హైదరాబాద్: ఏపీ ప్రత్యేక హోదా కోసం తిరుపతి యువకుడి ఆత్మహత్య బాధాకరమని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా కోసం తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని.. త్వరలోనే ఈ అంశంపై ఢిల్లీకి వెళ్తారన్నారు.
ఏఐసీసీ సోనియా గాంధీ దగ్గర మోకరిల్లి రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ నేతలేనని కేఈ విమర్శించారు. అటువంటి కాంగ్రెస్ నేతల తమపై విమర్శలు చేయడం తగదన్నారు.