కేఈ అధికారాలకు సీఎం కత్తెర
సీఎం చేతికి డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు, పోస్టింగ్‌లు
సాక్షి, అమరావతి: రెవెన్యూ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అధికారాలకు కత్తెర పడింది. డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు, పోస్టింగ్‌ల అధికారాన్ని రెవెన్యూ శాఖ నుంచి సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేశారు. ఈమేరకు బిజినెస్ రూల్స్‌లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.