హైదరాబాద్: భూముల వివరాల్లో పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘మీ భూమి’ వెబ్‌ల్యాండ్ రెవెన్యూశాఖలో అవినీతి కొత్త పుంతలు తొక్కడానికి దోహదం చేస్తోందని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్లు డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తికిఈ విషయాన్ని నివేదించారు. సోమవారం హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం కేఈ జాయింట్ కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ‘సాక్షి’ కథనాలే అజెండాగా మారాయి. రెవెన్యూశాఖలో అక్రమాలకు పాల్పడుతున్న కొందరు అధికారుల వల్ల శాఖతోపాటు ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని, వీరిని ఉపేక్షించబోమని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి హెచ్చరించారు.
నా వయసులో కష్టంగా ఉంటుంది కదా..
ఏ జిల్లాకూ ఇన్‌చార్జి మంత్రిగా తనను నియమించకపోవడం సంతోషమేనని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. తన వయసులో శ్రీకాకుళం, విజయనగరం వంటి జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రిగా నియమిస్తే.. అక్కడకు వెళ్లడానికి కష్టంగా ఉంటుంది కదా.. అని తనదైన శైలిలో స్పందించారు. మిమ్నల్ని గవర్నర్‌గా పంపేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారట కదా? అన్న ప్రశ్నకు.. ‘ఆ సందర్భం వచ్చినప్పుడు స్పందిస్తా’ నని సమాధానం దాటవేశారు.
‘వెబ్ ల్యాండ్’.. డబ్బు ల్యాండే!
Published Sun, May 17 2015 1:44 AM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM
Advertisement