సీఆర్డీఏ బిల్లు సిద్ధం | capital region development authority bill ready | Sakshi
Sakshi News home page

సీఆర్డీఏ బిల్లు సిద్ధం

Published Mon, Nov 17 2014 6:15 PM | Last Updated on Tue, Aug 14 2018 3:30 PM

capital region development authority bill ready

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) బిల్లును రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. దీనిపై మంగళవారం కేబినెట్ లో చర్చించనున్నారు. రాజధాని భూముల సేకరణ బాధ్యతను సీఆర్డీఏకు అప్పగించనున్నారు. దీనికి సీఎం చంద్రబాబు నాయుడు చైర్మన్ గా వ్యవహరించనున్నారు.

సీఆర్డీఏలో గవర్నింగ్ బాడీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. సీఆర్డీఏకు ప్రత్యేక కమిషన్ ను కూడా ప్రభుత్వం నియమించనుంది. సీఆర్డీఏ ఏర్పాటు కాగానే విజయవాడ - గుంటూరు - తెనాలి - మంగళగిరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీజీటీఎం ఉడా) రద్దు కానుంది. వీజీటీఎం పరిధిలోని ఆస్తులన్నీ సీఆర్డీఏకు బదలాయించనున్నారు. సీఆర్డీఏ ఏర్పాటుకు ఏపీ కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపే అవకాశముంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement