
భూమి వినియోగ బోర్డు కావాల్సిందే
కొత్త రాజధాని ఏర్పాటు నేపథ్యంలో అధికారుల సూచన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ నేపథ్యంలో ఊహాగానాలకు తావివ్వకుండా, సాగుభూమికి చేటు లేకుండా ఉండాలంటే భూమి వినియోగ బోర్డు అవసరముందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. కొత్త రాజధాని నిర్మాణం పేరిట వ్యసాయ భూములను సేకరించిన పక్షంలో భవిష్యత్‌లో సాగు తగ్గి తిండి గింజలకు కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అధికార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. రిమోట్ సెన్సింగ్, సర్వేలు ద్వారా గ్రామాల వారీగా భూమి సామర్థ్యాన్ని మ్యాప్‌లతో సహా నిర్ధారించేందుకు 2000 సంవత్సరం వరకు కేంద్రం చాలా నిధులను వెచ్చించింది. ఇప్పుడు భూమి వినియోగ బోర్డును పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
కొత్త రాజధాని నిర్మాణం నేపథ్యంలో భూమి నిర్వహణ క్లిష్టంగా మారింది. వ్యవసాయేతర కార్యకలాపాల వినియోగానికి భూమి డిమాండ్, విలువ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు కాలుష్యంపై ఆందోళన, సాగు భూములు పోతున్నాయంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు.
జిల్లాలవారీగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న భూముల సామర్థ్యం ఆధారంగా పారిశ్రామిక, వ్యవసాయ, ఇతర కార్యకలాపాలకు నోటిఫై చేసి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలి. జిల్లాల వారీగా సాగు, పారిశ్రామిక, మైనింగ్ భూమి ఎంతనేది నిర్ధారించి శాస్త్రీయంగా జోనిఫికేషన్ చేయవచ్చు. వ్యవసాయానికి, పరిశ్రమలకు, మైనింగ్ లేదా ఇతర అవసరాలకు పనికివచ్చే భూములను నిర్ధారించవచ్చు.
{పజా విచారణ అనంతరం శాస్త్రీయంగా ఆయా ప్రాంతాలను వర్గీకరిస్తూ జోనిఫికేషన్ చేస్తే న్యాయస్థానాలతోపాటు ఇతరత్రా ఫిర్యాదులకు ఆస్కారం ఉండదని, ఈ విధంగా చేస్తే విస్తారమైన సాగు భూములను పరిరక్షించవచ్చని, వ్యవసాయ భూములను ఇతర అవసరాలకు వినియోగించకుండా సులభంగా నిరోధించవచ్చని చెబుతున్నారు. ఏ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయొచ్చో స్పష్టత ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమఅవుతోంది.
{పస్తుతం రాష్ట్ర విభజన, కొత్త రాజధాని ఏర్పాటు నేపథ్యంలో భూ వినియోగ బోర్డు ఏర్పాటునకు చట్టం తీసుకురావాల్సి ఉంది. ఇందుకోసం పెద్దగా వ్యయం కూడా కాదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సమాచారం అంతా అందుబాటులో ఉందని, తగిన సాంకేతిక బృందాలకు ఈ పనిని అప్పగిస్తే ఆరు నెలల్లోగా జిల్లా వారీగా ఏ ప్రాంతంలో ఏ జోన్ అనేది నిర్ధారించగలరని ఉన్నతాధికార వర్గాలు పేర్కొంటున్నాయి.