సాక్షి, అమరావతి: తన మంత్రివర్గంలో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పిస్తానంటూ వైఎస్సార్‌ఎల్పీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనపై తెలుగు దేశం పార్టీ స్పందించింది. తన కేబినెట్‌లోకి ఎవర్ని తీసుకోవాలో నిర్ణయించుకునే విశేషాధికారం ముఖ్యమంత్రికి ఉంటుందని టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకరన్ అన్నారు. అర్హులైన వారిని మంత్రులుగా నియమించే అధికారం సీఎంకు ఉంటుందని ‘ఏఎన్‌ఐ’ వార్తా సంస్థతో చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త ప్రభుత్వం పనిచేయాలని తాము భావిస్తున్నామన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా తమ పార్టీ వ్యవహరిస్తుందని పునరుద్ఘాటించారు.
కాగా, కేబినెట్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయంపై అన్నివర్గాల నుంచి హర్షం అవుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాలకు చెందిన ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పిస్తానని సీఎం జగన్ ప్రకటించారు. (చదవండి: 25 మందితో పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పాటు: వైఎస్ జగన్)
Comments
Please login to add a commentAdd a comment