Deputy Chief Ministers
-
ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు
-
ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన 25 మందికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శాఖలు కేటాయించారు. దీనికి గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేశారు. ఐదుగురు మంత్రులకు డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. ఆళ్ల నాని, అంజాద్ భాషా, నారాయణస్వామి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, పుష్పశ్రీవాణిలకు ఉప ముఖ్యమంత్రి హోదా లభించింది. ఈ మేరకు శనివారం సాయంత్రం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారిక ట్విటర్ పేజీలోనూ ఈ వివరాలు పొందుపరిచారు. మేకతోటి సుచరితకు కీలకమైన హోంశాఖను అప్పగించారు. (చదవండి: ఏపీ మంత్రివర్గ పూర్తి వివరాలు) మంత్రులకు కేటాయించిన శాఖలు 1. ధర్మాన కృష్ణదాస్- రోడ్లు, భవనాలు 2. బొత్స సత్యనారాయణ- మున్సిపల్, అర్బన్ డెవలప్మెంట్ 3. పాముల పుష్పశ్రీవాణి- గిరిజన సంక్షేమ శాఖ (డిప్యూటీ సీఎం) 4. అవంతి శ్రీనివాస్- టూరిజం, సాంస్కృతిక, యువజన వ్యవహారాలు 5. కురసాల కన్నబాబు- వ్యవసాయం, సహకార శాఖ 6. పిల్లి సుభాష్‌చంద్రబోస్- రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపులు (డిప్యూటీ సీఎం) 7. పినిపే విశ్వపరూప్- సాంఘిక సంక్షేమం 8. ఆళ్ల నాని- ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య (డిప్యూటీ సీఎం) 9. చెరుకువాడ శ్రీరంగనాథరాజు- గృహ నిర్మాణం 10. తానేటి వనిత- మహిళా, శిశు సంక్షేమం 11. కొడాలి నాని- పౌర సరఫరా, వినియోగదారుల శాఖ 12. పేర్ని నాని- రవాణా, సమాచార శాఖ 13. వెల్లంపల్లి శ్రీనివాస్- దేవాదాయ 14. మేకతోటి సుచరిత- హోం, విపత్తు నిర్వహణ 15. మోపిదేవి వెంకటరమణ- పశు సంవర్థకం, మత్స్య, మార్కెటింగ్ 16. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి- అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ 17. ఆదిమూలపు సురేశ్- విద్యా శాఖ 18. అనిల్‌కుమార్ యాదవ్- ఇరిగేషన్ 19. మేకపాటి గౌతమ్‌రెడ్డి- పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ 20. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు 21. కళత్తూరు నారాయణస్వామి- ఎక్సైజ్, వాణిజ్య పన్నులు (డిప్యూటీ సీఎం) 22. బుగ్గన రాజేంద్రనాథ్- ఆర్థిక, ప్రణాళిక, అసెంబ్లీ వ్యవహరాలు 23. గుమ్మునూరు జయరామ్- కార్మిక, ఉపాధి శిక్షణ, కార్మాగారాలు 24. షేక్ అంజాద్ బాషా - మైనార్టీ సంక్షేమం (డిప్యూటీ సీఎం) 25. మాలగుండ్ల శంకర్ నారాయణ- బీసీ సంక్షేమం -
‘రాజన్న రాజ్యం దిశగా జగనన్న అడుగులు’
సాక్షి, తాడేపల్లి: దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలుస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా షేక్ అన్నారు. తన మంత్రివర్గంలో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పిస్తానంటూ వైఎస్సార్‌ఎల్పీలో సీఎం జగన్ చేసిన ప్రకటనపై ఆయన హర్షం ప్రకటించారు. వైఎస్సార్ఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత పలువురు ఎమ్మెల్యేలు ‘సాక్షి’ టీవీతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాలకు చెందిన ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా ఇవ్వాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మరో ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్ అన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో ప్రజలకు సేవ చేసే అవకాశం తమందరికీ లభిస్తుందని వ్యాఖ్యానించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. దేశ చరిత్రలో ఎవరు చేయనివిధంగా ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను ఆయన నియమించనున్నారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి ఆయన శ్రమిస్తున్నారని, రాజన్న రాజ్యం దిశగా జగనన్న అడుగులు పడుతున్నాయని అన్నారు. ‘మ్యాన్ విత్ కమిట్మెంట్’ పదానికి పర్యాయపదంగా వైఎస్ జగన్ నిలుస్తారని, దేశమంతా ఆయన గురించి మాట్లాడుకునే రోజు దగ్గరలోనే ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. అవినీతి రహిత పరిపాలన అందించేందుకు ఆయన కృషి చేస్తున్నారని.. పార్టీకి అండగా నిలిచిన బడుగు, బలహీన వర్గాలకు ఆయన పెద్దపీట వేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. -
సీఎం జగన్ ప్రకటనపై స్పందించిన టీడీపీ
సాక్షి, అమరావతి: తన మంత్రివర్గంలో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పిస్తానంటూ వైఎస్సార్‌ఎల్పీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటనపై తెలుగు దేశం పార్టీ స్పందించింది. తన కేబినెట్లోకి ఎవర్ని తీసుకోవాలో నిర్ణయించుకునే విశేషాధికారం ముఖ్యమంత్రికి ఉంటుందని టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకరన్ అన్నారు. అర్హులైన వారిని మంత్రులుగా నియమించే అధికారం సీఎంకు ఉంటుందని ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థతో చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త ప్రభుత్వం పనిచేయాలని తాము భావిస్తున్నామన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా తమ పార్టీ వ్యవహరిస్తుందని పునరుద్ఘాటించారు. కాగా, కేబినెట్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయంపై అన్నివర్గాల నుంచి హర్షం అవుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాలకు చెందిన ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పిస్తానని సీఎం జగన్ ప్రకటించారు. (చదవండి: 25 మందితో పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పాటు: వైఎస్ జగన్) -
ఓ డిప్యూటీ సీఎం ఔట్?...
-
ఓ డిప్యూటీ ఔట్?
♦ మరో మంత్రిపైనా వేటు.. పలువురి పనితీరుపై కేసీఆర్ అసంతృప్తి ♦ శాఖల మార్పు తప్పదంటున్న సీఎం సన్నిహిత వర్గాలు ♦ రాష్ట్ర బడ్జెట్‌కు ముందే మంత్రివర్గ విస్తరణ ♦ 15-20 తేదీల మధ్యే మార్పుచేర్పులు ♦ కొత్తగా ఐదుగురికి అవకాశమిచ్చే యోచన ♦ ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచే ముగ్గురికి చాన్స్ ♦ చోటు కోసం పలువురు నేతల యత్నాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గం నుంచి ఓ ఉప ముఖ్యమంత్రిపై వేటుకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. మరో మంత్రిని కూడా తప్పించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కేబినెట్ విస్తరణలో భాగంగా కొత్తగా ఐదుగురిని మాత్రమే చేర్చుకోనున్నట్లు సీఎంకు అత్యంత సన్నిహితులు వెల్లడించారు. మంత్రివర్గంలోని పలువురి పనితీరు, వారి పేషీల్లోని వ్యక్తిగత సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై కేసీఆర్ ఇప్పటికే తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయా మంత్రుల శాఖలను మార్చాలని ఆయన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15-20 తేదీల మధ్యే కేబినెట్లో మార్పుచేర్పులు ఉంటాయని సీఎం సన్నిహిత వర్గాలు నమ్మకంగా చెబుతున్నాయి. ఈనెల 10న కేబినెట్లో మార్పులు చేయాలని మొదట్లో అనుకున్నప్పటికీ.. తర్వాత మరో వారం రోజులకు వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొంటున్నాయి. అయితే బడ్జెట్ సమావేశాలకు ముందే కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరించి కొత్త మంత్రులతో అసెంబ్లీ సమావేశాలకు వెళతారా లేక బడ్జెట్ భేటీలు ముగిసేవరకు వేచి చూస్తారా? అన్న అనుమానాలు లేకపోలేదు. కాగా, డిప్యూటీ సీఎం ఒకరికి మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలకడం ఖాయమని కేసీఆర్ సన్నిహితులు చెబుతున్నారు. ఆ ఉప ముఖ్యమంత్రి వ్యవహారశైలిపై సీఎం చాలాసార్లు ఆగ్రహం వ్యక్తం చేశారని, తీరును మార్చుకోకుంటే కష్టమని ఇప్పటికే హెచ్చరించారని పేర్కొంటున్నారు. ఉప ముఖ్యమంత్రిగా, బాధ్యతాయుతమైన పోర్టుఫోలియోను నిర్వహిస్తున్నా.. ఆయన శాఖాపరమైన పనిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఈ స్థానంలో కరీంనగర్ జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ను ఉప ముఖ్యమంత్రిగా చేస్తారన్న వాదన వినిపిస్తోంది. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాకు చెందిన ఓ మంత్రి పనితీరుపైనా కేసీఆర్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఆయనను కేబినెట్ నుంచి తొలగించే విషయంలో ఇంకా తుది నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. మరికొందరిపైనా సీఎంకు అసంతృప్తి ఉన్నా.. వారి విషయంలో శాఖల మార్పునకే పరిమితం కావాలని అనుకుంటున్నారు. మంత్రివర్గంలో ఒకేసారి భారీ మార్పులు చేస్తే ఆయా సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత, నేతల సమీకరణాల్లో సమస్యలు వంటివి తలెత్తే అవకాశాలున్నందున వీరి విషయంలో కొంత వేచిచూస్తున్నట్టుగా తెలుస్తోంది. పెరుగుతున్న ఆశావహులు... మంత్రివర్గంలో ఆశావహుల జాబితా పెరుగుతోంది. అవకాశం కోసం సీఎం కేసీఆర్‌పై, ఆయన సన్నిహితులపై వివిధ వర్గాల నుంచి ఇప్పటికే తీవ్ర ఒత్తిడి ఉంది. ఇప్పటిదాకా అవకాశం దక్కని ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి కనీసం ముగ్గురిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఖమ్మం జిల్లా నుంచి పార్టీలో చేరనున్న టీడీపీ నేత తుమ్మల నాగేశ్వర్రావుకు ప్రధానమైన పోర్టుఫోలియోను అప్పగించనున్నారు. మహబూబ్‌నగర్ నుంచి డాక్టర్ సి.లక్ష్మా రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, జూపల్లి కృష్ణారావు మంత్రి పదవులను ఆశిస్తున్నారు. వీరిలో ఇద్దరికి తప్పకుండా అవకాశం దక్కనుంది. వరంగల్ జిల్లా నుంచి ఎ.చందూలాల్, కొండా సురేఖ, ఎం.యాదగిరి రెడ్డి కేబినెట్లో చోటు కోరుకుంటున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి ప్రస్తుతం ఒక్కొక్కరికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యమున్నా.. మరో ఇద్దరికి బెర్తు దక్కుతుందని అక్కడి నేతలు విశ్వాసంతో ఉన్నారు. నిజానికి తెలంగాణ మంత్రివర్గం ఏర్పడిన(జూన్ 2) వారం రోజుల్లోనే విస్తరణ ఉంటుందని కేసీఆర్ సన్నిహితులు ప్రకటించినా.. వివిధ కారణాలతో అది వాయిదాలు పడుతూ వచ్చింది. దీంతో ఈసారైనా మంత్రివర్గ విస్తరణ ఉంటుందా, తమకు అవకాశం దక్కుతుందా అని ఆశావహులు కొట్టుమిట్టాడుతున్నారు. -
నేడు బాధ్యతలు స్వీకరించనున్న డిప్యూటీ సీఎంలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులతో పాటు పలువురు మంత్రులు ఆదివారం బాధ్యతలు చేపట్టనున్నారు. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప హెచ్ బ్లాక్‌లో ఉదయం 8.30 గంటలకు, మరో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మధ్యాహ్నం 12 గంటలకు జె బ్లాక్‌లో, పంచాయతీరాజ్ మంత్రి అయ్యన్నపాత్రుడు హెచ్ బ్లాక్‌లో ఉదయం 7.46 గంటలకు, రవాణా మంత్రి సిద్ధా రాఘవరావు ఉదయం 9.30 గంటలకు ఎల్ బ్లాక్‌లో, గనులు, మహిళా సాధికారత మంత్రి పీతల సుజాత ఉదయం 7.50 గంటలకు జే బ్లాక్ లో, దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు 7.45 గంటలకు, గ్రామీణాభివృద్ధి మంత్రి మృణాళిని 7.55 గంటలకు బాధ్యతలు స్వీకరిస్తారు.