రాష్ట్ర విభజనకే వ్యతిరేకం... రాయలతెలంగాణకు ఎలా... | Rayalaseema leaders oppose 'Rayala Telangana' proposal | Sakshi
Sakshi News home page

రాష్ట్ర విభజనకే వ్యతిరేకం... రాయలతెలంగాణకు ఎలా...

Published Wed, Dec 4 2013 2:28 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

రాయలతెలంగాణ ప్రతిపాదనను రాయలసీమ ప్రజాప్రతినిధులంతా వ్యతిరేకిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, శ్రీకాంత్రెడ్డిలతోపాటు ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి స్పష్టం చేశారు.

రాయలతెలంగాణ ప్రతిపాదనను రాయలసీమ ప్రజాప్రతినిధులంతా వ్యతిరేకిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి శ్రీకాంత్రెడ్డిలతోపాటు ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజననే తాము వ్యతిరేకిస్తున్నామని వారు ఈ సందర్బంగా గుర్తు చేశారు. అలాంటప్పుడు రాయలతెలంగాణ ఏలా ఒప్పుకుంటామని వారు ప్రశ్నించారు.

 

అయితే ఈ నెల 12న హైదరాబాద్లో తమ పార్టీ సమావేశమై భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు. రాయలసీమలోని రెండు జిల్లాలను తెలంగణ ప్రాంతంలోని 10 జిల్లాలను కలపి రాయలతెలంగాణ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆటు సీమ ప్రాంతంలో, ఇటు తెలంగాణ ప్రాంతంలో నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement