
సాక్షి, పెద్దాపురం : తెలుగుదేశం వల్లే రాష్ట్రంలో బీజేపీ బాగుపడిందే తప్ప బీజేపీ వల్ల టీడీపీకి వచ్చిన ప్రయోజనం ఏమీ లేదని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో పర్యటించిన ఆయన బీజేపీపై మండిపడ్డారు. అన్ని రాష్ట్రాలను మోదీ సమానం చూడాలంటూ చురకలంటించారు. అభివృద్ధిలో కొన్ని రాష్ట్రాలు ముందుండి, కొన్ని రాష్ట్రాలు వెనుకబడటం దేశానికి మంచిది కాదంటూ మోదీని హెచ్చరించారు. బీజేపీ దేశాన్ని ఉత్తర, దక్షిణ ప్రాంతాల పేరుతో వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు. దక్షిణ భారతాన్ని విస్మరిస్తే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమంటూ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక వనరులు, పోలవరం త్వరాగా పూర్తవుతుందనే కారణంగానే బీజేపీతో మిత్రపక్షంగా చేరామని ఆయన అన్నారు.
నాలుగు ఏళ్లపాటు తమ సమస్యలను బీజేపీ అధిష్టానానికి విన్నవించినా స్పందన లేదని, పైగా కక్షసాధింపు చర్యలకు దిగారని కేఈ మండిపడ్డారు. ఏపీకి ఇచ్చిన నిధులపై రాష్ట్ర బీజేపీ నేతలు శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలు వెనక్కిపోయాయని, తిరుపతిలో వెంకన్న సాక్షిగా మోదీ ఇచ్చిన హామీలు వెనక్కిపోయాయని విమర్శించారు. ప్రధాని ఏది కూడా సక్రమంగా చేయకపోవడం వల్లే కేంద్ర మంత్రులు రాజీనామాలు చేశారని పేర్కొన్నారు. పోలవరం పూరఇ చస్తే చంద్రబాబుకు మంచిపేరు వస్తుందనే ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు విడుదల చేయడంలేదని విమర్శించారు. రాష్ట్రానికి మోదీ చేసిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టకుని కర్ణాటక ఎన్నికల్లో తెలుగువారిని బీజేపీకి ఓటు వేయవద్దని చెప్పామంటూ సమర్ధించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment