
'బలవంతంగా భూములు లాక్కోవడం జరగదు'
కర్నూలు:ఆంధ్రప్రదేశ్ రాజధానికి బలవంతంగా భూములు లాక్కోవడం జరగదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా అభివృద్ధిపై పత్రికల్లో వచ్చిన వార్తలపై స్పందించిన ఆయన.. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ జిల్లాలో అమలవుతాయన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే పెండింగ్ లో ప్రాజెక్టులను పూర్తి చేయాలని చంద్రబాబును కోరినట్లు ఆయన తెలిపారు.
రైతుల గురించి ప్రత్యేకంగా సాగునీరు అందించాలన్నదే తమ ఉద్దేశమన్నారు. శ్రీశైల జలాశయ విషయంలో రైతులకు నీరు అందేలా కేబినెట్ లో చర్చిస్తామని కేఈ తెలిపారు.