హైదరాబాద్‌లో 13,170 గృహాలు రెడీ! | 13,170 homes in Hyderabad will be ready | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో 13,170 గృహాలు రెడీ!

Published Sat, Aug 11 2018 2:43 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM

13,170 homes in Hyderabad will be ready - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం దేశంలో 4,65,555 గృహాలు నిర్మాణం పూర్తయి.. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి విలువ రూ.3,32,848 కోట్లుగా ఉంటుందని ప్రాప్‌ఈక్విటీ తెలిపింది. వీటిల్లో ద్వితీయ శ్రేణి పట్టణాల్లో 68,094 యూనిట్లు ఉన్నాయని, వీటి విలువ రూ.33,512 కోట్లుగా ఉంటుందని సర్వే పేర్కొంది. 

- హైదరాబాద్‌లో 2.3 కోట్ల చ.అ.ల్లో 51 ప్రాజెక్ట్‌లు నిర్మాణం పూర్తి చేసుకొని రెడీగా ఉన్నాయని . వీటిల్లో 13,710 యూనిట్లు గృహ ప్రవేశానికి రెడీగా ఉన్నాయని వీటి విలువ రూ.7,778 కోట్లుగా ఉంటుందని ప్రాప్‌ఈక్విటీ ఫౌండర్‌ అండ్‌ ఎండీ సమీర్‌ జసూజ తెలిపారు. ఆర్ధిక సంక్షోభం, నిర్మాణంలో సవాళ్లు, ప్రభుత్వ, పర్యావరణ అనుమతుల జాప్యం, అమ్మకాల్లో మందగమనం, సరఫరా ఎక్కువగా ఉండటం వంటివి నిర్మాణం, అమ్మకాలపై ప్రభావం చూపించాయని ఆయన పేర్కొన్నారు. 

ఇతర నగరాల్లోని గణాంకాలను పరిశీలిస్తే.. గృహ ప్రవేశానికి రెడీగా ఉన్న గృహాల్లో 70 శాతం నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్‌సీఆర్‌)లోనే ఉన్నాయి. నిర్మాణ గడువు పూర్తయినా నేటికీ పూర్తి కాని ప్రాజెక్ట్‌లు ఎన్‌సీఆర్‌లో 1.80 లక్షల యూనిట్లుంటాయి. వీటి విలువ రూ.1.22 లక్షల కోట్లు. ఇక, ముంబైలో 1.05 లక్షల యూనిట్లున్నాయి. వీటి విలువ రూ.1.12 లక్షల కోట్లు. బెంగళూరులో 38,242 యూనిట్లు, విలువ రూ.26,454 కోట్లు, చెన్నైలో 20,847 యూనిట్లు, విలువ రూ.9,511 కోట్లు, పుణెలో 22,517 యూనిట్లు, విలువ రూ.14,111 కోట్లు, కోల్‌కతాలో 15,552 యూనిట్లు, విలువ రూ.6,175 కోట్లుగా ఉంటుందని సర్వేలో తేలింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement