‘భ్రమరావతి కథలు’ పుస్తకాన్ని అవిష్కరిస్తున్న విజయ్‌బాబు, గౌతంరెడ్డి, అనిత్, కృష్ణంరాజు తదితరులు
సాక్షి, అమరావతి : తన ఒక్కడి స్వప్రయోజనం కోసం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అటు 29 గ్రామాల ప్రజలను ఇటు రాష్ట్రాభివృద్ధిని పణంగా పెట్టారని పలువురు మేధావులు, సామాజికవేత్తలు విమర్శించారు. అమరావతి దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణమని, ఇందులో రూ.లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారు. సమాజ నిర్మాణానికి మూల స్తంభంగా ఉండాల్సిన మీడియాలోని ఓ వర్గం కూడా ఆయనకు జత కలవడంతో రాష్ట్రానికి ముప్పు ఏర్పడుతోందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బహిరంగ దోపిడీలకు తెగబడిన చంద్రబాబు అధికారం కోల్పోయాక రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అటంకాలు కల్పిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తంచేశారు.
సీనియర్ జర్నలిస్ట్ అనిల్ గోపరాజు రచించిన ‘‘భ్రమరావతి కథలు’’ పుస్తకావిష్కరణ, ‘‘అమరావతి–మూడు రాజధానులు’’ అంశంపై విజయవాడలో ఆదివారం ప్రత్యేక సదస్సు జరిగింది. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో పలువురు వక్తలు మాట్లాడారు. అధికారం కోల్పోయిన చంద్రబాబు కక్ష కట్టినట్లుగా వ్యవహరించి అడుగడుగునా రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడ్డారని, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంపైనా వేయనన్ని కోర్టు కేసులు వేయించారని వారు గుర్తుచేశారు. ‘చంద్రబాబు ఓ మాయను సృష్టిస్తారు.. దాన్ని ఎల్లో మీడియా అది నిజమని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుంది.
అందుకోసం రాష్ట్ర ప్రయోజనాలను సైతం నాశనం చేశారు’.. అని ఆరోపించారు. ‘అమరావతి’ పేరుతో చంద్రబాబు చేసిన మోసాలన్నీ సమగ్రంగా అనిల్ గోపరాజు చక్కగా వివరించారన్నారు. ఈ భూ కుంభకోణంలో చంద్రబాబుతో పాటు నారా లోకేశ్‌కు కూడా భాగం ఉందని.. గతంలో నారా బ్రాహ్మణి ఇన్వెస్ట్‌మెంట్ అసోసియేట్‌గా పనిచేసిన సింగపూర్ కంపెనీకే చంద్రబాబు అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రాజెక్టును కట్టబెట్టారన్నారు.
టీడీపీ తప్పుడు ప్రచారంతో ప్రజలు ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని సామాజిక కార్యకర్త రజనీచౌదరి సూచించారు. సదస్సులో రాజకీయ విశ్లేషకుడు చింతా రాజశేఖర్, విద్యావేత్త డాక్టర్ జయప్రకాష్, అంధ్రా అడ్వకేట్స్ ఫోరం కన్వినర్ బి. అశోక్‌కుమార్, నాయీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి తుళ్లూరు సూరిబాబు, అఖిల భారత బ్రాహ్మణ మహాసభ జోనల్ కార్యదర్శి కృత్తివెంటి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులకు ‘రాష్ట్రాభివృద్ధి–సంక్షేమం’పై పోటీలు నిర్వహించి నగదు బహుమతులు అందజేశారు. ఇక సదస్సులో వక్తలు ఏమన్నారంటే..
బూర్జువా వ్యవస్థ ఏర్పాటుకు యత్నం
రాజకీయాల్లో అధికారాన్ని అడ్డుపెట్టి డబ్బు ఎలా సంపాదించాలో చంద్రబాబుకు బాగా తెలుసు. హైటెక్ సిటీ నిర్మాణంలోనూ మోసం చేశారు. ఇలా మోసాలు మొదలుపెట్టి, అమరావతి భూకుంభకోణంతో 100 తరాలకు సరిపడా ధనం పోగేసుకున్నారాయన. అంతేకాక.. ఈ ప్రాంతంలో మరో వర్గం ఉండకూడదని ఆరాటపడి చట్టాలు చేశారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటి బూర్జువా, జమీందారీ వ్యవస్థలను ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. కానీ, సీఎం జగన్ దాన్ని భగ్నం చేశారు. బాబు అమరావతి ప్రాంత రైతులను సైతం నిలువునా ముంచారు. ఈ ప్రాంత రైతులకు, సీఆర్డీఏల మధ్య జరిగింది వ్యాపార ఒప్పందం మాత్రమే. అమరావతి రాజధానిగా గెజిట్ నోటిఫికేషన్ లేదు. అక్కడ భూ సమీకరణ ప్రక్రియ ఇంకా పూర్తికానందువల్ల రాజధానిగా గుర్తింపు ఉండదు. – పి. విజయబాబు, అధికార భాషా సంఘం అధ్యక్షుడు
ఈశ్వరన్, బాబు తోడు దొంగలు
చంద్రబాబు స్వార్థం లేకుండా ఏ పనీ చేయరు. అమరావతి కూడా అలాంటిదే. ఈయనలాంటి వ్యక్తే సింగపూర్‌కు చెందిన మంత్రి ఈశ్వరన్ కూడా. ఈ తోడుదొంగలకు ఎల్లో మీడియా జతకలిసి రాష్ట్ర ప్రజలను మోసంచేశాయి. దాంతో అక్కడ ఈశ్వరన్, ఇక్కడ బాబు ఇద్దరూ జైలుకెళ్లారు. రాష్ట్రాభివృద్ధిపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజానికి.. సర్వతోముఖాభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ దేశానికే దిక్సూచిగా మారింది. వలంటీర్ వ్యవస్థ, సచివాలయాల ద్వారా పరిపాలనను, ప్రభుత్వ సేవలను మారుమూల గ్రామాల్లో ప్రజల ముంగిటకే సీఎం జగన్ తీసుకెళ్లారు. – పి.గౌతంరెడ్డి, ఏపీ ఫైబర్‌నెట్ చైర్మన్
రాజధాని లేకపోవడం బాబు పుణ్యమే
రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత చంద్రబాబుదే. ఇక్కడ 29 గ్రామాల మధ్య సన్నిహితులతో ఆయన ముందే భూములు కొనిపించారు. అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని నాటి కేంద్రంలోని కీలక వ్యక్తి సలహా ఇచ్చారు. దానికి అమరావతిగా ఓ పత్రికాధిపతి నామకరణం చేశారు. చంద్రబాబు మొత్తం పథకాన్ని అమలుచేశారు. వీరంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. ప్రస్తుతం సింగపూర్‌లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్.ఈశ్వరన్‌తో కలిసి చంద్రబాబు 1,691 ఎకరాల భూమిని ఆ దేశ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేశారు. – వీవీఆర్ కృష్ణంరాజు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
రాజధాని ఎక్కడైనా ఉండొచ్చు
పరిపాలన కోసం రాజధాని అవసరం. అది రాష్ట్రం మధ్యలోనే కాకుండా ఎక్కడైనా ఉండొచ్చు. అక్కడ ప్రైవేటు వ్యక్తులు, నివాసాలు ఎక్కడా ఉండవు. అమెరికా రాజధాని వాషింగన్ట్ డీసీలో కేవలం అధ్యక్ష భవనం, పార్లమెంట్, వివిధ శాఖల కార్యాలయాలు మాత్రమే ఉంటాయి. న్యూఢిల్లీలో సైతం అలాగే ఉంటాయి. కానీ, అందుకు భిన్నంగా చంద్రబాబు కొత్త రాజధాని నగరం అమరావతి నిరి్మస్తామంటూ ప్రజలను మోసం చేశారు. – కోడూరు కృష్ణారెడ్డి, నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్(నాటా) కో–కన్వినర్
ఆ భూములు ప్రభుత్వపరం చేయాలి
ఎక్కడైనా రాజధానిని ప్రభుత్వ భూములు, అవి లేని పక్షంలో పంటకు పనికిరాని భూముల్లో ఏర్పాటు చేయాలి. అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, సిబ్బంది నివాసాలు మాత్రమే ఉండాలి. ప్రైవేటు వ్యక్తులకు స్థానం ఉండదు. రాజధాని ప్రాంతాలైన న్యూఢిల్లీ, చంఢీగడ్‌లో కూడా భూములు ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. అమరావతి పేరుతో సమీకరించిన మొత్తం భూములను ప్రభుత్వపరం చేయాలి. యాజమాన్య హక్కులు ప్రభుత్వానికి మాత్రమే ఉండాలి. చంద్రబాబు ఒకే ఇంట్లో తగవులు పెట్టగల ఘనుడు. మోసం చేయడంలో దిట్ట. ముందే భూములు కొనిపించి రైతుల సంపదను బాబు కొల్లగొట్టారు. – డీఎస్‌ఎన్‌వీ ప్రసాదబాబు, జనవాహిని సామాజిక సంస్థ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment