రాయల తెలంగాణను రాయలసీమ వాసులు ఎవరూ కోరుకోవడం లేదని టీడీపీ ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తి చెప్పారు.
సాక్షి, హైదరాబాద్: రాయల తెలంగాణను రాయలసీమ వాసులు ఎవరూ కోరుకోవడం లేదని టీడీపీ ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తి చెప్పారు. రాయలసీమ ప్రజలు సమైక్యాంధ్రప్రదేశ్‌నే కోరుకుంటున్నారని తెలిపారు. ఎన్టీఆర్ భవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రజల్ని గందరగోళంలోకి నెట్టేలా కాంగ్రెస్ రాయల తెలంగాణ ప్రతిపాదన చేస్తోందని దుయ్యబట్టారు. ‘‘రాయలసీమ వాసులు మమ్మల్ని దోచుకున్నారు’’ అని ఆరోపించిన వారితో తామెలా కలిసి ఉంటామని ప్రశ్నించారు. రాయల తెలంగాణ తమకు అక్కర్లేద ని స్పష్టంచేశారు.