
రాష్ట్రాన్ని కేంద్రం చిన్నచూపు చూస్తోంది: డిప్యూటీ సీఎం
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కేంద్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారమిక్కడ ఆయన మాట్లాడుతూ...ఏపీని కేంద్రం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు.
ఏదీ మాట్లాడినా కేంద్రమంత్రులు నీతి ఆయోగ్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేఈ డిమాండ్ చేశారు.