 19, 2023
క్వాష్‌ పిటిషన్‌ ఎందుకు కొట్టేయాలంటే... : CID లాయర్‌

► NCT ఢిల్లీ X ప్రీతీ సరఫ్‌ కేసును ప్రస్తావించిన CID లాయర్‌
► సాంకేతిక కారణాలు చూపించి క్వాష్‌ కొట్టేయడం సరికాదని సుప్రీంకోర్టు చెప్పింది
► సెక్షన్‌ CrPC 482 ప్రకారం దర్యాప్తు అధికారులను విచారణ పూర్తి చేసుకోనివ్వాలి

04:10PM, సెప్టెంబర్‌ 19, 2023
స్కిల్‌ డెవలప్‌ స్కాంలో ఎప్పుడు ఏం జరిగిందంటే.. కోర్టుకు వివరించిన CID లాయర్‌ రంజిత్‌

►నిందితులకు ఆదాయపుపన్నుశాఖ నోటీసులు జారీచేసింది
► స్కిల్‌ స్కాంపై ఆదాయంపన్ను శాఖ ఫోరెన్సిక్‌ ఆడిట్‌  నిర్వహించింది
► వాళ్ల మోడస్‌ ఆపరండీని మొత్తం ఇన్‌కంటాక్స్‌ పసిగట్టింది
► రూ.200 కోట్ల మేర నిధులను మళ్లించినట్టుగా IT తన ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో గుర్తించింది
► స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం నాటి చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్‌లో ఎలాంటి తేదీ కూడా లేదు
► ఒప్పందం చేసుకున్న వెంటనే డిజైన్‌ టెక్‌ స్కిల్లర్‌ కంపెనీతో ఒప్పందం చేసుకుంది
► ఎలాంటి ముందస్తు ఒప్పందం లేకుండానే ఈ కంపెనీని ఇన్‌కార్పొరేట్‌ చేశారు
► స్కిలర్‌ నుంచి రూ.178 కోట్లు కొనుగోలు చేసినట్టుగా డిజైన్‌టెక్‌ చూపింది
► ఒప్పదంలోకాని, ప్రతిపాదనలోకాని ఎలాంటి తేదీ కూడా లేదు
► డాక్యుమెంట్లలో ఎలాంటి తేదీలు కూడా లేవు, ఇది ఉద్దేశపూర్వకంగా విస్మరించారు
► ప్రభుత్వం ఉత్తర్వుల్లో కానీ, MOUల్లో ఎలాంటి స్థిరత్వం లేదు
► సంతకాలకు ముందే ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా 164 స్టేట్‌మెంట్‌లో నిందితులు అంగీకరించారు

04:00PM, సెప్టెంబర్‌ 19, 2023
ఇది పక్కా కుంభకోణమే, చంద్రబాబే సూత్రధారి, పాత్రధారి : CID లాయర్లు

► నేరం జరిగినప్పుడు తాను ముఖ్యమంత్రిని కాబట్టి ఇది రాజకీయ కక్ష్య అని చంద్రబాబు అంటున్నారు.
► విచారణ పూర్తై అధికారులు నివేదిక సమర్పించిన తరువాతే కోర్టు జోక్యం చేసుకోవాలి.
► FIRలో తన పేరులేదు కాబట్టి అరెస్టు చేయకూడదని చెప్పడం తప్పు
► FIR సర్వస్వం కాదు కోర్టులో కేసు విచారణ జరుగుతున్న సందర్భంలో కూడా పేరు చేర్చవచ్చు.
► ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో వ్యవహరించింది… అందుకే 2021లో చంద్రబాబు పేరును ఎఫ్ఐఆర్లో చేర్చలేదు
► ప్రైవేటు కంపెనీలు ఒక్క రూపాయి ఇవ్వకుండానే ప్రభుత్వానికి చెందిన 300కోట్లు రిలీజ్ చేశారు
► ముందుగానే ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేయడం అనేది ఎక్కడా ఉండదు.
► చంద్రబాబు ఆధ్వర్యంలోనే ఈ కుట్ర జరిగింది.. షెల్ కంపెనీలకు సైతం చంద్రబాబే సూత్రధారి, పాత్రధారి

03:48PM, సెప్టెంబర్‌ 19, 2023
కేవలం ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగానే అరెస్ట్‌ జరగలేదు: CID లాయర్లు

► దర్యాప్తు బృందంపై రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. కానీ, వీళ్లంతా శిక్షణ పొందిన అధికారులు. ఆరోపించేవాళ్లు ముందు ఈ విషయం గుర్తించాలి.  
► సీమెన్స్‌ కంపెనీతో జరిపిన మెయిల్‌ సంభాషణలు మా దగ్గర ఉన్నాయి. 
► చంద్రబాబు సెక్రటరీకి ఈడీ, ఐటీ నోటీసులు ఇచ్చాయి. ఆయన దేశం విడిచి అమెరికాకు పారిపోయారు. 
► సీమెన్స్‌కు నిందితుడు సుబ్బారావు, గంటా ఈమెయిల్స్‌ పంపారు.. అప్పటి ఏపీఎస్‌ఎస్‌డీసీ డైరెక్టర్‌ లక్ష్మీ నారాయణ కూడా ఇందులో బాగం అయ్యారు.
► కేవలం ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగానే చంద్రబాబు అరెస్ట్‌ జరగలేదు. 

03:23PM, సెప్టెంబర్‌ 19, 2023
పోలీసులపై నిందలు మోపుతారా? :  CID లాయర్లు
►ఈ కేసు ప్రారంభ దశలోనే ఉంది. బెయిల్‌ దరఖాస్తు చేసుకున్న దరిమిలా.. 10 రోజుల్లో దర్యాప్తు పూర్తి కాదు.
►ప్రభుత్వం ప్రతీకారమే తీర్చుకోవాలనుకుంటే.. ఈ పెద్దమనిషి (చంద్రబాబు నాయుడు) ఏనాడో అరెస్టు అయ్యేవారు కదా. 
►సెక్షన్ 17A ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకున్న అమాయక సేవకులను (innocent servants) రక్షించడం కోసం మాత్రమే.
►శంభూ నాథ్ మిశ్రా కేసును ఉదహరిస్తూ.. ‘‘రికార్డులను రూపొందించడం, నిధుల్ని దుర్వినియోగం చేయడం అధికారిక విధి కాదు."
►కేసు దర్యాప్తు దశలోనే ఉంది. ఐటీ శాఖ దర్యాప్తు చేస్తోంది. ఈడీ దర్యాప్తు చేస్తోంది. 
►నేను సీఎంను(మాజీ) కాబట్టే.. అనే అంశం ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఇది రాజకీయమైంది
►ఎంవోయూలో సబ్‌ కాంట్రాక్ట్‌ ప్రస్తావనే లేదు. ఎలాంటి సేవలు అందించకుండానే షెల్‌ కంపెనీలకు నిధులు వెళ్లాయి. 
► రూ. 3 వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది
► షెల్‌ కంపెనీల జాడ తీస్తున్నాం
► నిబంధనలకు వ్యతిరేకంగా ఎంవోయూ నుంచి సబ్‌ కాంట్రాక్టుకు ఎలా వెళ్లింది?
► అన్ని బోగస్‌ కంపెనీలు కలిపి ప్రజాధనాన్ని లూటీ చేశాయి. 
► ఫోరెన్సిక్‌ ఆడిట్‌ ద్వారా నిధుల దుర్వినియోగం జరిగింది
► ఈ డీల్‌కు కేబినెట్‌ ఆమోదం లేదు
► చంద్రబాబు పథకం ప్రకారమే తన అనుచరులతో కలిసి బోగస్‌ కంపెనీల పేరుతో రూ.371 కోట్ల ప్రజాధనం దోచుకున్నారు. 
►మార్గదర్శకాలను కూడా కోర్టు అనుసరించాలి. విచారణ పూర్తయ్యే దాకా ఆగాలి. దర్యాప్తు సంస్థను నివేదిక సమర్పించేదాకా వేచి చూడాలి. మెరిట్స్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడ. 

02:55PM, సెప్టెంబర్‌ 19, 2023
చంద్రబాబు క్వాష్‌పిటిషన్‌కు అనర్హుడు : CID తరపు లాయర్లు

► చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌కు అనర్హుడు
► ఎఫ్‌ఐఆర్‌ చేసిన వెంటనే చంద్రబాబును అరెస్ట్‌ చేయలేదు. 
► రెండేళ్లు అన్ని సాక్ష్యాలు సేకరించాకే అరెస్ట్‌ చేశారు.
► పోలీసులకు పూర్తి స్వేచ్చను ఇచ్చి.. క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేయాలి
► సెక్షన్‌ 319 ప్రకారం ఎన్ని ఛార్జిషీట్లు అయినా వేయొచ్చు.. ఎంత మంది సాక్ష్యులను అయినా చేర్చొచ్చు.

02:38PM, సెప్టెంబర్‌ 19, 2023
సీఐడీ తరపున వాదనలు

►చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
► గణపతి వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు తో పాటు శంభునాథ్ మిశ్రా కేసు లో తీర్పుల్ని వివరిస్తున్న ముకుల్‌ రోహత్గీ
► చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌కు అనర్హుడంటూ వాదనలు
► ఈ దశలో నిందితుడికి అనుకూలంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని హైకోర్టుకు విజ్ఞప్తి

02:25PM, సెప్టెంబర్‌ 19, 2023
లంచ్‌ విరామం తర్వాత మొదలైన కోర్టు

►లంచ్‌ తర్వాత మొదలైన హైకోర్టు
► క్వాష్‌ పిటిషన్‌పై వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు

1:58 PM, సెప్టెంబర్‌ 19, 2023
హైకోర్టుకు లంచ్‌ బ్రేక్‌..
►చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ లంచ్‌ తర్వాతకు వాయిదా
►లంచ్‌ తర్వాత వాదనలు వినిపించనున్న చంద్రబాబు లాయర్లు

1:40 PM, సెప్టెంబర్‌ 19, 2023
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో బాబు తరపున సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు
► చంద్రబాబును అరెస్ట్‌ చేసిన తీరుపై అభ్యంతరాలున్నాయి
► ఒక వేళ ఈ FIR 2018 సవరణ కంటే ముందు నమోదై ఉంటే అడిగేవాళ్లం కాదు
► కానీ FIR 2020లో నమోదయింది కాబట్టి చంద్రబాబును అరెస్ట్‌ చేయాలంటే గవర్నర్‌ అనుమతి తప్పనిసరి
► 2020లో అచ్చెన్నాయుడును అరెస్ట్‌ చేసినప్పుడు ఇలాగే జరిగింది
► కర్ణాటక కేసును ఉదహరించిన లూథ్రా, 17Aలో ముందస్తు అనుమతి అవసరమని వాదన
 

1:30 PM, సెప్టెంబర్‌ 19, 2023
చంద్రబాబును అరెస్ట్‌పై కాంగ్రెస్‌ ప్రకటన
► చంద్రబాబును అరెస్ట్‌పై మాట్లాడిన మధుయాష్కీ
► చంద్రబాబును జైలుకు పంపడం వెనుక మోదీ, కేసీఆర్ ఉన్నారు
► కేసీఆర్ పాత్ర పై మాకు పూర్తిస్థాయి సమాచారం ఉంది
► ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పనిచేసినందుకే చంద్రబాబుపై కక్షసాధింపు చర్యలు
► చంద్రబాబు అరెస్టు పై కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించలేదు? : మధుయాష్కి

12:30 PM, సెప్టెంబర్‌ 19, 2023
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో బాబు తరపున హరీష్‌ సాల్వే వాదనలు
► చంద్రబాబు అరెస్టులో సరైన నియామవళి పాటించలేదు
► చంద్రబాబు అరెస్టులో గవర్నర్ అనుమతి తీసుకోలేదు
► ప్రీవెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ యాక్ట్‌ సెక్షన్‌ 17A ప్రకారం అరెస్ట్‌ చూపించారు
► దీని ప్రకారం పోలీసులు గవర్నర్‌ అనుమతి తర్వాతే అరెస్ట్‌ చేయాలి
► ఈ కేసులో 2020లో FIR నమోదయింది, అప్పుడు బాబు పేరు లేదు
► అరెస్ట్‌ చేసే సమయానికి బాబు పేరు FIRలో లేదు
► FIRలో పేరు ఉంటేనే అరెస్ట్‌ చేయాలి కాబట్టి ప్రోసీజర్‌ సరిగా ఫాలో కాలేదు
► ఎన్నికలు వచ్చాయి కాబట్టి రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్‌ చేశారు
► సీమెన్స్‌ కంపెనీ రాసిన మెయిల్‌ ఆధారంగా APSSDC ఛైర్మన్‌ ఫిర్యాదు చేశారు
► స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో సేవలందించింది సీమెన్స్‌కు చెందిన ఉప కంపెనీనే
► ప్రభుత్వం బాధ్యత నిధులు విడుదల చేయడం, సేవలు పొందడం
► CID ఆరోపించినట్టు  ఎక్కడా సాక్ష్యాలను తారుమారు చేయలేదు
► ఈ కేసులో చంద్రబాబు సహకరిస్తున్నా.. అరెస్ట్‌కు తొందరపడ్డారు
► ముగిసిన హరీష్‌ సాల్వే వాదనలు

12:20 PM, సెప్టెంబర్‌ 19, 2023
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసును విచారిస్తోన్న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు
► కేసు నుంచి చంద్రబాబు పేరును తొలగించాలని క్వాష్‌ పిటిషన్‌
► చంద్రబాబు తరపున వర్చువల్‌లో (వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా) హరీష్‌ సాల్వే వాదనలు
► చంద్రబాబు తరపున రంగంలోకి దిగిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్థార్థ లూథ్రా, హరీష్ సాల్వే, సిద్దార్థ్ అగర్వాల్
► CID తరపున సుప్రీం న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు
 

12:09PM, సెప్టెంబర్‌ 19, 2023
► హైకోర్టు ముందుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ స్కాం
► ఈ కేసులో బెయిల్‌ ఇవ్వాలని చంద్రబాబు లాయర్ల పిటిషన్‌
► ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ స్కాం కేసును ఎల్లుండికి (ఈ నెల 21కి) వాయిదా వేసిన హైకోర్టు

11:30 AM, సెప్టెంబర్‌ 19, 2023
హైకోర్టులో మధ్యాహ్నం 12 తర్వాత రింగ్‌రోడ్డు కేసు విచారణ
► చంద్రబాబు రిమాండ్ పిటిషన్‌పై మధ్యాహ్నం 12 గంటలకు వాదనలు జరిగే అవకాశం
► సీనియర్ లాయర్‌ హరీశ్ సాల్వే హాజరవుతారు, సమయం కావాలన్న బాబు లాయర్లు
► చంద్రబాబు తరపు న్యాయవాదుల అభ్యర్ధనను అంగీకరించిన హైకోర్టు
► హరీష్‌ సాల్వే వల్ల జరిగిన ఆలస్యంపై CIDని అడిగిన హైకోర్టు
► తమకు అభ్యంతరం లేదని చెప్పిన ప్రభుత్వ న్యాయవాదులు

11:20 AM, సెప్టెంబర్‌ 19, 2023
పచ్చ మీడియా చెప్పని/చెప్పలేని అసలు నిజాలు
► అరెస్ట్‌ అక్రమమంటూ గొంతు చించుకుంటోన్న పచ్చమీడియా
► కేంద్ర సంస్థల నుంచి బాబుకు ఇప్పటివరకు వచ్చిన నోటీసులు
► కేంద్ర దర్యాప్తు సంస్థ నుంచి వచ్చిన ఏ ఒక్క నోటీసునూ బయటపెట్టని పచ్చ మీడియా
Case - 1

► ఆగష్టు 4న  ఇన్‌కమ్‌టాక్స్‌ నుంచి చంద్రబాబుకు అందిన నోటీసు
► అమరావతి కాంట్రాక్టర్ల నుంచి 600 కోట్ల కాంట్రాక్టులో (సచివాలయం బిల్డింగ్) 119 కోట్లు (20 శాతం ) ముడుపులు  
► బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరికి ఇచ్చానని చెప్పిన షాపూర్‌జీ పల్లోంజీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్
► ఆ నోటీసు గురించి ఇప్పటివరకు నోరు మెదపని బాబు, ఎల్లో మీడియా

Case - 2
► స్కిల్‌ డెవలప్‌మెంట్‌తో మాకు సంబంధం లేదని లిఖితపూర్వకంగా పంపిన సీమెన్స్‌
► అయినా సీమెన్స్‌ కంపెనీ, చాలా గొప్ప పని బాబు చేశారంటూ ఎల్లోమీడియా ప్రచారం
► టెండర్ లేకుండా తరలిపోయిన 371 కోట్ల గురించి అధికారులను అడగాలని తిరకాసు
► ఈ కేసులో నలుగురిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అరెస్ట్ చేసిన విషయం రహస్యం.!
► బాబు పర్సనల్ సెక్రటరీ మరియు మనోజ్ విదేశాలకు పారిపోయిన విషయం అత్యంత గోప్యం

Case - 3
► ఫిబ్రవరి 17,2020న ప్రెస్ నోట్ విడుదల చేసిన ఆదాయంపన్ను శాఖ
► స్వయంగా విడుదల చేసిన ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా
► బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో ఫిబ్రవరి 13 ,2020న తనిఖీలు
► ఐటీ అధికారులు సోదాల్లో 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలకు సంబందించి నల్లధన వివరాలు
► దీనికి సంబంధించి చంద్రబాబుకు ఇన్‌కంటాక్స్‌ నోటీసులు
► ఇప్పటివరకు నోటీసుల గురించి ఎక్కడా కోట్‌ చేయని పచ్చమీడియా

11:15 AM, సెప్టెంబర్‌ 19, 2023
 అల్లర్లను నమ్ముకున్న తెలుగుదేశం టీం
► గుంటూరు, విశాఖ, విజయవాడలో రోడ్లపైకి టిడిపి నేతలు
► ఎలాంటి అనుమతులు లేకుండా ర్యాలీ చేస్తామంటూ ఏర్పాట్లు
► జన జీవనానికి ఇబ్బందులు వస్తాయని వద్దని చెప్పిన పోలీసులు
► పలు చోట్ల పోలీసులతో వాగ్వాదం, అల్లర్లు చేసేందుకు ప్రయత్నాలు
► గుంటూరులో తెలుగుదేశం ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
► నక్కా ఆనంద్ బాబు, డేగల ప్రభాకర్, నన్నపనేని రాజకుమారిని నిలువరించిన పోలీసులు
► పూజలు చేస్తామంటూ వేర్వేరు దారుల్లో గుళ్లకు వస్తోన్న టిడిపి నేతలు
► దుర్గగుడికి ఆటోలో వచ్చిన దేవినేని ఉమ, వినాయకుడి గుడి వద్ద ఉమను గమనించి నిలువరించిన పోలీసులు

11:00 AM, సెప్టెంబర్‌ 19, 2023
హైబ్రీడ్‌ మోడ్‌లో చంద్రబాబు కేసు విచారణ.!
► నేరుగా వాదిస్తాం, వర్చువల్‌గా వాదిస్తాం...
► హైకోర్టుకు చంద్రబాబు తరపున లాయర్ల విజ్ఞప్తి
► ఒక సీనియర్‌ లాయర్‌, మరో సీనియర్‌ లాయర్‌ వర్చువల్‌గా
► ఆన్‌లైన్‌లో వాదనలు వినాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి
► మధ్యాహ్నం తర్వాత కేసు విచారణ చేపట్టనున్న హైకోర్టు

10:30 AM, సెప్టెంబర్‌ 19, 2023
కస్టడీ ఇస్తారా? రిమాండ్‌ పొడిగిస్తారా?
► హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో చంద్రబాబు పిటిషన్లపై నేడు విచారణ
► నేటితో ముగియనున్న నేటితో ముగియనున్న రిమాండ్‌
► సాధారణ ప్రక్రియలో భాగంగా రిమాండ్‌ పొడిగించే అవకాశం
► హైకోర్టుకు చేరుకున్న అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి
► మధ్యాహ్నం 12 గంటల తర్వాత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం

10:30 AM, సెప్టెంబర్‌ 19, 2023
ఏ కేసులో ఏ లాయర్‌ ? గంటకు ఫీజు ఎంత?
► చంద్రబాబు పిటిషన్లపై హేమాహేమీలను దించిన టిడిపి లీగల్‌ సెల్‌
► చంద్రబాబు కోసం రంగంలోకి దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లు
► క్వాష్‌ పిటిషన్‌పై వాదనలు వినిపించనున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లోథ్రా
► రిమాండ్ ఉత్తర్వుల సస్పెన్షన్‌, కస్టడీ ఇవ్వొందంటూ వాదించనున్న ముఖుల్ రోహత్గీ
► ఏపీ హైకోర్టులోనే మరో బెంచ్‌లో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణ
► ఈ పిటిషన్‌పై చంద్రబాబు తరపున హరీశ్‌ సాల్వే వర్చువల్‌ వాదనలు
► గంటకు కోటి అయినా ఇచ్చేందుకు టిడిపి లీగల్‌ సెల్‌ సిద్ధమని ఢిల్లీలో చర్చలు

10:10 AM, సెప్టెంబర్‌ 19, 2023
ఏపీ హైకోర్టుకు  చేరుకున్న లూథ్రా
► ఏపీ హైకోర్టుకు చేరుకున్న సీనియర్ లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా
► చంద్రబాబుపై నమోదయిన స్కిల్‌ కేసును కొట్టేయాలని లూథ్రా పిటిషన్‌
► లూథ్రా వేసిన క్వాష్‌ పిటిషన్‌ ఇవ్వాళ హైకోర్టులో విచారణ
► గత పది రోజులుగా కేసుపై వీపరీతంగా ప్రిపేర్‌ అయిన లూథ్రా
► చంద్రబాబును విడిపించే బలమైన లాజిక్‌ దొరక్క లూథ్రా నిర్వేదం
► నిర్వేదంలో గురు గోవింద్‌ సింగ్‌, స్వామి వివేకానంద కొటేషన్లతో ట్వీట్లు

10:00 AM, సెప్టెంబర్‌ 19, 2023
చంద్రబాబు కోసం దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లు
► చంద్రబాబు తరపున దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లు
► ముగ్గురు టాప్‌ మోస్ట్‌ లాయర్లతో టిడిపి లీగల్‌ సెల్‌ మంతనాలు
► ఇవ్వాళ హైకోర్టులో వాదనలు వినిపించనున్న ముగ్గురు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు
► సిద్ధార్ధ లూథ్రాతో పాటు హారీశ్ సాల్వే, సిద్ధార్ధ్ అగర్వాల్
► ఇతర పనుల నిమిత్తం ఫ్రాన్స్‌లో ఉన్న హారీశ్ సాల్వే
► ఎక్కడ ఉన్నా.. ఇక్కడ వాదనలు వినిపించాలని హారీశ్ సాల్వేకు టిడిప లీగల్‌ సెల్‌ విజ్ఞప్తి
► ఫ్రాన్స్ నుంచి వర్చువల్ గా వాదనలు వినిపించనున్న హరీశ్ సాల్వే

9:00 AM, సెప్టెంబర్‌ 19, 2023
యనమలపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు..
►చంద్రబాబు జైల్లో కూర్చుని విజన్ 2047 గురించి ఆలోచిస్తున్నారు.
►జాతీయ నేతలకు ధన్యవాదాలు చెప్పమన్నారని స్వయంప్రకటిత మేధావి యనమల రామకృష్ణుడు సెలవిస్తున్నారు.
►బెయిల్ కోసం ఆయన బెంబేలెత్తిపోతుంటే మీ బిల్డప్స్ ఏంటి రామా కృష్ణా!. 

08:12AM, సెప్టెంబర్‌ 19, 2023
►గుంటూరులో టీడీపీ నేతల పూజా కార్యక్రమాలు 
►చంద్రబాబు బెయిల్ కోసం ప్రత్యేక పూజలు
►వినాయక మండపాల వద్ద టీడీపీ నేతల పూజలు
►ఆధ్యాత్మిక ప్రాంతాల్లో రాజకీయాలు చేయడం ఏంటని భక్తుల ఆగ్రహం

7:59 AM
ఢిల్లీలో లోకేష్ వెంటే రఘురామ కృష్ణంరాజు
►రాజ్‌ఘాట్‌కు నారా లోకేష్‌, టీడీపీ మంత్రులు, ఎంపీలు
►అదే టీంలో రఘురామ కృష్ణంరాజు
►ఢిల్లీ వెళ్లినప్పటి నుంచి రఘురామ లాబీయింగ్‌పై ఆధారపడ్డ లోకేష్
►బీజేపీ పెద్దల అపాయింట్‌మెంట్లు ఇప్పించాలని విజ్ఞప్తి
►పార్లమెంటు సమావేశాలతో కేంద్ర పెద్దలు బిజీ బిజీ
►ఎలాగైనా వారి దృష్టిలో పడేందుకు టీడీపీ బృందం విశ్వప్రయత్నాలు

07:30 AM, సెప్టెంబర్‌ 19, 2023
లోకేష్‌లో గుబులు
► ఇంకా ఢిల్లీలోనే చంద్రబాబు కొడుకు నారా లోకేష్ 
► ఎల్లో మీడియాలో లోకేష్ పై విపరీతంగా ప్రచారం
► రాజమండ్రి రాగానే లోకేష్ ను అరెస్ట్ చేస్తారంటున్న ఎల్లో మీడియా
► రాజమండ్రికి రావాలా? వద్దా? ఇంకొన్నాళ్లు ఢిల్లీలోనే ఉండాలా?
► ఎల్లో మీడియా చెప్పినట్టు అరెస్ట్ చేస్తే రాజమండ్రి కంటే ఢిల్లీ బెటరా?
► ఢిల్లీలో సుప్రీంకోర్టు లాయర్లతో లోకేష్ మంతనాలు
► తనకు వ్యతిరేకంగా ఏయే ఆధారాలున్నాయన్నదానిపై చర్చ
► ఇవ్వాళ ఢిల్లీలో ఎంపీలతో కలిసి ధర్నాలో పాల్గొనున్న లోకేష్
► ఢిల్లీలో ఉదయం రాజ్ ఘాట్ సందర్శించనున్న లోకేష్ 
► ఎక్కడికి వెళ్లినా వెంట టిడిపి ఎంపీలు ఉండాలని సూచించిన లోకేష్

07:20 AM, సెప్టెంబర్‌ 19, 2023
పీక్స్‌కు చేరిన ఎల్లో మీడియా సానుభూతి ఆరాటం
► లోకేష్ ను అరెస్ట్ చేస్తారని ఎల్లో మీడియాలో భారీ ప్రచారం
► బాబును అరెస్ట్ కు లోకేష్ ను జత చేయాలని ఎల్లో మీడియా ఆరాటం
► ప్రజల్లో సానుభూతి తెచ్చుకొనేందుకు ప్రయాసలు
► ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేశ్‌ను అరెస్ట్ చేస్తారంటున్న ఎల్లో మీడియా
► ఫైబర్ గ్రిడ్ కేసులో ఇప్పటికే కొందరి అరెస్ట్
► రెండేళ్ల నుంచి ఫైబర్ గ్రిడ్ కేసులో దర్యాప్తు
► ఈ రోజు రాత్రి లోకేశ్ రాజమండ్రి చేరుకునే అవకాశం
► రాజమండ్రికి లోకేష్ రాగానే CID అరెస్ట్ చేస్తుందంటూ పచ్చ ప్రచారం

07:00 AM, సెప్టెంబర్‌ 19, 2023
అసలు మన లాయర్లు  ఏం చేస్తున్నారు? : చంద్రబాబు రుసరుస
► తన కేసు వాదిస్తోన్న లాయర్లతో కలుస్తానని నిన్న యనమలకు చెప్పిన చంద్రబాబు
► నేడు చంద్రబాబుతో సుప్రీంకోర్టు లాయర్ తో పాటు టీడీపీ లీగల్ సెల్ లాయర్లు కలిసే అవకాశం
► కేసులో సాంకేతిక లోపాలు ఏమున్నాయన్న దానిపై టిడిపి లీగల్ సెల్ రంధ్రాన్వేషణ
► ఏసీబీ కోర్టులో ఏం వాదించాలి? హైకోర్టులో క్వాష్ పిటిషన్ సందర్భంగా ఏం చెప్పాలి?
► బాబు కోసం భారీ కసరత్తు చేస్తోన్న సుప్రీంకోర్టు లాయర్లు

6:50 AM, సెప్టెంబర్‌ 19, 2023
టీడీపీవి బూటకపు వాదనలు..
► స్కిల్ స్కామ్ కేసులో మనోజ్ వాసుదేవ్ పార్థసాని, పెండ్యాల శ్రీనివాసరావు దేశం విడిచి పారిపోయారు. 
► వీరికి చంద్రబాబుతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి.
► ఈ కేసు విషయంలో టీడీపీ చేస్తున్నవన్నీ బూటకపు వాదనలు.
► స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రూ.371 కోట్ల అవినీతి జరిగినట్టు ఐటీ, ఈడీ నిర్ధారించాయి.
► చంద్రబాబు షెల్ కంపెనీలకు నిధులు మళ్లించి, తర్వాత వాటిని స్వాహా చేశాడు.
► ఇన్నేళ్ళ తర్వాత ఈ కేసులో చట్టం చంద్రబాబును పట్టుకుంది.

06:30 AM, సెప్టెంబర్‌ 19, 2023
ఏసీ లేని గదిలో ఎవరయినా ఉంటారా? : బాబుకు కోపమొచ్చింది..!
► రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహా బ్లాక్ లో చంద్రబాబు
► పదో రోజుకు చేరుకున్న చంద్రబాబు రిమాండ్ 
► నిన్న కుటుంబ సభ్యులను ములాఖత్ లో కలిసిన చంద్రబాబు
► కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేత యనమలతో బాబు చర్చలు
► తనకు గదిలో ఏసీ లేదని, ఇబ్బందిగా ఉందని బాబు తనతో చెప్పాడన్న యనమల
► కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్న జైలు అధికారులు
► చంద్రబాబు కాలక్షేపం కోసం అయిదు న్యూస్ పేపర్లు, టీవీ 
► స్నేహా బ్లాక్ లో ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్న చంద్రబాబు
► ఇంటి నుంచి అన్ని పూటల భోజనం, స్నానానికి వేడి నీళ్ల సదుపాయం

06:20 AM, సెప్టెంబర్‌ 19, 2023
హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం
► స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నేడు హైకోర్టులో విచారణ
► చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ
► జ్యుడీషియల్ రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరిన చంద్రబాబు
► చట్టవిరుద్ధంగా చంద్రబాబుని అరెస్ట్ చేశారని వాదించారన్న లాయర్ సిద్దార్థ లూథ్రా
► ఇవ్వాళ కౌంటర్ దాఖలు చేయనున్న CID
► అనంతరం ఇరు పక్షాల వాదనలు విననున్న హైకోర్టు 

06:15 AM, సెప్టెంబర్‌ 19, 2023
హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్ కేసు
► ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నేడు హైకోర్టులో విచారణ
► బెయిల్ కోరుతూ పిటిషన్ వేసిన చంద్రబాబు
► చంద్రబాబు వేసిన పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం

06:10 AM, సెప్టెంబర్‌ 19, 2023
బాబును కస్టడీకి ఇవ్వండి : CID విజ్ఞప్తి
► ఏసీబీ కోర్టులో CID కస్టడీ పిటిషన్
► స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ పిటిషన్
► కస్టడీకి ఇస్తే స్కాంకు సంబంధించి కీలక వివరాలు రాబడతామన్న సీఐడీ

6:00 AM, సెప్టెంబర్‌ 19, 2023
బెయిల్, మధ్యంతర బెయిల్.. ACB కోర్టులో నేడు విచారణలు
► ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ
► చంద్రబాబు తరపున మరో పిటిషన్, మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్
► బెయిల్ తో పాటు మధ్యంతర పిటిషన్ పై నేడు విచారణ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement