చంద్రబాబుపై డిప్యూటీ సీఎం అలక | ke krishna murthy unhappy on mlc candidates selection | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై డిప్యూటీ సీఎం అలక

Published Tue, Mar 7 2017 10:12 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

చంద్రబాబుపై డిప్యూటీ సీఎం అలక - Sakshi

చంద్రబాబుపై డిప్యూటీ సీఎం అలక

విజయవాడ: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక అధికార టీడీపీలో అసంతృప్తి రాజేసింది. ఇప్పటికే చాలా జిల్లాల్లో టీడీపీ నాయకులు అసమ్మతి వ్యక్తం చేయగా..  ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సైతం ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తన తమ్ముడికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడంతో కేఈ అలకచెందారు.  

అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబానికి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చారని, తన తమ్ముడికి ఎమ్మెల్సీ టికెట్ ఎందుకు ఇవ్వలేదని కేఈ ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ తన తమ్ముడికి నచ్చజెప్పలేకపోతున్నానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీ టికెట్ తమ కుటుంబానికి ఇస్తేనే అక్కడ టీడీపీ గెలుస్తుందన్నారు. రాయలసీమలో బీసీలకు ఒక్క ఎమ్మెల్సీ టికెట్ కూడా కేటాయించలేదని కేఈ విమర్శించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement