![Housing Zone to Poor People in Amaravati - Sakshi](/styles/webp/s3/article_images/2020/03/11/188.jpg.webp?itok=zp1ILaBh)
సాక్షి, అమరావతి: అమరావతిలో ఈడబ్లూఎస్, అఫర్డ్‌బుల్ హౌసింగ్ జోన్ ఏర్పాటుకు సీఆర్‌డీయే మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కూరగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు, వెంకటపాలెం గ్రామాల పరిధిలోని 967.25 ఎకరాల్లో ఈ హౌసింగ్ జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు.
అమరావతి మాస్టర్ ప్లాన్‌లో నివాసయోగ్యంగా పేర్కొన్న ప్రాంతంలోనే ఈ కొత్త హౌసింగ్ జోన్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు జారీ చేసిన నోటిఫికేషన్‌పై ఏమైనా సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లో సీఆర్‌డీయే కమిషనర్‌ను ఉద్దేశించి లిఖిత పూర్వకంగా తెలపాలని చెప్పింది. గడువు ముగిసిన తర్వాత వచ్చే వాటిని పరిశీలించేది లేదని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment