తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో నవ్యాంధ్రప్రదేశ్ రాజధానినిర్మిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కష్ణమూర్తి అన్నారు.
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో నవ్యాంధ్రప్రదేశ్ రాజధానినిర్మిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కష్ణమూర్తి అన్నారు. సోమవారం ఆయన కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. రెవెన్యూ విభాగంలో పని చేసే ప్రతి ఒక్కరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నానన్నారు. సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని సమర్థవంతంగా కార్యదక్షతతో ముందుకు నడిపిస్తున్నారని, అందుకు అవసరమైన మరింత శక్తిని ఆ శ్రీవేంకటేశ్వర స్వామివారే ప్రసాదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టే ఏ కార్యక్రమమైనా ఆటంకం లేకుండా దిగ్విజయంగా సాగుతుందన్నారు.