ke krishna murthy
-
కేఈ కుటుంబ కబంధహస్తాల్లో సుద్దవాగు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): డిప్యూటీ సీఎం కేఈ కుటుంబ కబంధ హస్తాల్లో చిక్కిన సుద్దవాగును పరిరక్షించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి కోరారు. కర్నూలు గణేష్ నగర్ వెంట పారుతున్న సుద్దవాగు కబ్జాకు గురైందన్న స్థానికుల సమాచారం మేరకు సీపీఎం నాయకులు కె. ప్రభాకరరెడ్డి, పి.రాముడు, సీహెచ్సాయిబాబా, ఆర్ నరసింహులు, వీ.వెంకటేశ్వర్లు, వీరన్న, రామకృష్ణ తదితరులతో కూడిన బృందం మంగళవారం అక్కడకు వెళ్లి పరిశీలించింది. ఏకంగా వాగునే ఆక్రమించుకోవడానికి చేసిన ప్రయత్నాలను చూసి వారు మండిపడ్డారు. వాగును పూడ్చేస్తే నీరు పారేదెలా అని ప్రశ్నించారు. ఇలా అయితే చిన్నపాటి వర్షానికే నీరు ఇళ్లలోకి చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందన్నారు. సుద్దవాగుకు రక్షణ గోడ నిర్మాణం కోసం గఫూర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిధులు మంజూరు చేయించినా తర్వాతి ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. ఈ కారణంగా ప్రస్తుతం వాగు ఆక్రమణదారుల చెరలో కనుమరుగైపోతోందన్నారు. వాగును ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా అధికారులు మిన్నకుండి పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆక్రమణదారులపై చర్యలు తీçసుకుని వాగును పరిరక్షించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. -
మంత్రి గారి తమ్ముడు..మహా ముదురు
అన్న చాటున తమ్ముడు ‘ప్రతాప’ం చూపుతున్నాడు. మంత్రి గారి తమ్ముడామజాకా.. అంటూ ఓ వైపు అధికారులకు చుక్కలు చూపిస్తూ.. మరో వైపు అక్రమ దందాకు తెరలేపారు. భూ బకాసురుడిగా మారి కనిపించిన ప్రభుత్వ భూములను కబ్జాకు పాల్పడుతున్నారు. వాగులు.. వంకలు.. పేదలకు పంపిణీ చేసిన స్థలాలు.. వక్ఫ్ భూములు రాత్రికి రాత్రే రియల్ వెంచర్లుగా మారిపోతున్నాయి. ఆన్లైన్లో రికార్డులు సైతం తారుమారవుతున్నాయి. దేవుని మాన్యాలను వదలడం లేదు. అక్రమార్జనకు రియల్ దందాతో పాటు ఇసుక, మట్టి, మద్యం వ్యాపారం చేస్తున్న డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కేఈ ప్రతాప్ వ్యవహారంపై ‘సాక్షి’ ఫోకస్.. సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఆయన సర్పంచ్ కాదు.. కనీసం వార్డు మెంబర్ కూడా కాదు. అయినా ఆయన చెప్పిందే అధికారులకు వేదం.. కేవలం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా ఉంటూనే అధికారికంగా ప్రొటోకాల్ పాటించేలా చేసుకుంటున్నారు. జన్మభూమి కమిటీ సమావేశాలు మొదలు.. అన్ని ప్రభుత్వ సమావేశాలను కూడా ఆయన నిర్వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి జిల్లాలో చేపట్టే అధికారిక కార్యకలాపాలన్నీంటికీ కేఈ ప్రతాప్ సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ సీఎం ఎక్కడ పర్యటించాలన్నా.. అధికారులు కూడా ముందస్తుగా ఈయన అనుమతి తీసుకోవాల్సిందే. అన్న చాటు తమ్ముడిగా డోన్‌లో అధికారాన్ని చెలాయిస్తూ అడ్డంగా దోచుకుంటున్నారు. రైల్వే జంక్షన్‌గా ఉన్న డోన్‌లో భూముల ధరలకు రెక్కలొచ్చింది మొదలు.. ఖాళీ భూములన్నింటినీ ఆయన హయాంలో అనుచరులు ఆక్రమించేసుకుంటున్నారు. మునిసిపాలిటీ మొదలు మార్కెట్ కమిటీ వరకూ ఆయనకు కప్పం కట్టాల్సిందే. అన్న మౌనం పూర్తి అంగీకారం అన్నట్టుగా చెలరేగిపోతున్నారు. దర్జీల స్థలాలు.. దర్జాగా కబ్జా 20 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు... ప్రస్తుత డిప్యూటీ సీఎంకేఈ కృష్ణమూర్తి జాతీయ రహదారి పక్కన ఉన్న 270 సర్వే నంబర్లో 4 ఎకరాల స్థలంలో టైలర్స్‌కు ఇళ్లపట్టాలు ఇచ్చారు. ఆయన చేతుల మీదుగా తమకు ఇళ్లపట్టాలు వచ్చాయన్న సంతోషంతో ఏకంగా ఆ కాలనీకి కేఈ కృష్ణమూర్తి నగర్‌గా పేరు పెట్టారు. అయితే, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా... అన్న పంచిన పట్టాలను తమ్ముడుఆధ్వర్యంలో అధికారపార్టీ నేతలు స్వాధీనం చేసుకున్నారు. తమ ఇళ్ల పట్టాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న సుమారు 200 బేస్ మట్టాలను నిర్దాక్షిణ్యంగా నేల మట్టం చేశారు. అయితే, ఇక్కడ ఎన్టీఆర్ గృహ నిర్మాణం పేరుతో బహుళంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. అసలైన లబ్ధిదారులను కాదని టీడీపీ కార్యకర్తలనే లబ్ధిదారులుగా ఎంపిక చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వంకను కుదించి.. ప్రభుత్వ నిధులతో గోడ కట్టి డోన్ పట్టణం నడి ఒడ్డున ఉన్న వంక భూమిని అధికారపార్టీకి చెందిన మరో నేత... చదును చేసుకుని పొలంగా మార్చడమే కాకుండా ఏకంగా ఉన్న కొద్దిపాటి వాగుకు అడ్డంగా గోడను కూడా నిర్మించారు. వాగు నీరు పొలంలోకి రాకుండా చేసేందుకు ఈ విధంగా చేసుకున్నారు. అయితే, ఈ గోడను కూడా ప్రభుత్వ నిధులతో నిర్మించడం గమనార్హం. నీరు – చెట్టులో 15 శాతం కమీషన్ నియోజకవర్గంలో ఉన్న వాగులు, వంకల్లో నీరు–చెట్టు పథకం కింద రూ.50 కోట్ల మేర పనులు మంజూరు చేసుకున్నారు. ఈ పనులను కాంట్రాక్టర్‌తోపాటు నేతలకూ అప్పగించారు. సుమారు 15 శాతం వరకూ కమీషన్ తీసుకుని పనులు అప్పగించినట్టు తెలుస్తోంది. అయితే, వాగులు, వంకల్లో మట్టి పూడిక తీత పనులు ముగిసిన తర్వాత... మళ్లీ నీరు–చెట్టు పథకం కింద చెక్‌డ్యాంల నిర్మాణ పనులను మంజూరు చేయించుకున్నారు. అయితే, ఈ పనులల్లో భారీగా ఆదాయం ఉండదని అనుకున్న తెలుగు తమ్ముళ్లు కాస్తా పనులను కాంట్రాక్టరుకు 5 శాతం కమీషన్‌కు అప్పగించారు. ఈ పనులు సిమెంటుతో కాకుండా ఇసుక సంచులతో చెక్‌డ్యాంలను నిర్మించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా నీరు–చెట్టు పనుల్లో తవ్విన మట్టిని... చెరువు కట్టడాలను మరింత పటిష్టం చేసేందుకు ఉపయోగించాలి. ఇందుకు విరుద్ధంగా.... చెరువుల నుంచి మట్టిని తరలిస్తున్న ప్రతి ట్రాక్టర్‌కు రూ.200 కప్పాన్ని ట్రాక్టర్ యజమానుల నుంచి వసూలు చేస్తున్నారు. అబ్బిరెడ్డిపల్లె, జగదూర్తి, ఉడుములపాడు, వెంగళాంపల్లె, కొచ్చెర్వు లాంటి చెరువుల వద్ద మట్టిని అక్రమంగా తరలిస్తూ ప్రతి రోజూ వేలాది రూపాయలను అక్రమంగా ఆర్జిస్తున్నారు. ఇసుక మేటల చాటున.. ఓ వైపు ప్రభుత్వం ఉచిత ఇసుకను అందిస్తున్నామని చెబుతోంది. ఇందుకోసం ఏకంగా ఇసుక పాలసీని తెచ్చామని ప్రచారం చేసుకుంటోంది. నియోజకవర్గంలో ఉన్న వాగులు, వంకల్లోని ఇసుకను ముందుగానే తోడుకుని భారీగా డంపులను ఏర్పాటు చేస్తున్నారు. ఎవరికి ఇసుక కావాలన్నా ఇక్కడి నుంచి తీసుకునే పరిస్థితి కల్పించారు. ట్రాక్టర్ కటకం ఇసుక రూ.800, ట్రాక్టర్ ప్లాస్టింగ్ ఇసుక రూ.1500 ఉండాల్సి ఉండగా టీడీపీ నాయకుని అండదండలతో ఇసుక రేట్లను అమాంతంగా పెంచేశారు. తాము తప్ప ఇసుకను ఎవరూ తరలించడం, విక్రయించడం చేయరాదని హుకూం జారీ చేశారు. కటకం ఇసుక రేటును రూ.2 వేలు, ప్లాస్టింగ్ ఇసుకను ట్రాక్టర్ రూ.5 వేల చొప్పున విక్రయిస్తున్నారు. వాస్తవానికి రోజువారీ అవసరాలకు మినహా ఇసుక డంప్‌లను ఏర్పాటు చేయడం నేరం. అంతేకాకుండా అటువంటి ఇసుక డంపులపై పోలీసు, రెవెన్యూ అధికారులు దాడులు చేసి స్వాధీనం చేసుకునే అధికారం కూడా ఉంది. అయితే, కళ్లెదుట భారీగా ఇసుక మేటలు కనిపిస్తున్నా అధికారులు మాత్రం మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇసుక కోసం సాధారణ ప్రజలు అధికారపార్టీ నేతలు చెప్పిందే రేటు చెల్లించి తీసుకెళ్లాల్సి వస్తోంది. ♦ డోన్ – బేతంచర్ల రహదారి పక్కనే పారిశ్రామిక వాడ ఆనుకొని ఉన్న 702 జెడ్‌లో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కొండను తొలిచి టీడీపీ నాయకులు నిరాటకంగా చదును చేస్తున్నా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇక్కడ చదును చేసిన స్థలాన్ని ఎకరా రూ.20 నుంచి రూ.30 లక్షల వరకు విక్రయించి సొమ్ము చేసుకొంటున్నారు. ♦ ప్యాపిలి మండలం ఊటకొండ గ్రామ పరిధిలోని ఉమా మహేశ్వర స్వామికి చెందిన 8.60 ఎకరాల భూమిని అధికారపార్టీ నాయకుడు ఆక్రమించుకున్నాడు. అనేక గ్రామాల్లో మాన్యం భూములను సైతం దిగమింగి దేవుళ్లకే శఠగోపం పెడుతున్నారు. ధూపదీప నైవేద్యాలు, నిత్యపూజల కోసం పూర్వికులు ఏర్పాటు చేసిన మాన్యం భూములను సైతం అధికారపార్టీ నాయకులు వదలడం లేదు. బంధువుల ఇంటికి దారేశారు.. డోన్ మునిసిపాలిటీలోనూ అధికారపార్టీ నేతలదే పెత్తనంగా సాగుతోంది. మునిసిపాలిటీ చైర్ పర్సన్ కోట్రికె గాయత్రీదేవి జన నివాసాల్లో అభివృద్ధి పనులు చేపట్టకుండా తన బంధువులైన కోట్రికె శేషయ్య కుటుంబీకుల స్థలాల్లో డ్రైనేజీ, సీసీరోడ్లును నిర్మించారు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను ఈ విధంగా పక్కదారి పట్టిస్తున్నారు. ♦ ఏ మాత్రమూ జన నివాసాలు లేని ప్రాంతాల్లో కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకే కన్నపుకుంట, దత్తనగర్ ప్రాంతాల్లో సీసీరోడ్లను నాసిరకంగా నిర్మించి జేబులు నింపుకున్నారు. అంతేకాకుండా పనులన్నింటినీ నామమాత్రంగా టెండరు ప్రక్రియను అమలు చేసి అత్యధికం పనులను నామినేషన్‌పై అప్పగిస్తున్నారు. ♦ ఎవరైనా ధైర్యంగా కొన్ని పనులకు టెండర్లు వేసేందుకు వస్తే వారిపై దాడులకు తెగబడుతున్నారు. మున్సిపల్ టెండర్లలో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ మద్దతుదారులపై కేఈ ప్రతాప్ అనుచరులు దాడులు చేసి హత్యచేసేందుకు ప్రయత్నించారు. ♦ మున్సిపల్ పరిధిలో లే –అవుట్ లేకుండానే స్థలాలను ప్లాట్లుగా వేసి కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి లక్షలాది రూపాయలను అధికారపార్టీ నేతలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని మూలంగా ఏటా కోట్లాది రూపాయల ఆదాయాన్ని మున్సిపాలిటీ నష్టపోతోంది. గోనె సంచుల్లోనూ గోకుడే వేరుశనగ, కంది పంటలను కొనుగోలు చేసిన మార్క్‌ఫెడ్ అధికారులు రైతులకు ఖాళీ సంచులను తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా గతేడాది నియోజకవర్గంలోని రైతులకు లక్షా 80 వేల సంచులను తిరిగి ఇవ్వాల్సి ఉంది. అయితే అధికారపార్టీ నాయకునికి కప్పం కింద పెద్ద మొత్తంలో చెల్లించాల్సి రావడంతో మార్క్‌ఫెడ్ అధికారి రైతులకు ఖాళీ సంచులు ఇవ్వకుండా ఎగనామం పెట్టారు. అధికారి నుంచి వసూళ్లు చేసిన మొత్తాన్నే దిన, వారం సంత కోసం మున్సిపాలిటీకి సదరు నాయకుడు డిపాజిట్ చెల్లించారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరుగుదొడ్లలోనూ... డోన్ నియోజకవర్గంలో పేద ప్రజలు నిర్మించుకొన్న వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లులను సైతం థర్డ్‌పార్టీ పేరుతో అధికారపార్టీ నేతలు దిగమింగారు. లబ్ధిదారులకు అందాల్సిన బిల్లులన్నీ థర్డ్‌పార్టీ అవతారం ఎత్తిన టీడీపీ నాయకులు తమ బ్యాంక్ ఖాతాల్లో లబ్ధిదారుల సొమ్మును వేయించుకొని స్వాహా చేశారు. ప్యాపిలి, బేతంచర్ల, డోన్ మండలాల్లోని అనేక గ్రామాల్లో ఈ దోపిడీ పర్వం నిరాటకంగా సాగింది. ఏకంగా ఇదే ఆరోపణలతో ఒక ఎంపీడీఓపై సైతం వేటు పడింది. దర్జీల స్థలాలు.. దర్జాగా కబ్జా 20 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు... ప్రస్తుత డిప్యూటీ సీఎంకేఈ కృష్ణమూర్తి జాతీయ రహదారి పక్కన ఉన్న 270 సర్వే నంబర్లో 4 ఎకరాల స్థలంలో టైలర్స్‌కు ఇళ్లపట్టాలు ఇచ్చారు. ఆయన చేతుల మీదుగా తమకు ఇళ్లపట్టాలు వచ్చాయన్న సంతోషంతో ఏకంగా ఆ కాలనీకి కేఈ కృష్ణమూర్తి నగర్‌గా పేరు పెట్టారు. అయితే, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా... అన్న పంచిన పట్టాలను తమ్ముడుఆధ్వర్యంలో అధికారపార్టీ నేతలు స్వాధీనం చేసుకున్నారు. తమ ఇళ్ల పట్టాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న సుమారు 200 బేస్ మట్టాలను నిర్దాక్షిణ్యంగా నేల మట్టం చేశారు. అయితే, ఇక్కడ ఎన్టీఆర్ గృహ నిర్మాణం పేరుతో బహుళంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. అసలైన లబ్ధిదారులను కాదని టీడీపీ కార్యకర్తలనే లబ్ధిదారులుగా ఎంపిక చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వంకను కుదించి.. ప్రభుత్వ నిధులతో గోడ కట్టి డోన్ పట్టణం నడి ఒడ్డున ఉన్న వంక భూమిని అధికారపార్టీకి చెందిన మరో నేత... చదును చేసుకుని పొలంగా మార్చడమే కాకుండా ఏకంగా ఉన్న కొద్దిపాటి వాగుకు అడ్డంగా గోడను కూడా నిర్మించారు. వాగు నీరు పొలంలోకి రాకుండా చేసేందుకు ఈ విధంగా చేసుకున్నారు. అయితే, ఈ గోడను కూడా ప్రభుత్వ నిధులతో నిర్మించడం గమనార్హం. ఖాళీ జాగా.. వేసెయ్ పాగా.. మునిసిపాలిటీగా మారిన తర్వాత డోన్‌లో భూమి ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో అధికార తెలుగుదేశం పార్టీ నేతల కన్ను ప్రభుత్వ స్థలాలపై పడింది. ప్రధానంగా వాగులు, వంక భూములతో పాటు వక్ఫ్ భూములపై కన్నేశారు. అనుకున్నదే తడువుగా.... ఆయా భూములను అధికార పార్టీ అండతో నేతలు కాస్తా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఈ విధంగా ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా సరే తీసేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. పెద్దొంక హాంఫట్ డోన్ పట్టణ నడిబొడ్డున ఉన్న సర్వే నంబర్ 323/ఏ లో ఉన్న 2.70 ఎకరాల విస్తీర్ణంలోని వక్ఫ్‌బోర్డు భూమిని అధికార పార్టీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ కేశన్న గౌడ్‌ను అడ్డుపెట్టి ఆక్ర మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూమి విలువ ఎకరా సుమారు రూ. 5 కోట్లు ఉంటుందని అంచనా. దీనిపై వక్ఫ్ అధికారులు చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారు. మరోవైపు రెవెన్యూ అధికారులు తమకేమీ సంబంధం లేదన్నట్టుగా మిన్నకుండిపోతున్నారు. ఏకంగా డిప్యూటీ సీఎం కాస్తా రెవెన్యూ మంత్రి కావడంతో రెవెన్యూ అధికారులు... ఫిర్యాదులు వచ్చినప్పటికీ కనీసం కన్నెత్తి చూసేందుకు కూడా వెనుకాడుతున్నారు. ఈ భూమికి ఆనుకొని ఉన్న పెద్దొంకను సమూలంగా నాశనం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం పెద్దొంక నీటిని ఇతర వంకలకు మళ్లించేందుకు పెద్దొంకకు గండికొట్టారు. నాయీ బ్రాహ్మణుల గూడు కొల్లగొట్టారు పట్టణ నడిబొడ్డున కోట్లాది రూపాయల విలువ చేసే సర్వే నంబర్ 379/1 రెండెకరాల విస్తీర్ణంలోని భూమిని 15 ఏళ్ల క్రితం నాయీ బ్రాహ్మణులకు ఇళ్లపట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ స్థలంలో లబ్ధిదారులు అధిక వడ్డీలకు అప్పులు చేసి బేస్ మట్టాల వరకు నిర్మాణాలు చేపట్టారు. అయితే మున్సిపల్ వైస్ చైర్మన్ కేశన్న గౌడ్ ఆధ్వర్యంలో కేఈ ప్రతాప్ సూచనల మేరకు ఈ ప్రాంతంలోని బేస్ మట్టాలను ప్రొక్లైన్లతో నేలమట్టం చేశారు. నాయీ బ్రాహ్మణుల గోడును పట్టించుకోకుండా వారి స్థలాల్లో ప్లాట్లువేసి సెంటు రూ.5లక్షల చొప్పున విక్రయించి సొమ్ము చేసుకొన్నారు. ఈ విషయం పై నాయీ బ్రాహ్మణులు లోలోపల రగిలిపోతున్నారు. ఎవరికి ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగదనే నిరాశలో మిన్నుకున్నారు. గంగ పుత్రుల స్థలం.. అనుచరుల పరం పట్టణ శివారులోని పారిశ్రామిక వాడ సమీపంలోని సర్వే నంబర్ 564లో 4.80 ఎకరాలు, 914 సర్వే నంబర్లో 1.70 ఎకరాల విస్తీర్ణంలో గంగమ్మ మాన్యం భూమి ఉంది. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కేఈ ప్రతాప్ ఆధ్వర్యంలో ఆయన అనుచరులు మాన్యం భూమిని ఆక్రమించి పునాదులు కూడా తీశారు. దీంతో గంగపుత్రులు తమకు న్యాయం చేయాలంటూ కేఈ ప్రతాప్‌ను ఆశ్రయించగా ‘మీకు అంత భూమి అవసరం లేదు’ అని పంచాయితీ నిర్వహించి కేవలం రెండెకరాలు మాత్రమే కేటాయించి మిగిలిన 4.50 ఎకరాలను తన అనుచరులకు ధారాదత్తం చేశారనే విమర్శలు ఉన్నాయి. పక్కనే ఉన్న బుగ్గమాన్యం భూమిని సైతం ఆక్రమించి ప్లాట్లు వేసి టీడీపీ నాయకులు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే, ఇన్ని జరుగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు మాత్రం అటువైపుగా వెళ్లి కనీసం పరిశీలించేందుకు కూడా సాహసించడం లేదు. -
కేఈ కుటుంబానికి రెండు సీట్లు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లాలో సీట్ల కేటాయింపుపై గురువారం కసరత్తు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా మొదట కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సీట్ల కసరత్తును శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకూ చేపట్టారు. కేఈ కుటుంబానికి పత్తికొండ, డోన్ సీట్లను ఖరారు చేసినట్టు తెలిసింది. పత్తికొండ నుంచి కేఈ శ్యాంబాబు, డోన్ నుంచి కేఈ ప్రతాప్ బరిలో ఉండేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇక ఆదోని నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసిన మీనాక్షి నాయుడుకు మొండిచేయి చూపారు. ఈ స్థానం నుంచి బుట్టా రేణుకను బరిలో దించాలని భావిస్తున్నారు. కర్నూలు సీటు కోసం పోటీ పడుతున్న ఎస్వీ మోహన్ రెడ్డి, టీజీ భరత్ల్లో.. ఎస్వీవైపే చంద్రబాబు మొగ్గుచూపినట్టు తెలిసింది. ఎస్వీకే సీటు ఇవ్వాలని మంత్రి లోకేష్ పట్టుబట్టడంతో సీఎం అంగీకరించినట్లు సమాచారం. కర్నూలు నియోజకవర్గంపై సమావేశం జరగక ముందే..ఎస్వీకే సీటు ఖరారు అంటూ అనుకూల మీడియాకు లీకులిచ్చి బ్రేకింగ్ ఇప్పించినట్టు తెలుస్తోంది. ఈ స్థానంలో సర్వే ప్రకారం ఎస్వీకి వ్యతిరేకత ఉన్నప్పటికీ.. టీజీ వర్గం కచ్చితంగా సహకరించి గెలిపించాలని ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఎమ్మిగనూరు సీటుజయనాగేశ్వరరెడ్డికి ఇవ్వాలని నిర్ణయించగా.. మంత్రాలయం సీటు ఇన్చార్జ్ తిక్కారెడ్డికే కేటాయించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆలూరు, కోడుమూరు సీట్లపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రధానంగా కోట్ల కుటుంబం పార్టీలో చేరనున్న నేపథ్యంలో ఆలూరు సీటుపై స్పష్టత ఇవ్వలేదు. ఎమ్మెల్యే మణిగాంధీ, ఇన్చార్జ్ విష్ణువర్దన్ రెడ్డి మధ్య విభేదాల నేపథ్యంలో కోడుమూరు సీటు ఖరారు కాలేదని తెలిసింది. కోట్ల చేరిక అనంతరమే ఈ రెండు సీట్లపై స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఎంపీగా పోటీలో ఉంటారని, కావున ఆదోని నుంచి బరిలో ఉండాలని బుట్టా రేణుకకు సూచించినట్టు తెలిసింది. మరోవైపు బనగానపల్లె నుంచి బీసీ జనార్దన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని కూడా చంద్రబాబు దాదాపుగా ఖరారు చేశారు. కలసి పనిచేయాల్సిందే! ఈ ఎన్నికలు పార్టీకి ఎంతో కీలకమని, అందరూ కచ్చితంగా కలసి పనిచేయాల్సిందేనని కర్నూలు నేతలకు చంద్రబాబు చెప్పారు. ఈ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైతే అందరి రాజకీయ భవిష్యత్‌కు ఇబ్బందులు ఉంటాయని అన్నట్లు తెలిసింది. నియోజకవర్గంలో ఏయే నేతలతో ఏ విధంగా ఉంటున్నారు? వారిని ఏ విధంగా కలుపుకుని పోవాలనే అంశాలను కూడా వివరించినట్టు సమాచారం. గంటకో నియోజకవర్గం... వాస్తవానికి కర్నూలు జిల్లా సమీక్ష సమావేశం గురువారం సాయంత్రమే జరగాల్సి ఉంది. అయితే, వైఎస్సార్ జిల్లా సమీక్ష సమావేశం గురువారం రాత్రి 11.30 వరకూ కొనసాగింది. దీంతో జిల్లా సమీక్ష పైపైన చేసి శుక్రవారానికి వాయిదా వేశారు. శుక్రవారం సాయంత్రం కర్నూలు పార్లమెంటు పరిధిలోని సీట్లపై కసరత్తు ప్రారంభించారు. మొదట డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని పిలిచి మాట్లాడారు. పత్తికొండ నుంచి కేఈ కృష్ణమూర్తినే పోటీ చేయాలని కోరినట్టు తెలిసింది. అయితే, వయసురీత్యా తాను పోటీలో ఉండలేనని, తన కుమారుడికి సీటు ఇవ్వాలని ఆయన కోరినట్టు సమాచారం. ఇందుకు సీఎం అంగీకరించడమే కాకుండా డోన్ కూడా ఆయన కుటుంబీకులకే ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఒక్కో నియోజకవర్గం సమీక్షకు సుమారు 45 నిమిషాల నుంచి గంటపాటు చంద్రబాబు కేటాయించారు. ఈ సందర్భంగా అభ్యర్థికి ఉన్న పాజిటివ్ అంశాలతో పాటు నెగటివ్ అంశాలను ఆయన వివరించారు. ఏ విధంగా ముందుకు వెళ్లాలి.. పార్టీ తరఫున ఎంత ఫండింగ్ ఇస్తారన్న అంశాన్ని కూడా పేర్కొంటున్నట్టు సమాచారం. ఈ డబ్బును ఎవరు చేరవేస్తారు? ఏ విధంగా చేరవేస్తారనే విషయాన్ని కూడా వివరించినట్టు తెలిసింది. -
మోసకారి టీడీపీకి బుద్ధిచెబుదాం...
అభివృద్ధిని విస్మరించి బీసీలను ఓటు బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే వాడుకుంటున్న మోసకారి టీడీపీకి ఓటుతో బుద్ధిచెబుదామని పలువురు బీసీ కులాల నాయకులు, వైఎస్సార్సీపీ బీసీ అ«ధ్యయన కమిటీ నేతలు స్పష్టం చేశారు. బీసీలు అంటే టీడీపీకి, చంద్రబాబుకు చిత్తశుద్ధి్ద లేదన్నారు. అందులో భాగంగానే బీసీ మంత్రి కేఈ కృష్ణమూర్తిని అమరావతిలో దేవుడు సాక్షిగా అవమానించారని మండిపడ్డారు. చిత్తూరు, తిరుపతి రూరల్: ఈ నెల 17న ఏలూరులో నిర్వహించే బీసీ గర్జన సమరభేరికి సమాయత్తం చేసేందుకు తిరుపతి తుమ్మలగుంటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం రాయలసీమ రీజియన్ బీసీ గర్జన సన్నాహక సమావేశం జరిగింది. వైఎస్సార్సీపీ బీసీ అధ్యయన కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీసీ గర్జన సభను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు, నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధుల పాత్ర, బీసీల కోసం వైఎస్సార్సీపీ చేపట్టనున్న సంక్షేమ పథకాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వం బీసీలను మోసగిస్తున్న తీరుపై మండిపడ్డారు. బీసీలను రాజకీయంగా అణగదొక్కుతున్నారని విరుచుకుపడ్డారు. నవరత్నాల పథకాలతో బీసీ ల్లోని అన్ని కులాలకు సమన్యాయం జరుగుతుం దని అభిప్రాయపడ్డారు. బీసీల సంక్షేమం కోసం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని బీసీ అధ్యయన కమిటీ చైర్మన్ జంగా కృష్ణమూర్తి అన్నారు. బీసీల్లోని ప్రతి కులం అభివృద్ధి చెందాలనే ముందుచూపుతో 2017 నవంబర్‌లో బీసీ అ«ధ్యయన కమిటీని ఏర్పాటు చేశారన్నారు. ఈ కమిటీ నివేదికలతో పాటు పాదయాత్రలో వచ్చిన సమస్యలను సైతం క్రోడీకరించి ప్రతి సమస్యకు పరిష్కారం చేసేలా ఈ నెల 17న జరిగే బీసీ గర్జన సభలోజగనన్న బీసీలకు వరాలు ప్రకటిస్తారని తెలిపారు. బీసీల సంక్షేమం, అభివృద్ధికి వేదికగా బీసీ గర్జన సదస్సును నిర్వహిస్తున్నామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఏలూరులో నిర్వహించే బీసీ గర్జన సభే పార్టీకి సంబంధించి మొదటి ఎన్నికల సన్నాహక సభగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి గ్రామం నుంచి ప్రాతినిథ్యం ఉండేలా నాయకులు చొరవ చూపాలని సూచించారు. బీసీల సంక్షేమానికి నిరంతరం తపించిన నాయకుడు దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి మాత్రమేనని మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి అన్నారు. ఆయన అడుగుజాడల్లోనే ఆయన కుమారుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి బీసీలకు అండగా ఉంటారని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన నాలుగున్నర ఏళ్లలో అభివృద్ధిని విస్మరించిన చంద్రబాబు, మోసపూరిత హామీలతో జనం ముందుకు రావాలని చేస్తున్న ప్రయత్నాలను పార్టీలకతీతంగా బీసీలు అందరూ తిప్పికొట్టాలని తిరుపతి మాజీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ పిలుపునిచ్చారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా వేలాది కిలోమీటర్ల మేర వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రజా సంకల్పయాత్ర బీసీల భరోసాయాత్రగా జరిగిందని అనంతపురం పార్లమెంటరీ జిల్లా పార్టీ సమన్వయకర్త పీడీ రంగయ్య అన్నారు. బీసీలను రాజకీయంగా ఎదగనీయకుండా చంద్రబాబు అణిచివేస్తున్నారని గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి ఆరోపించారు. కుప్పంలో గెలిచిన తర్వాత ఉన్నత విద్యావంతుడైన చంద్రమౌళిని మంత్రిని చేస్తామని ఇప్పటికే వైఎస్ జగనన్న ప్రకటించారని గుర్తు చేశారు. కుప్పంను కబళించిన అవినీతి తిమింగలం చంద్రబాబు అని వైఎస్సార్సీపీ కుప్పం సమన్వయకర్త చంద్రమౌళి ధ్వజమెత్తారు. ఈసారి ఓటుతో బీసీలు చంద్రబాబును తరిమికొట్టడం ఖాయమని మాజీ ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డి చెప్పారు. జగన్ వస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని పాణ్యం నియోజకవర్గ సమన్వయకర్త కాటసాని రామ్‌భూపాల్‌రెడ్డి అన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చి అమలు చేయని మోసకారి చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ జిల్లా సమన్వయకర్త రామయ్య పిలుపునిచ్చారు. బీసీ గర్జనలో బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం జగనన్న ఊహించని వరాలను ప్రకటించనున్నారని అధ్యయన కమిటీ సభ్యుడు మీసాల రంగన్న తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సంజీవయ్య, మాజీ మంత్రి నర్సాగౌడ్, వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాయలసీమ రీజియన్ సమన్వయకర్త పుల్లయ్య, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, గంగుల బీజేంద్రనాథ్‌రెడ్డి, మేరుగ మురళి, కర్నాటి ప్రభాకర్, మిద్దెల హరి, వెంకటేష్, నర్సింహగౌడ్, సుధాకర్, చిన్నరాజు, బొమ్మగుంట రవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నా పరిస్థితేంటి?!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్న నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుక పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోంది. కర్నూలు పార్లమెంట్ సీటును కోట్లకు కేటాయించే అవకాశముంది. దీంతో తన పరిస్థితి ఏమిటంటూ బుట్టా రేణుక నేరుగా ముఖ్యమంత్రికి ఫోన్ చేసి అడిగినట్లు తెలుస్తోంది. ఇంకా సీట్ల విషయం ఖరారు కాలేదని పేర్కొన్న సీఎం.. వాటి గురించి తర్వాత మాట్లాడదామంటూ ముక్తసరిగా ఫోన్ సంభాషణ ముగించినట్టు సమాచారం. దీంతో ఆమె మరింతగా మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. కాగా.. బుట్టా పార్టీ మారేటప్పుడు టీడీపీలోఎంతో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇవ్వడమే కాకుండా తిరిగి ఎంపీ సీటు కేటాయిస్తామని చెప్పారని ఆమె వర్గీయులు అంటున్నారు. స్వయంగా మంత్రి లోకేష్ కర్నూలు పర్యటన సందర్భంగా ఎంపీగా బుట్టాను తిరిగి గెలిపించాలని పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు ‘జయహో బీసీ’ అని నినదిస్తూనే ఒక బీసీ మహిళకు అన్యాయం చేస్తున్నారని అధికార టీడీపీ వైఖరిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎలా వెళతాం! వాస్తవానికి బుట్టా రేణుక రాజకీయాలకు కొత్త. అయినప్పటికీ ఆమెను గత ఎన్నికల్లో కర్నూలు ఎంపీ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. పార్టీకి ఉన్న బలంతో ఆమె ఎంపీగా గెలిచారు. తీరా గెలిచిన తర్వాత ఆమె భర్త తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆమె మాత్రం వైఎస్సార్సీపీలో కొనసాగారు. అయితే, టీడీపీ ఆకర్ష్ పథకంలో భాగంగా రూ.50 కోట్ల నగదుతో పాటు ఆమె పాఠశాలకు అమరావతిలో భూ కేటాయింపునకు హామీ పొందారు. తీరా టీడీపీలో చేరిన తర్వాత ఆమెకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడు ఎంపీ సీటు కూడా లేకుండా పోతోంది. అయితే.. ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారనే ఆశతో వర్గీయులు ఉన్నారు. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డికి మంత్రి లోకేష్ అండదండలున్నాయి. దీంతో ఆయనకే టికెట్ ఇస్తారని అంటున్నారు. ఫలితంగా రెంటింకీ చెడ్డ రేవడిలా బుట్టా పరిస్థితి తయారైంది. ఇదే తరుణంలో బీసీ మహిళకు టీడీపీ అన్యాయం చేసిందన్న అభిప్రాయాన్ని బీసీ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీ వైఖరిపై నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు పెద్దన్నగా పిలవబడే డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి కనీసం కోట్ల చేరికపై సమాచారం కూడా లేకపోవడాన్ని ఆయన వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. మౌనంగా కేఈ వర్గం జిల్లాలో మొదటి నుంచి కోట్ల, కేఈ కుటుంబాల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. ఇరువర్గాలకు చెందిన అనేక మంది నేతలు, కార్యకర్తలు ఫ్యాక్షన్‌కు బలైపోయారు. గ్రామాల వారీగా వర్గాలుగా విడిపోయారు. ఇప్పుడు కోట్ల టీడీపీలో చేరనుండడంతో కేఈ వర్గీయులు మండిపడుతున్నారు. మొదటి నుంచి రాజకీయ వైరుధ్యంతో ఉన్న కోట్లతో ఎలా సర్దుకుపోతామంటూ పార్టీ వైఖరిపై ఆగ్రహిస్తున్నారు. ఈ పరిణామాలపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కూడా గుమ్మనంగా స్పందించారు. కోట్ల చేరికపై తనకు సమాచారం లేదన్నారు. అంతేకాకుండా తమ సీటు అడిగితే అప్పుడు స్పందిస్తానని పరోక్షంగా సంకేతాలు పంపారు. మొత్తమ్మీద ప్రస్తుత పరిణామాలను కేఈ వర్గం సునిశితంగా గమనిస్తోంది. కోట్లకు ఏయే సీట్లు ఇవ్వనున్నారనే అంశంపై స్పష్టత వచ్చిన తర్వాత తమ పూర్తిస్థాయి స్పందన తెలియజేయాలని భావిస్తున్నారు. -
టీడీపీలో ‘కోట్ల’ కలకలం.. డిప్యూటీ సీఎం అలక
సాక్షి, కర్నూలు: టీడీపీలోకి మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కుటుంబం రాకపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అలక వహించారు. కేఈ కృష్ణమూర్తికి సమాచారం లేకుండానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి అపాయింమెంట్ ఇచ్చారు. టీడీపీలో కోట్ల కుటుంబం రాకను చాలా కాలంగా వ్యతిరేకిస్తు వస్తున్న కేఈ కృష్ణమూర్తికి ఈ పరిణామాలు మింగుడు పడటం లేదని సమాచారం. ఇప్పటికే కేఈ కృష్ణమూర్తి అధికారాలను కత్తిరించి అవమానించిన చంద్రబాబు.. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని టీడీపీలో చేర్చుకోవాలని యోచిస్తున్నారు. మరోవైపు, టీడీపీలోకి కోట్ల రాకపై కేఈ కృష్ణమూర్తి సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. టీడీపీలో కోట్ల కుటుంబం చేరికపై తనకెలాంటి సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో తనపై వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలిపారు. రాజకీయంగా తొలి నుంచి కోట్ల కుటుంబంతో పోరాడుతున్న కేఈ కృష్ణమూర్తి వర్గం.. చంద్రబాబు తాజా నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. -
టీడీపీలో ‘కోట్ల’ కలకలం.. డిప్యూటీ సీఎం అలక
-
కేఈ వర్సెస్ తుగ్గలి
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలో ఉన్న కేఈ, తుగ్గలి నాగేంద్ర మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. రైల్వే కాంట్రాక్టు పనుల విషయంలో విభేదాలు ముదిరి, ఏకంగా దాడులు చేసుకునే దాకా పరిస్థితి వెళ్లింది. రైల్వే కాంట్రాక్టు పనులు చేస్తున్న ప్రాంతంలోకి కేఈ శ్యాంబాబు స్టిక్కరు తగిలించుకున్న వాహనంలో ఆయన అనుచరులు వచ్చి.. కాంట్రాక్టు సంçస్థకు చెందిన లారీలు, జేసీబీలపై దాడులు చేశారని తుగ్గలి నాగేంద్ర అంటున్నారు. లింగనేనిదొడ్డి నుంచి గుంతకల్లు వరకు మొత్తం 50 కిలోమీటర్ల మేర రూ.78 కోట్లతో రైల్వే లైన్ డబ్లింగ్ పనులు జరుగుతున్నాయి. వీటిని తుగ్గలి నాగేంద్ర అండదండలతో కాంట్రాక్టర్లు చేస్తున్నారనేది కేఈ వర్గం భావన. కాంట్రాక్టు చేయొద్దని తుగ్గలిని వారించినప్పటికీ వినకపోవడం వల్లనే ఈ ఘటనలు జరుగుతున్నాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తమను బెదిరించేందుకు చేస్తున్న ఈ ఘటనలకు భయపడబోమని తుగ్గలి నాగేంద్ర అంటున్నారు. కేఈ శ్యాంబాబు ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ నేత చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజా సంఘటనలోనూ ఆయనపై సొంత పార్టీ నేతనే ఆరోపణలు చేయడం గమనార్హం. మరోవైపు దీనిపై కేఈ వర్గం ఇంకా అధికారికంగా స్పందించలేదు. మొదటి నుంచి ఇరువర్గాల మధ్య నెలకొన్న విభేదాలు ఇప్పుడు ఏకంగా దాడుల దాకా వెళ్లడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు జరిగిన సంఘటనకు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొదటి నుంచీ అదే తీరు! వాస్తవానికి ఇరువర్గాల మధ్య ఆధిపత్యపోరు మొదటి నుంచీ నడుస్తోంది. అయితే, చంద్రబాబు కుటుంబానికి తుగ్గలి నాగేంద్ర దగ్గర కావడంతో కేఈ వర్గం ఆయన్ను ఏమీ చేయలేకపోతోందన్న అభిప్రాయం ఉంది. ఇక ఏటా నిర్వహించే సామూహిక వివాహ మహోత్సవానికి జిల్లాలోని అందరు నేతలను పిలిచిన తుగ్గలి నాగేంద్ర.. కేఈ కుటుంబాన్ని మాత్రం దూరంగా ఉంచారు. అలాగే వివిధ కార్పొరేషన్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో కేఈ వర్గం వారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మండల కార్యాలయంలో హల్చల్ చేశారు. తమ వర్గానికి కూడా కార్పొరేషన్ రుణాలు అందేలా జాబితా రూపొందించాలంటూ ఉద్యోగులపై చిందులు వేశారు. దీంతో నాగేంద్రపై కేసు పెట్టేదాకా పరిస్థితి వెళ్లింది. ఇక రైల్వే కాంట్రాక్టు విషయంలో ఎవ్వరూ టెండరు వేయవద్దని కేఈ వర్గం నుంచి హెచ్చరికలు వెళ్లాయి. ఈ కాంట్రాక్టు పనులను వారే తీసుకోవాలని భావించారు. అయితే, దీన్ని ఖాతరు చేయని తుగ్గలి నాగేంద్ర టెండర్లో పాల్గొనడమే కాకుండా పనులు సైతం దక్కించుకున్నారు. ఇది కేఈ వర్గానికి మింగుడుపడని వ్యవహారంగా మారింది. ఈ నేపథ్యంలోనే రైల్వే పనులు చేస్తున్న ప్రాంతానికి వెళ్లి.. లారీలు, జేసీబీల అద్దాలు పగలగొట్టి, పనులు చేయవద్దంటూ బెదిరింపులకు దిగారు. వారు కేఈ శ్యాంబాబుకు చెందిన స్టిక్కర్లు అతికించిన వాహనాల్లో వచ్చారని తుగ్గలి నాగేంద్ర అంటున్నారు. దీనిపై పోలీసు స్టేషన్లోనూ ఫిర్యాదు చేశారు. అయితే, ఇప్పటివరకు కేఈ కుటుంబంపై ఎటువంటి కేసు నమోదు కాలేదు. -
కాంగ్రెస్‌తో పొత్తుపై మరోసారి కేఈ వ్యాఖ్యలు
సాక్షి, కర్నూలు : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు అంశం టీడీపీతో తీవ్ర కలకలం రేపుతోంది. కాంగ్రెస్ దౌర్భాగ్యం తమకెందుకంటూ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఇటీవల వ్యాఖ్యానించడం.. దానికి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందని ఇటు చంద్రబాబునాయుడు, అటు టీడీపీ నాయకత్వం సంకేతాలు ఇస్తున్నా.. కేఈ కృష్ణమూర్తి వెనుకకు తగ్గడం లేదు. ఆయన మరోసారి పొత్తు అంశంపై మాట్లాడారు. తెలుగుదేశం జాతీయ పార్టీ అని, ఇతర రాష్ట్రాల్లో పలు పార్టీలతో టీడీపీ పొత్తులు ఏ విధంగా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండబోదని ఆయన తెగేసి చెప్పారు. ఇప్పటికే కేఈ వ్యాఖ్యలపై వర్ల రామయ్య మండిపడిన సంగతి తెలిసిందే. పార్టీ వేదికల్లో అభిప్రాయం చెప్పాలని, బహిరంగంగా మాట్లాడి పార్టీ కేడర్‌కు ఏం సందేశమిస్తున్నారని కేఈని ఉద్దేశించి వర్ల వ్యాఖ్యానించారు. వర్ల ఎవరు తనకు చెప్పడానికని డిప్యూటీ సీఎం కేఈ మండిపడ్డారు. కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో కిందిస్థాయి కేడర్ నుంచి వచ్చిన అభిప్రాయాలనే తాను వెల్లడించానని చెప్పారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే ఎన్టీఆర్ పార్టీని స్థాపించారనే విషయం తమ మనస్సుల్లో హత్తుకుపోయిందన్నారు. కాంగ్రెస్ పొత్తుపై మాట్లాడినందుకు సీఎం చంద్రబాబు తనను మందలించారనడంలో నిజం లేదన్నారు. ధర్మపోరాటం సభలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఈ నేతలు ఇరువురు మీడియాతో మాట్లాడారు. -
రూ.750 కోట్లతో ఆధునిక పనిముట్లు
కర్నూలు(అర్బన్): రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ పథకం–2 ద్వారా బీసీ కుల వృత్తులకు ఆధునిక పనిమట్లు అందించేందుకు ప్రభుత్వం రూ.750 కోట్లను వెచ్చిస్తున్నదని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు. బుధవారం స్థానిక ఎస్టీబీసీ కళాశాల మైదానంలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆదరణ పథకం ద్వారా బీసీ కుల వృత్తులకు ఆందించేందుకు ఆధునిక పనిముట్ల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ..ఆదరణ –2 పథకానికి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న బీసీలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 25వ తేదీతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరో నెల రోజులు పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల ద్వారా బీసీలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఆదరణ పథకం ద్వారా జిల్లాలో 22,500 మందికి లబ్ధి చేకూర్చనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ తెలిపారు. ఆధునిక పనిమట్లును 90 శాతం సబ్సిడీతో అందించనున్నట్లు చెప్పారు. రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, శాలివాహన, వాల్మీకి, వడ్డెర ఫెడరేషన్ల చైర్మన్లు తుగ్గలి నాగేంద్ర, బీటీ నాయుడు, దేవళ్ల మురళీ, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లికార్జున, ఈడీ కే లాలా లజపతిరావు , జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ఎంపీడీఓలు, ఆయా కార్యాలయాల సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాగా.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో ఆదరణ సభ ఆంతరాయం ఏర్పడింది. షామియానాల నుంచి వర్షపు నీరు సభా వేదిక మీదకు పడడంతో అందరూ చెల్లాచెదురయ్యారు. వర్షంలోనే డిప్యూటీ సీఎం కేఈ కొద్ది సేపు తన ప్రసంగాన్ని కొనసాగించారు. -
రమణ దీక్షితులుపై క్రమశిక్షణా చర్యలు: కేఈ
సాక్షి, అమరావతి: టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించారని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. దీనిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని.. ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులను ఆదేశిస్తున్నట్లు చెప్పారు. గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రమణ దీక్షితులు ఇటీవల చాలా తప్పులు చేశారని చెప్పారు. ఒక ప్రధాన అర్చకుడు రాజకీయాలు మాట్లాడటం ఆలయ నియమాలకు విరుద్ధమన్నారు. ఇంతవరకూ రమణ దీక్షితులు వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోలేదన్నారు.ఇప్పుడు హద్దులు దాటి మరీ ఆరోపణలు చేస్తున్నందున ఇక ఉపేక్షించేది లేదని చెప్పారు. ఆయన చేసిన పనులపై ప్రత్యేక విచారణ జరిపిస్తామని మంత్రి వెల్లడించారు. అవసరమైతే టీటీడీ ఆస్తులు, ఆభరణాలపై తనిఖీకి ఆదేశిస్తామన్నారు. డాలర్ శేషాద్రి విషయం గురించి కూడా ఆరా తీస్తామన్నారు. -
టీడీపీ వల్లే బీజేపీ బాగుపడింది
సాక్షి, పెద్దాపురం : తెలుగుదేశం వల్లే రాష్ట్రంలో బీజేపీ బాగుపడిందే తప్ప బీజేపీ వల్ల టీడీపీకి వచ్చిన ప్రయోజనం ఏమీ లేదని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో పర్యటించిన ఆయన బీజేపీపై మండిపడ్డారు. అన్ని రాష్ట్రాలను మోదీ సమానం చూడాలంటూ చురకలంటించారు. అభివృద్ధిలో కొన్ని రాష్ట్రాలు ముందుండి, కొన్ని రాష్ట్రాలు వెనుకబడటం దేశానికి మంచిది కాదంటూ మోదీని హెచ్చరించారు. బీజేపీ దేశాన్ని ఉత్తర, దక్షిణ ప్రాంతాల పేరుతో వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు. దక్షిణ భారతాన్ని విస్మరిస్తే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమంటూ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక వనరులు, పోలవరం త్వరాగా పూర్తవుతుందనే కారణంగానే బీజేపీతో మిత్రపక్షంగా చేరామని ఆయన అన్నారు. నాలుగు ఏళ్లపాటు తమ సమస్యలను బీజేపీ అధిష్టానానికి విన్నవించినా స్పందన లేదని, పైగా కక్షసాధింపు చర్యలకు దిగారని కేఈ మండిపడ్డారు. ఏపీకి ఇచ్చిన నిధులపై రాష్ట్ర బీజేపీ నేతలు శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంట్లో అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలు వెనక్కిపోయాయని, తిరుపతిలో వెంకన్న సాక్షిగా మోదీ ఇచ్చిన హామీలు వెనక్కిపోయాయని విమర్శించారు. ప్రధాని ఏది కూడా సక్రమంగా చేయకపోవడం వల్లే కేంద్ర మంత్రులు రాజీనామాలు చేశారని పేర్కొన్నారు. పోలవరం పూరఇ చస్తే చంద్రబాబుకు మంచిపేరు వస్తుందనే ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు విడుదల చేయడంలేదని విమర్శించారు. రాష్ట్రానికి మోదీ చేసిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టకుని కర్ణాటక ఎన్నికల్లో తెలుగువారిని బీజేపీకి ఓటు వేయవద్దని చెప్పామంటూ సమర్ధించుకున్నారు. -
నాన్ బెయిలబుల్ వారెంట్ కొట్టేయాలి
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో కర్నూలు జిల్లా డోన్ మొదటి తరగతి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. నారాయణరెడ్డి భార్య కె.శ్రీదేవి దాఖలు చేసిన ప్రైవేటు పిటిషన్‌ను విచారించిన డోన్ మేజిస్ట్రేట్ కోర్టు శ్యాంబాబుకు ఎన్బీడబ్ల్యూ జారీ చేసింది. ఇదే కేసులో డోన్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై ఎస్సై నాగతులసీప్రసాద్ హైకోర్టు నుంచి స్టే ఉత్తర్వులు పొందారని, వారెంట్‌పై స్టే మంజూరు చేయాలని కేఈ శ్యాంబాబు తరఫు సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి కోరారు. గురువారం కేసు విచారణ ప్రారంభం కాగానే శ్రీదేవి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి లేచి.. శ్యాంబాబు దాఖలు చేసిన పిటిషన్లో డోన్ కోర్టు జరిపే విచారణను కొట్టేయాలని కోరలేదని, ఈ వ్యాజ్యం చెల్లదన్నారు. వ్యాజ్యాన్ని టైపింగ్ చేసే దశలో సాంకేతికంగా జరిగిన పొరపాటు వల్ల అలా జరిగిందని వీరారెడ్డి బదులిచ్చారు. సవరణలతో వ్యాజ్యాన్ని తిరిగి దాఖలు చేస్తామని కోరారు. అయినా హైకోర్టు నోటీసులు జారీ చేయకుండానే ప్రతివాది అయిన శ్రీదేవి కౌంటర్ పిటిషన్ ఏవిధంగా దాఖలు చేస్తారని ప్రశ్నించారు. పిటిషనర్ కేఈ శ్యాంబాబును ఏనాడైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముందని, స్టే మంజూరు చేయాలన్నారు. వాదనల అనంతరం పిటిషన్‌ను సరవరించి దాఖలు చేసేందుకు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ అనుమతించారు. విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేశారు. కర్నూలు జిల్లా చెరుకులపాడు గ్రామానికి చెందిన నారాయణరెడ్డి హత్యకేసులో శ్యాంబాబు, జెడ్పీటీసీ కప్పట్రాళ్ల బొజ్జమ్మలను నిందితులుగా చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం చార్జిషీటులో వారి పేర్లను తొలగించారు. దాంతో లక్ష్మీనారాయణరెడ్డి భార్య శ్రీదేవి డోన్ కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. దీనిని విచారించిన డోన్ మేజిస్ట్రేట్ కోర్టు శ్యాంబాబుకు ఎన్బీడబ్ల్యూ జారీ చేసింది. -
కేఈ ధ్రుతరాష్ట్రుడిగా మారారు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి రాష్ట్ర రాజకీయాల్లో భీష్మాచార్యుడు అనుకుంటే ధ్రుతరాష్ట్రుడిగా మారారని వైఎస్ఆర్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య విమర్శించారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న రీతితో తమ్ముడు కేఈ ప్రభాకర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకుని సీఎం చంద్రబాబునాయుడు తప్పులను కప్పిపుచ్చేలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భిక్షతో వచ్చిన ఎమ్మెల్సీ పదవిని పట్టుకొని అది తమ బలం అనుకుంటే పొరపాటన్నారు. సీఎం చంద్రబాబునాయుడు సమకాలికుడినని చెప్పుకునే కేఈ ఆయన చేస్తున్న రాజకీయ వ్యభిచారాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. జిల్లాలో కేఈ కుటుంబానికి మంచి ఆదరణ ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం స్వతంత్ర అభ్యర్థులతో ఎందుకు రాజీ కావాల్సి వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. టీడీపీ మాజీ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి అంటే మండిపడే ఆయన ఎమ్మెల్సీ కోసం రాజీపడడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ పదవిని అడ్డుపెట్టుకొని బైరెడ్డి రాజశేఖరరెడ్డి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని చెప్పారు. మరోవైపు జిల్లాలో నిజంగా టీడీపీ బలం ఉందనుకుంటే ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని ఆయన డిప్యూటీ సీఎంకు సవాల్ విసిరారు. విలువలతో కూడిన రాజకీయాల కోసం వైఎస్ఆర్సీపీ లోకి... పదవుల కోసం పాకులాడే కేఈ కుటుంబం ఎదుటి వారిపై నిందలు వేయడం సిగ్గుచేటని బీవై రామయ్య మండిపడ్డారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి తనను పదవుల కోసం కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చానని విమర్శించడం తగదన్నారు. ఆదర్శ రాజకీయాలు చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగు జాడల్లో నడవాలని తాను వైఎస్ఆర్సీపీలో చేరానన్నారు. ప్రజల కోసం, నీతివంతమైన రాజకీయాలు చేస్తున్న వైఎస్ఆర్సీపీలో తాను చేరడం బిచ్చం ఎత్తుకోవడం ఎలా అవుతుందో ఆయనే చెప్పాలన్నారు. ఎంపీ టిక్కెట్ కోసం డాక్టర్ పార్ధసారథి, పత్తికొండలో రాజకీయాల కోసం జెడ్పీ మాజీ చైర్మన్ బత్తిన వెంకట రాముడుపై దాడి చేసిన చరిత్ర కేఈ కుటుంబానిదన్నారు. -
కేఈ అధికారాలకు సీఎం కత్తెర
సీఎం చేతికి డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు, పోస్టింగ్‌లు సాక్షి, అమరావతి: రెవెన్యూ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అధికారాలకు కత్తెర పడింది. డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు, పోస్టింగ్‌ల అధికారాన్ని రెవెన్యూ శాఖ నుంచి సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేశారు. ఈమేరకు బిజినెస్ రూల్స్‌లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
తిమింగలాలను తప్పిస్తారా
విచారణ తూతూ మంత్రమేనా? lవిశాఖ భూ కుంభకోణం విచారణపై బాధితుల్లో అనుమానాలు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భూ కబ్జాల్లో భారీ తిమింగలాలను తప్పిస్తారా? విచారణ తూతూ మం త్రమేనా? ఇప్పుడు విశాఖ జిల్లా వాసుల్లో ఇవే సందేహాలు. విశాఖ జిల్లాలో భూ కుంభకోణాలు, రికార్డుల ట్యాంపరింగ్‌పై ఈనెల 15న ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సమక్షంలో విశాఖ కలెక్టరేట్లో బహిరంగ విచారణ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయి తే దీనిపై ప్రజల్లో పలు సందేహాలు వెల్లువెత్తాయి. టీడీపీ పెద్దలను గట్టున పడేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికారుల వ్యవహారశైలి కూడా అనుమానాలు బలపడే విధంగానే ఉన్నాయి. రికార్డుల ట్యాంపరింగ్‌పై వచ్చిన ఫిర్యాదులపై అధికార యం త్రాంగం అత్యంత రహస్యంగా వ్యవహరిస్తోంది. వచ్చిన ఫిర్యాదుల్లో ఏ ఒక్కటీ బహిర్గతపరచొద్దంటూ భూముల కుంభకోణం వ్యవహారంపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన కమాం డ్ కంట్రోల్ అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో ఈ నెల 15న జరిగే బహిరంగ విచారణపై బాధితుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందా లేదా అనే ఆందోళన చెందుతున్నారు. విశాఖ నగ రం.. దాని చుట్టుపక్కల గ్రామీణ మండలాల్లో భారీ ఎత్తున జరిగిన రికార్డుల ట్యాంపరింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో బాధితులు ఫిర్యాదు చేయడానికి కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. డిప్యూటీì కలెక్టర్ పర్యవేక్షణలో తహసీల్దారు నేతృత్వంలో మే నెల 15 నుంచి 20 వరకూ ఫిర్యాదులు స్వీకరించారు. ఈ ఐదు రోజుల్లో మధురవాడ నుంచి 25, కొమ్మాది నుంచి 5 ఫిర్యాదులు అందా యి. ఫిర్యాదుల వివరాల కోసం కమాండ్ కంట్రోల్ అధికారులను సాక్షి సంప్రదించగా..వివరాలు బహిర్గత పరచొద్దని ఆదేశాలున్నాయని వారు చెప్పారు. -
‘కాంగ్రెస్ బలపడితే బీజేపీదే బాధ్యత’
గుంటూరు: ప్రత్యేక హోదా అనేది ఫుల్‌ప్టాప్ పెట్టే అంశం కాదని, అది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష అని టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఏపీ ప్రజల కోరికను ప్రధాని నరేంద్ర మోదీ మన్నించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడితే బీజేపీ బాధ్యత వహించాలని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనమే రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆరోపించారు. కట్టుబట్టలతో బయటకు పంపి ఇవాళ రాష్ట్ర పర్యటనకు వస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేకహోదా భరోసా సభను ప్రజలు బహిష్కరించాలని కోరారు. -
దళిత వృద్ధులకు ఆనంద నిలయాలు
- 14న 700 ఎకరాల భూ పంపిణీ - సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు - డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కర్నూలు(అర్బన్): దళిత వృద్ధుల సంక్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆనంద నిలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి ఉత్సవాలను బుధవారం.. స్థానిక ఐదు రోడ్ల కూడలిలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ రూ.1,56,990 కోట్లు అయితే.. సాంఘిక సంక్షేమానికి రూ.3,692 కోట్లు, ఎస్సీల ఆర్థికాభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించామన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అర్హులైన దళిత విద్యార్థులకు రూ.10 లక్షలు అందజేస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకంలో భాగంగా ఉపకార వేతనాలు అందిస్తున్నామని వివరించారు. ఎస్సీలకు 50 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లులను సాంఘిక సంక్షేమశాఖ చెల్లిస్తున్నదని చెప్పారు. దళిత కౌలు రైతులకు వ్యవసాయ పనిముట్లపై 50 నుంచి 70 శాతం సబ్సిడీ అందిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని భూమి లేని దళితులకు ఈ నెల 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా 700 ఎకరాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమలు వస్తే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం : ఎంపీ బుట్టా రేణుక జిల్లాలో పరిశ్రమలు వస్తే నిరుద్యోగ సమస్య కొంత మేర పరిష్కారం అవుతుందని ఎంపీ బుట్టా రేణుక అన్నారు. మహానేతల జయంతి, వర్ధంతి సభల్లో ఒక మంచి కార్యక్రమంపై తీర్మానం చేసి ఏడాది కల్లా పూర్తి చేయగలిగితే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు కొనసాగుతున్నాయని.. ఇవి పూర్తయితే రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కర్నూలు అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. జగ్జీవన్‌రామ్‌ను స్ఫూర్తిగా తీసుకుందాం: హఫీజ్‌ఖాన్ జగ్జీవన్‌రామ్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని వైఎస్సార్సీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జ్ హఫీజ్‌ఖాన్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ విద్య, ఉపాధి రంగాలపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, వై.ఐజయ్య, గౌరు చరితారెడ్డి, ఎం. మణిగాంధీ, ఎస్పీ ఆకె రవికృష్ణ, డీఆర్ఓ గంగాధర్‌గౌడ్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ప్రకాష్‌రాజు, మాజీ మంత్రి మూలింటి మారెప్ప, మాజీ ఎమ్మెల్సీ ఎం. సుధాకర్‌బాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ మద్దయ్య , వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ ... మెప్మా ఆధ్వర్యంలోని మహిళా గ్రూపులకు రూ.5 కోట్లు, డీఆర్డీఏ ఆధ్వర్యంలోని మహిళా గ్రూపులకు రూ.50 కోట్ల చెక్కులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి అందజేశారు. -
చంద్రబాబుపై డిప్యూటీ సీఎం అలక
-
చంద్రబాబుపై డిప్యూటీ సీఎం అలక
విజయవాడ: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక అధికార టీడీపీలో అసంతృప్తి రాజేసింది. ఇప్పటికే చాలా జిల్లాల్లో టీడీపీ నాయకులు అసమ్మతి వ్యక్తం చేయగా.. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సైతం ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తన తమ్ముడికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడంతో కేఈ అలకచెందారు. అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబానికి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చారని, తన తమ్ముడికి ఎమ్మెల్సీ టికెట్ ఎందుకు ఇవ్వలేదని కేఈ ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ తన తమ్ముడికి నచ్చజెప్పలేకపోతున్నానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీ టికెట్ తమ కుటుంబానికి ఇస్తేనే అక్కడ టీడీపీ గెలుస్తుందన్నారు. రాయలసీమలో బీసీలకు ఒక్క ఎమ్మెల్సీ టికెట్ కూడా కేటాయించలేదని కేఈ విమర్శించారు. -
కర్నూలులో ఓట్లకు గాలం వేస్తున్న మంత్రులు
-
డిప్యూటీ సీఎం కేఈకి అవమానం
-
డిప్యూటీ సీఎం కేఈ అధికారాలకు కత్తెర
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోనే అత్యంత సీనియర్లలో ఒకరైన రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తికి పదే పదే అవమానాలు ఎదురవుతున్నాయి. ఆయన వద్ద ఉన్న అధికారాలను ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాగేసుకుంటున్నారు. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లపై నేరుగా చంద్రబాబే పెత్తనం చలాయించనున్నారు. వాళ్ల నియామకాలు, బదిలీల అధికారాన్ని రెవెన్యూ మంత్రి నుంచి తప్పించి, సాధారణ పరిపాలన శాఖకు (జీఏడీ) అప్పగించారు. ఈ మేరకు జీవో నెం. 28ను జారీ చేశారు. గతంలో కూడా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలపై చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. కేఈ కృష్ణమూర్తి చేసిన బదిలీలను ఆయన నిలిపివేయించారు. ఇప్పుడు జీవో 28ను జారీచేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీసీ వర్గానికి చెందిన సీనియర్ మంత్రిని ఇంతలా అవమానిస్తారా అని ఆయన అనుయాయులు మండిపడుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కేఈ కృష్ణమూర్తికి అవమానాలే ఎదురవుతున్నాయి. రాజధాని వ్యవహారంలో ఆయనను పూర్తిగా పక్కన పెట్టి, మునిసిపల్ శాఖ మంత్రి నారాయణకు పెత్తనం ఇచ్చారు. అలాగే భూ కేటాయింపుల సంఘంలో కూడా కేఈ కృష్ణమూర్తికి చోటు దక్కలేదు. ఇప్పుడు ఏకంగా తన సొంత శాఖకు చెందిన నియామకాలు, బదిలీల విషయాన్ని కూడా ఆయన చూడలేకుండా చేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఏపీ సీనియర్ మంత్రికి మళ్లీ మళ్లీ అవమానం
-
త్వరలో 250 సర్వేయర్ల పోస్టుల భర్తీ
విజయవాడ : త్వరలో 250 సర్వేయర్ల పోస్టులు భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. రెండేళ్ల కాలంలో రెవెన్యూ శాఖలో 13 రకాల సంస్కరణలు తీసుకువచ్చామని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. కొన్నిచోట్ల రెవెన్యూ రికార్డుల్లో పొరపాట్లు జరుగుతుందన్నమాట వాస్తవమేనని అంగీకరించారు. వెబ్ ల్యాండ్ కీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వద్ద ఉండటం వల్లే సమస్యలు వస్తున్నాయని కేఈ అన్నారు. భూముల వివరాలు నేరుగా తెలుసుకునేందుకే మీభూమి వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చామని ఆయన తెలిపారు. -
దోచుకోడానికే ఈ పాస్‌బుక్ విధానం
రైతు ఇంటి యాజమాన్య హక్కుగా పిలిచే పట్టాదారు, టైటిల్ డీడ్ పుస్తకాలను రద్దుచేసి ఎలక్ట్రానిక్ పాస్‌బుక్ విధానం ప్రవేశపెట్టడంలో ప్రభుత్వ కుట్ర దాగిఉందని రైతు సంఘాల నాయకులు మండిపడ్డారు. రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్ స్వగ్రామం కృష్ణాజిల్లా కలిదిండి మండలం కొండూరు పంచాయతీ కార్యాలయం వద్ద రైతు సంఘాల నిజనిర్ధారణ కమిటీ ఆదివారం రైతులతో ముఖాముఖి చర్చను ఏర్పాటు చేసింది. గ్రామంలో మొత్తం 536 రైతుల పట్టాదారు పుస్తకాలను పరిశీలించగా ఈ-పాస్ బుక్ 1బీలో 125 మంది రైతుల పేర్లు, భూమి విస్తీర్ణం తప్పులు ఉన్నట్లు గుర్తించారు. రైతులు తమకు వెబ్‌ల్యాండ్, ఆన్లైన్ అంటే ఏమిటో కూడా తెలియదని కమిటీ ముందు చెప్పారు. తమ భూములకు శిస్తులు కడుతున్నప్పటికీ ఎవరి పేర్లో ఆన్లైన్లో నమోదైన ట్లు పుస్తకాలు చూపించారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి మాట్లాడుతూ ఈ-పాస్‌బుక్ విధానం ఎంత గందరగోళంగా ఉందనేదానికి తానే ఓ ఉదాహరణ అన్నారు. తన పేరుతో ఉన్న బుక్‌లో తండ్రి పేరు మరొకరిది ఉందన్నారు. ఈ-పాస్ విధానాన్ని వినియోగించే స్థాయికి రైతు కుటుంబాలు రాలేదన్నారు. నాగేంద్రనాథ్ మాట్లాడుతూ 42 ఏళ్ల కిందట మరణించినవారి పేర్లు 1బీలో చేర్చారని, రిజిస్ట్రేషన్‌కు వారిని తీసుకురాలేము కదా అని ప్రశ్నించారు. ఏపీ రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామచంద్రయ్య మాట్లాడుతూ కోట్లు దండుకునే దుర్బుద్ధి ఈ విధానంలో ఉందన్నారు. మంత్రి కృష్ణమూర్తి రాజీనామా చేయాలి.. రైతులు నకిలీ పాసుపుస్తకాలను అరికట్టడమంటే వాటిని నియంత్రించలేక ఈ-పాస్ తీసుకొచ్చిన మంత్రి కృష్ణమూర్తి రాజీనామా చేయాలని డెల్టా పరిరక్షణ సమితి నాయకుడు కొలనుకొండ శివాజీ డిమాండ్ చేశారు. భూ వివాదాలపై కోనేరు రంగారావు, జయదేవ్ఘోష్ కమిటీల మాదిరిగా ఎందుకు కమిటీని వేయలేదన్నారు. భారతీయ కిసాన్‌మోర్చా జాతీయ కార్యదర్శి జె.కుమారస్వామి మాట్లాడుతూ జీవో నంబరు 255ను వెంటనే రద్దుచేయాలన్నారు. లేదంటే కిసాన్ మోర్చా అధ్వర్యంలో జీవో ప్రతులను తగలబెడతామన్నారు. 11న జిల్లా కేంద్రాల్లో నిరసన... పాసుపుస్తకాల రద్దు ఆదేశాలు నిలిపివేయాలనే డిమాండ్‌తో ఈ నెల 11న రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన చేపడుతున్నట్లు రైతుసంఘ నాయకులు చెప్పారు. పార్టీలకు అతీతంగా రైతులు హాజరుకావాలని కోరారు. కొండూరులో జరిగిన చ ర్చలో వివిధ జిల్లాల రైతు సంఘ నాయకులు రాజమోహన్‌రావు, రామచంద్రరాజు, నాగబాబు, కృష్ణమూర్తి, పాండురంగరాజు, తమ్మినేని నాగేశ్వరరావు, మధుసూదనరావు, వేణు, యలమందారావులు పాల్గొన్నారు. -
'వీఆర్ఏలను రికార్డు అసిస్టెంట్లుగా నియమిస్తాం'
హైదరాబాద్: ఉద్యోగులపై క్రిమినల్ కేసులు పెట్టకుండా చర్యలు తీసుకుంటామని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై ఆయన బుధవారం ఇక్కడ సమీక్ష నిర్వహించారు. కొత్త అర్బన్ మండలాల ఏర్పాటును పరిశీలిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. ప్రతి మూడు లక్షల మందికి ఒక తహశీల్దార్ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. రెవెన్యూ శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు చేపడుతున్నామని అధికారులకు తెలిపారు. ఇకపై రెవెన్యూ ఉద్యోగులకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి స్పష్టం చేశారు. ఉన్నత విద్యార్హత గల వీఆర్ఏలను రికార్డు అసిస్టెంట్లుగా నియమిస్తామన్నారు. కొత్త తహశీల్దార్లు ఏజెన్సీలో పనిచేసేలా నిబంధలు తీసుకొస్తామని చెప్పారు. -
రాష్ట్రాన్ని కేంద్రం చిన్నచూపు చూస్తోంది: డిప్యూటీ సీఎం
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కేంద్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారమిక్కడ ఆయన మాట్లాడుతూ...ఏపీని కేంద్రం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. ఏదీ మాట్లాడినా కేంద్రమంత్రులు నీతి ఆయోగ్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేఈ డిమాండ్ చేశారు. -
చంద్రబాబుకు కూడా క్లారిటీ లేదు: కేఈ
విజయవాడ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి (నంద్యాల) కుటుంబం టీడీపీలో చేరే అంశంపై అసలు ఇంతవరకు తమ పార్టీలో ఎవరికీ స్పష్టత లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఈ అంశంపై అసలు చంద్రబాబుకు కూడా క్లారిటీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. భూమాను చేర్చుకోవడానికి తమకు అభ్యంతరం లేదని కేఈ అన్నారు. శిల్పా మోహన్ రెడ్డి సోదరులు భూమా నాగిరెడ్డి రాకను సీఎం చంద్రబాబు నాయుడు వద్ద వ్యతిరేకించారని, అయితే చంద్రబాబు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారని చెప్పారు. -
100 గజాల్లో ఇళ్లున్న వారికి స్థలం ఉచితం
కర్నూలు(అర్బన్): రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లోని ప్రభుత్వ స్థలాల్లో వంద గజాల్లో ఎవరైనా గృహాలు నిర్మించుకొని ఉంటే వాటికి ఎలాంటి మార్కెట్ విలువ చెల్లించనవసరం లేదని, స్థలాన్ని వారికి ఉచితంగానే అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ నిర్ణయం వర్తిస్తుందన్నారు. స్వర్గీయ దామోదరం సంజీవయ్య 95వ జయంతి వేడుకలు ఆదివారం స్థానిక నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో అధికారికంగా నిర్వహించారు. దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలకు పంపిణీ చేసిన ఆరు లక్షల ఎకరాల భూములు.. ఎక్కడైనా అన్యాక్రాంతం అయివుంటే వాటిని హక్కుదారులకు అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. -
'సీఎం, మంత్రికి తెలియకుండానే బాక్సైట్ జీవో'
విజయవాడ: బాక్సైట్ తవ్వకాల జీవో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే అటవీశాఖ జారీ చేసిందని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఇదే విషయం మంత్రివర్గ సమావేశంలోనూ చర్చకు వచ్చిందని, ఇలాంటి లోపాలను సరిదిద్దుతామని ఆయన చెప్పారు. విజయవాడ స్టేట్ గెస్ట్‌హౌస్‌లో మంగళవారం కేఈ కృష్ణమూర్తి విలేకరులతో మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖలో అవినీతి ఉందని సీఎం గతంలో ఒకసారి అన్నారని, తరువాత ఇంకెప్పుడూ అనలేదన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతి ఉందని ఓ మంత్రి మాట్లాడుతున్నారని, ఆయన మాదిరి సంబంధం లేని ఇతర శాఖల గురించి తాను మాట్లాడబోనని కేఈ చురకలు అంటించారు. రెవెన్యూ సిబ్బంది, అధికారులపై దాడులపట్ల తక్షణ చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్లు చెప్పారు. బ్యాంకు రుణాలకు పాస్‌బుక్‌లు అవసరం లేకుండా లోన్ చార్జ్ క్రియేషన్ మాడ్యూల్‌ను బ్యాంకులకు అనుసంధానిస్తామన్నారు. సర్వే పనులు వేగవంతం చేయడానికి సుమారు రూ.15 కోట్లతో 273 ఈటీఎస్ మిషన్లు రప్పిస్తామన్నారు. కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ-పంట కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా అమలు చేస్తామన్నారు. మీ-సేవ కేంద్రాల ద్వారా 62 రెవెన్యూ సేవలను అందుబాటులోకి తెచ్చామని, అవసరంలేని 18 రకాల సేవలను తొలగించామన్నారు. 240 డిప్యూటీ సర్వేయర్ల పోస్టులు భర్తీ చేస్తామని ఉపముఖ్యమంత్రి వెల్లడించారు. సమావేశంలో చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) అనిల్‌చంద్ర పునీత పాల్గొన్నారు. -
'భూముల సేకరణతో నాకు సంబంధం లేదు'
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అమరావతిలో భూముల సేకరణతో తనకు సంబంధం లేదని, అది మరో మంత్రి చూసుకుంటున్నారని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని కోసం భూముల సేకరణపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అక్షింతలు వేయడంపై ప్రశ్నించగా ఆయన పై విధంగా స్పందించారు. బాక్సైట్ తవ్వకాలపై ప్రశ్నించగా అది మరో మంత్రిత్వశాఖ అంశం గనుక తానేమీ స్పందించలేనని చెప్పారు. రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి వాస్తవమేనని, అయితే దానిని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
మూడు నెలల్లో ప్రత్యేక హోదాపై స్పష్టత
ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఉయ్యూరు/మచిలీపట్నం (చిలకలపూడి): ప్రత్యేక హోదా, ప్యాకేజీపై కేంద్రం మూడు నెలల్లో స్పష్టతనిస్తుందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. ఉయ్యూరు, మచిలీపట్నంలో సోమవారం పర్యటించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ రూపొందించిన నీతి ఆయోగ్ నివేదికతో రాష్ట్రానికి మంచి అవకాశాలొస్తాయని కేఈ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రధాని ప్రత్యేక హోదా, నిధులు ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలు విభజన సమయంలో నోరు మెదపకుండా ఇప్పుడు ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
పనిచేయని మోటార్లు ఉంటే ఏంటి.. లేకపోతే ఏంటి?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సహనం కోల్పోయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా పరిషత్ సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హంద్రీ నీవా మోటార్లను పట్టిసీమకు తరలించిన అంశంపై చర్చ రావడం కేఈ ఆగ్రహానికి కారణమైంది. మోటార్లను రహస్యంగా ఎందుకు తరలించారని వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రశ్నించారు. మీకు తెలియకుండానే మోటారును ఎలా తరలిస్తారని కేఈపై మండిపడ్డారు. దాంతో డిప్యూటీ సీఎం ఒక్కసారిగా సహనం కోల్పోయారు. హంద్రీ నీవాకు నీళ్లు కావాలంటే నాలుగు రోజుల్లో మోటారు తీసుకొస్తామని చెప్పారు. అయినా, అసలు పనిచేయని మోటార్లు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటంటూ వైఎస్ఆర్సీపీ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
డిప్యూటి సీఎం బదిలీలను నిలిపిన సీఎం
-
చంద్రబాబు, కేఈల మధ్య భగ్గుమన్న విభేదాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. 22 మంది రెవెన్యూ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ, వారిలో కొందరికి పదోన్నతులు ఇస్తూ ఉప ముఖ్యమంత్రి అనుమతితో రెవెన్యూ శాఖ మంగళవారం నాడు 872, 873, 874,876 జీవోలను జారీ చేసింది. అయితే, వాటన్నింటినీ అబెయెన్స్‌లో పెడుతున్నట్లు తాజాగా బుధవారం సాయంత్రం ఏపీ ప్రభుత్వం కొత్తగా 888 నెంబరు జీవో జారీచేసింది. పాత జీవోలు జారీచేసి 24 గంటలు కూడా గడవక ముందే వాటిని తుంగలో తొక్కేయడం వివాదాస్పదంగా మారింది. దీంతో గత కొన్ని రోజులుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం కేఈల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ మరోసారి బయటపడింది. ఇంతకుముందు కూడా ఇలాగే కేఈ కొంతమందిని బదిలీ చేయగా వాటిని సీఎం నిలిపివేశారు. ఇక తాజా బదిలీల నిలిపివేత విషయంలో లోకేష్ జోక్యం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేఈ కృష్ణమూర్తికి ఉప ముఖ్యమంత్రి పదవి అయితే కట్టబెట్టారు గానీ, ఆయన శాఖకు ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి భూసమీకరణ, భూసేకరణ లాంటి అంశాల్లో ఎక్కడా కీలకమైన రెవెన్యూ శాఖకు సంబంధం లేకుండా చేశారు. తనతో సమానమైన సీనియారిటీ ఉన్న కేఈ కృష్ణమూర్తిని పూర్తిగా పక్కన పెట్టేశారు. భూసేకరణ నోటిఫికేషన్ విషయంలో కూడా ఆయనకు ఏమాత్రం చెప్పలేదని అంటున్నారు. -
చంద్రబాబు, కేఈల మధ్య భగ్గుమన్న విభేదాలు
-
'రాజధానిలో భూసేకరణకు వ్యతిరేకం'
-
రాజధానిలో భూసేకరణకు వ్యతిరేకం : డిప్యూటీ సీఎం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి మరో సారి సంచలన వ్యాఖ్యలకు తెరతీశారు. రాజధానిలో భూ సేకరణకు నేను వ్యతిరేకమని ఆయన గురువారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణ భూ సేకరణ చేస్తామంటున్నారు.... దీనిపై తాను మాట్లాడనని కేఈ కృష్ణమూర్తి తెలిపారు. గ్రామ కంఠాలు రైతులు వినియోగంలో ఉంటే వారికే ఇచ్చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధానిలో భూ సేకరణకు... తమ శాఖకు ఎటువంటి సంబంధం లేదని కేఈ కృష్ణమూర్తి మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే రాజధాని కోసం రైతుల చాలా భూములు ఇచ్చారని... ఇంకా భూ సేకరణ అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే రాజధాని భూసేకరణ చేసేటట్లయితే రెవెన్యూ శాఖ ద్వారానే జరగాలి. కానీ ఆ శాఖ మంత్రి ప్రమేయం లేకుండానే ఈ వ్యవహారం సాగుతుందని కేఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతుంది. రాజధాని వ్యవహారం అంతా మంత్రి పి.నారాయణ తానై వ్యవహరిస్తున్నారు. దాంతో నారాయణపై ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. కేఈ వ్యాఖ్యలతో ఇది మరో మారు స్పష్టమైంది. -
'ప్రత్యేక హోదా కోసం యువకుడి ఆత్మహత్య బాధాకరం'
హైదరాబాద్: ఏపీ ప్రత్యేక హోదా కోసం తిరుపతి యువకుడి ఆత్మహత్య బాధాకరమని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా కోసం తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని.. త్వరలోనే ఈ అంశంపై ఢిల్లీకి వెళ్తారన్నారు. ఏఐసీసీ సోనియా గాంధీ దగ్గర మోకరిల్లి రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ నేతలేనని కేఈ విమర్శించారు. అటువంటి కాంగ్రెస్ నేతల తమపై విమర్శలు చేయడం తగదన్నారు. -
పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండాల్సింది
హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల భూముల సమస్యల పరిష్కారానికి ఆగస్టు 10 వ తేదీ నుంచి 'మీ భూమి మీ ఇంటికి' కార్యక్రమం నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. అందులోభాగంగా 20 రోజులపాటు రెవెన్యూ సభలు నిర్వహిస్తామని వెల్లడించారు. కర్నూలు జిల్లాలోపరిశ్రమల ఏర్పాటు కోసం 33 వేల ఎకరాల భూములు కేటాయించామని కేఈ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా తహసీల్దార్ వనజాక్షికి బెదిరింపు లేఖ వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే వనజాక్షి తనకు అందిన బెదిరింపు లేఖను విచారణాధికారికి అందజేయాలని సూచించారు. తహశీల్దార్ వనజాక్షికి రక్షణ కల్పించమని ఇప్పటికే జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని వివరించారు. కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై అక్రమ ఇసుక తవ్వకాల విషయంలో పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేశారు. దాంతో ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఈ ఘటనపై ఐఏఎస్ అధికారి జేసీ శర్మతో ప్రభుత్వం ఓ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. -
పెద్దన్న.. మాట చెల్లదన్న!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో తాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం శీతకన్ను వేసింది. కనీసం ప్రాజెక్టు సర్వే కోసం పంపిన ప్రతిపాదనలను కూడా నెలలు గడుస్తున్నా పట్టించుకోని పరిస్థితి. స్వయంగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పంపిన ప్రతిపాదనలకూ దిక్కులేకుండా పోతోంది. హంద్రీనీవా నుంచి ఆలూరు, పత్తికొండ, డోన్ నియోజవర్గాల్లోని 38 చెరువులను నింపేందుకు ఏ విధంగా ప్రాజెక్టును నిర్మించాలనే విషయంపై సర్వే చేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ జిల్లా సాగునీటిశాఖ అధికారులు.. జనవరి 7, 2015న ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదన సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శికి మార్చి 14న చేరింది. అయితే, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. వాస్తవానికి ఈ సర్వేకు అయ్యే ఖర్చు రూ.95.25 లక్షలు మాత్రమే. సర్వే కోసం అనుమతి ఇవ్వాలంటూ సాగునీటిశాఖ ఉన్నతాధికారులను స్వయంగా డిప్యూటీ సీఎం కోరినా ఫలితం లేకపోవడం గమనార్హం. పదే పదే ఫాలో అప్ చేసినా పట్టించుకోరే.. వాస్తవానికి ఈ ప్రాజెక్టు ద్వారా ఎక్కువగా లబ్ధి పొందేది డిప్యూటీ సీఎం నియోజకవర్గమైన పత్తికొండనే. దీంతో ఆయన ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందుకోసం సాగునీటిశాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రాజెక్టు సర్వేకు అనుమతివ్వాలని అధికారులను స్వయంగా విన్నవించారు. ఇప్పటివరకు సంబంధిత అధికారులకు ఏకంగా 18 సార్లు ఫోన్ చేసినట్టు సమాచారం. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి కించిత్తు స్పందన కూడా లేకపోయింది. హంద్రీ నీవా ద్వారా 38 చెరువులకు నీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు ద్వారా ఆలూరు, పత్తికొండ, డోన్ నియోజకవర్గాల్లో తాగునీటిని అందించే అవకాశం ఉంది. కరువు ప్రాంతాలైన ఈ నియోజకవర్గాలకు ఉపయోగపడే ప్రాజెక్టు గురించి డిప్యూటీ సీఎం స్థాయిలో ఫాలోఅప్ చేసినా ఫలితం లేకపోవడం చర్చనీయాంశమవుతోంది. కరువు ప్రాంతాలపైనా కనికరమేదీ.. వాస్తవానికి ఆలూరు, పత్తికొండ, డోన్ నియోజకవర్గాలకు తాగు, సాగునీటి సమస్యలు ఉన్నాయి. ప్రతి యేటా కరువుబారిన పడే మండలాల్లో అధికంగా ఈ నియోజకవర్గాలకు చెందినవే. వేసవి వచ్చిందంటే చాలు.. గుక్కెడు నీటి కోసం ఈ నియోజకవర్గాల్లోని ప్రజలు గొంతెండాల్సిందే. కిలోమీటర్ల దూరం నడిచి తాగునీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో కరువు ప్రాంతాలైన ఈ నియోజకవర్గాల్లో చెరువులను నింపడం ద్వారా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు.. చెరువులు నిండటం ద్వారా భూగర్భ జలాలు పెరిగి సాగునీటికీ ఇబ్బందులు లేకుండా పోయే అవకాశం ఉంది. ఇంతటి కరువు దుర్భిక్ష ప్రాంతాలైనప్పటికీ వీటిపై ప్రభుత్వం కనికరం చూపకపోవడం పట్ల తమ్ముళ్లు గుర్రుమంటున్నారు. -
దాడులను ఉపేక్షించేది లేదు: డిప్యూటీ సీఎం
హైదరాబాద్: విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై దాడిని ఆయన ఖండించారు. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ను ఆయన ఆదేశించారు. నివేదిక వచ్చిన తర్వాత సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తహసీల్దార్ ఫిర్యాదుపై పోలీసుల విచారణ జరుగుతుందన్నారు. ఉద్యోగులకు భద్రత కల్పించే విషయంలో తమ ప్రభుత్వం ముందు ఉంటుందన్నారు. ఇసుక అక్రమ రవాణాను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. -
ఉమ్మడి రాజధాని అనే ఫీలింగ్ రావడం లేదు: గంటా
హైదరాబాద్: రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఉమ్మడి రాజధాని అనే ఫీలింగ్ రావడం లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆయన ఏపీ మంత్రులతో కలిసి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను నరసింహన్ దృష్టికి తీసుకెళ్లారు. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకేనని మంత్రులు తెలిపారు. మొత్తం ఏడుగురు మంత్రులు వెళ్లారు. సెక్షన్ - 8 అమలు చేయాల్సిన బాధ్యత గవర్నర్దేనని గంటా అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వం ఇక్కడ సబ్ ఆర్డినేట్ ప్రభుత్వం కాదు అని గంటా గుర్తు చేశారు. తక్షణమే సెక్షన్ - 8 అమలు చేయాలని గవర్నర్‌ను కోరామని గంటా తెలిపారు. ఏడాదిగా ఆంధ్రా ఉద్యోగులకు, ప్రభుత్వానికి, ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి గంటా ఈ సందర్భంగా సూచించారు. కేసీఆర్ తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం: కేఈ ముఖ్యమంత్రి, మంత్రులని చూడకుండా మాట్లాడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తీరును నిరసిస్తూ గవర్నర్ వద్దకు తీసుకెళ్లామని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. గవర్నర్‌తో సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో శాంతి భద్రతల బాధ్యత గవర్నర్దేనని కేఈ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సుంకేశుల డ్యాం బాంబులతో పేల్చేస్తామంటున్నారని కేఈ ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఇచ్చిన ఫిర్యాదులపై గివర్నర్ సానుకూలంగా స్పందించారని ఈ సందర్భంగా కేఈ తెలిపారు. -
'స్ట్రీట్ లీడర్లా కాదు.... సీఎంలా వ్యవహారించాలి'
కర్నూలు: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి శుక్రవారం కర్నూలులో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఎటువంటి భాష మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్‌కు రాజ్యాంగంపై అవగాహనే లేదని విమర్శించారు. తమతో సంప్రదించకుండా కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. స్ట్రీట్ లీడర్‌గా కాకుండా ఓ ముఖ్యమంత్రిగా వ్యవహారించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేఈ కృష్ణమూర్తి హితవు పలికారు. కొత్త ప్రాజెక్ట్‌లకు నీటి కేటాయింపులు లేవని ట్రిబ్యునల్ స్పష్టం చేసినా... కేసీఆర్ కొత్త ప్రాజెక్ట్‌లు ఎలా ప్రారంభిస్తారని కేఈ ప్రశ్నించారు. ఓ వేళ కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభించాలంటే సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) అనుమతి తప్పని సరి అని ఆయన గుర్తు చేశారు. పట్టిసీమ పోలవరం ప్రాజెక్ట్‌లో అంతర్భాగం అని ఆయన గుర్తు చేశారు. ఆ ప్రాజెక్ట్‌కు అనుమతి అవసరం లేదని కేఈ స్పష్టం చేశారు. -
ఏపీ సీఎంపై వ్యాఖ్యలు తగదు: కేఈ
హైదరాబాద్: 'ఓటుకు నోటు' వ్యవహారంలో తమ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యలు చేయడం తగదని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. ముడుపుల కేసులో అరెస్టైన తమ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గంటలో సంచలన వార్త వింటారని రేవంత్ రెడ్డి అరెస్ట్ ముందు విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ చెప్పడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలులో ప్రధాన సూత్రధారి చంద్రబాబేనని నాయిని నర్సింహారెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు ఒక్కొక్కరికీ రూ.5 కోట్లు ఆఫర్ ఇచ్చారని, అందులో భాగంగానే నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌తో చంద్రబాబు నేరుగా ఫోన్లో మాట్లాడారని, అందుకు తగిన ఆధారాలు ఉన్నాయని నాయిని వెల్లడించారు. -
అధికారులతో చెడుగుడు!
పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగు తమ్ముళ్లు తమదైన 'శైలి'లో చెలరేగుతున్నారు. ఏపీ అధికారులతో చెడుగుడు ఆడుతున్నారు. తమ మాట చెల్లించుకునేందుకు 'పవర్' చూపిస్తున్నారు. 'పచ్చ' బాబులకు అనుకూలంగా పనిచేయని అధికారులకు బదిలీ వేటు తప్పదని హెచ్చరించారు. మినీ మహానాడు వేదికగా సాక్షాత్తూ టీడీపీ మంత్రులే ఇలాంటి వార్నింగ్ లు ఇవ్వడం శోచనీయం. అసలు తమ కార్యకర్తలకు పనులు చేసే పెట్టేందుకే అధికారులు ఉన్నారట్టుగా అమాత్యులు మాట్లాడుతుండడం విస్తుగొల్పుతోంది. అధికారంలోకొచ్చాక కార్యకర్తల కోసం పనిచేసుకోకపోతే ఎలా గడుసుగా ప్రశ్నించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు. పార్టీని పవర్ లోకి తెచ్చేందుకు తమ్ముళ్లు ఎంతో కష్టపడ్డారని, వారి కోసం పనులు చేస్తే తప్పా అని రెట్టించారు. ఆమాటకొస్తే ఉద్యోగుల బదిలీలన్నీ తమ సౌలభ్యం కోసమేనని, పరిపాలనా సౌలభ్యం కోసం కాదని అసలు నిజం బయపెట్టారు. తాను ఇలా అన్నానని మీడియా గగ్గోలు పట్టినా పట్టించుకోనని, తన పని తనదేనంటూ విశాఖలో నిర్వహించిన మినీ మహానాడులో అయ్యన్న అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం చెబితే అధికారులు అదే చేయాలని కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం మినీ మహానాడులో హుకుం జారీ చేశారు. ప్రతీ సంక్షేమ పథకంపై కార్యకర్తల ముద్ర ఉండేలా చూస్తామని సెలవిచ్చారు. తెలుగు తమ్ముళ్లకు 'రెస్పెక్ట్' ఇవ్వకపోతే రప్ఫాడిస్తామని అధికారులకు మంత్రి గంటా శ్రీనివాసరావు వార్నింగ్ ఇచ్చారు. కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాలకొస్తే గౌరవంతో చూడాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని కడప మినీ మహానాడులో హెచ్చరించారు. అధికార పార్టీ కార్యకర్తల మనసు గాయపడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హితబోధ చేశారు. తెలుగు తమ్ముళ్లను నిర్లక్ష్యం చేస్తే క్షమించనని చెప్పారు. అధికారుల కారణంగా పార్టీకి, కార్యకర్తల మనోభావాలకు నష్టం జరిగినా.. వేధించినా రాజీపడే ప్రసక్తి లేదని నెల్లూరు టీడీపీ మినీ మహానాడులో ముక్తాయించారు. మంత్రులు, టీడీపీ నాయకుల వార్నింగులతో అధికారులు బెంబేలెత్తున్నారు. కర్నూలు మినీ మహానాడులో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఒక అడుగు ముందుకేసి పోలీసుల సేవలను తమ ప్రధాన ప్రత్యర్థి వైఎస్సార్సీపీని అణగదొక్కేందుకు వాడుకోవాలన్న సూచన చేశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తల్ని అణగదొక్కేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిస్థాయిలో సహకరించాలని కూడా ఆయన మనవి చేశారు. డిప్యూటీ సీఎం మాటలకు తగ్గట్టుగా మంత్రి అచ్చెన్నాయుడు తాళం వేశారు. మాట వినని అధికారుల లిస్ట్ ఇస్తే తానే స్వయంగా సంతకం పెట్టి సీఎం దగ్గరకు పంపుతానంటూ 'పుషింగ్' ఇచ్చారు. మంత్రులే బెదిరింపులకు దిగడంతో అధికారులు హడలిపోతున్నారు. -
చంద్రబాబు.. కేఈ.. డిష్యుం డిష్యుం!
-
చంద్రబాబు.. కేఈ.. డిష్యుం డిష్యుం!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వైఖరి ఇలాగే ఉంటుందని, తాను ఎందుకు పశ్చిమగోదావరి జిల్లా గురించి మాట్లాడుతున్నానో పార్టీ నాయకులు తెలుసుకోవాలని ఆయన అన్నారు. తమ నాయకులు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారని సీఎం చెప్పారు. హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయనిలా అన్నారు. రాబోయే రోజుల్లో మిగిలిన నాయకులు కూడా మంచి పనులు చేయాలని, అప్పుడే సరైన మాండేట్ వస్తుందని తాను పశ్చిమగోదావరి జిల్లాను పదేపదే ప్రస్తావిస్తున్నానని ఆయన చెప్పారు. నాయకులంతా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. పశ్చిమగోదావరి జిల్లానే ముఖ్యమంత్రి పదేపదే ప్రస్తావిస్తున్నారని, ఆయనకు ఆ జిల్లాపైనే అభిమానం ఎక్కువంటూ కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. గతంలో ఉద్యోగుల బదిలీ విషయంలో మరో మంత్రి నారాయణ జోక్యం చేసుకున్నప్పుడు, మరికొన్ని ఇతర సందర్భాలలో అసంతృప్తికి గురైన కేఈ కృష్ణమూర్తి.. రాష్ట్ర రాజధాని ఎంపిక విషయంలో కూడా బాహాటంగా తన అసమ్మతిని వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోసారి పశ్చిమగోదావరి జిల్లాను ప్రస్తావిస్తూ చంద్రబాబుపై విమర్శలు చేయడంతో సీఎం నేరుగానే ఆయన వ్యాఖ్యలను ఖండించారు. -
‘వెబ్ ల్యాండ్’.. డబ్బు ల్యాండే!
హైదరాబాద్: భూముల వివరాల్లో పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘మీ భూమి’ వెబ్‌ల్యాండ్ రెవెన్యూశాఖలో అవినీతి కొత్త పుంతలు తొక్కడానికి దోహదం చేస్తోందని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్లు డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తికిఈ విషయాన్ని నివేదించారు. సోమవారం హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం కేఈ జాయింట్ కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ‘సాక్షి’ కథనాలే అజెండాగా మారాయి. రెవెన్యూశాఖలో అక్రమాలకు పాల్పడుతున్న కొందరు అధికారుల వల్ల శాఖతోపాటు ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని, వీరిని ఉపేక్షించబోమని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి హెచ్చరించారు. నా వయసులో కష్టంగా ఉంటుంది కదా.. ఏ జిల్లాకూ ఇన్చార్జి మంత్రిగా తనను నియమించకపోవడం సంతోషమేనని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. తన వయసులో శ్రీకాకుళం, విజయనగరం వంటి జిల్లాలకు ఇన్చార్జి మంత్రిగా నియమిస్తే.. అక్కడకు వెళ్లడానికి కష్టంగా ఉంటుంది కదా.. అని తనదైన శైలిలో స్పందించారు. మిమ్నల్ని గవర్నర్‌గా పంపేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారట కదా? అన్న ప్రశ్నకు.. ‘ఆ సందర్భం వచ్చినప్పుడు స్పందిస్తా’ నని సమాధానం దాటవేశారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కేఈ ఆకస్మిక తనిఖీలు
కర్నూలు: కర్నూలు జిల్లా కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ క్రిష్టమూర్తి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు విధులకు ఆలస్యంగా రావడం గుర్తించిన ఆయన వారిపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. విధులకు ఆలస్యంగా రావద్దంటూ ఆయన ఉద్యోగులను హెచ్చరించారు. బ్రోకర్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి రానివద్దంటూ కేఈ క్రిష్ణమూర్తి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. -
పూర్తి కాలం డిప్యూటీ సీఎంగానే కొనసాగుతా..
పత్తికొండ (అనంతపురం) : ఇచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు పూర్తి కాలం ఇదే పదవిలో కొనసాగుతానని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో మార్కెట్‌యార్డు చైర్మన్‌గా లక్ష్మి నారాయణశెట్టి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేఈ మాట్లాడుతూ పట్టిసీమను సాధించి తీరుతామన్నారు. రైతులు వ్యవసాయాన్నే నమ్ముకుని జీవిస్తున్నారని, అందువల్ల మార్కెట్‌యార్డులను అన్నివిధాల అభివృద్ధి చేస్తామని చెప్పారు. 2009 ఎన్నికల్లో తన తమ్ముడు కేఈ ప్రభాకర్ పత్తికొండకు వచ్చినప్పుడు ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వలేదని, ఆ సమయంలో అండగా నిలిచినందునే లక్ష్మినారాయణశెట్టికి మార్కెట్ యార్డు పదవి ఇచ్చామన్నారు. -
శ్రీవారి ఆశీస్సులతో రాజధాని నిర్మాణం
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో నవ్యాంధ్రప్రదేశ్ రాజధానినిర్మిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కష్ణమూర్తి అన్నారు. సోమవారం ఆయన కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. రెవెన్యూ విభాగంలో పని చేసే ప్రతి ఒక్కరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నానన్నారు. సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని సమర్థవంతంగా కార్యదక్షతతో ముందుకు నడిపిస్తున్నారని, అందుకు అవసరమైన మరింత శక్తిని ఆ శ్రీవేంకటేశ్వర స్వామివారే ప్రసాదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టే ఏ కార్యక్రమమైనా ఆటంకం లేకుండా దిగ్విజయంగా సాగుతుందన్నారు. -
లోకేష్ నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి: కేఈ
లోకేష్ నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న యాత్రకు మంచి స్పందన వస్తోందని తెలిపారు. అందుకే తెలుగుదేశం పార్టీలో లోకేష్‌కు మంచి స్థానం కల్పించాలని కేఈ కోరారు. ఇక భోగాపురంలో ఎయిర్‌పోర్టుకు భూసేకరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేఈ చెప్పారు. భూసేకరణ చట్టానికి పార్లమెంటులో తుదిరూపు వచ్చిన తర్వాతే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రెవెన్యూ అధికారులు అసలు గ్రామాల్లోకి వెళ్లడం లేదని, రెవెన్యూ శాఖలో త్వరలోనే సంస్కరణలు చేపడతామని చెప్పారు. ఎమ్మార్వో, వీఆర్వోలను సొంత రెవెన్యూ డివిజన్లలో ఉండనిచ్చేది లేదని స్పష్టం చేశారు. రాజధానిలో కూడా గ్రామకంఠాల వివాదాలు ఉన్నాయని, బీపీఎల్ కేటగిరీకి చెందినవారి ఆధీనంలో ఉన్న గ్రామకంఠాలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేఈ చెప్పారు. మిగిలిన వాళ్ల ఆధీనంలో ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఆయన వివరించారు. -
రామయ్యకు కేఈ కృష్ణమూర్తి పట్టువస్త్రాలు
-
'రాయలసీయ జిల్లాలకు నీరందిస్తాం'
గుంతకల్లు(అనంతపురం): గోదావరి నుంచి 70 టీఎమ్‌సీలనీటిని శ్రీశైలం తరలించి రాయలసీమ జిల్లాలకు నీరందిస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. కృష్ణమూర్తి తెలిపారు. అనంతపురం జిల్లాలో సోమవారం ఒకపెళ్లి కార్యాక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లాలో పారిశ్రామిక హబ్‌ను ఏర్పాటుచేస్తామని మంత్రి చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 571జీవోను రద్దు చేస్తామన్నారు. అంతేకాకుండా ఈ జీవో ఆధారంగా గత ప్రభుత్వ ఇచ్చిన భూములను వెనక్కి తీసుకుంటామని చెప్పారు. ఆసైన్డ్ భూములు, గ్రామకుంటాలులను సాగుచేసుకునే వారు రిజిస్ట్రేషన్ ద్వారా ఆ భూములను సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తామని హామినిచ్చారు. 2014-15 ఏడాది కాలంలో రెవిన్యూ స్టాంప్ డ్యూటీ ఆదాయ లక్ష్యం రూ. 3400కోట్లుగా ఉందని గుర్తుచేశారు. ఇప్పటికే 2723 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. ఫిబ్రవరి, మార్చిలో మిగిలిన మొత్తాన్ని రాబడతామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. -
'గూగుల్ మ్యాపింగ్ తో భూములు గుర్తింపు'
హైదరాబాద్: గ్రామకంఠం, భూదాన భూములు, అసైన్డ్ భూముల వివరాలు గూగుల్ మ్యాపింగ్ ద్వారా సేకరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్టు ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. గ్రామకంఠం భూమిని ఇప్పడు అనుభవిస్తున్న వారికే ఇవ్వాలని యోచిస్తున్నట్టు చెప్పారు. అసైన్డ్ భూములు ఒకరి పేరు మీద ఉండి వేరేవారు అనుభవిస్తే ఆ భూములను వెనక్కుతీసుకునే అంశాన్న పరిశీలిస్తున్నామన్నారు. ప్రత్యేక ప్రతిపత్తి కోసం ఢిల్లీలో తమ ఎంపీలు చేయాల్సిందంతా చేస్తున్నారని తెలిపారు. -
22 నుంచి రెవెన్యూ సమీక్షలు
డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో ఈనెల 22 నుంచి రెవెన్యూ సమీక్షలు నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ శాఖను నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం కె.ఈ.కృష్ణమూర్తి తెలిపారు. మంగళవారం కర్నూలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 22న అనంతపురం, 29న ఏలూరు, ఫిబ్రవరి 4న గుంటూరులో, 11 విజయనగరంలో సమీక్షలు నిర్వహిస్తామన్నారు. రెవెన్యూ చట్టాలను సరళతరం చేయడం, మీసేవ కేంద్రాల ద్వారా ఈ-పాసు పుస్తకాల మంజూరుతో పాటు ఇతర సర్టిఫికెట్ల జారీ ప్రక్రియపై సమీక్షల్లో చర్చిస్తామన్నారు. నిర్ణీత కాలంలో ఈ-పాసు పుస్తకాలు లేదా ఇతర సర్టిఫికెట్లు(జనన, మరణ, కుల తదితరాలు) సకాలంలో ఇవ్వని పక్షంలో రూ. 1,000 జరిమానా విధిస్తామన్నారు. పనులు ప్రారంభించకపోతే భూములు వాపస్ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు భూములను తీసుకుని ఇప్పటి వరకు కార్యకలాపాలు మొదలుపెట్టని సంస్థల భూములను వెనక్కి తీసుకుంటామని కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఈ నెల 19న ఆర్థికశాఖమంత్రి యనమల నేతృత్వంలోని కేబినెట్ సబ్‌కమిటీ సమావేశం అవుతుందన్నారు. పనులు ప్రారంభించని పరిశ్రమల భూములను వెనక్కి తీసుకోవడంతో పాటు కొత్తగా ఏయే పరిశ్రమలకు భూములను ఎంత మేరకు కేటాయించాలి? ఎలా కేటాయించాలి? తదితర అంశాలపై చర్చించి నిర్ణయుం తీసుకుంటావున్నారు. -
పాస్ పుస్తకాలు లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తే క్రిమినల్ కేసులు
హైదరాబాద్: వ్యవసాయ భూములకు పట్టాదార్ పాస్ పుస్తకాలు లేకుండా రిజిస్ట్రేషన్ చేసిన, చేస్తున్న అధికారులపై క్రిమినల్ కేసులు పెడతామని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి హెచ్చరించారు. రెవెన్యూ భూముల వ్యవహారాలలో వీఆర్ఓలపై విచారణ చేపడతామని చెప్పారు. 571 జీఓపై ఈ నెల 19న మంత్రి మండలి ఉప సంఘంలో చర్చిస్తామన్నారు. ఏపీ ఐఐసీ ద్వారా కేటాయించిన భూములపై సమీక్ష చేస్తామని కృష్ణమూర్తి చెప్పారు. -
'రాజధానికి మద్దతుగా భారీ సభను ఏర్పాటు చేస్తాం'
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటుకు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి తనదైన శైలిలో స్పందించారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 20 లోగా రాజధానికి మద్దతుగా లక్ష మందితో విజయవాడలో సభ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో విధ్వంసాన్ని డిప్యూటీ సీఎం తీవ్రంగా ఖండించారు. ఆ సంఘటనకు సంబంధించి ఎవరినీ ఉపేక్షించమన్నారు. గ్రామ కంటం భూములు, ఫోరం బోకు భూములు ఉపయోగపడే విధంగా ప్రయత్నాలు చేస్తామన్నారు. వీఆర్వోవోల సంఖ్యను పెంచి సమర్ధవంతంగా పనిచేయిస్తామన్నారు. -
'బలవంతంగా భూములు లాక్కోవడం జరగదు'
కర్నూలు:ఆంధ్రప్రదేశ్ రాజధానికి బలవంతంగా భూములు లాక్కోవడం జరగదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా అభివృద్ధిపై పత్రికల్లో వచ్చిన వార్తలపై స్పందించిన ఆయన.. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ జిల్లాలో అమలవుతాయన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే పెండింగ్ లో ప్రాజెక్టులను పూర్తి చేయాలని చంద్రబాబును కోరినట్లు ఆయన తెలిపారు. రైతుల గురించి ప్రత్యేకంగా సాగునీరు అందించాలన్నదే తమ ఉద్దేశమన్నారు. శ్రీశైల జలాశయ విషయంలో రైతులకు నీరు అందేలా కేబినెట్ లో చర్చిస్తామని కేఈ తెలిపారు. -
టీడీపీది మాటల ప్రభుత్వం కాదు : కేఈ
హైదరాబాద్: రుణమాఫీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గురువారం హైదరాబాద్‌లో వెల్లడించారు. దీంతో టీడీపీ మాటల ప్రభుత్వం కాదని... చేతల ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనతో ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉందని... ఈ నేపథ్యంలో కూడా చంద్రబాబు రుణమాఫీ చేశారని కేఈ కృష్ణమూర్తి తెలిపారు. ఈ ఏడాది మే నెలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికల జరిగాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు రుణాల మాఫీకి సంబంధించిన దస్త్రంపై సంతకం చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఆ క్రమంలో ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అనంతరం చంద్రబాబు రుణమాఫీపై కోటయ్య కమిటీ అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. అలా ఆరు నెలలు గడించింది. రుణమాఫీ అంటూ రైతులను మోసం చేస్తున్న చంద్రబాబు వైఖరిని ఎండగట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లు వద్ద ధర్నాలకు పిలుపునిచ్చారు. దాంతో చంద్రబాబు రుణమాఫీపై 4వ తేదీనే ఓ ప్రకటన చేశారు. -
ఏపీ మంత్రుల వింత పోకడ..!
-
ఏపీ మంత్రుల వింత పోకడ..
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రుల వింత పోకడ విచిత్రంగా ఉంది. వడ్డించేవారు మనవాళ్లు అయితే...అన్న చందంగా మంత్రులు ... ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏజెంట్లను నియమించుకుంటున్నారు. ఏజెంట్ల నియామకాల కోసం మంత్రల పేషీలో లాబీయింగ్ జోరుగా సాగుతోంది. సాక్షాత్తు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి...నందకుమార్ అనే వ్యక్తిని సిఫార్సు చేశారు. అది కూడా సామాన్య భక్తులకు సేవలు అందించేందుకే ఏజెంట్ల నియామకం అని పేర్కొనటం విశేషం. మంత్రుల సిఫార్సుల పరంపరను చూసి టీటీడీ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. గతంలో ఉద్యోగుల బదిలీల విషయంలోనూ లాబీయింగ్ జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరకు వెళ్లినట్లు సమాచారం. -
చంద్రబాబు హెచ్చరించినా.. మంత్రులు బేఖాతరు!
హైదరాబాద్: విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుల మధ్య చోటు చేసుకున్న ఆధిపత్య పోరు అంతకంతకూ ముదురుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా జోక్యం చేసుకుని వారిని హెచ్చరించినా మంత్రుల వైఖరిలో ఏమాత్రం మార్పురాలేదు. చంద్రబాబు హెచ్చరించిన 24 గంటల్లోనే అయ్యన్నపాత్రుడు మరో సిఫార్సు చేశారు. విశాఖ డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ ను కొనసాగించాలనే ప్రతిపాదనను అయ్యన్నపాత్రుడు మరోసారి చంద్రబాబు ముందుకు తీసుకొచ్చారు. ఎనిమిది నెలలుగా డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ గా ఉంటున్న శ్రీనివాస్ సేవలు అవసరమని లేఖలో అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. ఆదివారం ఆర్డీవో బదిలీ వ్యవహారంలో అయ్యన్నపాత్రుణ్ని తీవ్రంగా మందలించినా మంత్రుల వైఖరిలో మార్పు రాకపోవడం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. -
చంద్రబాబు ముందుకు గంటా, అయ్యన్న పంచాయతీ!
హైదరాబాద్: విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుల మధ్య వివాదం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చింది. విశాఖ జిల్లాకు చెందిన ఈ ఇద్దరు మంత్రులమధ్య నెలకొన్న విభేదాలు ఆర్డీవోల బదిలీల వ్యవహారంతో మరింత రచ్చకు దారితీసిన సంగతి తెలిసిందే. విశాఖపట్నం ఆర్డీవోను బదిలీ చేసే విషయంలో టీడీపీ నాయకులు గొడవ పడిన విషయాన్ని అధికారులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. సీఎంఓ అధికారుల పట్ల మంత్రి అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యే రామకృష్ణ వ్యవహరించిన తీరును చంద్రబాబుకు వివరించారు. కార్యాలయం తలుపులు తీసి మరీ గట్టిగా గొడవ పడ్డారని సీఎంఓ అధికారులు సీఎంకు తెలియజేశారు. దాంతో చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి అయిన కె.ఇ.కృష్ణమూర్తితో సమావేశమైనట్లు తెలుస్తోంది. వీరిద్దరూ రెవెన్యూ శాఖలో బదిలీలపై చర్చిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ** -
ఎన్టీఆర్ విగ్రహాల ఆవిష్కరణ
తిరుపతి/కర్నూలు: ఏపీలో మంత్రులు వరుసపెట్టి ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారు. వెలుగోడు జలాశయం వద్ద ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. తిరుపతి జూపార్కు వద్ద అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. ** -
భూసేకరణ బలవంతంగా జరపం : కేఈ కృష్ణమూర్తి
భూసేకరణ బలవంతంగా జరపం: ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి నూజివీడు: రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములను బలవంతంగా ప్రభుత్వం తీసుకోదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖమంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు. కృష్ణా జిల్లా నూజివీడులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భూములను రైతులు రాజధానికి ఇవ్వడం వల్ల వారికి వచ్చే వసతులు, సౌకర్యాలు, లాభాలను వివరించి స్వచ్ఛందంగా ఇచ్చేలా ప్రయత్నిస్తామన్నారు. కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ అధికులు సుముఖంగానే ఉన్నారన్నారు. సేకరిత భూమిలో 60-40 నిష్పత్తిలో రైతులకు ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం ఎకరా ధర రూ.కోటి ఉంటే రాజధానికి ఇవ్వడం వల్ల నిర్మాణనంతరం ఎకరం విలువ రూ.10 కోట్లకు చేరవచ్చన్నారు. -
రెవెన్యూ శాఖలో అవినీతి వాస్తవమే: డిప్యూటీ సీఎం
రెవిన్యూ శాఖలో అవినీతి ఎక్కువగా ఉన్నమాట వాస్తవమేనని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అంగీకరించారు. తన వద్దకు వచ్చే ఫైళ్లన్నీ సస్పెన్షన్లు, డిస్మిస్లే ఉంటున్నాయని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని నిర్మాణంలో రెవిన్యూ శాఖదే కీలకపాత్ర అని, రాజధాని భూసేకరణ మంత్రివర్గ ఉపసంఘంలో తనను ఉండమని ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగినా.. తానే వద్దనుకున్నానని ఆయన చెప్పారు. ఎందుకు వద్దన్నానో అందరికీ తెలుసని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. రాజధాని భూసేకరణ, భూ సమీకరణ ఎలా ఉండాలన్న విషయమై అందరి అభిప్రాయాలు తీసుకుంటామని, దీనికి ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చామని కేఈ కృష్ణమూర్తి తెలిపారు. దీనికోసం తాము అంతర్గతంగా ఓ కమిటీ నియమించామని, కమిటీ నివేదిక వచ్చాకే భూసేకరణపై స్పష్టత వస్తుందని అన్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో మార్కెట్ ధరలు పెంచాలనుకుంటున్నామని, కానీ ప్రభుత్వం ప్రస్తుతానికి దానికి అంగీకరించలేదని తెలిపారు. 32 వేల ఎకరాల భూములను పరిశ్రమలు, విద్యాసంస్థలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ఇక దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ పాస్‌బుక్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆయన చెప్పారు. అక్టోబర్ 2 నుంచి ఆన్లైన్లో పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామని వివరించారు. -
అక్టోబర్ 2 నుంచి 9 గంటల విద్యుత్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ అవసరాల కోసం ప్రస్తుత పరిస్థితుల్లో 7 గంటలపాటే విద్యుత్ ఇస్తామని ప్రభుత్వం శాసనమండలిలో ప్రకటించిన 24 గంటలు గడవకముందే అక్టోబర్ 2 నుంచి రైతులకు 9 గంటల పాటు విద్యుత్ ఇస్తామని శుక్రవారం శాసనసభలో వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. వ్యవసాయ పద్దుపై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇకపై భూములకూ హెల్త్‌కార్డులు ఇస్తామని, పేదలకు ఉచితంగా వైద్యం అందించినట్టే భూములకు ఇచ్చే హెల్త్‌కార్డుల ద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్లు.. : కేఈ ఇకపై.. భూములను ఎక్కడి నుంచైనా రిజిస్టర్ చేయించుకునేలా చర్యలు చేపట్టినట్టు రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు. దీనికోసం వెబ్‌ల్యాండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖకు, రెవెన్యూ శాఖకు మధ్య అనుసంధానం చేసి, రిజిస్ట్రేషన్ చేసిన 10 నిముషాల్లో రెవెన్యూ శాఖకు వివరాలు తెలిపే విధంగా చేస్తామన్నారు. రెవెన్యూ శాఖ పద్దుపై ఆయన సభ్యుల ప్రశ్నలకు సభలో సమాధానమిచ్చారు. -
రైతులకు ఈ-పాస్ పుస్తకాలు
హైదరాబాద్: ఏపీలో రైతులకు ఈ (ఎలక్ట్రానిక్) పాస్ పుస్తకాలు అందించాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న పట్టాదార్ పాస్ పుస్తకాల స్థానంలో ఇవి అందజేస్తారు. వీటిని ఆధార్ కార్డులతో అనుసంధానం చేస్తారు. మంగళవారం అసెంబ్లీలోని తన కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తోపాటు రెవిన్యూ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎంతమంది రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఉన్నాయి, వారి పొలం వివరాలు ఎంతవరకు నమోదు చేసుకున్నారు అనే అంశాలపై చర్చించారు. రైతుల భూముల వివరాలను నమోదు చేయటంతో పాటు ఈ పాస్ పుస్తకాలను రూపొందించి అందించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూమి ఎంత ఉంది, వ్యవసాయ భూమి ఎంత, వ్యవసాయేతర భూమి ఎంత అనే వివరాలను సేకరించాలని కూడా నిర్ణయించారు. రాష్ట్ర రాజధానిని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో స్థానికంగా భూమి లభ్యత ఎంత ఉంది అనే అంశంపైనా చర్చించినట్లు సమాచారం. -
తిరుపతిని మెగా సిటీగా తీర్చిదిద్దుతాం: కేఈ
తిరుమల : తిరుపతి పట్టణాన్ని మెగా సిటీగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. శేషాచల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. ఎర్రచందనం అక్రమరవాణాను అడ్డుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇద్దరు మంత్రులూ ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. -
టిడిపిలో లోకేష్ కీలకపాత్ర
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ బాబు పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తండ్రి ప్రభుత్వ వ్యవహారాలలో బిజీబిజీగా ఉంటే, కొడుకు పార్టీ వ్యవహారాలు చక్కదిద్దడంలో ప్రధాన పాత్ర పోహిస్తున్నారు. ఎన్నికల సందర్భంలోగానీ, మరే ఇతర అంశాల విషయంలోనైనా అసంతృప్తి చెందిన నేతలను బజ్జగించే ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. పార్టీని పటిష్టపరచాలన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొందరు తనను పనికట్టుకొని ఓడించారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాలో తెలుగు దేశం పార్టీ రెండుగా చీలిపోయింది. ఓ వర్గం పార్టీకి దూరం కానుంది. అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర తనకన్నా తన ప్రత్యర్థివర్గం మాటే ఎక్కువగా చెల్లుబాటు అవుతోందని తుమ్మల కలత చెందుతున్నారు. ఈ పరిస్థితులలో తుమ్మల తన వర్గంవారితో కలసి టిఆర్ఎస్లో చేరనున్నట్లు తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుని కూడా తుమ్మల కలిసినట్లు తెలిసింది. ఒక పక్క తుమ్మల టిఆర్ఎస్లో చేరతారని ప్రచారం జరుగుతుంటే, ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిధంగా ‘తుమ్మలన్నా..! రా కదలిరా..!! బంగారు తెలంగాణలో ఖమ్మం జిల్లా అభివృద్ధి నీతోనే సాధ్యం’ ఇట్లు తుమ్మల అభిమానులు.. అంటూ సత్తుపల్లి బస్టాండ్ సెంటర్లో ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీలు రాజకీయవర్గాల్లో కలకలం రేపాయి. తుమ్మల అనుచరులు కూడా పార్టీని వీడేందుకు గ్రామగ్రామాన సమాలోచనలు జరుపుతున్న నేపథ్యంలోనే ఈ ఫ్లెక్సీలు వెలువడటం చర్చనీయాంశమైంది. పార్టీ పుట్టినప్పటి నుంచి వివిధ హోదాలలో, పదవుల్లో పని చేసినవారు ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటా అన్న ఆలోచనలో పడ్డారు. తుమ్మల పార్టీ మారితే ఖమ్మం జిల్లాలో టిడిపి కోలుకోవడం కష్టం. అంతేగాక ఈ ప్రభావం తెలంగాణలోని ఇతర జిల్లాలపై కూడా పడే ప్రమాదం ఉంది. ఈ నేపధ్యంలో నారా లోకేష్ రంగంలోకి దిగారు. తుమ్మల పార్టీ మారకుండా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎవరితో చెప్పిస్తే అతను వింటారో వారితోనే చెప్పించాలనుకున్నారు. తుమ్మల పార్టీ మారకుండా బుజ్జగించమని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణ మూర్తిని లోకేష్ కోరారు. ఏవిధంగానైనా తుమ్మల టిడిపిని విడువకుండా ఉండేందుకు తన ప్రయత్నాలు తను చేస్తున్నారు. - శిసూర్య -
టీడీపీలో రాజధాని ప్రకంపనలు!
రాజధాని అంశం అధికార టీడీపీలో చిచ్చు రాజేసింది. నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికపై మంత్రులు చేస్తున్న ప్రకటనలు సైకిల్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిపుణుల కమిటీ నివేదిక రాకుండానే రాజధాని ఇక్కడ అని ఒకరు, అక్కడొద్దని మరొకరు అంటూ సిగపట్లు పడుతున్నారు. మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. తమ ప్రాంతంలోనే పెట్టాలని ఒకరు, కాదు మా ప్రాంతంలోనే పెట్టాలని మరొకరు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ-గుంటూరులో రాజధాని ఉండొచ్చని ఏపీ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ ప్రకటించడంతో అధికార పార్టీలో అసంతృప్తి జ్వాలలు రేగాయి. రాయలసీమ నాయకులు నారాయణ ప్రకటనను తప్పుబట్టారు. ఆయన తొందరపాటు ప్రకటన వల్ల ఆ ప్రాంతంలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయని రెవెన్యూ మంత్రి, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ భూమి విజయవాడ, గుంటూరు మధ్య లేదని తెలిపారు. రాజధాని ఏర్పాటుకు అవసరమైన భూమిని ప్రభుత్వ ధర ప్రకారమే సేకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలో రాజధాని ఏర్పాటు సమస్యాత్మకం అవుతుందని జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ వాసులంతా తమ ప్రాంతంలో రాజధాని నగరం ఉంటే బాగుంటుందని భావిస్తున్నారని జేసీ చెప్పారు. మాచర్లను రాజధాని చేస్తే బాగుంటుందని సూచించారు. అయితే, తమ మాట నెగ్గదని ఆయన వాపోయారు. తమ పెరట్లోనే రాజధాని ఉండాలనుకోవడం సరికాదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి సహచరులకు చురక అంటించారు. భూములు, నీటి లభ్యత ఉన్న చోటే రాజధాని ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధానిపై తలో మాట మాటాడొద్దని అధినేత వారించినా మంత్రులు పట్టించుకోకపోవడం గమనార్హం. రాజధాని అంశం టీడీపీ ఇంకా ఎన్ని ప్రకంపనలు సృష్టిస్తోందో చూడాలి. -
తాత్కాలికం అంటే శాశ్వతమని కాదు: కేఈ
విజయవాడపై నారాయణది తొందరపాటు ప్రకటన దాంతో ఆ ప్రాంతంలో ధరలు విపరీతంగా పెరిగాయి కానీ, మేం ప్రభుత్వ ధరల ప్రకారమే భూములు సేకరిస్తాం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజయవాడ తాత్కాలిక రాజధాని అంటే అర్థం అదే శాశ్వత రాజధాని అని కాదని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి స్పష్టంచేశారు. రాజధాని నగరం అన్ని ప్రాంతాల వారికి అందుబాటులో ఉండే విధంగా మధ్యలో ఉండాలన్నారు. విజయవాడ, గుంటూరు మధ్యే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉంటుందని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదన్నారు. ఆయన తొందరపాటు ప్రకటనవల్ల ఆ ప్రాంతంలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయని అసంతృప్తి వ్యక్తంచేశారు. కర్నూలు లేదా రాయలసీమ ప్రాంతంలో రాజ దాని ఉండాలని కోరే వారి సంఖ్య తక్కువగా ఉందని, వారికి నాయకత్వం వహించే వారు కూడా లేరని చెప్పారు. ఆయన మంగళవారం అసెంబ్లీ లాబీల్లోని తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు. విజయవాడ ఏపీ రాజధాని అని మంత్రి నారాయణ చెప్పింది అధికారికం కాదు. తాత్కాలిక రాజధాని ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసిన తరువాత స్థానికంగా భూములు ధరలు పెరిగితే మరోచోటికి మారుస్తాం. విజయవాడ ఇరుకు నగరం. అక్కడ ప్రస్తుతం ఎకరా భూమి ధర పది నుంచి పదిహేను కోట్లు ఉంది. రాజధాని ఏర్పడుతుందనే కారణంతో ధరలు పెరి గాయి. ఇప్పుడు అక్కడ రాజధాని ఏర్పాటు కాదని నేను ప్రకటిస్తే రిజిస్ట్రేషన్లు తగ్గిపోతాయి. విజయవాడలో నేను ఇల్లు అద్దెకు తీసుకున్నానన్న వార్తలు అవాస్తవం. విజయవాడ, గుంటూరు మధ్య ప్రభుత్వ భూమి కేవలం 500 ఎకరాలు మాత్రమే ఉంది. ఆ ప్రాంతంలో భూమి మార్కెట్ ధర ఎక్కువగా ఉంది. అయితే రాజధాని ఏర్పాటుకు అవసరమైన భూమిని ప్రభుత్వ ధర ప్రకారమే సేకరిస్తాం. ప్రస్తుతం ఎక్కువ ధరకు భూమిని ఇపుడు కొనుగోలు చేసిన వారు అపుడు ఇబ్బందులు పడతారు. మంత్రి నారాయణకు బాబు మందలింపు ఆంధ్రప్రదేశ్ పురపాలక మంత్రి పి.నారాయణపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా మంత్రి పదేపదే విజయవాడ, గుంటూరు మధ్యే రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ప్రజల్లో కోరికలు ఎక్కువగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ తమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతున్నారని, ఈ తరుణంలో ఒక ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించటం సరికాదని బాబు నారాయణకు సూచించారు. పార్టీలోని సీనియర్లందరినీ కలుపుకుని పోవాలని చెప్పారు. శివరామకృష్ణన్ నివేదిక తర్వాతే రాజధానిపై నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక అందిన తర్వాతే కొత్త రాజధాని ఎంపికపై నిర్ణయం తీసుకుంటామని శాసన మండలిలో ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ చెప్పారు. కమిటీ నివేదిక అందిన తర్వాత సభ్యులందరితో మాట్లాడి వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకున్న తర్వాతే రాజధాని ఎంపికపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. -
కర్నూలు రాజధాని అవసరం లేదు
-
కర్నూలు రాజధాని అవసరం లేదు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఆ రాష్ట్ర మంత్రుల్లో భేదాభిప్రాయాలు తలెత్తుతున్నాయి. రాజధాని కోసం ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతాన్ని సూచిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మంగళవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. విజయవాడ తాత్కాలిక రాజధానిపై ఆయన మాట్లాడుతూ మంత్రి నారాయణ రోజుకో స్థలాన్ని సూచిస్తున్నారన్నారు. మొదట్లో గుంటూరు-విజయవాడ అన్నారని, ఇప్పుడు విజయవాడ అంటున్నారని కేఈ వ్యాఖ్యానించారు. విజయవాడ-గుంటూరు మధ్య కేవలం 500 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉందన్నారు. విజయవాడ రాజధాని అయితే ఇరుకైన ప్రాంతంగా ఉంటుందని అన్నారు. దీనివల్ల రాజధానిపై గందరగోళం ఏర్పడిందని, రాజధానిపై కసరత్తు పూర్తి అయ్యేందుకు ఏడాది సమయం పడుతుందన్నారు. ఈలోగా స్మార్ట్ సిటీలు వస్తే రాజధాని అంశాన్ని ప్రజలు పట్టించుకోరని కేఈ పేర్కొన్నారు. కాగా కర్నూలు రాజధాని అవసరం లేదని, కర్నూలును రాజధానిగా కోరుకునే ప్రజలు కూడా తక్కువగా ఉన్నారన్నారు. దీనిపై కర్నూలు నాయకుల్లోనూ సంఘీభావం లేదని, ఎవరికి వారే ఉన్నారన్నారు. జిల్లాలో దాదాపు 32వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అలాగే విమానాశ్రయాలు కూడా అవసరం లేదన్నారు. స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లాలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో సగం నిలబెట్టుకున్నా.... తన పేరు చిరస్థాయిగా ఉంటుందని ఈకే కృష్ణమూర్తి అన్నారు. జిల్లాల కేంద్రాలకు 10 కి.మీ పరిధిలో ప్రభుత్వ భూముల వివరాలను ఆయన వెల్లడించారు. *శ్రీకాకుళం 177 ఎకరాలు *విజయనగరం 581 ఎకరాలు *విశాఖపట్నం 1473 *తూర్పుగోదావరి 204 ఎకరాలు *పశ్చిమగోదావరి 79 ఎకరాలు *కృష్ణా 3247 ఎకరాలు *గుంటూరు 2012 ఎకరాలు *ప్రకాశం 559 ఎకరాలు *నెల్లూరు 5823 ఎకరాలు *చిత్తూరు 2050 ఎకరాలు *కడప 689 ఎకరాలు *కర్నూలు 4975 ఎకరాలు *అనంతపురం 4270 ఎకరాలు -
డెప్యూటీ సీఎం పీఏనంటూ హల్చల్ !
విజయవాడ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి వ్యక్తిగత సహాయకుడినని.. తనకు అవసరమైన భూముల వివరాలను ఇవ్వాలంటూ తహసీల్దార్‌తో గొడవ పడి, విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిని గన్నవరం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం... గవర ప్రసాద్ అనే వ్యక్తి గురువారం ఉదయం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. నేరుగా తహసీల్దార్ ఎం.మాధురి వద్దకు వెళ్లి.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వద్ద పీఏగా పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. వెదురుపావులూరిలోని ఆర్ఎస్ నెంబరు 88, 895లోని భూముల వివరాలు కావాలని కోరారు. ఆ భూములు ఆతనికి సంబంధించినవి కాకపోవడంతో సమాచారం ఇచ్చేందుకు ఆమె నిరాకరించారు. దీనిపై ప్రసాద్ గట్టిగా డిమాండ్ చేయడంతో ఆమెకు అనుమానం వచ్చి ఐడెంటిటీ కార్డు చూపమని కోరారు. ఆతడు ఎటువంటి ఆధారాలు చూపకపోవడంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు. వారి ఆదేశాల మేరకు డెప్యూటీ సీఎం వద్ద పనిచేసే వోఎస్డీని తహసీల్దార్ ఫోన్లో సంప్రదించారు. అయితే ప్రసాద్ అనే వ్యక్తి ఎవరో తమకు తెలియదని చెప్పారు. పీఏనంటూ తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఆతడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో ఆతనిని గట్టిగా నిలదీయగా, కొద్దిసేపు ఎంపీ నిమ్మల కిష్టప్పకు పీఏ నంటూ, తర్వాత ఓ పెద్ద మనిషి వద్ద పనిచేస్తున్నట్లు చెప్పాడు. ఆ వివరాలు చెప్పకూడదంటూ పొంతన లేని సమాధానాలిచ్చాడు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు పోలీసు అధికారులు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. -
నీరుగార్చారు..!
సాక్షి ప్రతినిధి, కర్నూలు : కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు దర్పణం పట్టాల్సిన సమావేశం.. నిరాశను మిగిల్చింది. రెండు జిల్లాల పరిధిలోని ప్రాజెక్టులు, సాగునీటి కాలువలు, లక్షలాది ఎకరాల ఆయకట్టుపై చర్చించాల్సిన సమావేశం కేవలం మూడు గంటలే కొనసాగింది. అందులోనూ ఏ విషయాన్ని తేల్చకుండానే ముగిసింది. రెండు జిల్లాల నీటి వాటా ఎంత? ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇస్తారు? ఎప్పటి నుంచి ఇస్తారు? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వలేకపోయారు. కర్నూలు కలెక్టర్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశం రైతులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఇప్పటి వరకు కాలువలకు నీరందలేదని కర్నూలు, కడప జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజల తర ఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తుంటే.. టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం ప్రభుత్వ తీరును వెనకేసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అంతేకాని ప్రజలకు సాగు, తాగు నీరు ఇవ్వడానికి ప్రయత్నం చేద్దామనే ఆలోచన కనిపించలేదు. సాగు నీటి సమస్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి నిలదీస్తుండటంతో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి సమాధానం చెప్పలేక సమావేశం మధ్యలోనే నిష్ర్కమించారు. ఓ అధికారి శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి తాను తెలియక మాట్లాడానని క్షమించమని అడగటం ఐఏబీపై అధికారులకు ఉన్న అవగాహనను స్పష్టం చేస్తోందని సభ్యులు చర్చించుకున్నారు. భూమా నాగిరెడ్డి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు తడబడ్డారు. ఈ సమావేశానికి కర్నూలు జిల్లా కలెక్టర్ విజయమోహన్ అధ్యక్షత వహించారు. ఇందులో కడప ఎంపీ వైఎస్.అవినాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, ఐజయ్య, సాయిప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మణిగాంధీ, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, టీడీపీ ఎమ్మెల్యేలు జయనాగేశ్వరరెడ్డి, బీసీ జనార్ధన్‌రెడ్డి, నీటి పారుదల శాఖ ఛీఫ్ ఇంజినీర్ కాశీ విశ్వేశ్వరరావు, పర్యవేక్షక ఇంజినీరు ఆర్.నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి గైర్హాజరు! రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటి సారిగా నిర్వహించిన కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల నీటి పారుదల సలహా మండలి సమావేశానికి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి హాజరుకాలేదు. సమావేశానికి ఉప ముఖ్యమంత్రి వస్తారని రెండు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, సాగునీటి సలహా మండలి సభ్యులు, అధికారులు హాజరయ్యారు. అయితే ఉపముఖ్యమంత్రి రాకపోవటంతో వారందరూ నిరుత్సాహానికి గురయ్యారు. రెండు జిల్లాల ప్రజలకు సంబంధించిన అతి ముఖ్యమైన సమావేశానికి ఉప ముఖ్యమంత్రి రాకపోతే తమ గోడు వినేవారెవరని, సమస్యలను తామెవరికి చెప్పుకోవాలని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రశ్నించారు. గత సమావేశాల్లో చేసిన తీర్మానాలకు ఇప్పటికీ మోక్షం లభించలేదని, ఈ సమావేశంలో చేసే తీర్మానాలకు కూడా మోక్షం లభిస్తుందని తాము భావించటం లేదని వ్యాఖ్యానించారు. జిల్లాకు చెందిన మంత్రి లేనప్పుడు ఈ సమావేశం నిర్వహించడం ఎందుకని భూమా నాగిరెడ్డి ప్రశ్నించటంతో.. కలెక్టర్ విజయమోహన్ జోక్యం చేసుకుని చైర్మన్‌గా తాను ఉన్నానని, సమావేశంలో చర్చించిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వటంతో సమావేశం కొనసాగింది. ఎక్కడి పనులు అక్కడే.. కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాలు, సాగునీటి కాలువ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. తుంగభద్ర దిగువకాలువ మొదలు వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోట రిజర్వాయర్, అనేక ఎత్తిపోతల పథకాలపై వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరిత, రవీంద్రనాథ్‌రెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, గుమ్మనూరు జయరాం, ఐజయ్య, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మణిగాంధి, ఆదినారాయణరెడ్డి, రఘురామిరెడ్డి.. అధికారులు, అధికారపార్టీ నేతలను నిలదీశారు. ఎల్లెల్సీలోని ఆంధ్రా వాటాకు కన్నడిగులు గండికొడుతున్నారని.. రాజోలి బండ వద్ద ఆనకట్ట ఎత్తు పెంచకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భూమా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంట్లో దీనిపై చర్చించాలని ఎంపీ ఎస్పీవై రెడ్డికి సూచించారు. జిల్లాలో అనేక ఎత్తిపోతల పథకాలు నిలిచిపోయాయని పలువురు ఎమ్మెల్యేలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సుంకేసుల నుంచి మహబూబ్‌నగర్ జిల్లా వాసులు 1.2 టీఎంసీలని చెప్పి 1.5 టీఎంసీలను తీసుకెళ్తున్నారని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వరదల నుంచి కర్నూలు ప్రజలను కాపాడేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.244 కోట్లు మంజూరు చేస్తే ఆ పనులకు ఇంత వరకు అతీగతీ లేదన్నారు. ఫేజ్-1, ఫేజ్-2 రద్దు చేసి వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. జిందాల్, ప్రియా సిమెంటు ఫ్యాక్టరీల యాజమాన్యాల వైఖరిపై డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి నిరసన వ్యక్తంచేశారు. వీరికి సభ్యులందరూ సంఘీభావం తెలిపారు. -
తాగునీటికి మొదటి ప్రాధాన్యం
డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కర్నూలు: తాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి మండలాలకు మంజూరయిన నిధులను ఖర్చు చేయాలని అధికారులకు, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులకు ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అతిథి గృహంలో సోమవారం పత్తికొండ, డోన్ నియోజకవర్గ పరిధిలోని అధికారులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్లతో గ్రామీణ ప్రాంతాల్లో నీరు వృథా అవుతోందన్నారు. అలాంటి చోట్ల వెంటనే కొత్త పైపులైన్ వేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ రహదారులకు ఎంత బడ్జెట్ ఉంది, ఇంకా ఎంత అవసరమవుతుంది అనే విషయంపై అడిగి తెలుసుకున్నారు. సరిగాలేని రోడ్లను గుర్తించి, వాటి నిర్మాణం కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్య మెరుగుదల కోసం సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, ఇంటర్నల్ రోడ్లు నిర్మించాలన్నారు. పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, క్రిష్ణగిరి జెడ్పీటీసీ సభ్యులు సుకన్య, పురుషోత్తం చౌదరి, వరలక్ష్మి, లక్ష్మిదేవిలతో పాటు ఎంపీపీలు తలారి లక్ష్మి, పద్మావతి, గురుస్వామి, సుంకులమ్మ, శైలజ, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ క్రిష్ణారెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ సురేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకుల చేరికను అడ్డుకున్న టీడీపీ నేతలు... ప్యాపిలి మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు డిప్యూటీ సీఎం కేఈ క్రిష్ణమూర్తి సమక్షంలో టీడీపీలో చేరేందుకు సిద్ధ పడగా ప్యాపిలికి చెందిన టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ప్యాపిలికి చెందిన కాంగ్రెస్ నాయకులు బోరెడ్డి పుల్లారెడ్డి, కమతం భాస్కర్‌రెడ్డి, సింగిల్‌విండో ఛైర్మన్వెంకటరెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ నాయకులు సోమవారం కర్నూలులోని ప్రభుత్వ అతిథి గృహానికి తరలి వచ్చారు. విషయం తెలుసుకున్న స్థానిక తెలుగుదేశం నాయకులు ప్యాపిలి ఎంపీపీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వారి చేరికను అడ్డుకోవడంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన వారిని పార్టీలో చేర్చుకుంటే బావుండదని స్థానిక నాయకులు అడ్డుకోవడంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు.