విలక్షణ డిజైన్లు కావాలి!
రాజధాని మాస్టర్ ఆర్కిటెక్ట్ ‘నార్మన్ పోస్టర్’కు సీఎం సూచన
సాక్షి, అమరావతి: రాజధాని మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ పోస్టర్ ఇచ్చిన ప్రాథమిక డిజైన్లకు సీఎం చంద్రబాబు మళ్లీ పలు సూచనలు చేశారు. విలక్షణమైన డిజైన్లు కావాలని వారికి సూచించారు. లండన్ నుంచి వచ్చిన నార్మన్ పోస్టర్ సంస్థ ప్రతినిధులు బుధవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు.
ఇదిలా ఉండగా.. ఈసారి కాలువలు, చెరువులను అనుసంధానం చేసి రాష్ట్రంలో కరువే లేకుండా చేస్తామని చంద్రబాబు అన్నారు. ప్రకాశం బ్యారేజీ మెయిన్ బ్రాంచ్ కెనాల్ గేటు వద్ద కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. బస్సు ప్రమాద ఘటనపై వైఎస్సార్ సీసీ నేతలు రాజకీయం చేస్తున్నారన్నారు.