గోదావరి నుంచి 70 టీఎమ్‌సీలనీటిని శ్రీశైలం తరలించి రాయలసీమ జిల్లాలకు నీరందిస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. కృష్ణమూర్తి తెలిపారు.
గుంతకల్లు(అనంతపురం): గోదావరి నుంచి 70 టీఎమ్‌సీలనీటిని శ్రీశైలం తరలించి రాయలసీమ జిల్లాలకు నీరందిస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. కృష్ణమూర్తి తెలిపారు. అనంతపురం జిల్లాలో సోమవారం ఒకపెళ్లి కార్యాక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లాలో పారిశ్రామిక హబ్‌ను ఏర్పాటుచేస్తామని మంత్రి చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 571జీవోను రద్దు చేస్తామన్నారు. అంతేకాకుండా ఈ జీవో ఆధారంగా గత ప్రభుత్వ ఇచ్చిన భూములను వెనక్కి తీసుకుంటామని చెప్పారు.
ఆసైన్డ్ భూములు, గ్రామకుంటాలులను సాగుచేసుకునే వారు రిజిస్ట్రేషన్ ద్వారా ఆ భూములను సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తామని హామినిచ్చారు. 2014-15 ఏడాది కాలంలో రెవిన్యూ స్టాంప్ డ్యూటీ ఆదాయ లక్ష్యం రూ. 3400కోట్లుగా ఉందని గుర్తుచేశారు. ఇప్పటికే 2723 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. ఫిబ్రవరి, మార్చిలో మిగిలిన మొత్తాన్ని రాబడతామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.