
నేడు బాధ్యతలు స్వీకరించనున్న డిప్యూటీ సీఎంలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులతో పాటు పలువురు మంత్రులు ఆదివారం బాధ్యతలు చేపట్టనున్నారు. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప హెచ్ బ్లాక్‌లో ఉదయం 8.30 గంటలకు, మరో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మధ్యాహ్నం 12 గంటలకు జె బ్లాక్‌లో, పంచాయతీరాజ్ మంత్రి అయ్యన్నపాత్రుడు హెచ్ బ్లాక్‌లో ఉదయం 7.46 గంటలకు, రవాణా మంత్రి సిద్ధా రాఘవరావు ఉదయం 9.30 గంటలకు ఎల్ బ్లాక్‌లో, గనులు, మహిళా సాధికారత మంత్రి పీతల సుజాత ఉదయం 7.50 గంటలకు జే బ్లాక్ లో, దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు 7.45 గంటలకు, గ్రామీణాభివృద్ధి మంత్రి మృణాళిని 7.55 గంటలకు బాధ్యతలు స్వీకరిస్తారు.