పూర్తి కాలం డిప్యూటీ సీఎంగానే కొనసాగుతా.. | ap deputy cm k.e.krishna murthy press meet | Sakshi
Sakshi News home page

పూర్తి కాలం డిప్యూటీ సీఎంగానే కొనసాగుతా..

Published Thu, Apr 30 2015 7:03 PM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM

పూర్తి కాలం డిప్యూటీ సీఎంగానే కొనసాగుతా.. - Sakshi

పూర్తి కాలం డిప్యూటీ సీఎంగానే కొనసాగుతా..

పత్తికొండ (అనంతపురం) : ఇచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు పూర్తి కాలం ఇదే పదవిలో కొనసాగుతానని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో మార్కెట్‌యార్డు చైర్మన్‌గా లక్ష్మి నారాయణశెట్టి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా కేఈ మాట్లాడుతూ పట్టిసీమను సాధించి తీరుతామన్నారు. రైతులు వ్యవసాయాన్నే నమ్ముకుని జీవిస్తున్నారని, అందువల్ల మార్కెట్‌యార్డులను అన్నివిధాల అభివృద్ధి చేస్తామని చెప్పారు. 2009 ఎన్నికల్లో తన తమ్ముడు కేఈ ప్రభాకర్ పత్తికొండకు వచ్చినప్పుడు ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వలేదని, ఆ సమయంలో అండగా నిలిచినందునే లక్ష్మినారాయణశెట్టికి మార్కెట్ యార్డు పదవి ఇచ్చామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement