విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అమరావతిలో భూముల సేకరణతో తనకు సంబంధం లేదని, అది మరో మంత్రి చూసుకుంటున్నారని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని కోసం భూముల సేకరణపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అక్షింతలు వేయడంపై ప్రశ్నించగా ఆయన పై విధంగా స్పందించారు. బాక్సైట్ తవ్వకాలపై ప్రశ్నించగా అది మరో మంత్రిత్వశాఖ అంశం గనుక తానేమీ స్పందించలేనని చెప్పారు. రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి వాస్తవమేనని, అయితే దానిని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.