
22న మాస్టర్ ప్లాన్ తుది నోటిఫికేషన్ విడుదల
ఈ నెల 22న మాస్టర్ ప్లాన్ తుది నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 28 నుంచి మార్చి 7 వరకు గ్రామాల వారీగా మాస్టర్ ప్లాన్ నోటిఫైం చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.
విజయవాడ: ఈ నెల 22న మాస్టర్ ప్లాన్ తుది నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 28 నుంచి మార్చి 7 వరకు గ్రామాల వారీగా మాస్టర్ ప్లాన్ నోటిఫైం చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ల్యాండ్ పూలింగ్‌కు భూములిచ్చిన రైతులకు మార్చి 31 నుంచి ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎక్స్‌ప్రెస్ హైవేల కోసం 350 వరకు నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
తుళ్లూరు, మందడం గ్రామాల్లో కొన్ని ఇళ్లు తొలగిస్తామని చెప్పారు. ఇళ్ల పరిహారాన్ని ఇంకా ఖరారు చేయలేదని తెలిపారు. మాస్టర్ డవలపర్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. అగ్రికల్చర్ జోన్‌పై అభ్యంతరాలను సోమవారం పరిష్కరిస్తామని చెప్పారు. అసైన్డ్ భూములు కొన్నవారికి కూడా ప్యాకేజీ ఇస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.