
దాడులను ఉపేక్షించేది లేదు: డిప్యూటీ సీఎం
విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు.
హైదరాబాద్: విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై దాడిని ఆయన ఖండించారు. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ను ఆయన ఆదేశించారు. నివేదిక వచ్చిన తర్వాత సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తహసీల్దార్ ఫిర్యాదుపై పోలీసుల విచారణ జరుగుతుందన్నారు. ఉద్యోగులకు భద్రత కల్పించే విషయంలో తమ ప్రభుత్వం ముందు ఉంటుందన్నారు. ఇసుక అక్రమ రవాణాను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.