అది మా జాగా.. మేమే నిర్మిస్తాం | GHMC suspends construction of Wipro Junction flyover | Sakshi
Sakshi News home page

అది మా జాగా.. మేమే నిర్మిస్తాం

Published Sat, Mar 15 2025 8:00 AM | Last Updated on Sat, Mar 15 2025 8:00 AM

GHMC suspends construction of Wipro Junction flyover

    విప్రో జంక్షన్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ స్వస్తి  

    మిగతా మార్గాల్లోనూ డౌటే..  

 

సాక్షి, హైదరాబాద్‌: ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ ప్రతిపాదించిన ఫ్లై ఓవర్లలో విప్రో జంక్షన్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. వాస్తవంగా ఖాజాగూడ జంక్షన్, ట్రిపుల్‌ ఐటీ జంక్షన్, విప్రో జంక్షన్‌ల వద్ద ఫ్లై ఓవర్ల నిర్మాణాల అంచనా వ్యయం రూ.837 కోట్లుగా చెప్పి..నాలుగో ప్యాకేజీలో భాగంగా  ఈ మూడింటికీ  కలిపి టెండర్లు పిలవాల్సి ఉంది. కానీ  విప్రో జంక్షన్‌ వద్ద ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి మాత్రం టెండర్లు పిలవకుండా పెండింగ్‌లో ఉంచి మిగతా రెండు జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. వాటి నిర్మాణ అంచనా వ్యయం రూ.650 కోట్లు. 

విప్రో జంక్షన్‌ వద్ద టెండరు పిలవకపోవడానికి కారణం ఆ మార్గంలో మెట్రో రైలు మార్గం కూడా రానున్నందున ఒకే పిల్లర్‌పై మెట్రో మార్గం, జీహెచ్‌ఎంసీ ఫ్లై ఓవర్‌ను డబుల్‌ డెక్కర్‌గా నిర్మించాలని భావించారు. ఆ మేరకు  జరిగిన జీహెచ్‌ఎంసీ, రైల్వే అధికారుల సమావేశంలో డబుల్‌ డెక్కర్‌ నిర్మాణానికి రైల్వే నుంచి సానుకూల స్పందన రాలేదని తెలిసింది. దాంతోపాటు మెట్రో మార్గం నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు, తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని రైల్వేతో   సమన్వయం కుదరదని జీహెచ్‌ఎంసీ కూడా  భావించింది.  అంతే కాకుండా  జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ జామ్‌లు లేకుండా సిగ్నల్‌ ఫ్రీగా ఉండేందుకు జీహెచ్‌ఎంసీ ఫ్లై ఓవర్లను నిర్మిస్తోంది.  మెట్రో రైలు స్టేషన్‌  జంక్షన్‌లోనే ఉంటుంది. ఇలా వివిధ అంశాల్లో వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకొని ఆ ఫ్లై ఓవర్‌కు టెండర్‌ పిలవలేదు.  

అది మా జాగా.. మేమే నిర్మిస్తాం
మరోవైపు, విప్రో జంక్షన్‌ స్థలం  తెలంగాణ ఇండ్రస్టియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌కు  చెందినది కావడంతో తమ స్థలంలో అవసరమైన ఫ్లై ఓవర్‌ను తామే నిర్మిస్తాం సదరు కార్పొరేషన్‌ అధికారులు జీహెచ్‌ఎంసీకి  తెలిపినట్లు సమాచారం. దీంతో ఇక విప్రో జంక్షన్‌లో ఫ్లై ఓవర్‌ నిర్మాణాన్ని జీహెచ్‌ఎంసీ విరమించుకుంది. 

మిగతా మార్గాల్లో డౌటే 
ఈ నేపథ్యంలో మిగతా ప్రాంతాల్లోనూ డబుల్‌ డెక్కర్ల నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. జీహెచ్‌ఎంసీ కొత్తగా నిర్మించబోయే ఫ్లై ఓవర్ల మార్గాల్లో మెట్రో రైలు మార్గాలున్నట్లయితే ఫ్లై ఓవర్ల పై వరుసలో మెట్రో రైలు మార్గానికి అనుగుణంగా పిల్లర్లు నిరి్మంచాలని భావించారు. ఎత్తయిన  పిల్లర్లు నిర్మించి డబుల్‌ డెక్కర్‌గా రెండు నిర్మాణాలు చేయాలనుకున్నారు. అందులో భాగంగానే విప్రో జంక్షన్‌ వద్ద కూడా సిద్ధమైనప్పటికీ, ప్రభుత్వశాఖలు వేటికవిగా అందుకు విభేదించడంతో జీహెచ్‌ఎంసీ విరమించుకుంది. మియాపూర్‌ –పటాన్‌న్‌చెరు మార్గంలో ఆలి్వ¯Œన్‌ క్రాస్‌రోడ్, మదీనగూడ, చందానగర్, బీహెచ్‌ఈఎల్,ఇక్రిశాట్‌ల మార్గాల్లో, నాగోల్‌– ఎయిర్‌పోర్ట్‌ మార్గంలో ఎల్‌బీనగర్, కర్మ¯న్‌Œ ఘాట్, ఒవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, ఆరాంఘర్‌ తదితర ప్రాంతాల్లో మెట్రో రైలు రానుంది. ఆ మార్గాల్లో జీహెచ్‌ఎంసీ ఫ్లై ఓవర్లు వచ్చేచోట డబుల్‌డెక్కర్లుగా  డబుల్‌ డెక్కర్లు నిరి్మంచేందుకు ఆలోచనలు చేసినప్పటికీ, తాజా పరిస్థితులతో డైలమాలో పడ్డాయి.  

⇒ నాగోల్‌– ఎయిర్‌పోర్టు మార్గంలో మెట్రో మార్గంలో   జీహెచ్‌ఎంసీ  ఫ్లై ఓవర్లు వచ్చే  ప్రాంతాలు 
⇒   టీకేఆర్‌ కాలేజ్,గాయత్రినగర్,     మందమల్లమ్మ జంక్షన్లు 
⇒ ఒమర్‌ హోటల్‌– సోయబ్‌హోటల్‌     (వయా మెట్రో ఫంక్షన్‌హాల్‌) 
⇒   బండ్లగూడ– ఎరక్రుంట క్రాస్‌రోడ్స్‌ 
⇒   మైలార్‌దేవ్‌పల్లి, శంషాబాద్‌ రోడ్, కాటేదాన్‌ జంక్షన్‌.  
⇒    మియాపూర్‌ క్రాస్‌రోడ్‌– ఆలి్వన్‌ క్రాస్‌రోడ్‌ మార్గంలో మదీనగూడ గంగారం వద్ద.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement