100 గజాల్లో ఇళ్లున్న వారికి స్థలం ఉచితం | Space free for 100 yards to those who have house | Sakshi
Sakshi News home page

100 గజాల్లో ఇళ్లున్న వారికి స్థలం ఉచితం

Published Mon, Feb 15 2016 2:18 AM | Last Updated on Sun, Sep 3 2017 5:39 PM

100 గజాల్లో ఇళ్లున్న వారికి స్థలం ఉచితం

100 గజాల్లో ఇళ్లున్న వారికి స్థలం ఉచితం

కర్నూలు(అర్బన్): రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లోని ప్రభుత్వ స్థలాల్లో వంద గజాల్లో ఎవరైనా గృహాలు నిర్మించుకొని ఉంటే వాటికి ఎలాంటి మార్కెట్ విలువ చెల్లించనవసరం లేదని, స్థలాన్ని వారికి ఉచితంగానే అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ నిర్ణయం వర్తిస్తుందన్నారు.

స్వర్గీయ దామోదరం సంజీవయ్య 95వ జయంతి వేడుకలు ఆదివారం స్థానిక నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో అధికారికంగా నిర్వహించారు. దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలకు పంపిణీ చేసిన ఆరు లక్షల ఎకరాల భూములు.. ఎక్కడైనా అన్యాక్రాంతం అయివుంటే వాటిని హక్కుదారులకు అందించేందుకు చర్యలు చేపడతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement