
ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి
హైదరాబాద్: వ్యవసాయ భూములకు పట్టాదార్ పాస్ పుస్తకాలు లేకుండా రిజిస్ట్రేషన్ చేసిన, చేస్తున్న అధికారులపై క్రిమినల్ కేసులు పెడతామని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి హెచ్చరించారు. రెవెన్యూ భూముల వ్యవహారాలలో వీఆర్ఓలపై విచారణ చేపడతామని చెప్పారు.
571 జీఓపై ఈ నెల 19న మంత్రి మండలి ఉప సంఘంలో చర్చిస్తామన్నారు. ఏపీ ఐఐసీ ద్వారా కేటాయించిన భూములపై సమీక్ష చేస్తామని కృష్ణమూర్తి చెప్పారు.