సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడి సోమవారం వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. ఈ వాయుగుండం సోమవారం రాత్రికి శ్రీలంకలోని ట్రింకోమలికి తూర్పు ఆగ్నేయంగా 530, భారత్‌లోని కరైకల్‌కు తూర్పు ఆగ్నేయంగా 750 కిలోమీటర్ల దూరంలోను కేంద్రీకృతమై ఉంది.
ఇది మంగళవారం సాయంత్రం వరకు పశ్చిమ వాయవ్య దిశగా కదులుతుందని, అనంతరం మలుపు తిరిగి క్రమంగా దక్షిణ నైరుతి వైపు పయనిస్తుందని, బుధవారం మధ్యాహ్నానికి శ్రీలంక వద్ద తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి నివేదికలో వివరించింది. దీని ప్రభావంతో మంగళవారం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం నుంచి రెండురోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment