భూసేకరణ బలవంతంగా జరపం : కేఈ కృష్ణమూర్తి
భూసేకరణ బలవంతంగా జరపం: ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి
నూజివీడు: రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములను బలవంతంగా ప్రభుత్వం తీసుకోదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖమంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు. కృష్ణా జిల్లా నూజివీడులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భూములను రైతులు రాజధానికి ఇవ్వడం వల్ల వారికి వచ్చే వసతులు, సౌకర్యాలు, లాభాలను వివరించి స్వచ్ఛందంగా ఇచ్చేలా ప్రయత్నిస్తామన్నారు. కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ అధికులు సుముఖంగానే ఉన్నారన్నారు. సేకరిత భూమిలో 60-40 నిష్పత్తిలో రైతులకు ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం ఎకరా ధర రూ.కోటి ఉంటే రాజధానికి ఇవ్వడం వల్ల నిర్మాణనంతరం ఎకరం విలువ రూ.10 కోట్లకు చేరవచ్చన్నారు.