‘చంద్రబాబుపై ఉన్న ఆక్రోశంతోనే ఓటేశారు’ | YSRCP MLA Srikanth Reddy Thanks To AP Voters | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబుపై ఉన్న ఆక్రోశంతోనే ఓటేశారు’

Published Fri, Apr 12 2019 1:17 PM | Last Updated on Fri, Apr 12 2019 4:39 PM

YSRCP MLA Srikanth Reddy Thanks To AP Voters - Sakshi

సాక్షి, కడప:  ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలంతా ఓటింగ్‌కు తరలివచ్చారని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మార్పుకోరుకుంటున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడి ఐదేళ్ళ పాలనలో దుర్మంగా వ్యవహరించారని, ప్రజాస్వామ్యాన్ని కాలరాసి స్వప్రయోజనాల కోసం పనిచేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుపై ఉన్న ఆక్రోశంతోనే ప్రజలు చైతన్యవంతులై.. ఓటు హక్కుని వినియోగించుకున్నారని అభిప్రాయపడ్డారు. రానున్నవి మంచిరోజులని, రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామన్నారు. ఏపీ వ్యాప్తంగా ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రజాసంక్షేమంపై దృష్టి పెడతామని శ్రీకాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల్లో టీడీపీ నేతలు అనేక అరాచకాలు సృష్టించారు. తమపై అసత్యకరమైన ఆరోపణలు సృష్టించారు. వ్యక్తిగత దాడులకు పాల్పడ్డారు. భయనక వాతవారణం సృష్టించారు. అంతటితో ఆగకుండా ఎల్లో మీడియా ద్వారా అసత్య రాతలు రాశారు.  ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర దుర్బిక్ష పరిస్థితులున్నాయి. ప్రజలు త్రాగునీటి కోసం అలమటిస్తున్నారు. ఇటువంటి సమస్య రావడానికి టీడీపీయే కారణం. ప్రభుత్వ నిధులను టీడీపీ సొంత ప్రచారానికి ఉపయోగించుకుంది. వైఎస్‌  జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ అభిమానులు తరలివచ్చారు. బెంగళూరు, హైదరాబాద్, దుబాయ్, కువైట్‌ నుంచి ప్రవాసాంధ్రులు కష్టపడి వచ్చి ఓటును వినియోగించుకున్నారు. వారందరికీ కృతజ్ఞతలు. అధికారంలో లేకపోయిన, ఆర్థిక సమస్యలున్నా.. వైఎస్సార్‌సీపీ విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు, వారందరి ఋణం తీర్చుకుంటాం’’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement