టీడీపీది మాటల ప్రభుత్వం కాదు : కేఈ | TDP don't Just say do it say : Dy CM KE Krishna Murthy | Sakshi
Sakshi News home page

టీడీపీది మాటల ప్రభుత్వం కాదు : కేఈ

Published Thu, Dec 4 2014 8:16 PM | Last Updated on Thu, Mar 28 2019 5:30 PM

టీడీపీది మాటల ప్రభుత్వం కాదు : కేఈ - Sakshi

టీడీపీది మాటల ప్రభుత్వం కాదు : కేఈ

హైదరాబాద్: రుణమాఫీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గురువారం హైదరాబాద్లో వెల్లడించారు. దీంతో టీడీపీ మాటల ప్రభుత్వం కాదని... చేతల ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనతో ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉందని... ఈ నేపథ్యంలో కూడా చంద్రబాబు రుణమాఫీ చేశారని కేఈ కృష్ణమూర్తి తెలిపారు.


ఈ ఏడాది మే నెలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికల జరిగాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు రుణాల మాఫీకి సంబంధించిన దస్త్రంపై సంతకం చేస్తానని చంద్రబాబు ప్రకటించారు.  ఆ క్రమంలో ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అనంతరం చంద్రబాబు రుణమాఫీపై కోటయ్య కమిటీ అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. అలా ఆరు నెలలు గడించింది.

రుణమాఫీ అంటూ రైతులను మోసం చేస్తున్న చంద్రబాబు వైఖరిని ఎండగట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లు వద్ద ధర్నాలకు పిలుపునిచ్చారు. దాంతో చంద్రబాబు రుణమాఫీపై 4వ తేదీనే ఓ ప్రకటన చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement