చంద్రబాబు ముందుకు గంటా, అయ్యన్న పంచాయతీ! | Ayyanna, Ganta dispute at Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ముందుకు గంటా, అయ్యన్న పంచాయతీ!

Published Sat, Nov 15 2014 3:53 PM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM

చంద్రబాబు ముందుకు గంటా, అయ్యన్న పంచాయతీ!

చంద్రబాబు ముందుకు గంటా, అయ్యన్న పంచాయతీ!

హైదరాబాద్: విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు,  పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి  చింతకాయల అయ్యన్నపాత్రుడుల మధ్య వివాదం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చింది. విశాఖ జిల్లాకు చెందిన ఈ ఇద్దరు మంత్రులమధ్య నెలకొన్న విభేదాలు ఆర్డీవోల బదిలీల వ్యవహారంతో మరింత రచ్చకు దారితీసిన సంగతి తెలిసిందే. విశాఖపట్నం ఆర్డీవోను బదిలీ చేసే విషయంలో టీడీపీ నాయకులు గొడవ పడిన విషయాన్ని అధికారులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. సీఎంఓ అధికారుల పట్ల మంత్రి అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యే రామకృష్ణ వ్యవహరించిన తీరును చంద్రబాబుకు వివరించారు. కార్యాలయం తలుపులు తీసి మరీ గట్టిగా గొడవ పడ్డారని సీఎంఓ అధికారులు సీఎంకు తెలియజేశారు.

దాంతో చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి అయిన కె.ఇ.కృష్ణమూర్తితో సమావేశమైనట్లు తెలుస్తోంది. వీరిద్దరూ రెవెన్యూ శాఖలో బదిలీలపై చర్చిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement